ఈ సూరహ్ లో ఆవు యొక్క ప్రస్తావన 67-73 ఆయతులలో వచ్చింది. కావున ఇది, ఆవు ప్రస్తా వన ఉన్న సూరహ్ అని అనబడుతుంది. ఇందులో 286 ఆయతులున్నాయి. ఇది మదీనహ్ లో మొదటి 2 సంవత్సరాలలో అవతరింపజేయబడింది. ఆయత్ 255, ఆయతుల్ కుర్సీ అనబడు తుంది, ఆయత్ 281 చిట్టచివర అవతరింపజేయబడింది. ఆయత్ 282 ఆయత్ - ఆద్దేన్ అనబడుతుంది. ఇది అన్నిఆయతుల కంటే పెద్దది. ఏ ఇంట్లో ఈ సూరహ్ ప్రతిరోజూ చదువబడు తుందో, ఆ ఇంట్లో నుండి షై’తాన్ పారిపోతాడు. (’స. ముస్లిం). కొందరు ధర్మవేత్తల అభిప్రాయంలో దీనిలో వేయి వార్తలు, వేయి ఆజ్ఞలు మరియు వేయి నిషేధాజ్ఞలు ఉన్నాయి. (ఇబ్నె-కసీ‘ర్)

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 2:1

الم ١

అలిఫ్-లామ్-మీమ్.1


ذَٰلِكَ الْكِتَابُ لَا رَيْبَ فِيهِ ۛ هُدًى لِّلْمُتَّقِينَ ٢

ఇది (ఈ ఖుర్ఆన్) ఒక దివ్య గ్రంథం; ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. దైవభీతి 2 గలవారికి ఇది మార్గదర్శకత్వము.


الَّذِينَ يُؤْمِنُونَ بِالْغَيْبِ وَيُقِيمُونَ الصَّلَاةَ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ ٣

(వారికి) ఎవరైతే అగోచర యథార్థాన్నిి 3 నమా’జ్ స్థాపించ డం: అంటే, ప్రతిదినము ఐదుసార్లు నిర్ణీత సమయాలలో అల్లాహ్ (సు.త.), దైవప్రవక్త ము’హమ్మద్ (’స’అస)కు నేర్పిన విధంగా నమా’జ్ చేయడం. (’స’హీ’హ్ బు’ఖారీ, పుస్తకము-1, ’హదీస్‘ నం. 702, 703, 704, 723, 786, 787). 4 మరియు మేము ప్రసాదించిన జీవనోపాధి నుండి (మా మార్గంలో) ఖర్చుచేస్తారో; 5


وَالَّذِينَ يُؤْمِنُونَ بِمَا أُنزِلَ إِلَيْكَ وَمَا أُنزِلَ مِن قَبْلِكَ وَبِالْآخِرَةِ هُمْ يُوقِنُونَ ٤

మరియు ఎవరైతే (ఓ ము’హమ్మద్!) నీపై అవతరింపజేయబడిన దానిని (ఈ ఖుర్ఆన్ ను)ై 6 మరియు నీకు వూర్వం అవతరింపజేయబడిన వాటినీ (దివ్యగ్రంథాలను) విశ్వసిస్తారో మరియు పరలోక జీవితాన్ని దృఢంగా నమ్ముతారో!


أُولَـٰئِكَ عَلَىٰ هُدًى مِّن رَّبِّهِمْ ۖ وَأُولَـٰئِكَ هُمُ الْمُفْلِحُونَ ٥

అలాంటివారే తమ ప్రభువు (చూపిన) సన్మార్గంలో ఉన్నవారు మరియు అలాంటివారే సాఫల్యం పొందేవారు.


إِنَّ الَّذِينَ كَفَرُوا سَوَاءٌ عَلَيْهِمْ أَأَنذَرْتَهُمْ أَمْ لَمْ تُنذِرْهُمْ لَا يُؤْمِنُونَ ٦

నిశ్చయంగా, సత్య-తిరస్కారులను (ఓ ము’హమ్మద్!) నీవు హెచ్చరించినా, హెచ్చరించక పోయినా ఒకటే, వారు విశ్వసించేవారు కారు.


خَتَمَ اللَّـهُ عَلَىٰ قُلُوبِهِمْ وَعَلَىٰ سَمْعِهِمْ ۖ وَعَلَىٰ أَبْصَارِهِمْ غِشَاوَةٌ ۖ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ ٧

అల్లాహ్ వారి హృదయాల మీద మరియు వారి చెవుల మీద ముద్రవేశాడు. 7 మరియు వారి కన్నుల మీద తెర పడి ఉన్నది. మరియు వారికొరకు ఘోరమైన శిక్ష ఉంది.


وَمِنَ النَّاسِ مَن يَقُولُ آمَنَّا بِاللَّـهِ وَبِالْيَوْمِ الْآخِرِ وَمَا هُم بِمُؤْمِنِينَ ٨

మరియు ప్రజలలో కొందరు: “మేము అల్లాహ్ నూ మరియు అంతిమ దినాన్నీవిశ్వసించాము.” అని, అనేవారున్నారు. కానీ (వాస్తవానికి) వారు విశ్వసించే వారు కారు.


يُخَادِعُونَ اللَّـهَ وَالَّذِينَ آمَنُوا وَمَا يَخْدَعُونَ إِلَّا أَنفُسَهُمْ وَمَا يَشْعُرُونَ ٩

వారు, తాము అల్లాహ్ నూ మరియు విశ్వసించిన వారినీ మోసగిస్తున్నారని (అనుకుం టున్నారు); కానీ వారు తమను తాము తప్ప మరెవ్వరినీ మోసగించటం లేదు, కాని వారది గ్రహించటం లేదు!


فِي قُلُوبِهِم مَّرَضٌ فَزَادَهُمُ اللَّـهُ مَرَضًا ۖ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ بِمَا كَانُوا يَكْذِبُونَ ١٠

వారి హృదయాలలో రోగముంది. 8 కాబట్టి అల్లాహ్ వారి రోగాన్ని మరింత అధికంచేశాడు. మరియు వారు అసత్యం పలుకుతూ ఉండటం వలన, వారికి బాధాకరమైన శిక్ష ఉంది.


وَإِذَا قِيلَ لَهُمْ لَا تُفْسِدُوا فِي الْأَرْضِ قَالُوا إِنَّمَا نَحْنُ مُصْلِحُونَ ١١

మరియు: “భువిలో కల్లోలం 9 రేకెత్తించ కండి.” అని వారితో అన్నప్పుడు; వారు: “మేము సంస్కర్తలము మాత్రమే!” అని అంటారు.


أَلَا إِنَّهُمْ هُمُ الْمُفْسِدُونَ وَلَـٰكِن لَّا يَشْعُرُونَ ١٢

జాగ్రత్త! నిశ్చయంగా, (భువిలో) కల్లోలం రేకెత్తిస్తున్నవారు వీరే, కాని వారది గ్రహించటం లేదు.


وَإِذَا قِيلَ لَهُمْ آمِنُوا كَمَا آمَنَ النَّاسُ قَالُوا أَنُؤْمِنُ كَمَا آمَنَ السُّفَهَاءُ ۗ أَلَا إِنَّهُمْ هُمُ السُّفَهَاءُ وَلَـٰكِن لَّا يَعْلَمُونَ ١٣

మరియు: “ఇతర జనులు విశ్వసించినట్లు మీరూ విశ్వసించండి.” అని, వారితో అన్నప్పుడు, వారు: “మూర్ఖులు విశ్వసించినట్లు మేమూ విశ్వ సించాలా?” అని జవాబిస్తారు. జాగ్రత్త! వాస్తవానికి వారే మూర్ఖులు, కాని వారికది తెలియదు.


وَإِذَا لَقُوا الَّذِينَ آمَنُوا قَالُوا آمَنَّا وَإِذَا خَلَوْا إِلَىٰ شَيَاطِينِهِمْ قَالُوا إِنَّا مَعَكُمْ إِنَّمَا نَحْنُ مُسْتَهْزِئُونَ ١٤

మరియు విశ్వాసులను కలిసినపుడు, వారు: “మేము విశ్వసించాము.” అని అంటారు. కానీ, తమ షైతానుల (దుష్టనాయకుల) దగ్గర ఏకాంతంలో ఉన్నప్పుడు వారు: “నిశ్చయంగా, మేము మీతోనే ఉన్నాము కేవలం (వారి) ఎగతాళి చేస్తున్నాము.” అని అంటారు.


اللَّـهُ يَسْتَهْزِئُ بِهِمْ وَيَمُدُّهُمْ فِي طُغْيَانِهِمْ يَعْمَهُونَ ١٥

అల్లాహ్ వారి ఎగతాళి చేస్తున్నాడు మరియు వారి తలబిరుసుతనాన్ని హెచ్చిస్తున్నాడు, (అందులో వారు) అంధులై తిరుగుతున్నారు;


أُولَـٰئِكَ الَّذِينَ اشْتَرَوُا الضَّلَالَةَ بِالْهُدَىٰ فَمَا رَبِحَت تِّجَارَتُهُمْ وَمَا كَانُوا مُهْتَدِينَ ١٦

ఇలాంటి వారే, సన్మార్గానికి బదులుగా దుర్మార్గాన్ని కొనుక్కున్నవారు; కాని వారి బేరం వారికి లాభదాయకం కాలేదు మరియు వారికి మార్గదర్శకత్వమూ దొరకలేదు.


مَثَلُهُمْ كَمَثَلِ الَّذِي اسْتَوْقَدَ نَارًا فَلَمَّا أَضَاءَتْ مَا حَوْلَهُ ذَهَبَ اللَّـهُ بِنُورِهِمْ وَتَرَكَهُمْ فِي ظُلُمَاتٍ لَّا يُبْصِرُونَ ١٧

వారి ఉపమానం 10 ఇలా ఉంది: 11 ఒక వ్యక్తి అగ్నిని వెలిగించగా, అది పరిసరాలను ప్రకాశింప జేసిన తరువాత అల్లాహ్ వారి వెలుగును తీసుకొని వారిని అంధకారంలో విడిచిపెట్టడం వల్ల, వారు ఏమీ చూడలేకపోతారు.


صُمٌّ بُكْمٌ عُمْيٌ فَهُمْ لَا يَرْجِعُونَ ١٨

(వారు) చెవిటివారు, మూగవారు, గ్రుడ్డి వారు, ఇకవారు (ఋజుమార్గానికి) మరలిరాలేరు.


أَوْ كَصَيِّبٍ مِّنَ السَّمَاءِ فِيهِ ظُلُمَاتٌ وَرَعْدٌ وَبَرْقٌ يَجْعَلُونَ أَصَابِعَهُمْ فِي آذَانِهِم مِّنَ الصَّوَاعِقِ حَذَرَ الْمَوْتِ ۚ وَاللَّـهُ مُحِيطٌ بِالْكَافِرِينَ ١٩

లేక, (మరొక ఉపమానం): ఆకాశం నుండి ఘోరంగా వర్షం కురుస్తున్నది; చిమ్మచీకట్లలో ఉరుములు, మెరుపులు మెరుస్తున్నాయి. ఆ ఉరు ముల భీకరధ్వని విని, మృత్యుభయంచేత వారు తమ వ్రేళ్ళను చెవులలో దూర్చుకుంటున్నారు. మరియు అల్లాహ్ సత్య-తిరస్కారులను అన్ని వైపుల నుండి ఆవరించి ఉన్నాడు. 12


يَكَادُ الْبَرْقُ يَخْطَفُ أَبْصَارَهُمْ ۖ كُلَّمَا أَضَاءَ لَهُم مَّشَوْا فِيهِ وَإِذَا أَظْلَمَ عَلَيْهِمْ قَامُوا ۚ وَلَوْ شَاءَ اللَّـهُ لَذَهَبَ بِسَمْعِهِمْ وَأَبْصَارِهِمْ ۚ إِنَّ اللَّـهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ٢٠

ఆ మెరుపు వారిదృష్టిని ఇంచుమించు ఎగురవేసుకు పోయినట్లుంటుంది. ప్రతిసారి అది మెరిసినప్పుడు, వారు ముందుకు నడుస్తారు మరియు వారిపై చీకటి క్రమ్ముకొనగానే వారు ఆగి పోతారు. మరియు అల్లాహ్ కోరితే వారి వినికిడినీ మరియు వారి చూపునూ తొలగించేవాడు. 13 నిశ్చ యంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు. 14


يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ ٢١

ఓ మానవులారా! మిమ్మల్ని మరియు మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువు (అల్లాహ్)నే ఆరాధించండి, తద్వారా మీరు భక్తి పరులు కావచ్చు! 15


الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ فِرَاشًا وَالسَّمَاءَ بِنَاءً وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَّكُمْ ۖ فَلَا تَجْعَلُوا لِلَّـهِ أَندَادًا وَأَنتُمْ تَعْلَمُونَ ٢٢

ఆయన (అల్లాహ్)యే మీ కొరకు భూమిని పరుపుగానూ మరియు ఆకాశాన్ని కప్పుగానూ చేశాడు. మరియు ఆకాశం నుండి వర్షాన్ని కురి పించి, తద్వారా మీకు జీవనోపాధిగా ఫలాలను (పంటలను) ఉత్పత్తిచేశాడు! కావున ఇది తెలుసుకొని కూడా, మీరు ఇతరులను అల్లాహ్ కు సాటిగా నిలబెట్టకండి. 16


وَإِن كُنتُمْ فِي رَيْبٍ مِّمَّا نَزَّلْنَا عَلَىٰ عَبْدِنَا فَأْتُوا بِسُورَةٍ مِّن مِّثْلِهِ وَادْعُوا شُهَدَاءَكُم مِّن دُونِ اللَّـهِ إِن كُنتُمْ صَادِقِينَ ٢٣

మరియు మేము మా దాసుడు (ము’హ మ్మద్)పై అవతరింపజేసిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) గురించి, మీకు సందేహముంటే; దాని వంటి ఒక్క సూరహ్ నైనా మీరు (రచించి) తీసుకు రండి. 17 మరియు అల్లాహ్ తప్ప మీకు ఉన్న సహాయకులను అందరినీ పిలుచుకోండి; మీరు సత్యవంతులే అయితే (ఇది చేసి చూపండి).


فَإِن لَّمْ تَفْعَلُوا وَلَن تَفْعَلُوا فَاتَّقُوا النَّارَ الَّتِي وَقُودُهَا النَّاسُ وَالْحِجَارَةُ ۖ أُعِدَّتْ لِلْكَافِرِينَ ٢٤

కానీ, ఒకవేళ మీరు అలా చేయలేకపోతే – నిశ్చయంగా, మీరు అలా చేయలేరు – మానవులు మరియు రాళ్ళు ఇంధనమయ్యే ఆ నరకాగ్నికి భయపడండి. 18 అది సత్య-తిరస్కారుల కొరకే తయారు చేయబడింది.


وَبَشِّرِ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أَنَّ لَهُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۖ كُلَّمَا رُزِقُوا مِنْهَا مِن ثَمَرَةٍ رِّزْقًا ۙ قَالُوا هَـٰذَا الَّذِي رُزِقْنَا مِن قَبْلُ ۖ وَأُتُوا بِهِ مُتَشَابِهًا ۖ وَلَهُمْ فِيهَا أَزْوَاجٌ مُّطَهَّرَةٌ ۖ وَهُمْ فِيهَا خَالِدُونَ ٢٥

మరియు విశ్వసించి, సత్కార్యాలు చేసే వారి కొరకు నిశ్చయంగా, క్రింద కాలువలు ప్రవ హించే స్వర్గవనాలు ఉంటాయనే శుభవార్తను వినిపించు. ప్రతిసారి వారికి తినటానికి ఫలాలు ఒసంగబడినపుడల్లా, వారు: “ఇవి ఇంతకుముందు మాకు ఇవ్వబడినవే!” అని అంటారు. ఎందుకంటే వారికి ఇవ్వబడేవి వాటీ పోలికగలవే. అక్కడ వారికి నిర్మల సహవాసులు (అ’జ్వాజ్) ఉంటారు. మరియు వారందులో శాశ్వతంగా ఉంటారు. (1/8)


إِنَّ اللَّـهَ لَا يَسْتَحْيِي أَن يَضْرِبَ مَثَلًا مَّا بَعُوضَةً فَمَا فَوْقَهَا ۚ فَأَمَّا الَّذِينَ آمَنُوا فَيَعْلَمُونَ أَنَّهُ الْحَقُّ مِن رَّبِّهِمْ ۖ وَأَمَّا الَّذِينَ كَفَرُوا فَيَقُولُونَ مَاذَا أَرَادَ اللَّـهُ بِهَـٰذَا مَثَلًا ۘ يُضِلُّ بِهِ كَثِيرًا وَيَهْدِي بِهِ كَثِيرًا ۚ وَمَا يُضِلُّ بِهِ إِلَّا الْفَاسِقِينَ ٢٦

* నిశ్చయంగా, అల్లాహ్ దోమ లేక దానికంటే చిన్న దాని దృష్టాంతం ఇవ్వటానికి సంకోచించడు. కావున విశ్వసించిన వారు, ఇది తమ ప్రభువు తరఫునుండి వచ్చిన సత్యమే అని గ్రహిస్తారు. కాని సత్య-తిరస్కారులు, వాటిని విని: “ఈ ఉపమా నాల ద్వారా అల్లాహ్ చెప్పదలుచుకున్నది ఏమిటీ?” అని, ప్రశ్నిస్తారు. ఈవిధంగా ఆయన ఎంతోమందిని మార్గభ్రష్టత్వంలో పడవేస్తాడు. మరియు ఎంతోమందికి సన్మార్గం కూడా చూపు తాడు. మరియు ఆయన కేవలం దుష్టులనే 19 మార్గభ్రష్టత్వంలో పడవేస్తాడు.


الَّذِينَ يَنقُضُونَ عَهْدَ اللَّـهِ مِن بَعْدِ مِيثَاقِهِ وَيَقْطَعُونَ مَا أَمَرَ اللَّـهُ بِهِ أَن يُوصَلَ وَيُفْسِدُونَ فِي الْأَرْضِ ۚ أُولَـٰئِكَ هُمُ الْخَاسِرُونَ ٢٧

ఎవరైతే అల్లాహ్ తో స్థిరమైన ఒడంబడిక 20 చేసుకున్న పిదప దానిని భంగపరుస్తారో మరియు అల్లాహ్ స్థిరపరచమని ఆజ్ఞాపించిన దానిని త్రెంచుతారో మరియు భువిలో కల్లోలం రేకెత్తిస్తారో! ఇలాంటివారే, వాస్తవంగా నష్టపడేవారు.


كَيْفَ تَكْفُرُونَ بِاللَّـهِ وَكُنتُمْ أَمْوَاتًا فَأَحْيَاكُمْ ۖ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يُحْيِيكُمْ ثُمَّ إِلَيْهِ تُرْجَعُونَ ٢٨

మీరు అల్లాహ్ పట్ల తిరస్కారవైఖరిని ఎలా అవలంబించగలరు? మరియు వాస్తవానికి ఆయనే నిర్జీవులుగా 21 ఉన్నమిమ్మల్నిసజీవులుగా చేశాడు కదా! తరువాత మీప్రాణాన్నితీసి తిరిగి మిమ్మల్ని సజీవులుగా చేసేది కూడా ఆయనే; చివరకు మీరంతా ఆయన వద్దకే మరలింప బడతారు.


هُوَ الَّذِي خَلَقَ لَكُم مَّا فِي الْأَرْضِ جَمِيعًا ثُمَّ اسْتَوَىٰ إِلَى السَّمَاءِ فَسَوَّاهُنَّ سَبْعَ سَمَاوَاتٍ ۚ وَهُوَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ ٢٩

ఆయనే భూమిలో నున్న సమస్తాన్నీ మీ కొరకు సృష్టించాడు; తరువాత తన దృష్టిని ఆకాశాల వైపునకు మరల్చి వాటిని సప్తాకాశాలుగా ఏర్పరిచాడు. మరియు ఆయనే ప్రతి విషయానికి సంబంధించిన జ్ఞానం గలవాడు.


وَإِذْ قَالَ رَبُّكَ لِلْمَلَائِكَةِ إِنِّي جَاعِلٌ فِي الْأَرْضِ خَلِيفَةً ۖ قَالُوا أَتَجْعَلُ فِيهَا مَن يُفْسِدُ فِيهَا وَيَسْفِكُ الدِّمَاءَ وَنَحْنُ نُسَبِّحُ بِحَمْدِكَ وَنُقَدِّسُ لَكَ ۖ قَالَ إِنِّي أَعْلَمُ مَا لَا تَعْلَمُونَ ٣٠

మరియు (జ్ఞాపకంచేసుకో!) నీ ప్రభువు దేవ దూతలతో: “వాస్తవంగా నేను భూమిలో ఒక ఉత్త రాధికారిని 22 సృషించబోతున్నాను!” అని, చెప్పినపుడు వారు: “ఏమీ? నీవు భూమిలో కల్లోలం రేకెత్తించేవానిని మరియు నెత్తురుచిందించే వానిని నియమించబోతున్నావా? మేము నీ స్తోత్రం చేస్తూ, నీ పవిత్రతను కొనియాడుతూనే ఉన్నాము కదా!” అని విన్నవించుకున్నారు. దానికి ఆయన: “నిశ్చయంగా, మీకు తెలియనిది నాకు తెలుసు!” అని, అన్నాడు.


وَعَلَّمَ آدَمَ الْأَسْمَاءَ كُلَّهَا ثُمَّ عَرَضَهُمْ عَلَى الْمَلَائِكَةِ فَقَالَ أَنبِئُونِي بِأَسْمَاءِ هَـٰؤُلَاءِ إِن كُنتُمْ صَادِقِينَ ٣١

మరియు ఆయన (అల్లాహ్) ఆదమ్ కు సకల వస్తువుల పేర్లను నేర్పాడు, 23 ఆ పిదప వాటిని దేవదూతల ఎదుట ఉంచి: “మీరు సత్య వంతులే అయితే, వీటి పేర్లను నాకు తెలుపండి.” అని, అన్నాడు.


قَالُوا سُبْحَانَكَ لَا عِلْمَ لَنَا إِلَّا مَا عَلَّمْتَنَا ۖ إِنَّكَ أَنتَ الْعَلِيمُ الْحَكِيمُ ٣٢

వారు (దేవదూతలు): “నీవు సర్వ లోపాల కు అతీతుడవు, 24 నీవు తెలిపినదే తప్ప మాకు మరేమీ తెలియదు. నిశ్చయంగా నీవే సర్వజ్ఞు డవు, 25 మహా వివేకవంతుడవు. 26 అని అన్నారు.


قَالَ يَا آدَمُ أَنبِئْهُم بِأَسْمَائِهِمْ ۖ فَلَمَّا أَنبَأَهُم بِأَسْمَائِهِمْ قَالَ أَلَمْ أَقُل لَّكُمْ إِنِّي أَعْلَمُ غَيْبَ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَأَعْلَمُ مَا تُبْدُونَ وَمَا كُنتُمْ تَكْتُمُونَ ٣٣

ఆయన (అల్లాహ్): “ఓ ఆదమ్! వీటి (ఈ వస్తువుల) పేర్లను వీరికి తెలుపు.” అని అన్నాడు. ఎపుడైతే అతను (ఆదమ్) ఆ వస్తువుల పేర్లను వారికి తెలిపాడో; ఆయన అన్నాడు: “నిశ్చయంగా నేను మాత్రమే భూమ్యాకాశాల అగోచర విషయాలను ఎరుగుదునని మీతో చెప్పలేదా? మరియు మీరు ఏది బహిర్గతంచేస్తారో మరియు ఏది దాస్తారో కూడా నాకు బాగా తెలుసు!”


وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ أَبَىٰ وَاسْتَكْبَرَ وَكَانَ مِنَ الْكَافِرِينَ ٣٤

మరియు (జ్ఞాపకంచేసుకోండి) మేము దేవదూతలతో: “మీరందరూ ఆదమ్ ముందు సాష్టాంగం (సజ్దా) చేయండి.” అని ఆదేశించినపుడు, ఒక ఇబ్లీస్ 27 తప్ప, మిగతావారంతా సాష్టాంగం (సజ్దా) చేశారు; 28 అతడు నిరాకరించాడు మరియు దురహంకారానికి గురయ్యాడు మరియు సత్య- తిరస్కారులలోని వాడయ్యాడు.


وَقُلْنَا يَا آدَمُ اسْكُنْ أَنتَ وَزَوْجُكَ الْجَنَّةَ وَكُلَا مِنْهَا رَغَدًا حَيْثُ شِئْتُمَا وَلَا تَقْرَبَا هَـٰذِهِ الشَّجَرَةَ فَتَكُونَا مِنَ الظَّالِمِينَ ٣٥

మరియు మేము (ఆదమ్ తో) అన్నాము: “ఓ ఆదమ్! నీవూ మరియు నీ భార్యా ఈ స్వర్గంలో నివసించండి మరియు మీరిద్దరూ మీకు ఇష్టమైనది యథేచ్ఛగా తినండి, కానీ ఈ చెట్టు 29 దరిదాపులకు పోకండి, అలా చేస్తే మీరిద్దరూ దుర్మార్గులలో 30 చేరిన వారవుతారు!”


فَأَزَلَّهُمَا الشَّيْطَانُ عَنْهَا فَأَخْرَجَهُمَا مِمَّا كَانَا فِيهِ ۖ وَقُلْنَا اهْبِطُوا بَعْضُكُمْ لِبَعْضٍ عَدُوٌّ ۖ وَلَكُمْ فِي الْأَرْضِ مُسْتَقَرٌّ وَمَتَاعٌ إِلَىٰ حِينٍ ٣٦

ఆ పిదప షై’తాన్ వారిద్దరినీ దాని (స్వర్గం) నుండి తప్పించి, వారిద్దరినీ వారున్న స్థితి నుండి బయటికితీశాడు. మరియు మేము (అల్లాహ్) అన్నాము: “మీరంతా ఇక్కడి నుండి దిగిపొండి; మీరు ఒకరికొకరు విరోధులవుతారు. 31 ఒక నియమిత కాలం వరకు మీరు భూమిలో ఉండి, అక్కడే జీవితం గడపవలసి ఉంటుంది.”


فَتَلَقَّىٰ آدَمُ مِن رَّبِّهِ كَلِمَاتٍ فَتَابَ عَلَيْهِ ۚ إِنَّهُ هُوَ التَّوَّابُ الرَّحِيمُ ٣٧

తరువాత ఆదమ్, తన ప్రభువు నుండి కొన్ని మాటలు గ్రహించి, 32 (పశ్చాత్తాపపడి క్షమాభిక్ష కోరాడు) మరియు ఆయన (అల్లాహ్) అతని పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. నిశ్చయంగా, ఆయనే పశ్చాత్తాపాన్ని అంగీకరించే వాడు, అపార కరుణాప్రదాత.


قُلْنَا اهْبِطُوا مِنْهَا جَمِيعًا ۖ فَإِمَّا يَأْتِيَنَّكُم مِّنِّي هُدًى فَمَن تَبِعَ هُدَايَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ ٣٨

మేము (అల్లాహ్) ఇలా అన్నాము: “మీరంతా ఇక్కడి నుండి దిగిపోండి.” ఇక నా తరఫు నుండి మీకు మార్గదర్శకత్వం తప్పక వస్తూ ఉంటుంది. అప్పుడు ఎవరైతే నా మార్గదర్శ కత్వాన్ని అనుసరిస్తారో వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా!


وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَـٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ ٣٩

కాని, ఎవరైతే (మార్గదర్శకత్వాన్ని) తిర స్కరిస్తారో మరియు మా సూచన (అయాతు) లను అసత్యాలని తిరస్కరిస్తారో, అలాంటి వారు నరకాగ్ని వాసులవుతారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.


يَا بَنِي إِسْرَائِيلَ اذْكُرُوا نِعْمَتِيَ الَّتِي أَنْعَمْتُ عَلَيْكُمْ وَأَوْفُوا بِعَهْدِي أُوفِ بِعَهْدِكُمْ وَإِيَّايَ فَارْهَبُونِ ٤٠

ఓ ఇస్రాయీ‘ల్ సంతతివారలారా! 33 నేను మీకుచేసిన ఉపకారాన్ని జ్ఞాపకంచేసుకోండి మరియు మీరు నాతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి, నేనూ మీతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుతాను. మరియు మీరు నాకు మాత్రమే భయపడండి!


وَآمِنُوا بِمَا أَنزَلْتُ مُصَدِّقًا لِّمَا مَعَكُمْ وَلَا تَكُونُوا أَوَّلَ كَافِرٍ بِهِ ۖ وَلَا تَشْتَرُوا بِآيَاتِي ثَمَنًا قَلِيلًا وَإِيَّايَ فَاتَّقُونِ ٤١

మరియు మీ వద్ద నున్నవాటిని (తౌరాత్ / ఇంజీల్ లను) ధృవీకరిస్తూ నేను అవతరింపజేసిన దానిని (ఈ దివ్యఖుర్ఆనును) విశ్వసించండి. మరియు దీనిని తిరస్కరించేవారిలో మీరు మొట్ట మొదటి వారు కాకండి. మరియు అల్ప లాభాలకు నా సూచన (ఆయాత్)లను 34 అమ్మకండి. కేవలం నా యందే భయ-భక్తులు కలిగి ఉండండి.


وَلَا تَلْبِسُوا الْحَقَّ بِالْبَاطِلِ وَتَكْتُمُوا الْحَقَّ وَأَنتُمْ تَعْلَمُونَ ٤٢

మరియు సత్యాన్ని అసత్యంతో కలిపి తారుమారు చేయకండి మరియు మీకు తెలిసి ఉండి కూడా సత్యాన్ని దాచకండి. 35


وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ وَارْكَعُوا مَعَ الرَّاكِعِينَ ٤٣

మరియు నమా’జ్ ను స్థాపించండి మరియు విధిదానం (’జకాత్) ఇవ్వండి మరియు (నా సాన్నిధ్యంలో వినమ్రులై) వంగే 36 (రుకూ’ఉ చేసే) వారితో పాటు మీరూ (వినమ్రులై) వంగండి (రుకూ’ఉ చేయండి). (1/4)


أَتَأْمُرُونَ النَّاسَ بِالْبِرِّ وَتَنسَوْنَ أَنفُسَكُمْ وَأَنتُمْ تَتْلُونَ الْكِتَابَ ۚ أَفَلَا تَعْقِلُونَ ٤٤

ఏమీ? మీరు ఇతరులనైతే నీతిపరు లవమని ఆజ్ఞాపిస్తున్నారు, కాని స్వయంగా మీరే దానిని అవలంబించడం మరచిపోతున్నా రెందుకు? 37 మరియు మీరయితే గ్రంథాన్ని చదువుతున్నారు కదా! అయితే మీరెందుకు మీ బుద్ధిని ఉపయోగించరు?


وَاسْتَعِينُوا بِالصَّبْرِ وَالصَّلَاةِ ۚ وَإِنَّهَا لَكَبِيرَةٌ إِلَّا عَلَى الْخَاشِعِينَ ٤٥

మరియు సహనం మరియు సమా’జ్ ద్వారా (అల్లాహ్) సహాయాన్ని అర్థించండి. నిశ్చయంగా, అది (అల్లాహ్ కు) వినమ్రులైన వారికి తప్ప, ఇతరులకు ఎంతో కష్టతరమైనది.


الَّذِينَ يَظُنُّونَ أَنَّهُم مُّلَاقُو رَبِّهِمْ وَأَنَّهُمْ إِلَيْهِ رَاجِعُونَ ٤٦

అలాంటి వారు తాము, తమ ప్రభువును నిశ్చయంగా, కలుసుకోవలసివుందనీ మరియు ఆయన వైపునకే మరలి పోవలసి ఉందనీ నమ్ముతారు. 38


يَا بَنِي إِسْرَائِيلَ اذْكُرُوا نِعْمَتِيَ الَّتِي أَنْعَمْتُ عَلَيْكُمْ وَأَنِّي فَضَّلْتُكُمْ عَلَى الْعَالَمِينَ ٤٧

ఓఇస్రాయీ‘ల్ సంతతివారలారా! నేనుమీకు చేసినమహోపకారాన్ని జ్ఞాపకంచేసుకోండి మరియు నేను నిశ్చయంగా, మిమ్మల్ని(మీ కాలంలో) సర్వ లోకాల వారికంటే అధికంగా ఆదరించాను!


وَاتَّقُوا يَوْمًا لَّا تَجْزِي نَفْسٌ عَن نَّفْسٍ شَيْئًا وَلَا يُقْبَلُ مِنْهَا شَفَاعَةٌ وَلَا يُؤْخَذُ مِنْهَا عَدْلٌ وَلَا هُمْ يُنصَرُونَ ٤٨

మరియు ఆ (తీర్పు) దినమునకు భయ పడండి, అప్పుడు ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఏ విధంగానూ ఉపయోగపడలేడు; మరియు అతని నుండి ఎట్టి సిఫారసూ అంగీకరించబడదు మరియు ఎలాంటి పరిహారం కూడా తీసుకోబడదు మరియు వారికెలాంటి సహాయం కూడా చేయబడదు.


وَإِذْ نَجَّيْنَاكُم مِّنْ آلِ فِرْعَوْنَ يَسُومُونَكُمْ سُوءَ الْعَذَابِ يُذَبِّحُونَ أَبْنَاءَكُمْ وَيَسْتَحْيُونَ نِسَاءَكُمْ ۚ وَفِي ذَٰلِكُم بَلَاءٌ مِّن رَّبِّكُمْ عَظِيمٌ ٤٩

మరియు ఫిర్’ఔన్ జాతివారి (బానిసత్వం) నుండి మేము మీకు విముక్తి కలిగించిన సందర్భాన్ని (జ్ఞాపకం చేసుకోండి). వారు మిమ్మల్ని ఘోర హింసకు గురిచేస్తూ ఉండేవారు; మీ కుమారులను వధించి, మీ స్త్రీలను సజీవులుగా విడిచిపెట్టేవారు. మరియు ఇందులో మీ ప్రభువు తరఫు నుండి మీకు గొప్ప పరీక్ష ఉండెను.


وَإِذْ فَرَقْنَا بِكُمُ الْبَحْرَ فَأَنجَيْنَاكُمْ وَأَغْرَقْنَا آلَ فِرْعَوْنَ وَأَنتُمْ تَنظُرُونَ ٥٠

మరియు మేము మీ కొరకు సముద్రాన్ని చీల్చి మిమ్మల్ని రక్షించినప్పుడు మీరు చూస్తూ ఉండగానే ఫిర్’ఔన్ జాతి వారిని ముంచివేసిన సంఘటనను (గుర్తుకు తెచ్చుకోండి). 39


وَإِذْ وَاعَدْنَا مُوسَىٰ أَرْبَعِينَ لَيْلَةً ثُمَّ اتَّخَذْتُمُ الْعِجْلَ مِن بَعْدِهِ وَأَنتُمْ ظَالِمُونَ ٥١

ఇంకా (జ్ఞాపకం చేసుకోండి), మేము మూసాను నలభై రాత్రుల వాగ్దానం చేసి (పిలిచి నపుడు) మీరు అతను లేకపోవడం చూసి, ఆవు దూడను (ఆరాధ్యదైవంగా) చేసుకున్నారు. 40 మరియు మీరు దుర్మార్గులయ్యారు.


ثُمَّ عَفَوْنَا عَنكُم مِّن بَعْدِ ذَٰلِكَ لَعَلَّكُمْ تَشْكُرُونَ ٥٢

అయినప్పటికీ మీరు కృతజ్ఞులవుతా రేమోనని మేము మిమ్మల్ని మన్నించాము. 41


وَإِذْ آتَيْنَا مُوسَى الْكِتَابَ وَالْفُرْقَانَ لَعَلَّكُمْ تَهْتَدُونَ ٥٣

మరియు (జ్ఞాపకం చేసుకోండి)! మీరు సన్మార్గులవుతారేమోనని మేము మూసాకు గ్రంథాన్ని మరియు (సత్యా-సత్యాలను వేరుచేసే) 42 గీటురాయిని ప్రసాదించాము


وَإِذْ قَالَ مُوسَىٰ لِقَوْمِهِ يَا قَوْمِ إِنَّكُمْ ظَلَمْتُمْ أَنفُسَكُم بِاتِّخَاذِكُمُ الْعِجْلَ فَتُوبُوا إِلَىٰ بَارِئِكُمْ فَاقْتُلُوا أَنفُسَكُمْ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ عِندَ بَارِئِكُمْ فَتَابَ عَلَيْكُمْ ۚ إِنَّهُ هُوَ التَّوَّابُ الرَّحِيمُ ٥٤

మరియు (జ్ఞాపకం చేసుకోండి)! మూసా తన జాతివారతో ఇలా అన్న విషయాన్ని: “ఓ నాజాతి ప్రజలారా! నిశ్చయంగా, ఆవుదూడను (ఆరాధ్య దైవంగా) చేసుకొని మీకు-మీరే అన్యాయం చేసుకున్నారు. కనుక పశ్చాత్తాపంతో క్షమాభిక్ష కొరకు మీ నిర్మాతను మీలోని వారిని (ఘోర పాతకులను) సంహరించండి. ఇదే మీ కొరకు – మీ సృష్టికర్త దృష్టిలో – శ్రేష్ఠమైనది.” ఆ తరువాత ఆయన (అల్లాహ్) మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. నిశ్చయంగా, ఆయనే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు. అపార కరుణాప్రదాత. 43 (సృష్టికర్తను) వేడుకోండి.


وَإِذْ قُلْتُمْ يَا مُوسَىٰ لَن نُّؤْمِنَ لَكَ حَتَّىٰ نَرَى اللَّـهَ جَهْرَةً فَأَخَذَتْكُمُ الصَّاعِقَةُ وَأَنتُمْ تَنظُرُونَ ٥٥

మరియు అప్పుడు మీరు అతనితో (మూసాతో) అన్న మాటలు (జ్ఞప్తికితెచ్చుకోండి): “ఓ మూసా! మేము అల్లాహ్ ను ప్రత్యక్షంగా చూడ నంతవరకు నిన్ను ఏ మాత్రం విశ్వసించము!” అదే సమయంలో మీరు చూస్తూ ఉండగానే ఒక భయంకరమైన పిడుగు మీపై విరుచుకుపడింది (మీరు చనిపోయారు).


ثُمَّ بَعَثْنَاكُم مِّن بَعْدِ مَوْتِكُمْ لَعَلَّكُمْ تَشْكُرُونَ ٥٦

ఆ పిమ్మట, మీరు కృతజ్ఞులై ఉంటా రేమోనని – మీరు చచ్చిన తరువాత – మిమ్మల్ని తిరిగి బ్రతికించాము.


وَظَلَّلْنَا عَلَيْكُمُ الْغَمَامَ وَأَنزَلْنَا عَلَيْكُمُ الْمَنَّ وَالسَّلْوَىٰ ۖ كُلُوا مِن طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ ۖ وَمَا ظَلَمُونَا وَلَـٰكِن كَانُوا أَنفُسَهُمْ يَظْلِمُونَ ٥٧

మరియు మేము మీపై మేఘాల ఛాయను కల్పించాము మరియు మన్న్ మరియు సల్వాలను మీ కొరకు ఆహారంగా దించాము: 44 “మేము మీకు ప్రసాదించిన శుధ్ధమయిన వస్తువు లను తినండి.” అని అన్నాము. (కాని వారు మా ఆజ్ఞలను ఉల్లంఘించారు), అయినా వారు మాకు అపకారమేమీ చేయలేదు, పైగా వారు తమకు తామే అపకారం చేసుకన్నారు.


وَإِذْ قُلْنَا ادْخُلُوا هَـٰذِهِ الْقَرْيَةَ فَكُلُوا مِنْهَا حَيْثُ شِئْتُمْ رَغَدًا وَادْخُلُوا الْبَابَ سُجَّدًا وَقُولُوا حِطَّةٌ نَّغْفِرْ لَكُمْ خَطَايَاكُمْ ۚ وَسَنَزِيدُ الْمُحْسِنِينَ ٥٨

మరియు మేము మీతో: “ఈ నగరం (జేరుసలం) లో ప్రవేశించండి మరియు అక్కడున్న వస్తువులను మీ ఇష్టానుసారంగా, కావలసినంత తినండి మరియు నగర ద్వారంలోకి వినమ్రులై తల వంచుతూ: ‘మమ్మల్ని క్షమించు’ (’హి’త్తతున్), అంటూ, ప్రవేశించండి; మేము మీ పాపాలను క్షమిస్తాము. మరియు మేము సజ్జనులను అత్యధికంగా కరుణిస్తాము.” అని చెప్పిన మాటలను (జ్ఞప్తికి తెచ్చుకోండి)!


فَبَدَّلَ الَّذِينَ ظَلَمُوا قَوْلًا غَيْرَ الَّذِي قِيلَ لَهُمْ فَأَنزَلْنَا عَلَى الَّذِينَ ظَلَمُوا رِجْزًا مِّنَ السَّمَاءِ بِمَا كَانُوا يَفْسُقُونَ ٥٩

కాని దుర్మార్గులైన వారు, వారికి చెప్పిన మాటను మరొక మాటతో మార్చారు. 45 కనుక, మేము దుర్మార్గం చేసిన వారిపై, వారి దౌష్ట్యాలకు ఫలితంగా, ఆకాశం నుండి ఆపదను దింపాము. 46 (3/8)


وَإِذِ اسْتَسْقَىٰ مُوسَىٰ لِقَوْمِهِ فَقُلْنَا اضْرِب بِّعَصَاكَ الْحَجَرَ ۖ فَانفَجَرَتْ مِنْهُ اثْنَتَا عَشْرَةَ عَيْنًا ۖ قَدْ عَلِمَ كُلُّ أُنَاسٍ مَّشْرَبَهُمْ ۖ كُلُوا وَاشْرَبُوا مِن رِّزْقِ اللَّـهِ وَلَا تَعْثَوْا فِي الْأَرْضِ مُفْسِدِينَ ٦٠

* మరియు (జ్ఞాపకం చేసుకోండి)! మూసా తన ప్రజలకు నీటి కొరకు ప్రార్థించినప్పుడు, మేము: “నీవు ఆ బండను నీ కర్రతో కొట్టు!” అని ఆదేశించాము. అప్పుడు దాని నుండి పన్నెండు ఊటలు ప్రవహించసాగాయి. ప్రతి తెగవారు తమ నీరుత్రాగే స్థలాన్ని కనుగొన్నారు. (అప్పుడు వారతో అన్నాము): “అల్లాహ్ మీకు ప్రసాదించిన ఆహారాన్ని తినండి త్రాగండి కానీ, భూమిలో కల్లోలం రేపుతూ దౌర్జన్యపరులుగా తిరగకండి!”


وَإِذْ قُلْتُمْ يَا مُوسَىٰ لَن نَّصْبِرَ عَلَىٰ طَعَامٍ وَاحِدٍ فَادْعُ لَنَا رَبَّكَ يُخْرِجْ لَنَا مِمَّا تُنبِتُ الْأَرْضُ مِن بَقْلِهَا وَقِثَّائِهَا وَفُومِهَا وَعَدَسِهَا وَبَصَلِهَا ۖ قَالَ أَتَسْتَبْدِلُونَ الَّذِي هُوَ أَدْنَىٰ بِالَّذِي هُوَ خَيْرٌ ۚ اهْبِطُوا مِصْرًا فَإِنَّ لَكُم مَّا سَأَلْتُمْ ۗ وَضُرِبَتْ عَلَيْهِمُ الذِّلَّةُ وَالْمَسْكَنَةُ وَبَاءُوا بِغَضَبٍ مِّنَ اللَّـهِ ۗ ذَٰلِكَ بِأَنَّهُمْ كَانُوا يَكْفُرُونَ بِآيَاتِ اللَّـهِ وَيَقْتُلُونَ النَّبِيِّينَ بِغَيْرِ الْحَقِّ ۗ ذَٰلِكَ بِمَا عَصَوا وَّكَانُوا يَعْتَدُونَ ٦١

మరియు అప్పుడు మీరు: “ఓ మూసా! మేము ఒకే రకమైన ఆహారం తింటూ ఉండలేము. కావున భూమిలో ఉత్పత్తి అయ్యే ఆకుకూరలు, దోసకాయలు (కూరగాయలు), వెల్లుల్లి (గోదు మలు), ఉల్లిగడ్డలు, పప్పు దినుసులు మొదలైనవి మాకొరకు పండించమని నీ ప్రభువును ప్రార్థించు.” అని అన్నారు. దానికతను: “ఏమీ? శ్రేష్ఠమైన దానికి బదులుగా అల్పమైన దానిని కోరుకుంటు న్నారా? (అలాగయితే) మీరు ఏదైనా నగరానికి తిరిగిపొండి. నిశ్చయంగా, అక్కడ మీకు, మీరు కోరేదంతా దొరుకుతుంది!” అని అన్నాడు. మరియు వారు, తీవ్ర అవమానం మరియు దారి ద్ర్యానికి గురయ్యారు. మరియు వారు అల్లాహ్ ఆగ్రహానికి గురయ్యారు. అదంతా వాస్తవానికి వారు, అల్లాహ్ సూచన (ఆయాత్)లను తిరస్కరించిన దాని మరియు ప్రవక్తలను యంగా చంపినదాని ఫలితం. అన్యా 47 ఇదంతా వారు చేసిన ఆజ్ఞోల్లంఘన మరియు హద్దులు మీరి ప్రవర్తించిన దాని పర్యవసానం.


إِنَّ الَّذِينَ آمَنُوا وَالَّذِينَ هَادُوا وَالنَّصَارَىٰ وَالصَّابِئِينَ مَنْ آمَنَ بِاللَّـهِ وَالْيَوْمِ الْآخِرِ وَعَمِلَ صَالِحًا فَلَهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ ٦٢

నిశ్చయంగా, విశ్వసించిన వారు (ముస్లింలు) కానీ, (ఇస్లాంకు పూర్వపు) యూదులు కానీ, క్రైస్తవులు కానీ, సాబీయూలు 48 కానీ (ఎవరైనా సరే)! అల్లాహ్ ను, అంతిమ దినాన్ని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారికి, వారి ప్రభువు వద్ద మంచి ప్రతిఫలం ఉంటుంది మరియు వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరుకూడా! 49


وَإِذْ أَخَذْنَا مِيثَاقَكُمْ وَرَفَعْنَا فَوْقَكُمُ الطُّورَ خُذُوا مَا آتَيْنَاكُم بِقُوَّةٍ وَاذْكُرُوا مَا فِيهِ لَعَلَّكُمْ تَتَّقُونَ ٦٣

మరియు (ఓ ఇస్రాయీ‘ల్ సంతతివారలారా!) మేము ’తూర్ పర్వతాన్ని ఎత్తి మీపై నిలిపి, మీ చేత చేయించిన గట్టి వాగ్దానాన్ని (జ్ఞప్తికి తెచ్చు కోండి)! అప్పుడుమేము:“మీకుప్రసాదిస్తున్నదానిని (గ్రంథాన్ని) దృఢంగా పట్టుకోండి, అందులో ఉన్న దంతా జ్ఞాపకం ఉంచుకోండి,
బహుశా మీరు భయ -భక్తులు గలవారు కావచ్చు!” అని అన్నాము.


ثُمَّ تَوَلَّيْتُم مِّن بَعْدِ ذَٰلِكَ ۖ فَلَوْلَا فَضْلُ اللَّـهِ عَلَيْكُمْ وَرَحْمَتُهُ لَكُنتُم مِّنَ الْخَاسِرِينَ ٦٤

ఆ పిదప కూడా మీరు వెనుదిరిగి పోయారు. అయినప్పటికీ అల్లాహ్ యొక్క అనుగ్రహం మరియు ఆయన కరుణ మీపై లేకుంటే, మీరు నష్టానికి గురైనవారిలో చేరేవారు.


وَلَقَدْ عَلِمْتُمُ الَّذِينَ اعْتَدَوْا مِنكُمْ فِي السَّبْتِ فَقُلْنَا لَهُمْ كُونُوا قِرَدَةً خَاسِئِينَ ٦٥

మరియు శనివారం (సబ్త్) శాసనం ఉల్లంఘించిన, మీ వారి గాథ మీకు బాగా తెలుసు. 50 మేము వారిని: “నీచులైన కోతులు కండి!” అని అన్నాము.


فَجَعَلْنَاهَا نَكَالًا لِّمَا بَيْنَ يَدَيْهَا وَمَا خَلْفَهَا وَمَوْعِظَةً لِّلْمُتَّقِينَ ٦٦

ఈ విధంగా మేము, దానిని (వారి ముగిం పును) ఆ కాలం వారికీ మరియు భావీ తరాల వారికీ ఒక గుణపాఠంగానూ, దైవభీతి గలవారికి ఒక హితోపదేశంగానూ చేశాము.


وَإِذْ قَالَ مُوسَىٰ لِقَوْمِهِ إِنَّ اللَّـهَ يَأْمُرُكُمْ أَن تَذْبَحُوا بَقَرَةً ۖ قَالُوا أَتَتَّخِذُنَا هُزُوًا ۖ قَالَ أَعُوذُ بِاللَّـهِ أَنْ أَكُونَ مِنَ الْجَاهِلِينَ ٦٧

మరియు (జ్ఞాపకం చేసుకోండి) మూసా తన జాతి వారితో: “అల్లాహ్ మిమ్మల్ని: ‘ఒక ఆవును బలి ఇవ్వండి!’ 51 అని ఆజ్ఞాపిస్తున్నాడు.” అని అన్నప్పుడు వారు: “ఏమీ? నీవు మాతో పరహాస మాడుతున్నావా?” అని పలికారు. (అప్పుడు మూసా) అన్నాడు: “నేను అవివేకులతో కలిసి పోకుండా ఉండాలని, నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.”


قَالُوا ادْعُ لَنَا رَبَّكَ يُبَيِّن لَّنَا مَا هِيَ ۚ قَالَ إِنَّهُ يَقُولُ إِنَّهَا بَقَرَةٌ لَّا فَارِضٌ وَلَا بِكْرٌ عَوَانٌ بَيْنَ ذَٰلِكَ ۖ فَافْعَلُوا مَا تُؤْمَرُونَ ٦٨

వారు: “అది ఎలాంటిదై ఉండాలో మాకు స్పష్టంగా తెలుపమని, నీ ప్రభువును ప్రార్థించు!” అని అన్నారు. (మూసా) అన్నాడు:“ ‘నిశ్చయంగా ఆ ఆవు ముసలిదిగానీ లేగదూడ గానీ కాకుండా, మధ్య వయస్సుగలదై ఉండాలి.’ అని, ఆయన అంటున్నాడు. కనుక ఆజ్ఞాపించిన విధంగా చేయండి.”


قَالُوا ادْعُ لَنَا رَبَّكَ يُبَيِّن لَّنَا مَا لَوْنُهَا ۚ قَالَ إِنَّهُ يَقُولُ إِنَّهَا بَقَرَةٌ صَفْرَاءُ فَاقِعٌ لَّوْنُهَا تَسُرُّ النَّاظِرِينَ ٦٩

వారు: “దాని రంగు ఎలా ఉండాలో మాకు తెలుపమని నీ ప్రభువును వేడుకో!” అని, అన్నారు. (దానికి అతను) అన్నాడు: “ ‘అది మెరిసే పసుపువన్నె కలిగి, చూసే వారికి మనోహరంగా కనిపించాలి.’ అని ఆయన ఆజ్ఞ!”


قَالُوا ادْعُ لَنَا رَبَّكَ يُبَيِّن لَّنَا مَا هِيَ إِنَّ الْبَقَرَ تَشَابَهَ عَلَيْنَا وَإِنَّا إِن شَاءَ اللَّـهُ لَمُهْتَدُونَ ٧٠

70. వారు ఇలా అన్నారు: “అసలు ఏ విధమైన ఆవు కావాలో నీవు నీ ప్రభువును అడిగి మాకు స్పష్టంగా తెలుపు; దానిని నిర్ణయించడంలో మాకు సందేహం కలిగింది మరియు నిశ్చయంగా, అల్లాహ్ కోరితే మేము తప్పక అలాంటి ఆవును కనుగొంటాము (మార్గదర్శకత్వం పొందుతాము).”


قَالَ إِنَّهُ يَقُولُ إِنَّهَا بَقَرَةٌ لَّا ذَلُولٌ تُثِيرُ الْأَرْضَ وَلَا تَسْقِي الْحَرْثَ مُسَلَّمَةٌ لَّا شِيَةَ فِيهَا ۚ قَالُوا الْآنَ جِئْتَ بِالْحَقِّ ۚ فَذَبَحُوهَا وَمَا كَادُوا يَفْعَلُونَ ٧١

అతను (మూసా) అన్నాడు: “ఆయన (అల్లాహ్) అంటున్నాడు: ‘ఆ గోవు భూమిని దున్నటానికిగానీ, పొలాలకు నీళ్ళు తోడటానికి గానీ ఉపయోగించబడకుండా ఆరోగ్యంగా ఎలాంటి లోపాలు లేకుండా ఉండాలి.’ అని!” అప్పుడు వారన్నారు: “ఇప్పుడు నీవు సత్యం తెచ్చావు.” తరువాత వారు దానిని బలి (జి‘’బ్హ్) చేశారు, లేకపోతే వారు అలా చేసేవారని అనిపించలేదు. 52


وَإِذْ قَتَلْتُمْ نَفْسًا فَادَّارَأْتُمْ فِيهَا ۖ وَاللَّـهُ مُخْرِجٌ مَّا كُنتُمْ تَكْتُمُونَ ٧٢

మరియు (జ్ఞాపకం చేసుకోండి), మీరు ఒక వ్యక్తిని చంపి ఆ నిందను ఒకరిపైనొకరు మోపుకో సాగారు. కాని మీరు దాస్తున్న దానిని అల్లాహ్ బయటపెట్టాడు. 53


فَقُلْنَا اضْرِبُوهُ بِبَعْضِهَا ۚ كَذَٰلِكَ يُحْيِي اللَّـهُ الْمَوْتَىٰ وَيُرِيكُمْ آيَاتِهِ لَعَلَّكُمْ تَعْقِلُونَ ٧٣

కనుక మేము: “దానిని (ఆ శవాన్ని), ఆ ఆవు (మాంసపు) ఒక ముక్కతో కొట్టండి (అతడు సజీవుడవుతాడు).” అని ఆజ్ఞాపించాము. ఈ విధంగా అల్లాహ్ మృతులను బ్రతికించి, తన సూచనలను మీకు చూపుతున్నాడు బహుశా మీరు అర్థం చేసుకుంటారేమోనని!


ثُمَّ قَسَتْ قُلُوبُكُم مِّن بَعْدِ ذَٰلِكَ فَهِيَ كَالْحِجَارَةِ أَوْ أَشَدُّ قَسْوَةً ۚ وَإِنَّ مِنَ الْحِجَارَةِ لَمَا يَتَفَجَّرُ مِنْهُ الْأَنْهَارُ ۚ وَإِنَّ مِنْهَا لَمَا يَشَّقَّقُ فَيَخْرُجُ مِنْهُ الْمَاءُ ۚ وَإِنَّ مِنْهَا لَمَا يَهْبِطُ مِنْ خَشْيَةِ اللَّـهِ ۗ وَمَا اللَّـهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ ٧٤

కానీ దీని తరువాత కూడా మీ హృద యాలు కఠినమైపోయాయి, అవి రాళ్ళ మాదిరిగా! కాదు, వాటికంటే కూడా కఠినంగా అయిపోయాయి. ఎందుకంటే వాస్తవానికి రాళ్ళలో కొన్ని బ్రద్దలై నప్పుడు వాటినుండి సెలయేళ్ళు ప్రవహిస్తాయి. మరియు నిశ్చయంగా, వాటిలో కొన్ని చీలిపోయి వాటి నుండి నీళ్ళు బయటికి వస్తాయి. 54 మరియు వాస్తవానికి వాటిలో మరికొన్ని అల్లాహ్ భయం వల్ల పడిపోతాయి. మరియు అల్లాహ్ మీ కర్మల పట్ల నిర్లక్ష్యంగాలేడు. (1/2)


أَفَتَطْمَعُونَ أَن يُؤْمِنُوا لَكُمْ وَقَدْ كَانَ فَرِيقٌ مِّنْهُمْ يَسْمَعُونَ كَلَامَ اللَّـهِ ثُمَّ يُحَرِّفُونَهُ مِن بَعْدِ مَا عَقَلُوهُ وَهُمْ يَعْلَمُونَ ٧٥

* (ఓ విశ్వాసులారా!) వారు (యూదులు) మీ సందేశాన్ని విశ్వసిస్తారని ఆశిస్తున్నారా ఏమిటీ? మరియు వాస్తవానికి వారిలో ఒక వర్గం వారు (ధర్మవేత్తలు) అల్లాహ్ ప్రవచనం (తౌరాత్) విని, అర్థంచేసుకొని కూడా, బుధ్ధిపూర్వకంగా దానిని తారుమారు చేసేవారు కదా?


وَإِذَا لَقُوا الَّذِينَ آمَنُوا قَالُوا آمَنَّا وَإِذَا خَلَا بَعْضُهُمْ إِلَىٰ بَعْضٍ قَالُوا أَتُحَدِّثُونَهُم بِمَا فَتَحَ اللَّـهُ عَلَيْكُمْ لِيُحَاجُّوكُم بِهِ عِندَ رَبِّكُمْ ۚ أَفَلَا تَعْقِلُونَ ٧٦

మరియు వారు (యూదులు) విశ్వాసులను కలిసినప్పుడు: “మేము విశ్వసించాము!” అని అంటారు. కాని వారు ఏకాంతంలో (తమ తెగ వారితో) ఒకరినొకరు కలుసుకున్నప్పుడు: “ఏమీ? అల్లాహ్ మీకు తెలిపింది వారికి (ముస్లిం లకు) తెలుపుతారా? 55 దానితో వారు (ముస్లిం లు) మీ ప్రభువు ముందు మీతో వాదులాడటానికి! మీరిది అర్థంచేసుకోలేరా ఏమిటి?” అని అంటారు.


أَوَلَا يَعْلَمُونَ أَنَّ اللَّـهَ يَعْلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعْلِنُونَ ٧٧

ఏమీ! వారికి తెలియదా? వారు (యూదులు) దాచేది మరియు వెలిబుచ్చేది, అంతా అల్లాహ్ కు బాగా తెలుసని?


وَمِنْهُمْ أُمِّيُّونَ لَا يَعْلَمُونَ الْكِتَابَ إِلَّا أَمَانِيَّ وَإِنْ هُمْ إِلَّا يَظُنُّونَ ٧٨

మరియు వారి (యూదుల)లో కొందరు నిరక్షరాస్యులున్నారు, వారికి గ్రంథజ్ఞానం లేదు, వారు కేవలం మూఢ విశ్వాసాలను (నమ్ముతూ), ఊహలపై మాత్రమే ఆధారపడి ఉన్నారు.


فَوَيْلٌ لِّلَّذِينَ يَكْتُبُونَ الْكِتَابَ بِأَيْدِيهِمْ ثُمَّ يَقُولُونَ هَـٰذَا مِنْ عِندِ اللَّـهِ لِيَشْتَرُوا بِهِ ثَمَنًا قَلِيلًا ۖ فَوَيْلٌ لَّهُم مِّمَّا كَتَبَتْ أَيْدِيهِمْ وَوَيْلٌ لَّهُم مِّمَّا يَكْسِبُونَ ٧٩

కావున ఎవరైతే తమ చేతులారా ఒక పుస్తకాన్ని వ్రాసి – దాని వల్ల తుచ్ఛ మూల్యం పొందే నిమిత్తం – “ఇది అల్లాహ తరఫు నుండి వచ్చింది.” అని (ప్రజలకు) చెబుతారో, వారికి వినాశముంది. వారి చేతులు వ్రాసినందుకు, వారికి వినాశముంది మరియు వారు సంపాదించిన దానికి కూడా వారికి వినాశముంది!


وَقَالُوا لَن تَمَسَّنَا النَّارُ إِلَّا أَيَّامًا مَّعْدُودَةً ۚ قُلْ أَتَّخَذْتُمْ عِندَ اللَّـهِ عَهْدًا فَلَن يُخْلِفَ اللَّـهُ عَهْدَهُ ۖ أَمْ تَقُولُونَ عَلَى اللَّـهِ مَا لَا تَعْلَمُونَ ٨٠

మరియు వారు (యూదులు) అంటారు: “మాకు నరకాగ్ని శిక్ష పడినా, అది కొన్ని రోజుల కొరకు మాత్రమే!” (ఓ ము’హమ్మద్!) నీవు వారి నడుగు: “ఏమీ? మీరు అల్లాహ్ నుండి వాగ్దానం పొందారా? ఎందుకంటే, అల్లాహ్ తన వాగ్దానాన్ని ఎన్నడూ భంగంచేయడు. లేదా మీకు తెలియని విషయాన్ని మీరు అల్లాహ్ కు అంటగడు తున్నారా?”


بَلَىٰ مَن كَسَبَ سَيِّئَةً وَأَحَاطَتْ بِهِ خَطِيئَتُهُ فَأُولَـٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ ٨١

వాస్తవానికి, ఎవరు పాపం అర్జించారో మరియు తమ పాపం తమను చుట్టుముట్టి ఉన్నదో, అలాంటి వారు నరకవాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.


وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أُولَـٰئِكَ أَصْحَابُ الْجَنَّةِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ ٨٢

మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, అలాంటి వారు స్వర్గవాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.


وَإِذْ أَخَذْنَا مِيثَاقَ بَنِي إِسْرَائِيلَ لَا تَعْبُدُونَ إِلَّا اللَّـهَ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا وَذِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينِ وَقُولُوا لِلنَّاسِ حُسْنًا وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ ثُمَّ تَوَلَّيْتُمْ إِلَّا قَلِيلًا مِّنكُمْ وَأَنتُم مُّعْرِضُونَ ٨٣

మరియు మేము ఇస్రాయీలు సంతతి వారి నుండి ఇలా తీసుకున్న వాగ్దానం (జ్ఞప్తికి తెచ్చు కోండి): “మీరు అల్లాహ్ ను తప్ప మరెవ్వరినీ ఆరాధించకూడదు. మరియు తల్లి-దండ్రులను, బంధువులను, అనాథులను, యాచించని పేద వారిని 56 ఆదరించాలి. మరియు ప్రజలను సహృదయంతో పలకరించాలి, నమా’జ్ ను స్థాపించాలి మరియు ’జకాత్ ఇవ్వాలి.” అటు పిమ్మట మీలో కొందరు తప్ప, మిగతా వారంతా (తమ వాగ్దానం నుండి) తిరిగిపోయారు. మీరంతా విముఖులైపోయే వారే!


وَإِذْ أَخَذْنَا مِيثَاقَكُمْ لَا تَسْفِكُونَ دِمَاءَكُمْ وَلَا تُخْرِجُونَ أَنفُسَكُم مِّن دِيَارِكُمْ ثُمَّ أَقْرَرْتُمْ وَأَنتُمْ تَشْهَدُونَ ٨٤

మరియు మేము మీ నుండి తీసుకున్న మరొక వాగ్దానాన్ని (జ్ఞాపకం చేసుకోండి); మీరు మీ (తోటివారి) రక్తాన్ని చిందించగూడదని మరియు మీ వారిని, వారి ఇండ్ల నుండి పారద్రోలగూడదని! అప్పుడు మీరు దానికి ఒప్పుకున్నారు. మరియు దానికి స్వయంగా మీరేసాక్షులు.


ثُمَّ أَنتُمْ هَـٰؤُلَاءِ تَقْتُلُونَ أَنفُسَكُمْ وَتُخْرِجُونَ فَرِيقًا مِّنكُم مِّن دِيَارِهِمْ تَظَاهَرُونَ عَلَيْهِم بِالْإِثْمِ وَالْعُدْوَانِ وَإِن يَأْتُوكُمْ أُسَارَىٰ تُفَادُوهُمْ وَهُوَ مُحَرَّمٌ عَلَيْكُمْ إِخْرَاجُهُمْ ۚ أَفَتُؤْمِنُونَ بِبَعْضِ الْكِتَابِ وَتَكْفُرُونَ بِبَعْضٍ ۚ فَمَا جَزَاءُ مَن يَفْعَلُ ذَٰلِكَ مِنكُمْ إِلَّا خِزْيٌ فِي الْحَيَاةِ الدُّنْيَا ۖ وَيَوْمَ الْقِيَامَةِ يُرَدُّونَ إِلَىٰ أَشَدِّ الْعَذَابِ ۗ وَمَا اللَّـهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ ٨٥

ఆ తరువాత మీరే ఒకరినొకరు చంపుకునే వారు. మరియు మీరు మీలోని ఒక వర్గం వారిని వారి ఇండ్ల నుండి తరిమేవారు. మరియు వారికి అన్యాయం చేయటంలోనూ మరియు వారిపై దౌర్జన్యం చేయటంలోనూ, (వారి విరోధులకు) తోడ్పడేవారు. మరియు వారు (శతృవుల చేతిలో) ఖైదీలై మీ వద్దకు వచ్చినపుడు మీరు వారిని విమోచనాధనం ఇచ్చి విడిపించేవారు. మరియు (వాస్తవానికి) వారిని తరమటం మీకు నిషిధ్ధం చేయబడింది. ఏమి? మీరు గ్రంథంలోని కొన్ని విషయాలను విశ్వసించి, మరికొన్నింటిని తిరస్కరిస్తారా? 57 మీలో ఇలా చేసేవారికి, ఇహలోక జీవితంలో అవమానమూ మరియు పునరుత్థాన దినమున మిమ్మల్ని కఠిన శిక్షకు గురిచేయటం తప్ప మరెలాంటి ప్రతిఫలం ఉంటుంది? మరియు అల్లాహ్ మీ కర్మల విషయంలో నిర్లక్ష్యంగా లేడు.


أُولَـٰئِكَ الَّذِينَ اشْتَرَوُا الْحَيَاةَ الدُّنْيَا بِالْآخِرَةِ ۖ فَلَا يُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ يُنصَرُونَ ٨٦

ఇలాంటి వారే పరలోకానికి బదులుగా ఇహలోక జీవితాన్ని కొనేవారు! కావున వీరికి పడేశిక్ష తగ్గించబడదు మరియు వీరికి ఎలాంటి సహాయమూ లభించదు.


وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ وَقَفَّيْنَا مِن بَعْدِهِ بِالرُّسُلِ ۖ وَآتَيْنَا عِيسَى ابْنَ مَرْيَمَ الْبَيِّنَاتِ وَأَيَّدْنَاهُ بِرُوحِ الْقُدُسِ ۗ أَفَكُلَّمَا جَاءَكُمْ رَسُولٌ بِمَا لَا تَهْوَىٰ أَنفُسُكُمُ اسْتَكْبَرْتُمْ فَفَرِيقًا كَذَّبْتُمْ وَفَرِيقًا تَقْتُلُونَ ٨٧

మరియు వాస్తవంగా మేము మూసాకు గ్రంథాన్ని (తౌరాత్ ను) ప్రసాదించాము మరియు అతని తర్వాత వరుసగా ప్రవక్తలను పంపాము. మరియు మర్యమ్ కుమారుడైన ’ఈసా కు (ఏసుకు) స్పష్టమైన సూచనలను ఇచ్చాము 58 మరియు పరిశుధ్ధాత్మ (రూ’హుల్-ఖుదుస్)తో అతనిని బలపరిచాము. 59 ఏమీ? మీ మనోవాంఛ లకు ప్రతికూలంగా ఉన్నదాన్ని తీసుకొని, ఏ ప్రవక్త అయినా మీ వద్దకు వస్తే, మీరు వారిపట్ల దురహం కారంతో ప్రవర్తించలేదా? వారిలో కొందరిని మీరు అసత్యవాదులన్నారు, మరికొందరిని చంపారు. 60


وَقَالُوا قُلُوبُنَا غُلْفٌ ۚ بَل لَّعَنَهُمُ اللَّـهُ بِكُفْرِهِمْ فَقَلِيلًا مَّا يُؤْمِنُونَ ٨٨

88. మరియు వారు: “మా హృదయాలు మూయ బడి ఉన్నాయి.” అని అంటారు. అలా కాదు (అది నిజం కాదు)! వారి సత్య-తిరస్కారం వలన అల్లాహ్ వారిని శపించాడు (బహిష్కరించాడు). 61 ఎందుకంటే వారు విశ్వసించేది చాలా తక్కువ.


وَلَمَّا جَاءَهُمْ كِتَابٌ مِّنْ عِندِ اللَّـهِ مُصَدِّقٌ لِّمَا مَعَهُمْ وَكَانُوا مِن قَبْلُ يَسْتَفْتِحُونَ عَلَى الَّذِينَ كَفَرُوا فَلَمَّا جَاءَهُم مَّا عَرَفُوا كَفَرُوا بِهِ ۚ فَلَعْنَةُ اللَّـهِ عَلَى الْكَافِرِينَ ٨٩

మరియు ఇప్పుడు వారి వద్ద నున్న దానిని (తౌరాత్ ను) ధృవీకరించే గ్రంథం (ఈ ఖుర్ఆన్) అల్లాహ్ తరఫునుండి వారివద్దకువచ్చింది. మరియు దీనికి ముందు వారు సత్య-తిరస్కారులపై విజయం కొరకుప్రార్థంచేవారు. ఇప్పుడు సత్యమని గుర్తించబడినది (ఈగ్రంథం) వచ్చినా, వారు దానిని తిరస్కరించారు. కాబట్టి, సత్య-తిరస్కారులపై అల్లాహ్ అభిశాపం (బహిష్కారం) అవతరిస్తుంది.


بِئْسَمَا اشْتَرَوْا بِهِ أَنفُسَهُمْ أَن يَكْفُرُوا بِمَا أَنزَلَ اللَّـهُ بَغْيًا أَن يُنَزِّلَ اللَّـهُ مِن فَضْلِهِ عَلَىٰ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ ۖ فَبَاءُوا بِغَضَبٍ عَلَىٰ غَضَبٍ ۚ وَلِلْكَافِرِينَ عَذَابٌ مُّهِينٌ ٩٠

అల్లాహ్ అవతరింపజేసిన సందేశాన్ని (ఖుర్ఆన్ ను) తిరస్కరించి, వారు ఎంత నీచమైన మూల్యానికి తమను తాము అమ్ముకున్నారు! అది (వారి తిరస్కారం) అల్లాహ్! తన దాసులలో, తాను కోరిన వారిపై, తన అనుగ్రహం (ఖుర్ఆన్/ ప్రవక్తృత్వం) అవతరింపజేశాడనే కక్షవల్లనే! కనుక వారు (అల్లాహ్) క్రోధం మీద మరింత క్రోధానికి గురి అయ్యారు. మరియు ఇలాంటి సత్య-తిరస్కా రులకు అవమానకరమైన శిక్ష ఉంది.


وَإِذَا قِيلَ لَهُمْ آمِنُوا بِمَا أَنزَلَ اللَّـهُ قَالُوا نُؤْمِنُ بِمَا أُنزِلَ عَلَيْنَا وَيَكْفُرُونَ بِمَا وَرَاءَهُ وَهُوَ الْحَقُّ مُصَدِّقًا لِّمَا مَعَهُمْ ۗ قُلْ فَلِمَ تَقْتُلُونَ أَنبِيَاءَ اللَّـهِ مِن قَبْلُ إِن كُنتُم مُّؤْمِنِينَ ٩١

మరియు వారి (యూదుల) తో: “అల్లాహ్ అవతరింపజేసిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసించండి.” అని అన్నప్పుడు, వారు: “మా (ఇస్రాయీ‘ల్) వారిపై అవతరింపజేయబడిన దానిని (తౌరాత్ ను) మాత్రమే మేము విశ్వ సిస్తాము.” అని అంటారు. మరియు దాని తరువాత వచ్చినది (ఈ ఖుర్ఆన్) సత్య మైనప్పటికీ మరియు వారి వద్దనున్న దానిని (తౌరాత్ ను) ధృవపరుస్తున్నప్పటికీ, దీనిని (ఈ ఖుర్ఆన్ ను) తిరస్కరిస్తున్నారు. (ఓ ము’హ మ్మద్) వారిని అడుగు: “మీరు (మీ వద్ద నున్న గ్రంథాన్ని) విశ్వసించేవారే అయితే ఇంతకు పూర్వం వచ్చిన అల్లాహ్ ప్రవక్తలను ఎందుకు హత్యచేస్తూ వచ్చారు?” 62


وَلَقَدْ جَاءَكُم مُّوسَىٰ بِالْبَيِّنَاتِ ثُمَّ اتَّخَذْتُمُ الْعِجْلَ مِن بَعْدِهِ وَأَنتُمْ ظَالِمُونَ ٩٢

* మరియు వాస్తవానికి మూసా స్పష్టమైన సూచనలను తీసుకొని మీ వద్దకు వచ్చాడు. తరువాత అతను పోగానే, మీరు ఆవుదూడ (విగ్రహాన్ని) ఆరాధ్యదైవంగా చేసుకున్నారు మరియు మీరు ఎంత దుర్మార్గులు!


وَإِذْ أَخَذْنَا مِيثَاقَكُمْ وَرَفَعْنَا فَوْقَكُمُ الطُّورَ خُذُوا مَا آتَيْنَاكُم بِقُوَّةٍ وَاسْمَعُوا ۖ قَالُوا سَمِعْنَا وَعَصَيْنَا وَأُشْرِبُوا فِي قُلُوبِهِمُ الْعِجْلَ بِكُفْرِهِمْ ۚ قُلْ بِئْسَمَا يَأْمُرُكُم بِهِ إِيمَانُكُمْ إِن كُنتُم مُّؤْمِنِينَ ٩٣

మరియు మేము ’తూర్ పర్వతాన్ని ఎత్తి మీపై నిలిపి మీ నుంచి తీసుకున్న ప్రమాణాన్ని (జ్ఞాపకం చేసుకోండి): “మేము మీకు చేస్తున్న వాటిని (ఉపదేశాలను) స్థిరంగా పాటించండి మరియు జాగ్రత్తగా వినండి.” అని చెప్పాము. వారు: “మేము విన్నాము కానీ, అతిక్రమిస్తు న్నాము.” అని అన్నారు, వారి సత్య-తిరస్కారం వలన వారి హృదయాలలో ఆవుదూడ ప్రేమ నిండిపోయింది. వారితో అను: “మీరు విశ్వాసులే అయితే! ఈ చెడు చేష్టలను చేయమని మిమ్మల్ని ఆదేశించే మీ ఈ విశ్వాసం చాలా చెడ్డది”


قُلْ إِن كَانَتْ لَكُمُ الدَّارُ الْآخِرَةُ عِندَ اللَّـهِ خَالِصَةً مِّن دُونِ النَّاسِ فَتَمَنَّوُا الْمَوْتَ إِن كُنتُمْ صَادِقِينَ ٩٤

వారితో ఇలా అను: “ఒకవేళ అల్లాహ్ వద్ద నున్న పరలోక నివాసం మానవులందిరికీ కాక కేవలం, మీకు మాత్రమే ప్రత్యేకించబడి ఉంటే, 63 మీరు మీ ఈ అభిప్రాయంలో సత్యవంతులే అయితే, మీరు మరణాన్ని కోరండి!”


وَلَن يَتَمَنَّوْهُ أَبَدًا بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ ۗ وَاللَّـهُ عَلِيمٌ بِالظَّالِمِينَ ٩٥

కాని వారు ఎన్నటికీ దానిని (మరణాన్ని) కోరరు. ఎందుకంటే, వారు తమ చేతులారా చేసి పంపినవి (తమ కర్మలు) వారికి బాగా తెలుసు. ఈ దుర్మార్గుల విషయం అల్లాహ్ కు బాగా తెలుసు.


وَلَتَجِدَنَّهُمْ أَحْرَصَ النَّاسِ عَلَىٰ حَيَاةٍ وَمِنَ الَّذِينَ أَشْرَكُوا ۚ يَوَدُّ أَحَدُهُمْ لَوْ يُعَمَّرُ أَلْفَ سَنَةٍ وَمَا هُوَ بِمُزَحْزِحِهِ مِنَ الْعَذَابِ أَن يُعَمَّرَ ۗ وَاللَّـهُ بَصِيرٌ بِمَا يَعْمَلُونَ ٩٦

మరియు నిశ్చయంగా, జీవితం పట్ల సర్వ జనుల కంటే ఎక్కువ వ్యామోహం వారి (యూదుల) లోనే ఉందనే విషయం నీవు గ్రహిస్తావు. ఈ విషయంలో వారు ముష్రికులను కూడా మించి పోయారు. వారిలో ప్రతి ఒక్కడూ వేయి సంవత్స రాలు బ్రతకాలని కోరుతుంటాడు. కానీ దీర్ఘాయు ర్ధాయం, వారిని శిక్షనుండి తప్పించలేదు. మరియు వారు చేసేదంతా అల్లాహ్ చూస్తున్నాడు. 64


قُلْ مَن كَانَ عَدُوًّا لِّجِبْرِيلَ فَإِنَّهُ نَزَّلَهُ عَلَىٰ قَلْبِكَ بِإِذْنِ اللَّـهِ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ وَهُدًى وَبُشْرَىٰ لِلْمُؤْمِنِينَ ٩٧

(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: “జిబ్రీల్ పట్ల విరోధమున్న ప్రతివాడూ ఈ యథార్థాన్ని గ్రహించాలి. అల్లాహ్ ఆజ్ఞతోనే అతను ఈ ఖుర్ఆన్ ను నీ హృదయంపై అవతరింపజేశాడు. పూర్వం వచ్చినఅన్నిదివ్యగ్రంథాలను ఇదిధృవీకరిస్తున్నది మరియు విశ్వసించేవారికి ఇది సన్మార్గం చూపు తున్నది మరియు శుభవార్తను ఇస్తున్నది.” 65


مَن كَانَ عَدُوًّا لِّلَّـهِ وَمَلَائِكَتِهِ وَرُسُلِهِ وَجِبْرِيلَ وَمِيكَالَ فَإِنَّ اللَّـهَ عَدُوٌّ لِّلْكَافِرِينَ ٩٨

“అల్లాహ్ కు, ఆయన దూతలకు, ఆయన ప్రవక్తలకు, జిబ్రీల్ కు మరియు మీకాయీల్ కు ఎవరు శత్రువులో, నిశ్చయంగా అలాంటి సత్య- తిరస్కారులకు అల్లాహ్ శత్రువు.” 66


وَلَقَدْ أَنزَلْنَا إِلَيْكَ آيَاتٍ بَيِّنَاتٍ ۖ وَمَا يَكْفُرُ بِهَا إِلَّا الْفَاسِقُونَ ٩٩

మరియు వాస్తనంగా, మేము నీపై స్పష్టమైన సూచనలు (ఆయాత్) అవతరింపజేశాము. మరియు అవిధేయులు తప్ప మరెవ్వరూ వాటిని తిరస్కరించరు.


أَوَكُلَّمَا عَاهَدُوا عَهْدًا نَّبَذَهُ فَرِيقٌ مِّنْهُم ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يُؤْمِنُونَ ١٠٠

ఏమీ? వారు ఒడంబడికి చేసినపుడల్లా, వారిలో ఒక వర్గం వారు దానిని త్రోసిపుచ్చుటం జరగలేదా? వాస్తవానికి వారిలో చాలామంది విశ్వసించని వారున్నారు.


وَلَمَّا جَاءَهُمْ رَسُولٌ مِّنْ عِندِ اللَّـهِ مُصَدِّقٌ لِّمَا مَعَهُمْ نَبَذَ فَرِيقٌ مِّنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ كِتَابَ اللَّـهِ وَرَاءَ ظُهُورِهِمْ كَأَنَّهُمْ لَا يَعْلَمُونَ ١٠١

మరియు వారిదగ్గర పూర్వంనుంచే ఉన్న దానిని (దివ్యగ్రంథాన్ని) ధృవపరుస్తూ ఒక ప్రవక్త (ము’హమ్మద్) అల్లాహ్ తరఫునుండి వారి వద్దకు వచ్చినప్పుడు, గ్రంథ ప్రజలలోని ఒక వర్గం వారు దానిని గురించి ఏమీ తెలియని వారిగా, అల్లాహ్ గ్రంథాన్ని తమ వీపుల వెనుకకు త్రోసివేశారు. 67


وَاتَّبَعُوا مَا تَتْلُو الشَّيَاطِينُ عَلَىٰ مُلْكِ سُلَيْمَانَ ۖ وَمَا كَفَرَ سُلَيْمَانُ وَلَـٰكِنَّ الشَّيَاطِينَ كَفَرُوا يُعَلِّمُونَ النَّاسَ السِّحْرَ وَمَا أُنزِلَ عَلَى الْمَلَكَيْنِ بِبَابِلَ هَارُوتَ وَمَارُوتَ ۚ وَمَا يُعَلِّمَانِ مِنْ أَحَدٍ حَتَّىٰ يَقُولَا إِنَّمَا نَحْنُ فِتْنَةٌ فَلَا تَكْفُرْ ۖ فَيَتَعَلَّمُونَ مِنْهُمَا مَا يُفَرِّقُونَ بِهِ بَيْنَ الْمَرْءِ وَزَوْجِهِ ۚ وَمَا هُم بِضَارِّينَ بِهِ مِنْ أَحَدٍ إِلَّا بِإِذْنِ اللَّـهِ ۚ وَيَتَعَلَّمُونَ مَا يَضُرُّهُمْ وَلَا يَنفَعُهُمْ ۚ وَلَقَدْ عَلِمُوا لَمَنِ اشْتَرَاهُ مَا لَهُ فِي الْآخِرَةِ مِنْ خَلَاقٍ ۚ وَلَبِئْسَ مَا شَرَوْا بِهِ أَنفُسَهُمْ ۚ لَوْ كَانُوا يَعْلَمُونَ ١٠٢

మరియు వారు సులైమాన్ రాజ్య కాలమున, షై’తానులు పఠించే దానిని (జాల విద్యను) అనుసరించారు. సులైమాన్ సత్య- తిరస్కారి కాలేదు; కానీ నిశ్చయంగా, షై’తానులు సత్యాన్ని తిరస్కరించారు. వారు బాబీలోన్ నగర మందు హారూత్, మారూత్ అనేఇద్దరుదేవదూతల ద్వారా తేబడిన జాలవిద్యను ప్రజలకు నేర్పు చుండిరి. ఎవరికైనా ఆ విద్యను నేర్పేటప్పుడు, వారిద్దరు (దేవదూతలు) ఇలా చెప్పే వారు: “నిశ్చయంగా మేము (మానవులకు) ఒక పరీక్ష! కాబట్టి మీరు (ఈ జాలవిద్యను నేర్చుకొని) సత్య- తిరస్కారులు కాకండి.” అయినప్పటికీ వారు (ప్రజలు) భార్యా-భర్తలకు ఎడబాటు కలిగించే (జాలవిద్య) వారిద్దరి దగ్గర నేర్చుకునేవారు. మరియు అల్లాహ్ అనుమతిలేనిదే, దాని ద్యారా ఎవరికీ ఏ మాత్రం హాని కలిగించలేరు. మరియు వారు నేర్చుకునేది, వారికి నష్టం కలిగించేదే కాని లాభం కలిగించేది ఎంత మాత్రం కాదు. మరియు వాస్తవానికి దానిని (జాలవిద్యను) స్వీకరించేవానికి పరలోక సౌఖ్యాలలో ఏ మాత్రమూ భాగం లేదని వారికి బాగా తెలుసు. మరియువారు ఎంత తుచ్ఛ మైన సొమ్ముకు బదులుగా తమను తాము అమ్ము కున్నారు! ఇది వారికి తెలిస్తే ఎంత బాగుండేది!


وَلَوْ أَنَّهُمْ آمَنُوا وَاتَّقَوْا لَمَثُوبَةٌ مِّنْ عِندِ اللَّـهِ خَيْرٌ ۖ لَّوْ كَانُوا يَعْلَمُونَ ١٠٣

మరియు వారు విశ్వసించి, దైవభీతి కలిగి ఉండినట్లయితే! నిశ్చయంగా అల్లాహ్ తరఫు నుండి వారికి ఎంతో శ్రేష్ఠమైన ప్రతిఫలం లభించి ఉండేది. దీనిని వారు గ్రహిస్తే ఎంత బాగుండేది!


يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَقُولُوا رَاعِنَا وَقُولُوا انظُرْنَا وَاسْمَعُوا ۗ وَلِلْكَافِرِينَ عَذَابٌ أَلِيمٌ ١٠٤

ఓ విశ్వాసులారా, (మీరు ప్రవక్తతో మాట్లాడేటప్పుడు) రా’ఇనా! అని అనకండి. ఉన్”జుర్నా! అని (గౌరవంతో) అనండి 68మరియు (అతని మాటలను) శ్రధ్ధతోవినండి. మరియు సత్య-తిరస్కారులకు బాధాకరమైన శిక్ష గలదు.


مَّا يَوَدُّ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ وَلَا الْمُشْرِكِينَ أَن يُنَزَّلَ عَلَيْكُم مِّنْ خَيْرٍ مِّن رَّبِّكُمْ ۗ وَاللَّـهُ يَخْتَصُّ بِرَحْمَتِهِ مَن يَشَاءُ ۚ وَاللَّـهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ ١٠٥

సత్య-తిరస్కారులైన గ్రంథప్రజలకు గానీ మరియు బహుదైవారాధకులకు (ముష్రికులకు) గానీ, మీ ప్రభువు నుండి మీకు ఏదైనా మేలు అవతరించడం ఎంత మాత్రం ఇష్టంలేదు. కానీ అల్లాహ్ తాను కోరిన వారినే తన కరుణకు ప్రత్యేకించుకుంటాడు. మరియు అల్లాహ్ అనుగ్ర హించటంలో సర్వోత్తముడు. 69 (3/4)


مَا نَنسَخْ مِنْ آيَةٍ أَوْ نُنسِهَا نَأْتِ بِخَيْرٍ مِّنْهَا أَوْ مِثْلِهَا ۗ أَلَمْ تَعْلَمْ أَنَّ اللَّـهَ عَلَىٰ لِّ شَيْءٍ قَدِيرٌ ١٠٦

* మేము మా ప్రవచనాలలో (ఆయాతులలో) ఒక దానిని రద్దుచేసినా లేక మర పింపజేసినా దాని స్థానంలో దానికంటే శ్రేష్ఠమైన దానిని లేక కనీసం దానితో సమానమైన దానిని తీసుకువస్తాము. ఏమీ? నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడని నీకు తెలియదా?


أَلَمْ تَعْلَمْ أَنَّ اللَّـهَ لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ وَمَا لَكُم مِّن دُونِ اللَّـهِ مِن وَلِيٍّ وَلَا نَصِيرٍ ١٠٧

ఏమీ? వాస్తవానికి, భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యం కేవలం అల్లాహ్ కే చెందు తుందని, నీకు తెలియదా? మరియు అల్లాహ్ తప్ప మిమ్మల్ని రక్షించేవాడు గానీ 70 సహాయం చేసేవాడు గానీ మరెవ్వడూ లేడు!


أَمْ تُرِيدُونَ أَن تَسْأَلُوا رَسُولَكُمْ كَمَا سُئِلَ مُوسَىٰ مِن قَبْلُ ۗ وَمَن يَتَبَدَّلِ الْكُفْرَ بِالْإِيمَانِ فَقَدْ ضَلَّ سَوَاءَ السَّبِيلِ ١٠٨

ఏమీ? పూర్వం (యూదులచే) మూసా ప్రశ్నించబడినట్లు, మీరు కూడా మీ ప్రవక్త (ము’హమ్మద్)ను ప్రశ్నించగోరుతున్నారా? మరియు ఎవడైతే, సత్య-తిరస్కారాన్ని, విశ్వా సానికి బదులుగా స్వీకరిస్తాడో! నిశ్చయంగా, వాడే సరైన మార్గం నుండి తప్పిపోయిన వాడు.


وَدَّ كَثِيرٌ مِّنْ أَهْلِ الْكِتَابِ لَوْ يَرُدُّونَكُم مِّن بَعْدِ إِيمَانِكُمْ كُفَّارًا حَسَدًا مِّنْ عِندِ أَنفُسِهِم مِّن بَعْدِ مَا تَبَيَّنَ لَهُمُ الْحَقُّ ۖ فَاعْفُوا وَاصْفَحُوا حَتَّىٰ يَأْتِيَ اللَّـهُ بِأَمْرِهِ ۗ إِنَّ اللَّـهَ عَلَىٰ لِّ شَيْءٍ قَدِيرٌ ١٠٩

గ్రంథ ప్రజలలోని పలువురు – వారి మనస్సులలో ఉన్న అసూయ వల్ల – సత్యం వారికి సుస్పష్టం అయినప్పటికీ, మీరు విశ్వసించిన తరువాత, మిమ్మల్ని ఏదో ఒక విధంగా, దాని (విశ్వాస మార్గం) నుండి మరల్చి, మళ్ళీ సత్య-తిరస్కారం వైపునకు తీసుకుపోదామని కోరుతుంటారు. అయితే (వారిపట్ల) అల్లాహ్ తన ఆదేశం ఇచ్చేవరకు, మీరు (వారిని) మన్నించండి, ఉపేక్షించండి. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు.


وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ ۚ وَمَا تُقَدِّمُوا لِأَنفُسِكُم مِّنْ خَيْرٍ تَجِدُوهُ عِندَ اللَّـهِ ۗ إِنَّ اللَّـهَ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ ١١٠

మరియు నమా’జ్ స్థాపించండి 71 విధిదానం (’జకాత్) ఇవ్వండి. మీరు ముందుగా చేసి పంపిన మంచి కార్యాలను మీరు అల్లాహ్ దగ్గర పొందుతారు. నిశ్చయంగా, అల్లాహ్ మీరు చేసేదంతా చూస్తున్నాడు.


وَقَالُوا لَن يَدْخُلَ الْجَنَّةَ إِلَّا مَن كَانَ هُودًا أَوْ نَصَارَىٰ ۗ تِلْكَ أَمَانِيُّهُمْ ۗ قُلْ هَاتُوا بُرْهَانَكُمْ إِن كُنتُمْ صَادِقِينَ ١١١

మరియు వారు: “యూదుడు లేదా క్రైస్త వుడుతప్ప, మరెవ్వడూ స్వర్గంలోప్రవేశించ లేడు!” అని అంటారు. ఇవి వారి అభిలాషలు మాత్రమే. వారిని ఇలా అడుగు: “మీరు సత్యవంతులే అయితే దానికి మీ నిదర్శనాలు చూపండి!”


بَلَىٰ مَنْ أَسْلَمَ وَجْهَهُ لِلَّـهِ وَهُوَ مُحْسِنٌ فَلَهُ أَجْرُهُ عِندَ رَبِّهِ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ ١١٢

వాస్తవానికి ఎవడైతే అల్లాహ్ కు విధైయుడై (ఇస్లాం స్వీకరించి) తన ముఖాన్ని (తనను-తాను) అల్లాహ్ కు అంకితం చేసుకొని, సజ్జనుడై ఉంటాడో! దానికి అతడు తన ప్రభువు వద్ద మంచి ప్రతిఫలం పొందుతాడు. 72 మరియు వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా!


وَقَالَتِ الْيَهُودُ لَيْسَتِ النَّصَارَىٰ عَلَىٰ شَيْءٍ وَقَالَتِ النَّصَارَىٰ لَيْسَتِ الْيَهُودُ عَلَىٰ شَيْءٍ وَهُمْ يَتْلُونَ الْكِتَابَ ۗ كَذَٰلِكَ قَالَ الَّذِينَ لَا يَعْلَمُونَ مِثْلَ قَوْلِهِمْ ۚ فَاللَّـهُ يَحْكُمُ بَيْنَهُمْ يَوْمَ الْقِيَامَةِ فِيمَا كَانُوا فِيهِ يَخْتَلِفُونَ ١١٣

మరియు యూదులు: “క్రైస్తవులవద్ద (సత్య-ధర్మమనేది) ఏమీ లేదు.” అని అంటారు. మరియు క్రైస్తవులు: “యూదుల వద్ద (సత్య- ధర్మమనేది) ఏమీ లేదు.” అని అంటారు. మరియు వారందరూ చదివేది దివ్యగ్రంథమే. ఇలాగే (దివ్యగ్రంథ) జ్ఞానంలేని వారు (బహు దైవారాధకులు) కూడా ఇదే విధంగా పలుకు తుంటారు. కావున వీరందరిలో ఉన్న అభిప్రాయ భేదాలను గురించి, అల్లాహ్ పునరుత్థాన దినమున వారి మధ్య తీర్పుచేస్తాడు.


وَمَنْ أَظْلَمُ مِمَّن مَّنَعَ مَسَاجِدَ اللَّـهِ أَن يُذْكَرَ فِيهَا اسْمُهُ وَسَعَىٰ فِي خَرَابِهَا ۚ أُولَـٰئِكَ مَا كَانَ لَهُمْ أَن يَدْخُلُوهَا إِلَّ خَائِفِينَ ۚ لَهُمْ فِي الدُّنْيَا خِزْيٌ وَلَهُمْ فِي الْآخِرَةِ عَذَابٌ عَظِيمٌ ١١٤

మరియు అల్లాహ్ మస్జిదులలో ఆయన నామ స్మరణం నిషేదించి వాటిని నాశనం చేయ టానికి పాటుపడే వారికంటే ఎక్కువ దుర్మార్గు లెవరు? అలాంటి వారు వాటి (మస్జిదుల)లో ప్రవేశించ టానికి అర్హులుకారు; వారు (ఒకవేళ ప్రవేశించినా) భయపడుతూ ప్రవేశించాలి. వారికి ఇహలోకంలో పరాభవం ఉంటుంది మరియు పరలోకంలో ఘోర శిక్ష ఉంటుంది.


وَلِلَّـهِ الْمَشْرِقُ وَالْمَغْرِبُ ۚ فَأَيْنَمَا تُوَلُّوا فَثَمَّ وَجْهُ اللَّـهِ ۚ إِنَّ اللَّـهَ وَاسِعٌ عَلِيمٌ ١١٥

మరియు తూర్పు పడమరలు అల్లాహ్ కే చెందినవి. కావున మీరు (మీముఖాలను) ఏ దిక్కు కు త్రిప్పినా మీకు అల్లాహ్ సముఖమే లభిస్తుంది. నిశ్చయంగా, అల్లాహ్, విస్తారుడు, 73సర్వజ్ఞుడు.


وَقَالُوا اتَّخَذَ اللَّـهُ وَلَدًا ۗ سُبْحَانَهُ ۖ بَل لَّهُ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ كُلٌّ لَّهُ قَانِتُونَ ١١٦

మరియు వారు: “అల్లాహ్ ఒక కుమారుణ్ణి కలిగి ఉన్నాడు (కన్నాడు).” అని అంటారు. ఆయన సర్వలోపాలకు అతీతుడు 74 వాస్తవానికి భూమ్యాకాశాలలో ఉన్నవన్నీ ఆయనకు చెందినవే. అవన్నీ ఆయనకు విధేయులై ఉన్నాయి. 75


بَدِيعُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ وَإِذَا قَضَىٰ أَمْرًا فَإِنَّمَا يَقُولُ لَهُ كُن فَيَكُونُ ١١٧

ఆయనే ఆకాశాలనూ మరియు భూమినీ ఏ నమూనా లేకుండా ఆరంభించిన (సృష్టించిన) 76 వాడు. మరియు ఆయన ఏదైనా చేయాలని నిర్ణ యించుకున్నప్పుడు దానికి కేవలం: “అయిపో!” అని ఆజ్ఞాపిస్తాడు. అంతే అది అయి పోతుంది. 77


وَقَالَ الَّذِينَ لَا يَعْلَمُونَ لَوْلَ يُكَلِّمُنَا اللَّـهُ أَوْ تَأْتِينَا آيَةٌ ۗ كَذَٰلِكَ قَالَ الَّذِينَ مِن قَبْلِهِم مِّثْلَ قَوْلِهِمْ ۘ تَشَابَهَتْ قُلُوبُهُمْ ۗ قَدْ بَيَّنَّا الْآيَاتِ لِقَوْمٍ يُوقِنُونَ ١١٨

మరియు అజ్ఞానులు: “అల్లాహ్ మాతో ఎందుకు మాట్లాడడు? లేక మా వద్దకు ఏదైనా సూచన (ఆయత్) ఎందుకు రాదు?” అని అడుగుతారు. వారికి పూర్వంవారు కూడా ఇదే విధంగా అడిగేవారు 78 వారందరి మనస్తత్వాలు (హృదయాలు) ఒకేవిధమైనవి. వాస్తవానికి, దృఢనమ్మకం ఉన్నవారికి మేము మా సూచన (ఆయాత్)లను స్పష్టపరుస్తాము.


إِنَّا أَرْسَلْنَاكَ بِالْحَقِّ بَشِيرًا وَنَذِيرًا ۖ وَلَا تُسْأَلُ عَنْ أَصْحَابِ الْجَحِيمِ ١١٩

నిశ్చయంగా, మేము నిన్ను (ఓ ము’హమ్మద్!) సత్యాన్ని ప్రసాదించి, శుభవార్త నిచ్చేవానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా పంపాము. మరియు భగభగ మండే నరకాగ్నికి గురిఅయ్యే వారినిగురించి నీవు ప్రశ్నించబడవు. 79


وَلَن تَرْضَىٰ عَنكَ الْيَهُودُ وَلَا النَّصَارَىٰ حَتَّىٰ تَتَّبِعَ مِلَّتَهُمْ ۗ قُلْ إِنَّ هُدَى اللَّـهِ هُوَ الْهُدَىٰ ۗ وَلَئِنِ اتَّبَعْتَ أَهْوَاءَهُم بَعْدَ الَّذِي جَاءَكَ مِنَ الْعِلْمِ ۙ مَا لَكَ مِنَ اللَّـهِ مِن وَلِيٍّ وَلَ نَصِيرٍ ١٢٠

మరియు యూదులైనా, క్రైస్తవులైనా నీవు వారి మతమును అనుసరించే వరకూ, వారు నీతో ప్రసన్నులు కారు. నీవు: “నిశ్చయంగా, అల్లాహ్ చూపిన మార్గమే సన్మార్గం.” అని చెప్పు. మరియు నీకు జ్ఞానం లభించిన తరువాత కూడా, నీవు వారి కోరికలను అనుసరిస్తే, అల్లాహ్ (శిక్ష) నుండి నిన్ను రక్షించే వాడు గానీ, సహాయపడే వాడు గానీ ఎవ్వడూ ఉండడు.


الَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَتْلُونَهُ حَقَّ تِلَاوَتِهِ أُولَـٰئِكَ يُؤْمِنُونَ بِهِ ۗ وَمَن يَكْفُرْ بِهِ فَأُولَـٰئِكَ هُمُ الْخَاسِرُونَ ١٢١

మేము దివ్యగ్రంథాన్ని ప్రసాదించిన వారు (యూదులు మరియు క్రైస్తవులు) దానిని (తమ గ్రంథాన్ని) కర్తవ్యంతో పఠించవలసిన విధంగా పఠిస్తే, అలాంటి వారు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసిస్తారు. మరియు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) తిరస్కరించే వారే నష్టపడు వారు. 80


يَا بَنِي إِسْرَائِيلَ اذْكُرُوا نِعْمَتِيَ الَّتِي أَنْعَمْتُ عَلَيْكُمْ وَأَنِّي فَضَّلْتُكُمْ عَلَى الْعَالَمِينَ ١٢٢

ఓ ఇస్రాయీల్ సంతతి వారలారా! నేను మీకు ప్రసాదించిన అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకోండి మరియు నిశ్చయంగా, నేను మిమ్మల్ని (మీ కాలంలోని) సర్వలోకాల వారికంటే ఎక్కువగా ఆదరించాను.


وَاتَّقُوا يَوْمًا لَّا تَجْزِي نَفْسٌ عَن نَّفْسٍ شَيْئًا وَلَا يُقْبَلُ مِنْهَا عَدْلٌ وَلَا تَنفَعُهَا شَفَاعَةٌ وَلَا هُمْ يُنصَرُونَ ١٢٣

మరియు ఆ (పునరుత్థాన) దినాన్ని గురించి భయభీతి కలిగి ఉండండి, ఆ నాడు ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తికి ఏమాత్రమూ ఉపయోగ పడలేడు. మరియు ఎవడి నుండీ ఎలాంటి పరిహారం స్వీకరించబడదు. మరియు ఎవడికీ సిఫారసూ లాభదాయకం కాజాలదు మరియు వారి కెలాంటి సహాయమూ లభించదు. (7/8)


وَإِذِ ابْتَلَىٰ إِبْرَاهِيمَ رَبُّهُ بِكَلِمَاتٍ فَأَتَمَّهُنَّ ۖ قَالَ إِنِّي جَاعِلُكَ لِلنَّاسِ إِمَامًا ۖ قَالَ وَمِن ذُرِّيَّتِي ۖ قَالَ لَا يَنَالُ عَهْدِي الظَّالِمِينَ ١٢٤

* మరియు ఇబ్రాహీమ్ ను అతని ప్రభువు (కొన్ని) ఉత్తరువులిచ్చి పరీక్షించిన విషయాన్ని (జ్ఞాపకం చేసుకోండి). వాటి అన్నింటిలో అతను నెగ్గాడు. అప్పుడు ఆయన (అల్లాహ్): “నిశ్చ యంగా నేను నిన్ను మానవజాతికి నాయకునిగా చేస్తున్నాను.” అనిఅన్నాడు. (దానికి ఇబ్రాహీమ్): “మరి నా సంతతి వారు?” అని అడిగాడు. 81 (దానికి అల్లాహ్): “నా వాగ్దానం దుర్మార్గులైన వారికి వర్తించదు.” అని జవాబిచ్చాడు. 82


وَإِذْ جَعَلْنَا الْبَيْتَ مَثَابَةً لِّلنَّاسِ وَأَمْنًا وَاتَّخِذُوا مِن مَّقَامِ إِبْرَاهِيمَ مُصَلًّى ۖ وَعَهِدْنَا إِلَىٰ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ أَن طَهِّرَا بَيْتِيَ لِلطَّائِفِينَ وَالْعَاكِفِينَ وَالرُّكَّعِ السُّجُودِ ١٢٥

మరియు ఈ (క’అబహ్) గృహాన్ని మేము మానవులకు తరచుగా సందర్శించే కేంద్రం (పుణ్య స్థలం) గా మరియు శాంతి నిలయంగా చేసి; 83 ఇబ్రా హీమ్ నిలబడిన చోటును మీరు నమా’జ్ చేసే స్థలంగా చేసుకోండన్న 84 విషయాన్ని (జ్ఞాపకం చేసుకోండి). మరియు మేము ఇబ్రాహీమ్ మరియు ఇస్మా’యీల్ లకు: “నా ఈ గృహాన్ని ప్రదక్షిణ చేసేవారి కొరకూ, ఏకాంత ధ్యానం (’ఏతికాఫ్) పాటించేవారి కొరకూ, వంగే (రుకూ’ఉ చేసే) వారి కొరకూ మరియు సజ్దాలు చేసేవారి కొరకూ పరిశు ధ్ధంగా ఉంచండి.” అని నిర్దేశించాము.


وَإِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّ اجْعَلْ هَـٰذَا بَلَدًا آمِنًا وَارْزُقْ أَهْلَهُ مِنَ الثَّمَرَاتِ مَنْ آمَنَ مِنْهُم بِاللَّـهِ وَالْيَوْمِ الْآخِرِ ۖ قَالَ وَمَن كَفَرَ فَأُمَتِّعُهُ قَلِيلًا ثُمَّ أَضْطَرُّهُ إِلَىٰ عَذَابِ النَّارِ ۖ وَبِئْسَ الْمَصِيرُ ١٢٦

మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఇబ్రాహీమ్: “ఓ నా ప్రభూ! ఈ నగరాన్ని (మక్కహ్ ను) శాంతియుతమైన నగరంగా చేసి, ఇందు నివసించే వారిలో, అల్లాహ్ ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించేవారికి అన్నిరకాల ఫలాలను జీవనో పాధిగా నొసంగు.” అని ప్రార్థించినప్పుడు, (అల్లాహ్): “మరియు ఎవడు సత్య-తిరస్కారి అవుతాడో అతనికి నేను ఆనందించటానికి కొంతకాలం విడిచిపెడ్తాను. తరువాత అతనిని నరకాగ్నిలోకి బలవంతంగా త్రోసివేస్తాను. అది ఎంత దుర్భరమైన గమ్యస్థానం!” అని అన్నాడు.


وَإِذْ يَرْفَعُ إِبْرَاهِيمُ الْقَوَاعِدَ مِنَ الْبَيْتِ وَإِسْمَاعِيلُ رَبَّنَا تَقَبَّلْ مِنَّا ۖ إِنَّكَ أَنتَ السَّمِيعُ الْعَلِيمُ ١٢٧

మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఇబ్రాహీమ్ మరియు ఇస్మా’యీల్ ఈ గృహపు (క’అబహ్) పునాదులను ఎత్తేటపుడు (ఈ విధంగా ప్రార్థించారు): “ఓ మా ప్రభూ! మా ఈసేవను స్వీకరించు. నిశ్చయంగా నీవు మాత్రమే సర్వం వినేవాడవు, 85 సర్వజ్ఞుడవు. 86


رَبَّنَا وَاجْعَلْنَا مُسْلِمَيْنِ لَكَ وَمِن ذُرِّيَّتِنَا أُمَّةً مُّسْلِمَةً لَّكَ وَأَرِنَا مَنَاسِكَنَا وَتُبْ عَلَيْنَا ۖ إِنَّكَ أَنتَ التَّوَّابُ الرَّحِيمُ ١٢٨

“ఓ మా ప్రభూ! మమ్మల్ని నీకు విధేయులుగా (ముస్లింలుగా) చేయి మరియు మా సంతతి నుండి ఒక సంఘాన్ని నీకు విధేయులుగా (ముస్లింలుగా) ఉండునట్లు చేయి. మరియు మాకు, మా ఆరాధనా రీతులను (మనాసిక్ లను) తెలుపు మరియు మా పశ్చాత్తాపాన్ని అంగీక రించు. నిశ్చయంగా నీవే పశ్చాత్తాపాన్ని అంగీక రించేవాడవు, అపార కరుణాప్రదాతవు.


رَبَّنَا وَابْعَثْ فِيهِمْ رَسُولًا مِّنْهُمْ يَتْلُو عَلَيْهِمْ آيَاتِكَ وَيُعَلِّمُهُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَيُزَكِّيهِمْ ۚ إِنَّكَ أَنتَ الْعَزِيزُ الْحَكِيمُ ١٢٩

“ఓ మా ప్రభూ! వీరిలో నుండి నీ సందేశా లను చదివి వినిపించుటకునూ, నీ గ్రంథాన్ని నేర్పు టకునూ, దివ్యజ్ఞానాన్ని బోధించుటకునూ మరియు వారిని పరిశుధ్ధులుగా మార్చుటకునూ ఒకసందేశహరుణ్ణి పంపు 87 నిశ్చయంగా, నీవే సర్వ శక్తిమంతుడవు, 88 మహా వివేకవంతుడవు.”


وَمَن يَرْغَبُ عَن مِّلَّةِ إِبْرَاهِيمَ إِلَّا مَن سَفِهَ نَفْسَهُ ۚ وَلَقَدِ اصْطَفَيْنَاهُ فِي الدُّنْيَا ۖ وَإِنَّهُ فِي الْآخِرَةِ لَمِنَ الصَّالِحِينَ ١٣٠

మరియు ఇబ్రాహీమ్ మతం నుండి విముఖుడయ్యే వాడెవడు, తనను తాను అవివేకిగా చేసుకొనువాడు తప్ప? వాస్తవానికి మేము అతనిని (ఇబ్రాహీమ్ ను) ఈ లోకంలో ఎన్నుకున్నాము. మరియు నిశ్చయంగా అతను పరలోకంలో సద్వర్తనులతో పాటు ఉంటాడు.


إِذْ قَالَ لَهُ رَبُّهُ أَسْلِمْ ۖ قَالَ أَسْلَمْتُ لِرَبِّ الْعَالَمِينَ ١٣١

అతని ప్రభువు అతనితో: “(మాకు) విధేయుడవుగా (ముస్లింగా) ఉండు.” అని అన్నప్పుడు అతను: “నేను సర్వలోకాల ప్రభువునకు విధేయుడను (ముస్లింను) అయి పోయాను.” అని జవాబిచ్చాడు.


وَوَصَّىٰ بِهَا إِبْرَاهِيمُ بَنِيهِ وَيَعْقُوبُ يَا بَنِيَّ إِنَّ اللَّـهَ اصْطَفَىٰ لَكُمُ الدِّينَ فَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسْلِمُونَ ١٣٢

మరియు ఇబ్రాహీమ్ తన సంతానాన్ని దీనిలోనే (ఈ ఇస్లాం మార్గంలోనే) నడవండని బోధించాడు. మరియు య’అఖూబ్ కూడా తన (సంతానంతో అన్నాడు): “నా బిడ్డలారా! నిశ్చ యంగా అల్లాహ్ మీ కొరకు ఈ ధర్మాన్నే నియ మించి ఉన్నాడు. కావున మీరు అల్లాహ్ కు విధే యులు (ముస్లింలు) కాకుండా మరణించకండి!” 89


أَمْ كُنتُمْ شُهَدَاءَ إِذْ حَضَرَ يَعْقُوبَ الْمَوْتُ إِذْ قَالَ لِبَنِيهِ مَا تَعْبُدُونَ مِن بَعْدِي قَالُوا نَعْبُدُ إِلَـٰهَكَ وَإِلَـٰهَ آبَائِكَ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ إِلَـٰهًا وَاحِدًا وَنَحْنُ لَهُ مُسْلِمُونَ ١٣٣

ఏమీ? య’అఖూబ్ కు మరణం సమీపించి నప్పుడు, మీరు అక్కడ ఉన్నారా? 90 అప్పుడ తను తన కుమారులతో: “నా తరువాత మీరు ఎవరిని ఆరాధిస్తారు?” అని అడిగినప్పుడు. వార న్నారు: “నీ ఆరాధ్య దైవం మరియు నీ పూర్వికు లగు ఇబ్రాహీమ్, ఇస్మా’యీల్ మరియు ఇస్’హాఖ్ ల ఆరాధ్య దైవమైన ఆ ఏకైక 91 దేవుణ్ణి (అల్లాహ్ నే), మేము ఆరాధిస్తాము మరియు మేము ఆయ నకే విధేయులమై (ముస్లింలమై) ఉంటాము.”


تِلْكَ أُمَّةٌ قَدْ خَلَتْ ۖ لَهَا مَا كَسَبَتْ وَلَكُم مَّا كَسَبْتُمْ ۖ وَلَا تُسْأَلُونَ عَمَّا كَانُوا يَعْمَلُونَ ١٣٤

అది ఒక గతించిన సమాజం. దాని కర్మల ఫలితం దానికి మరియు మీ కర్మలది మీకు. మరియు వారు చేస్తూ ఉండిన కర్మలను గురించి మీరు ప్రశ్మించబడరు.


وَقَالُوا كُونُوا هُودًا أَوْ نَصَارَىٰ تَهْتَدُوا ۗ قُلْ بَلْ مِلَّةَ إِبْرَاهِيمَ حَنِيفًا ۖ وَمَا كَانَ مِنَ الْمُشْرِكِينَ ١٣٥

మరియు వారంటారు: “మీరు యూదు లుగా లేదా క్రైస్తవులుగా ఉంటేనే మీకు మార్గ దర్శకత్వం లభిస్తుంది!” వారితో అను: “వాస్తవానికి, మేము (అనుసరించేది) ఇబ్రాహీమ్ మతం, ఏకైకదైవ సిధ్ధాంతం (’హనీఫా). మరియు అతను బహుదైవారాధకుడు కాడు.” 92


قُولُوا آمَنَّا بِاللَّـهِ وَمَا أُنزِلَ إِلَيْنَا وَمَا أُنزِلَ إِلَىٰ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ وَالْأَسْبَاطِ وَمَا أُوتِيَ مُوسَىٰ وَعِيسَىٰ وَمَا أُوتِيَ النَّبِيُّونَ مِن رَّبِّهِمْ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِّنْهُمْ وَنَحْنُ لَهُ مُسْلِمُونَ ١٣٦

(ఓ ముస్లింలారా!) మీరు ఇలా అనండి: “మేము అల్లాహ్ ను మరియు ఆయన మా కొరకు అవతరింపజేసిన సందేశాలను మరియు ఇబ్రాహీమ్ ఇస్మా’యీల్, ఇస్’హాఖ్, య’అఖూబ్ మరియు అతని సంతతి వారికి ఇవ్వబడిన వాటినీ మరియు మూసా, ’ఈసా మరియు ఇతర ప్రవక్త లందరికీ వారి ప్రభువు తరఫు నుండి ఇవ్వబడిన వాటినీ (సందేశాలను) విశ్వసిస్తాము. వారిలో ఏ ఒక్కరి పట్లా మేము భేదభావం చూపము. మేము ఆయనకు విధేయులం (ముస్లింలం) అయ్యాము.”


فَإِنْ آمَنُوا بِمِثْلِ مَا آمَنتُم بِهِ فَقَدِ اهْتَدَوا ۖ وَّإِن تَوَلَّوْا فَإِنَّمَا هُمْ فِي شِقَاقٍ ۖ فَسَيَكْفِيكَهُمُ اللَّـهُ ۚ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ ١٣٧

వారు కూడా మీరు విశ్వసించినట్లు విశ్వ సిస్తే, వారు సన్మార్గం పొందిన వారవుతారు. ఒకవేళ వారు తిరిగిపోతే, విరోధం వహించిన వారవుతారు. (వారి నుండి రక్షించటానికి) మీకు అల్లాహ్ చాలు. ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.


صِبْغَةَ اللَّـهِ ۖ وَمَنْ أَحْسَنُ مِنَ اللَّـهِ صِبْغَةً ۖ وَنَحْنُ لَهُ عَابِدُونَ ١٣٨

(వారితో ఇలా అను): “(మీరు) అల్లాహ్ రంగును (ధర్మాన్ని) స్వీకరించండి. మరియు అల్లాహ్ కంటే మంచి రంగు (ధర్మం) ఎవరిది? మరియు మేము ఆయనను మాత్రమే ఆరాధించే వారము.” 93


قُلْ أَتُحَاجُّونَنَا فِي اللَّـهِ وَهُوَ رَبُّنَا وَرَبُّكُمْ وَلَنَا أَعْمَالُنَا وَلَكُمْ أَعْمَالُكُمْ وَنَحْنُ لَهُ مُخْلِصُونَ ١٣٩

(ఓ ము’హమ్మద్!) వారితో అను: “ఏమీ? అల్లాహ్ విషయంలో మీరు మాతో వాదిస్తారా? (వాస్తవానికి) ఆయన మా ప్రభువు మరియు మీ ప్రభువు కూడాను. మా కర్మలు మాకు మరియు మీ కర్మలు మీకు. మరియు మేము ఆయనకు మాత్రమే మనఃపూర్వకంగా విధేయులమయ్యాము.”


أَمْ تَقُولُونَ إِنَّ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ وَالْأَسْبَاطَ كَانُوا هُودًا أَوْ نَصَارَىٰ ۗ قُلْ أَأَنتُمْ أَعْلَمُ أَمِ اللَّـهُ ۗ وَمَنْ أَظْلَمُ مِمَّن كَتَمَ شَهَادَةً عِندَهُ مِنَ اللَّـهِ ۗ وَمَا اللَّـهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ ١٤٠

లేక మీరు: “నిశ్చయంగా ఇబ్రాహీమ్, ఇస్మా’యీల్, ఇస్’హాఖ్, య’అఖూబ్ మరియు వారి సంతతి వారంతా యూదులు మరియు క్రైస్తవులు.” అని అంటారా? ఇంకా ఇలా అను: “ఏమీ మీకు బాగా తెలుసా? లేక అల్లాహ్ కు (బాగా తెలుసా)? అల్లాహ్ వద్ద నుండి తన వద్దకు వచ్చిన సాక్ష్యాన్ని దాచే వాని కంటే ఎక్కువ దుర్మార్గుడెవడు? మరియు మీ కర్మల నుండి, అల్లాహ్ నిర్లక్ష్యంగా లేడు!”


تِلْكَ أُمَّةٌ قَدْ خَلَتْ ۖ لَهَا مَا كَسَبَتْ وَلَكُم مَّا كَسَبْتُمْ ۖ وَلَا تُسْأَلُونَ عَمَّا كَانُوا يَعْمَلُونَ ١٤١

“ఇప్పుడు ఆ సంఘం గతించి పోయింది. అది చేసింది దానికి మరియు మీరు చేసింది మీకు. వారు చేస్తూ ఉండిన కర్మలను గురించి మీరు ప్రశ్నించబడరు.” 94

سَيَقُولُ السُّفَهَاءُ مِنَ النَّاسِ مَا وَلَّاهُمْ عَن قِبْلَتِهِمُ الَّتِي كَانُوا عَلَيْهَا قُل لِّلَّـهِ وَالْمَغْرِبُ يَهْدِي مَن يَشَاءُ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ ١٤٢

[(*)] ప్రజలలోని కొందరు మూఢజనులు ఇలా అంటారు: ''వీరిని (ముస్లింలను) ఇంత వరకు వీరు అనుసరిస్తూవచ్చిన, ఖిబ్లానుండి త్రిప్పింది ఏమిటీ?'' 95 వారితో ఇలా అను: ''తూర్పు మరియు పడమరలు అల్లాహ్‌కే చెందినవి. ఆయన తాను కోరిన వారికి బుజుమార్గం వైపునకు మార్గ దర్శకత్వం చేస్తాడు.''


وَكَذَٰلِكَ جَعَلْنَاكُمْ أُمَّةً وَسَطًا لِّتَكُونُوا شُهَدَاءَ عَلَى النَّاسِ وَيَكُونَ الرَّسُولُ عَلَيْكُمْ شَهِيدًا وَمَا جَعَلْنَا الْقِبْلَةَ الَّتِي كُنتَ عَلَيْهَا إِلَّا لِنَعْلَمَ مَن يَتَّبِعُ الرَّسُولَ مِمَّن يَنقَلِبُ عَلَىٰ عَقِبَيْهِ وَإِن كَانَتْ لَكَبِيرَةً إِلَّا عَلَى الَّذِينَ هَدَى اللَّـهُ وَمَا كَانَ اللَّـهُ لِيُضِيعَ إِيمَانَكُمْ إِنَّ اللَّـهَ بِالنَّاسِ لَرَءُوفٌ رَّحِيمٌ ١٤٣

మరియు మీరు ప్రజలకు సాక్షులుగా ఉండ టానికి మరియు సందేశహరుడు (ము'హమ్మద్‌) మీకు సాక్షిగా ఉండటానికి 96 మేము మిమ్మల్ని ఒక మధ్యస్థ (ఉత్తమ మరియు న్యాయశీలమైన) సమాజంగా చేశాము. మరియు ఎవరు సందేశ హరుణ్ణి అనుసరిస్తారో మరియు ఎవరు తమ మడ మల మీద వెనుదిరిగిపోతారో అనేది పరిశీలించ డానికి, నీవు పూర్వం అనుసరించే ఖిబ్లా (బైతుల్‌ - మఖ్దిస్‌)ను, ఖిబ్లాగా చేసి ఉన్నాము. మరియు ఇది వాస్తవానికి అల్లాహ్‌ మార్గదర్శకత్వం చూపిన వారికి తప్ప, ఇతరులకు భారమైనది. మరియు అల్లాహ్‌ మీ విశ్వాసాన్ని (బైతుల్‌-మఖ్దిస్‌ వైపునకు చేసిన నమా'జులను) ఎన్నడూ వృథాచేయడు 97 నిశ్చయంగా, అల్లాహ్‌ ప్రజల పట్ల కనికరుడు, అపార కరుణాప్రదాత.


قَدْ نَرَىٰ تَقَلُّبَ وَجْهِكَ فِي السَّمَاءِ فَلَنُوَلِّيَنَّكَ قِبْلَةً تَرْضَاهَا فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِ وَحَيْثُ مَا كُنتُمْ فَوَلُّوا وُجُوهَكُمْ شَطْرَهُ وَإِنَّ الَّذِينَ أُوتُوا الْكِتَابَ لَيَعْلَمُونَ أَنَّهُ الْحَقُّ مِن رَّبِّهِمْ وَمَا اللَّـهُ بِغَافِلٍ عَمَّا يَعْمَلُونَ ١٤٤

(ఓ ప్రవక్తా!) వాస్తవానికి మేము, నీవు పలుమార్లు నీ ముఖాన్ని ఆకాశం వైపునకు ఎత్తడం చూశాము. కావున మేము నిన్ను నీవు కోరిన ఖిబ్లా వైపునకు త్రిప్పుతున్నాము. కావున, నీవు మస్జిద్‌ అల్‌ -'హరామ్‌ వైపునకు నీ ముఖాన్ని త్రిప్పుకో! ఇకపై మీరంతా ఎక్కడున్నా సరే (నమా'జ్‌ చేసేటప్పుడు), మీ ముఖాలను ఆవైపునకే త్రిప్పుకోండి. మరియు నిశ్చయంగా, గ్రంథం గలవారికి ఇది తమ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యమని బాగా తెలుసు 98 మరియు అల్లాహ్‌ వారి కర్మల గురించి నిర్లక్ష్యంగా లేడు.


وَلَئِنْ أَتَيْتَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ بِكُلِّ آيَةٍ مَّا تَبِعُوا قِبْلَتَكَ وَمَا أَنتَ بِتَابِعٍ قِبْلَتَهُمْ وَمَا بَعْضُهُم بِتَابِعٍ قِبْلَةَ بَعْضٍ وَلَئِنِ اتَّبَعْتَ أَهْوَاءَهُم مِّن بَعْدِ مَا جَاءَكَ مِنَ الْعِلْمِ إِنَّكَ إِذًا لَّمِنَ الظَّالِمِينَ ١٤٥

మరియు నీవు గ్రంథ ప్రజలకు ఎన్ని సూచనలు (ఆయాత్‌) చూపినా, వారు నీ ఖిబ్లాను అనుసరించరు. మరియు నీవు కూడా వారి ఖిబ్లాను అనుసరించలేవు. మరియు వారిలో ఒక వర్గం వారు, మరొక వర్గం వారి ఖిబ్లాను అనుసరించరు 99 మరియు నీవు ఈ జ్ఞానం పొందిన తరువాత కూడా వారి మనోవాంఛలను అనుసరిస్తే! నిశ్చయంగా, నీవు దుర్మార్గులలో చేరిన వాడవవుతావు.


الَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَعْرِفُونَهُ كَمَا يَعْرِفُونَ أَبْنَاءَهُمْ ۖ وَإِنَّ فَرِيقًا مِّنْهُمْ لَيَكْتُمُونَ الْحَقَّ وَهُمْ يَعْلَمُونَ ١٤٦

మేము గ్రంథాన్ని ప్రసాదించిన వారు తమ కుమారులను ఏవిధంగా గుర్తిస్తారో ఇతనిని (ము'హమ్మద్‌ను) కూడా ఆవిధంగా గుర్తిస్తారు. మరియు వాస్తవానికి వారిలోని ఒక వర్గంవారు తెలిసి కూడా సత్యాన్ని దాస్తున్నారు. 100


الْحَقُّ مِن رَّبِّكَ ۖ فَلَا تَكُونَنَّ مِنَ الْمُمْتَرِينَ ١٤٧

(నిస్సందేహంగా!) ఇది నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. కావున నీవు సందేహించే వారిలో ఏ మాత్రం చేరకు!


وَلِكُلٍّ وِجْهَةٌ هُوَ مُوَلِّيهَا ۖ فَاسْتَبِقُوا الْخَيْرَاتِ ۚ أَيْنَ مَا تَكُونُوا يَأْتِ بِكُمُ اللَّـهُ جَمِيعًا ۚ إِنَّ اللَّـهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ١٤٨

మరియు ప్రతి ఒక (సంఘం) ఒక దిశ వైపునకు ముఖం త్రిప్పుతుంది. 101 కావున మీరు మంచిపనులు చేయటానికి త్వరపడండి. మీరెక్కడున్నా సరే, అల్లాహ్‌ మీ అందరినీ (తీర్పుదినంనాడు తన సన్నిధిలోకి) రప్పిస్తాడు. నిశ్చయంగా! అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడు.


وَمِنْ حَيْثُ خَرَجْتَ فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِ ۖ وَإِنَّهُ لَلْحَقُّ مِن رَّبِّكَ ۗ وَمَا اللَّـهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ ١٤٩

మరియు నీవు ఎక్కడికి బయలుదేరినా సరే! నీ ముఖాన్ని (నమా'జ్‌లో) మస్జిద్‌ అల్‌- 'హరామ్‌ వైపునకే త్రిప్పుకో. మరియు నిశ్చయంగా, ఇది నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. మరియు అల్లాహ్‌ మీ కర్మల పట్ల నిర్లక్ష్యంగా లేడు.


وَمِنْ حَيْثُ خَرَجْتَ فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِ ۚ وَحَيْثُ مَا كُنتُمْ فَوَلُّوا وُجُوهَكُمْ شَطْرَهُ لِئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَيْكُمْ حُجَّةٌ إِلَّا الَّذِينَ ظَلَمُوا مِنْهُمْ فَلَا تَخْشَوْهُمْ وَاخْشَوْنِي وَلِأُتِمَّ نِعْمَتِي عَلَيْكُمْ وَلَعَلَّكُمْ تَهْتَدُونَ ١٥٠

మరియు నీవు ఎక్కడికి బయలుదేరినా సరే! నీ ముఖాన్ని (నమా'జ్‌లో) మస్జిద్‌ అల్‌- 'హరామ్‌ వైపునకే త్రిప్పుకో. మరియు మీరెక్క డున్నా సరే, మీ ముఖాలను దాని వైపునకే త్రిప్పు కోండి. దీని వల్ల మీకు వ్యతిరేకంగా వాదించటానికి ప్రజలకు అవకాశం దొరుకదు. కాని వారిలో దుర్మార్గులైనవారు (ఎలాంటి పరిస్థితులలోనూ ఊరుకోరు) అందుకని వారికి భయపడకండి, నాకే భయపడండి! మరియు ఈ విధంగా నేను మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేయటానికి. మరియు బహుశా, ఈ విధంగానైనా మీరు మార్గదర్శకత్వం పొందవచ్చు!


كَمَا أَرْسَلْنَا فِيكُمْ رَسُولًا مِّنكُمْ يَتْلُو يَتْلُو عَلَيْكُمْ آيَاتِنَا وَيُزَكِّيكُمْ وَيُعَلِّمُكُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَيُعَلِّمُكُم مَّا لَمْ تَكُونُوا تَعْلَمُونَ ١٥١

ఈ విధంగా మేము మీ వారిలో నుండియే – మా సూచనలను మీ ఎదుట వినిపించటానికి మరియు మిమ్మల్ని సంస్కరించటానికి మరియు మీకు గ్రంథాన్ని మరియు వివేకాన్ని బోధించటానికి మరియు మీకు తెలియని విషయాలు నేర్పటానికి – ఒక ప్రవక్త (ము'హమ్మద్‌) ను మీ వద్దకు పంపాము.


فَاذْكُرُونِي أَذْكُرْكُمْ وَاشْكُرُوا لِ وَلَا تَكْفُرُونِ ١٥٢

కావున మీరు నన్నే స్మరించండి, నేను కూడా మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటాను. మరియు నాకు కృతజ్ఞులై ఉండండి మరియు నాకు కృతఘ్నులు కాకండి. 102


يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اسْتَعِينُوا بِالصَّبْرِ وَالصَّلَاةِ ۚ إِنَّ اللَّـهَ مَعَ الصَّابِرِينَ ١٥٣

ఓ విశ్వాసులారా! సహనం మరియు నమా'జ్‌ ద్వారా సహాయం అర్థించండి. నిశ్చయంగా అల్లాహ్‌ సహనం గలవారితో ఉంటాడు. 103


وَلَا تَقُولُوا لِمَن يُقْتَلُ فِي سَبِيلِ اللَّـهِ أَمْوَاتٌ ۚ بَلْ أَحْيَاءٌ وَلَـٰكِن لَّا تَشْعُرُونَ ١٥٤

మరియు అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని 'మృతులు,' అనకండి! 104 వాస్తవానికి వారు సజీవులు. కాని మీరది గ్రహించజాలరు.


وَلَنَبْلُوَنَّكُم بِشَيْءٍ مِّنَ الْخَوْفِ وَالْجُوعِ وَنَقْصٍ مِّنَ الْأَمْوَالِ وَالْأَنفُسِ وَالثَّمَرَاتِ ۗ وَبَشِّرِ الصَّابِرِينَ ١٥٥

మరియు నిశ్చయంగా మేము, మిమ్మల్ని భయ-ప్రమాదాలకు, ఆకలి బాధలకు, ధన, ప్రాణ, ఫల (ఆదాయాల) నష్టానికీ గురిచేసి పరీక్షిస్తాము. మరియు (ఇలాంటి పరిస్థితులలో) మనఃస్థైర్యంతో ఉండేవారికి శుభవార్తనివ్వు.


الَّذِينَ إِذَا أَصَابَتْهُم مُّصِيبَةٌ قَالُوا إِنَّا لِلَّـهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ ١٥٦

ఎవరైతే విపత్కరమైన పరిస్థితి ఏర్పడి నప్పుడు: ''నిశ్చయంగా, మేము అల్లాహ్‌కే చెందిన వారము! మరియు మేము ఆయన వైపునకే మరలి పోతాము!'' అని అంటారో!


أُولَـٰئِكَ عَلَيْهِمْ صَلَوَاتٌ مِّن رَّبِّهِمْ وَرَحْمَةٌ ۖ وَأُولَـٰئِكَ هُمُ الْمُهْتَدُونَ ١٥٧

అలాంటి వారికి వారి ప్రభువు నుండి అను గ్రహాలు 105 మరియు కరుణ ఉంటాయి. మరియు వారే సన్మార్గం పొందినవారు. 106 (1/8)


إِنَّ الصَّفَا وَالْمَرْوَةَ مِن شَعَائِرِ اللَّـهِ فَمَنْ حَجَّ الْبَيْتَ أَوِ اعْتَمَرَ فَلَا جُنَاحَ عَلَيْهِ أَن يَطَّوَّفَ بِهِمَا ۚ وَمَن تَطَوَّعَ خَيْرًا فَإِنَّ اللَّـهَ شَاكِرٌ عَلِيمٌ ١٥٨

* నిశ్చయంగా, 'సఫా మరియు మర్వాలు అల్లాహ్‌ చూపిన చిహ్నాలు. 107 కావున ఎవడు (క'అబహ్) గృహానికి 'హజ్జ్‌ లేక 'ఉమ్రా కొరకు పోతాడో, 108 అతడు ఈ రెంటి మధ్య పచార్లు (స'యీ) చేస్తే, అతనికి ఎట్టి దోషం లేదు. మరియు ఎవడైనా స్వేచ్ఛాపూర్వకంగా మంచి కార్యం చేస్తే! నిశ్చయంగా, అల్లాహ్‌ కృతజ్ఞతలను ఆమోదించే వాడు, 109 సర్వజ్ఞుడు.


إِنَّ الَّذِينَ يَكْتُمُونَ مَا أَنزَلْنَا مِنَ الْبَيِّنَاتِ وَالْهُدَىٰ مِن بَعْدِ مَا بَيَّنَّاهُ لِلنَّاسِ فِي الْكِتَابِ ۙ أُولَـٰئِكَ يَلْعَنُهُمُ اللَّـهُ وَيَلْعَنُهُمُ اللَّاعِنُونَ ١٥٩

నిశ్చయంగా, ఎవరైతే మేము అవతరింప జేసిన స్పష్టమైన బోధనలను, మార్గదర్శకత్వా లను – ప్రజల కొరకు దివ్యగ్రంథంలో స్పష్టపరచిన పిదప కూడా – దాచుతారో! వారిని అల్లాహ్‌ తప్పక శపిస్తాడు (బహిష్కరిస్తాడు). మరియు శపించగలవారు కూడా వారిని శపిస్తారు. 110


إِلَّا الَّذِينَ تَابُوا وَأَصْلَحُوا وَبَيَّنُوا فَأُولَـٰئِكَ أَتُوبُ عَلَيْهِمْ ۚ وَأَنَا التَّوَّابُ الرَّحِيمُ ١٦٠

కాని ఎవరైతే పశ్చాత్తాపపడతారో మరియు తమ నడవడికను సంస్కరించుకుంటారో మరియు సత్యాన్ని వెల్లడిస్తారో, అలాంటి వారి పశ్చాత్తాపాన్ని నేను అంగీకరిస్తాను. మరియు నేను మాత్రమే పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడను, 111 అపార కరుణాప్రదాతను.


إِنَّ الَّذِينَ كَفَرُوا وَمَاتُوا وَهُمْ كُفَّارٌ أُولَـٰئِكَ عَلَيْهِمْ لَعْنَةُ اللَّـهِ وَالْمَلَائِكَةِ وَالنَّاسِ أَجْمَعِينَ ١٦١

నిశ్చయంగా, ఎవరైతే సత్యతిరస్కారులై, ఆ తిరస్కారంలోనే మృతిచెందుతారో, అలాంటి వారిపై అల్లాహ్‌ యొక్క శాపం (బహిష్కారం) ఉంటుంది మరియు దేవదూతల మరియు సర్వ మానవుల యొక్క శాపముంటుంది.


خَالِدِينَ فِيهَا ۖ لَا يُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ يُنظَرُونَ ١٦٢

అందులో (ఆ శాపగ్రస్త స్థితిలోనే నరకంలో) వారు శాశ్వతంగా ఉంటారు. వారి శిక్షను తగ్గించటం కానీ మరియు వారికి మళ్ళీ వ్యవధి ఇవ్వటం కానీ జరుగదు.


وَإِلَـٰهُكُمْ إِلَـٰهٌ وَاحِدٌ ۖ لَّا إِلَـٰهَ إِلَّا هُوَ الرَّحْمَـٰنُ الرَّحِيمُ ١٦٣

మరియు మీ ఆరాధ్యదైవం కేవలం ఆ అద్వితీయుడు 112 (అల్లాహ్‌) మాత్రమే. ఆయన తప్ప! మరొక ఆరాధ్యదేవుడు లేడు, అనంత కరుణా మయుడు, అపార కరుణాప్రదాత.


إِنَّ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَاخْتِلَافِ اللَّيْلِ وَالنَّهَارِ وَالْفُلْكِ الَّتِي تَجْرِي فِي الْبَحْرِ بِمَا يَنفَعُ النَّاسَ وَمَا أَنزَلَ اللَّـهُ مِنَ السَّمَاءِ مِن مَّاءٍ فَأَحْيَا بِهِ الْأَرْضَ بَعْدَ مَوْتِهَا وَبَثَّ فِيهَا مِن كُلِّ دَابَّةٍ وَتَصْرِيفِ الرِّيَاحِ وَالسَّحَابِ الْمُسَخَّرِ بَيْنَ السَّمَاءِ وَالْأَرْضِ لَآيَاتٍ لِّقَوْمٍ يَعْقِلُونَ ١٦٤

నిశ్చయంగా భూమ్యాకాశాల సృష్టిలోనూ, రేయింబవళ్ళ మార్పులోనూ, ప్రజలకు ఉపయోగ కరమైన వాటిని తీసుకొని, సముద్రంలో పయనించే ఓడలలోనూ మరియు అల్లాహ్‌ ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి దాని ద్వారా నిర్జీవమైన భూమికి ప్రాణం పోసి, అందులో వివిధరకాల జీవరాసులను వర్థిల్లజేయటంలోనూ; మరియు వాయువులు మరియు మేఘాలు, భూమ్యాకాశాల మధ్య నియమబద్ధంగా చేసే సంచారాల మార్పుల లోనూ, బుధ్ధిమంతులకు ఎన్నో సంకేతాలు ఉన్నాయి. 113


وَمِنَ النَّاسِ مَن يَتَّخِذُ مِن دُونِ اللَّـهِ أَندَادًا يُحِبُّونَهُمْ كَحُبِّ اللَّـهِ ۖ وَالَّذِينَ آمَنُوا أَشَدُّ حُبًّا لِّلَّـهِ ۗ وَلَوْ يَرَى الَّذِينَ ظَلَمُوا إِذْ يَرَوْنَ الْعَذَابَ أَنَّ الْقُوَّةَ لِلَّـهِ جَمِيعًا وَأَنَّ اللَّـهَ شَدِيدُ الْعَذَابِ ١٦٥

అయినా ఈ మానవులలో కొందరు ఇతరు లను, అల్లాహ్‌కు సాటిగా కల్పించుకుని, అల్లాహ్‌ ను ప్రేమించ వలసిన విధంగా వారిని ప్రేమిస్తారు. కాని విశ్వాసులు అందరికంటే అత్యధికంగా అల్లాహ్‌నే ప్రేమిస్తారు. మరియు ఈ దుర్మార్గం చేస్తున్నవారు ప్రత్యక్షంగా చూడగలిగితే! ఆ శిక్షను చూసి నప్పుడు, వారు నిశ్చయంగా, సర్వశక్తి కేవలం అల్లాహ్‌కే చెందుతుంది. మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ చాలా కఠినంగా శిక్షించేవాడు, (అని తెలుసుకునేవారు). 114


إِذْ تَبَرَّأَ الَّذِينَ اتُّبِعُوا مِنَ الَّذِينَ اتَّبَعُوا وَرَأَوُا الْعَذَابَ وَتَقَطَّعَتْ بِهِمُ الْأَسْبَابُ ١٦٦

అప్పుడు (ఆ రోజు) వారు (ఆ సాటిగా కల్పించబడినవారు) తమను అనుసరించిన వారితో తమకు ఎలాంటి సంబంధం లేదంటారు. మరియు వారంతా తమ శిక్షను చూసుకుంటారు. మరియు వారి మధ్య ఉన్న సంబంధాలన్నీ తెగిపోతాయి.


وَقَالَ الَّذِينَ اتَّبَعُوا لَوْ أَنَّ لَنَا كَرَّةً فَنَتَبَرَّأَ مِنْهُمْ كَمَا تَبَرَّءُوا مِنَّا ۗ كَذَٰلِكَ يُرِيهِمُ اللَّـهُ أَعْمَالَهُمْ حَسَرَاتٍ عَلَيْهِمْ ۖ وَمَا هُم بِخَارِجِينَ مِنَ النَّارِ ١٦٧

మరియు ఆ అనుసరించిన వారు అంటారు: ''మాకు ప్రపంచ జీవితంలోకి మళ్ళీ తిరిగిపోయే అవకాశం లభిస్తే – వీరు ఈ రోజు మమ్మల్ని త్యజించినట్లు – మేము కూడా వీరిని త్యజిస్తాము!'' ఈ విధంగా (ప్రపంచంలో) వారు చేసిన కర్మలను అల్లాహ్‌ వారికి చూపించినప్పుడు, అది వారికి ఎంతో బాధాకరంగా ఉంటుంది. కాని వారు నరకాగ్ని నుండి ఏ విధంగానూ బయట పడలేరు.


يَا أَيُّهَا النَّاسُ كُلُوا مِمَّا فِي الْأَرْضِ حَلَالًا طَيِّبًا وَلَا تَتَّبِعُوا خُطُوَاتِ الشَّيْطَانِ ۚ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ ١٦٨

ఓ ప్రజలారా! భూమిలోనున్న ధర్మ సమ్మ తమైన పరిశుద్ధమైన వాటినే తినండి. మరియు షై'తాన్‌ అడుగుజాడలను అనుసరించకండి. నిశ్చయంగా అతడు మీకు బహిరంగ శత్రువు.


إِنَّمَا يَأْمُرُكُم بِالسُّوءِ وَالْفَحْشَاءِ وَأَن تَقُولُوا عَلَى اللَّـهِ مَا لَا تَعْلَمُونَ ١٦٩

నిశ్చయంగా, అతడు (షై'తాన్‌)మిమ్మల్ని దుష్కార్యాలు మరియు అశ్లీలమైన పనులు చేయటానికి మరియు అల్లాహ్‌ను గురించి మీకు తెలియని మాటలు పలుకటానికి ప్రేరేపిస్తుంటాడు.


وَإِذَا قِيلَ لَهُمُ اتَّبِعُوا مَا أَنزَلَ اللَّـهُ قَالُوا بَلْ نَتَّبِعُ مَا أَلْفَيْنَا عَلَيْهِ آبَاءَنَا ۗ أَوَلَوْ كَانَ آبَاؤُهُمْ لَا يَعْقِلُونَ شَيْئًا وَلَا يَهْتَدُونَ ١٧٠

మరియు వారితో: ''అల్లాహ్‌ అవతరింప జేసిన వాటిని (ఆదేశాలను) అనుసరించండి!'' అని అన్నప్పుడు. వారు: ''అలా కాదు, మేము మా తండ్రి-తాతలు అవలంబిస్తూవచ్చిన పధ్ధతినే అనుసరిస్తాము.'' అని సమాధానమిస్తారు. ఏమీ? వారి తండ్రి-తాతలు ఎలాంటి జ్ఞానంలేనివారై నప్పటికినీ మరియు సన్మార్గం పొందనివారు అయి నప్పటికినీ (వీరు, వారినే అనుసరిస్తారా)?


وَمَثَلُ الَّذِينَ كَفَرُوا كَمَثَلِ الَّذِي يَنْعِقُ بِمَا لَا يَسْمَعُ إِلَّا دُعَاءً وَنِدَاءً ۚ صُمٌّ بُكْمٌ عُمْيٌ فَهُمْ لَ يَعْقِلُونَ ١٧١

మరియు సత్య-తిరస్కారుల ఉపమానం, వాటి (ఆ పశువుల) వలే ఉంది; అవి అతని (కాపరి) అరుపులు వింటాయే (కానీ ఏమీ అర్థంచేసుకో లేవు), అరుపులు మరియు కేకలు వినడం తప్ప. వారు చెవిటివారు, మూగవారు మరియు గ్రుడ్డివారు, కాబట్టి వారు ఏమీ అర్థం చేసుకోలేరు! 115


يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُلُوا مِن طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ وَاشْكُرُوا لِلَّـهِ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ ١٧٢

ఓ విశ్వాసులారా! మీరు నిజంగానే కేవలం ఆయన (అల్లాహ్‌)నే ఆరాధించేవారు అయితే; మేము మీకు జీవనోపాధిగా ఇచ్చిన పరిశుధ్ధ (ధర్మసమ్మత)మైన వస్తువులనే తినండి మరియు అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలుపండి. 116


إِنَّمَا حَرَّمَ عَلَيْكُمُ الْمَيْتَةَ وَالدَّمَ وَلَحْمَ الْخِنزِيرِ وَمَا أُهِلَّ بِهِ لِغَيْرِ اللَّـهِ ۖ فَمَنِ اضْطُرَّ غَيْرَ بَاغٍ وَلَا عَادٍ فَلَا إِثْمَ عَلَيْهِ ۚ إِنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ١٧٣

నిశ్చయంగా, ఆయన మీ కొరకు చచ్చిన జంతువు, రక్తం, పందిమాంసం మరియు అల్లాహ్‌ తప్ప ఇతరుల కొరకు జి'బ్‌'హ్‌ చేయబడిన దానిని (తినటాన్ని) నిషేధించి ఉన్నాడు. 117 కాని ఎవరైనా గత్యంతరం లేక, దుర్నీతితో కాకుండా, హద్దు మీరకుండా (తిన్నట్లైతే) అట్టివానిపై ఎలాంటి దోషంలేదు! 118 నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, 119 అపార కరుణాప్రదాత.


إِنَّ الَّذِينَ يَكْتُمُونَ مَا أَنزَلَ اللَّـهُ مِنَ الْكِتَابِ وَيَشْتَرُونَ بِهِ ثَمَنًا قَلِيلًا ۙ أُولَـٰئِكَ مَا يَأْكُلُونَ فِي بُطُونِهِمْ إِلَّا النَّارَ وَلَا يُكَلِّمُهُمُ اللَّـهُ يَوْمَ الْقِيَامَةِ وَلَا يُزَكِّيهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ ١٧٤

నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్‌ గ్రంథంలో అవతరింపజేసిన సందేశాలను దాచి, దానికి బదు లుగా అల్పలాభం పొందుతారో అలాంటి వారు తమ కడుపులను కేవలం అగ్నితో నింపుకుంటు న్నారు మరియు అల్లాహ్‌ పునరుత్థాన దినమున వారితో మాట్లాడడు మరియు వారిని శుధ్ధపరచడు మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.


أُولَـٰئِكَ الَّذِينَ اشْتَرَوُا الضَّلَالَةَ بِالْهُدَىٰ وَالْعَذَابَ بِالْمَغْفِرَةِ ۚ فَمَا أَصْبَرَهُمْ عَلَى النَّارِ ١٧٥

ఇలాంటి వారే సన్మార్గానికి బదులుగా దుర్మార్గాన్ని మరియు క్షమాపణకు బదులుగా శిక్షను ఎన్నుకున్నవారు. ఎంత సహనముంది వీరికి, నరకాగ్ని శిక్షను భరించటానికి!


ذَٰلِكَ بِأَنَّ اللَّـهَ نَزَّلَ الْكِتَابَ بِالْحَقِّ ۗ وَإِنَّ الَّذِينَ اخْتَلَفُوا فِي الْكِتَابِ لَفِي شِقَاقٍ بَعِيدٍ ١٧٦

ఇదంతా ఎందుకంటే! నిశ్చయంగా, అల్లాహ్‌ ఈ గ్రంథాన్ని సత్యంతో అవతరింప జేశాడు. మరియు నిశ్చయంగా ఈ గ్రంథం (ఖుర్‌ఆన్‌) గురించి భిన్నాభిప్రాయాలు గలవారు, ఘోర అంతఃకలహంలో ఉన్నారు! 120 (1/4)


لَّيْسَ الْبِرَّ أَن تُوَلُّوا وُجُوهَكُمْ قِبَلَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ وَلَـٰكِنَّ الْبِرَّ مَنْ آمَنَ بِاللَّـهِ وَالْيَوْمِ الْآخِرِ وَالْمَلَائِكَةِ وَالْكِتَابِ وَالنَّبِيِّينَ وَآتَى الْمَالَ عَلَىٰ حُبِّهِ ذَوِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينَ وَابْنَ السَّبِيلِ وَالسَّائِلِينَ وَفِي الرِّقَابِ وَأَقَامَ الصَّلَاةَ وَآتَى الزَّكَاةَ وَالْمُوفُونَ بِعَهْدِهِمْ إِذَا عَاهَدُوا ۖ وَالصَّابِرِينَ فِي الْبَأْسَاءِ وَالضَّرَّاءِ وَحِينَ الْبَأْسِ ۗ أُولَـٰئِكَ الَّذِينَ صَدَقُوا ۖ وَأُولَـٰئِكَ هُمُ الْمُتَّقُونَ ١٧٧

* వినయ-విధేయత (ధర్మనిష్ఠా పరత్వం) 121 అంటే మీరు మీ ముఖాలను తూర్పు దిక్కునకో, లేక పడమర దిక్కునకో చేయటం కాదు; 122 కాని వినయ-విధేయత (ధర్మనిష్ఠా పరత్వం) అంటే అల్లాహ్‌ ను, అంతిమదినాన్ని, దేవదూతలను, ప్రతి దివ్యగ్రంథాన్ని మరియు ప్రవక్తలను హృదయపూర్వకంగా విశ్వసించడం; మరియు ధనంపై ప్రేమ కలిగి ఉండి కూడా, దానిని బంధువుల కొరకు అనాథుల కొరకు, యాచించని పేదల 123 కొరకు, బాటసారుల కొరకు, యాచకుల కొరకు మరియు బానిసలను 124 విడిపించడానికి వ్యయపరచడం. మరియు నమా'జ్‌ను స్థాపించడం, 'జకాత్‌ ఇవ్వడం మరియు వాగ్దానం చేసినప్పుడు తమ వాగ్దానాన్ని పూర్తిచేయడం. మరియు దురవస్థలో మరియు ఆపత్కాలాలలో మరియు యుధ్ధ సమయాలలో స్థైర్యం కలిగి ఉండటం. ఇలాంటివారే సత్యవంతులు మరియు ఇలాంటి వారే దైవభీతి గలవారు.


يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُتِبَ عَلَيْكُمُ الْقِصَاصُ فِي الْقَتْلَى ۖ الْحُرُّ بِالْحُرِّ وَالْعَبْدُ بِالْعَبْدِ وَالْأُنثَىٰ بِالْأُنثَىٰ ۚ فَمَنْ عُفِيَ لَ مِنْ أَخِيهِ شَيْءٌ فَاتِّبَاعٌ بِالْمَعْرُوفِ وَأَدَاءٌ إِلَيْهِ بِإِحْسَانٍ ۗ ذَٰلِكَ تَخْفِيفٌ مِّن رَّبِّكُمْ وَرَحْمَةٌ ۗ فَمَنِ اعْتَدَىٰ بَعْدَ ذَٰلِكَ فَلَهُ عَذَابٌ أَلِيمٌ ١٧٨

ఓ విశ్వాసులారా! హత్య విషయంలో మీ కొరకు న్యాయప్రతీకారం (ఖి'సా'స్‌) నిర్ణయించ బడింది. ఆ హత్య చేసినవాడు, స్వేచ్ఛగలవాడైతే ఆ స్వేచ్ఛాపరుణ్ణి, బానిస అయితే ఆ బానిసను, స్త్రీ అయితే ఆ స్త్రీని (వధించాలి). 125 ఒకవేళ హతుని సోదరులు (కుటుంబీకులు) హంతకుణ్ణి కనికరించదలిస్తే, ధర్మయుక్తంగా రక్తశుల్క నిర్ణయం జరగాలి. 126 హంతకుడు రక్తధనాన్ని, ఉత్తమ రీతిలో అతనికి చెల్లించాలి. ఇది మీ ప్రభువు తరఫు నుండి మీకు లభించే సౌకర్యం, కారుణ్యం. దీని తర్వాత కూడా ఈ హద్దులను అతిక్రమించే వానికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.


وَلَكُمْ فِي الْقِصَاصِ حَيَاةٌ يَا أُولِي الْأَلْبَابِ لَعَلَّكُمْ تَتَّقُونَ ١٧٩

ఓ బుద్ధిమంతులారా! న్యాయప్రతీకారం (ఖి'సా'స్‌)లో మీకు ప్రాణరక్షణ ఉంది, దీనివల్ల మీరు దైవభీతి గలవారు అవుతారు. 127


كُتِبَ عَلَيْكُمْ إِذَا حَضَرَ أَحَدَكُمُ الْمَوْتُ إِن تَرَكَ خَيْرًا الْوَصِيَّةُ لِلْوَالِدَيْنِ وَالْأَقْرَبِينَ بِالْمَعْرُوفِ ۖ حَقًّا عَلَى الْمُتَّقِينَ ١٨٠

మీలో ఎవరికైనా మరణకాలం సమీపించి నప్పుడు అతడు, ఆస్తిపాస్తులు గలవాడైతే, అతడు తన తల్లి-దండ్రుల కొరకు మరియు సమీప బంధువుల కొరకు ధర్మసమ్మతమైన మరణ శాసనం (వీలునామా) వ్రాయాలి. 128 ఇది దైవభీతి గలవారి విద్యుక్త ధర్మం.


فَمَن بَدَّلَهُ بَعْدَ مَا سَمِعَهُ فَإِنَّمَا إِثْمُهُ عَلَى الَّذِينَ يُبَدِّلُونَهُ ۚ إِنَّ اللَّـهَ سَمِيعٌ عَلِيمٌ ١٨١

ఇక దానిని (వీలునామాను) విన్నవారు, తరువాత ఒకవేళ దానిని మార్చితే, దాని పాపమంతా నిశ్చయంగా, ఆ మార్చిన వారిపైననే ఉంటుంది. నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. 129


فَمَنْ خَافَ مِن مُّوصٍ جَنَفًا أَوْ إِثْمًا فَأَصْلَحَ بَيْنَهُمْ فَلَا إِثْمَ عَلَيْهِ ۚ إِنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ١٨٢

కాని వీలునామా చేసిన వ్యక్తి పక్షపాతమో, లేదా అన్యాయమో చేశాడనే భయం ఎవనికైనా ఉంటే అతడు ఈ వ్యవహారంతో సంబంధమున్న వారందరి మధ్య రాజీకుదిరిస్తే అందులో ఎలాంటి దోషం లేదు. నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.


يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُتِبَ عَلَيْكُمُ الصِّيَامُ كَمَا كُتِبَ عَلَى الَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ ١٨٣

ఓ విశ్వాసులారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది 130 – ఏ విధంగానైతే మీ పూర్వీకులకు విధిగా నిర్ణయించబడి ఉండెనో – బహుశా మీరు దైవభీతిపరులై ఉంటారని!


أَيَّامًا مَّعْدُودَاتٍ ۚ فَمَن كَانَ مِنكُم مَّرِيضًا أَوْ عَلَىٰ سَفَرٍ فَعِدَّةٌ مِّنْ أَيَّامٍ أُخَرَ ۚ وَعَلَى الَّذِينَ يُطِيقُونَهُ فِدْيَةٌ طَعَامُ مِسْكِينٍ ۖ فَمَن تَطَوَّعَ خَيْرًا فَهُوَ خَيْرٌ لَّهُ ۚ وَأَن تَصُومُوا خَيْرٌ لَّكُمْ ۖ إِن كُنتُمْ تَعْلَمُونَ ١٨٤

ఇది (ఈ ఉపవాసం) నిర్ణయించబడిన రోజులకు మాత్రమే. కానీ, మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులై ఉంటే, లేక ప్రయాణంలో ఉంటే, వేరే దినాలలో (ఆ ఉపవాసాలు) పూర్తిచేయాలి. కాని దానిని పూర్తిచేయటం దుర్భరమైన వారు పరిహారంగా, ఒక పేదవానికి భోజనం పెట్టాలి. 131 కాని ఎవరైనా సహృదయంతో ఇంకా ఎక్కువ మేలు చేయదలిస్తే, అది అతని మేలుకే! కాని మీరు తెలుసుకో గలిగితే, ఉపవాసం ఉండటమే, మీకు ఎంతో ఉత్తమమైనది.


شَهْرُ رَمَضَانَ الَّذِي أُنزِلَ فِيهِ الْقُرْآنُ هُدًى لِّلنَّاسِ وَبَيِّنَاتٍ مِّنَ الْهُدَىٰ وَالْفُرْقَانِ ۚ فَمَن شَهِدَ مِنكُمُ الشَّهْرَ فَلْيَصُمْهُ ۖ وَمَن كَانَ مَرِيضًا أَوْ عَلَىٰ سَفَرٍ فَعِدَّةٌ مِّنْ أَيَّامٍ أُخَرَ ۗ يُرِيدُ اللَّـهُ بِكُمُ الْيُسْرَ وَلَا يُرِيدُ بِكُمُ الْعُسْرَ وَلِتُكْمِلُوا الْعِدَّةَ وَلِتُكَبِّرُوا اللَّـهَ عَلَىٰ مَا هَدَاكُمْ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ ١٨٥

రమ'దాన్‌ నెల! అందులో దివ్య ఖుర్‌ఆన్‌ మానవులకు మార్గదర్శకత్వంగా, అవతరింప జేయబడింది! 132 మరియు అందులో సన్మార్గం చూపే మరియు సత్యా-సత్యాలను వేర్పరచే, స్పష్టమైన ఉపదేశాలున్నాయి. కావున మీలో ఆ నెలను పొందిన వ్యక్తి ఆ నెలంతా (విధిగా) ఉపవాస ముండాలి. కాని వ్యాధిగ్రస్తుడైనవాడు, లేక ప్రయా ణంలో ఉన్నవాడు, (ఆ ఉపవాసాలను) వేరే దినా లలో పూర్తిచేయాలి. అల్లాహ్‌ మీకు సౌలభ్యం చేయగోరుతున్నాడే కానీ, మిమ్మల్ని కష్టపెట్ట దలచుకోలేదు. ఇది మీరు ఉపవాసదినాల సంఖ్యను పూర్తిచేయగలగటానికి మరియు మీకు సన్మార్గం చూపినందుకు, మీరు అల్లాహ్‌ మహ నీయతను (ఘనతను) కొనియాడటానికి మరియు మీరు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి!


وَإِذَا سَأَلَكَ عِبَادِي عَنِّي فَإِنِّي قَرِيبٌ ۖ أُجِيبُ دَعْوَةَ الدَّاعِ إِذَا دَعَانِ ۖ فَلْيَسْتَجِيبُوا لِي وَلْيُؤْمِنُوا بِي لَعَلَّهُمْ يَرْشُدُونَ ١٨٦

మరియు నా దాసులు, నన్ను గురించి నిన్ను అడిగితే: ''నేను (వారికి) అతి సమీపంలోనే ఉన్నాను. పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపును విని, జవాబిస్తాను 133 కాబట్టి వారు సరైన మార్గం పొందటానికి, నా ఆజ్ఞలను అనుసరించాలి మరియు నా యందు విశ్వాసం కలిగి ఉండాలి.'' అని, చెప్పు. 134


أُحِلَّ لَكُمْ لَيْلَةَ الصِّيَامِ الرَّفَثُ إِلَ نِسَائِكُمْ ۚ هُنَّ لِبَاسٌ لَّكُمْ وَأَنتُمْ لِبَاسٌ لَّهُنَّ ۗ عَلِمَ اللَّـهُ أَنَّكُمْ كُنتُمْ تَخْتَانُونَ أَنفُسَكُمْ فَتَابَ عَلَيْكُمْ وَعَفَا عَنكُمْ ۖ فَالْآنَ بَاشِرُوهُنَّ وَابْتَغُوا مَا كَتَبَ اللَّـهُ لَكُمْ ۚ وَكُلُوا وَاشْرَبُوا حَتَّىٰ يَتَبَيَّنَ لَكُمُ الْخَيْطُ الْأَبْيَضُ مِنَ الْخَيْطِ الْأَسْوَدِ مِنَ الْفَجْرِ ۖ ثُمَّ أَتِمُّوا الصِّيَامَ إِلَى اللَّيْلِ ۚ وَلَا تُبَاشِرُوهُنَّ وَأَنتُمْ عَاكِفُونَ فِي الْمَسَاجِدِ ۗ تِلْكَ حُدُودُ اللَّـهِ فَلَا تَقْرَبُوهَا ۗ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّـهُ آيَاتِهِ لِلنَّاسِ لَعَلَّهُمْ يَتَّقُونَ ١٨٧

ఉపవాసపు రాత్రులందు మీకు మీ భార్య లతో రతిక్రీడ (రఫస్‌') ధర్మసమ్మతం చేయ బడింది. వారు మీ వస్త్రాలు, మీరు వారి వస్త్రాలు. వాస్తవానికి మీరు రహస్యంగా ఆత్మద్రోహానికి పాల్పడుతున్నారనే విషయం అల్లాహ్‌కు తెలుసు. కావున ఆయన మీ పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు మరియు మిమ్మల్ని మన్నించాడు. ఇక నుండి మీరు మీ భార్యలతో సంభోగం (బాషిర్‌) చేయండి మరియు అల్లాహ్‌ మీ కొరకు వ్రాసిన దానిని కోరండి. మరియు ఉదయకాలపు తెల్లని రేఖలు రాత్రి నల్లచారల నుండి స్పష్టపడే వరకు, మీరు తినండి, త్రాగండి. ఆ తరువాత చీకటి పడేవరకూ మీ ఉపవాసాన్ని పూర్తిచెయ్యండి. కాని మస్జిద్‌లలో ఏ'తెకాఫ్‌ పాటించేటప్పుడు, మీరు మీ స్త్రీలతో సంభోగించకండి 135 ఇవి అల్లాహ్‌ ఏర్పరచిన హద్దులు, కావున ఉల్లంఘించే (ఉద్దేశంతో) వీటిని సమీపించకండి. ఈ విధంగా అల్లాహ్‌ తన ఆజ్ఞలను ప్రజలకు స్పష్టం చేస్తున్నాడు. బహుశా వారు భయ-భక్తులు కలిగి ఉంటారని!


وَلَا تَأْكُلُوا أَمْوَالَكُم بَيْنَكُم بِالْبَاطِلِ وَتُدْلُوا بِهَا إِلَى الْحُكَّامِ لِتَأْكُلُوا فَرِيقًا مِّنْ أَمْوَالِ النَّاسِ بِالْإِثْمِ وَأَنتُمْ تَعْلَمُونَ ١٨٨

మరియు మీరు ఒకరి సొమ్మును మరొకరు అన్యాయంగా కబళించకండి మరియు బుధ్ధి పూర్వకంగా, అక్రమమైనరీతిలో, ఇతరుల ఆస్తిలో కొంత భాగం తినే దురుద్దేశంతో, న్యాయాధి కారులకు లంచాలు ఇవ్వకండి. (3/8)


يَسْأَلُونَكَ عَنِ الْأَهِلَّةِ ۖ قُلْ هِيَ مَوَاقِيتُ لِلنَّاسِ وَالْحَجِّ ۗ وَلَيْسَ الْبِرُّ بِأَن تَأْتُوا الْبُيُوتَ مِن ظُهُورِهَا وَلَـٰكِنَّ الْبِرَّ مَنِ اتَّقَىٰ ۗ وَأْتُوا الْبُيُوتَ مِنْ أَبْوَابِهَا ۚ وَاتَّقُوا اللَّـهَ لَعَلَّكُمْ تُفْلِحُونَ ١٨٩

* (ఓ ప్రవక్తా!) వారు నిన్ను మారే చంద్రుని (రూపాలను) గురించి అడుగుతున్నారు. నీవు వారితో ఇలా అను: ''అవి ప్రజలకు కాలగణనను మరియు 'హజ్జ్‌ దినాలను తెలియజేస్తాయి.'' మీరు మీ ఇళ్ళలోకి వాటి వెనుక భాగం నుండి ప్రవేశించడం ఋజువర్తన (బిర్ర్‌) కాదు, దైవభీతి కలిగి ఉండటమే ఋజువర్తన (బిర్ర్‌). కనుక మీరు ఇండ్లలో వాటి ద్వారాల నుండియే ప్రవేశించండి. మరియు మీరు సాఫల్యం పొందటానికి అల్లాహ్ యందు భయ-భక్తులు కలిగి ఉండండి.


وَقَاتِلُوا فِي سَبِيلِ اللَّـهِ الَّذِينَ يُقَاتِلُونَكُمْ وَلَا تَعْتَدُوا ۚ إِنَّ اللَّـهَ لَا يُحِبُّ الْمُعْتَدِينَ ١٩٠

మరియు మీతో, పోరాడేవారితో, మీరు అల్లాహ్‌ మార్గంలో పోరాడండి, కాని హద్దులను అతిక్రమించకండి. నిశ్చయంగా, అల్లాహ్‌ హద్దులను అతిక్రమించే వారిని ప్రేమించడు 136


وَاقْتُلُوهُمْ حَيْثُ ثَقِفْتُمُوهُمْ وَأَخْرِجُوهُم مِّنْ حَيْثُ أَخْرَجُوكُمْ ۚ وَالْفِتْنَةُ أَشَدُّ أَشَدُّ الْقَتْلِ ۚ وَلَا تُقَاتِلُوهُمْ عِندَ الْمَسْجِدِ الْحَرَامِ حَتَّىٰ يُقَاتِلُوكُمْ فِيهِ ۖ فَإِن قَاتَلُوكُمْ فَاقْتُلُوهُمْ ۗ كَذَٰلِكَ جَزَاءُ الْكَافِرِينَ ١٩١

వారు, మీకు ఎక్కడ ఎదురైతే అక్కడనే వారిని చంపండి. మరియు వారు మిమ్మల్ని ఎచ్చటి నుండి తరిమివేశారో, మీరు కూడా వారిని అచ్చటి నుండి తరిమివేయండి. మరియు సత్య ధర్మానికి అడ్డుగా నిలవటం (ఫిత్నా) 137 చంపటం కంటే ఘోరమైనది. మస్జిద్‌ అల్‌-'హరామ్‌ వద్ద వారు మీతో యుధ్ధం చేయనంత వరకు మీరు వారితో అక్కడ యుధ్ధం చేయకండి. 138


فَإِنِ انتَهَوْا فَإِنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ١٩٢

కానీ, వారు (యుధ్ధం చేయటం) మాను కుంటే (మీరు కూడా మానుకోండి). ఎందుకంటే నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.


وَقَاتِلُوهُمْ حَتَّىٰ لَا تَكُونَ فِتْنَةٌ وَيَكُونَ الدِّينُ لِلَّـهِ ۖ فَإِنِ انتَهَوْا فَلَا عُدْوَانَ إِلَّا عَلَى الظَّالِمِينَ ١٩٣

మరియు ఫిత్నా 139 ముగిసిపోయే వరకు మరియు అల్లాహ్‌ ధర్మం మాత్రమే స్థాపించబడే వరకు మీరు వారితో యుధ్ధం చేస్తూ ఉండండి. ఒకవేళ వారు మానుకుంటే, దుర్మార్గులతో తప్ప ఇతరులతో పోరాడకండి. 140


الشَّهْرُ الْحَرَامُ بِالشَّهْرِ الْحَرَامِ وَالْحُرُمَاتُ قِصَاصٌ ۚ فَمَنِ اعْتَدَىٰ عَلَيْكُمْ فَاعْتَدُوا عَلَيْهِ بِمِثْلِ مَا اعْتَدَىٰ عَلَيْكُمْ ۚ وَاتَّقُوا اللَّـهَ وَاعْلَمُوا أَنَّ اللَّـهَ مَعَ الْمُتَّقِينَ ١٩٤

నిషిధ్ధమాసానికి బదులు నిషిధ్ధమాసమే మరియు నిషిద్ధస్థలాలలో న్యాయ ప్రతీకారం (ఖి'సా'స్‌) తీసుకో వచ్చు. 141 కాబట్టి మీపై ఎవరైనా దాడిచేస్తే, మీరు కూడా వారిపై అదే విధంగా దాడిచేయండి. మరియు అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉండండి. మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ భయ-భక్తులు గలవారికి తోడుగా ఉంటాడని తెలుసుకోండి.


وَأَنفِقُوا فِي سَبِيلِ اللَّـهِ وَلَا تُلْقُوا بِأَيْدِيكُمْ إِلَى التَّهْلُكَةِ ۛ وَأَحْسِنُوا ۛ إِنَّ اللَّـهَ يُحِبُّ الْمُحْسِنِينَ ١٩٥

మరియు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి. మరియు మీ చేతులారా మిమ్మల్ని మీరు వినాశంలో పడవేసుకోకండి; మేలుచేయండి. నిశ్చయంగా, అల్లాహ్‌ మేలు చేసేవారిని ప్రేమిస్తాడు


وَأَتِمُّوا الْحَجَّ وَالْعُمْرَةَ لِلَّـهِ ۚ فَإِنْ أُحْصِرْتُمْ فَمَا اسْتَيْسَرَ مِنَ الْهَدْيِ ۖ وَلَا تَحْلِقُوا رُءُوسَكُمْ حَتَّىٰ يَبْلُغَ الْهَدْيُ مَحِلَّهُ ۚ فَمَن كَانَ مِنكُم مَّرِيضًا أَوْ بِهِ أَذًى مِّن رَّأْسِهِ فَفِدْيَةٌ مِّن صِيَامٍ أَوْ صَدَقَةٍ أَوْ نُسُكٍ ۚ فَإِذَا أَمِنتُمْ فَمَن تَمَتَّعَ بِالْعُمْرَةِ إِلَى الْحَجِّ فَمَا اسْتَيْسَرَ مِنَ الْهَدْيِ ۚ فَمَن لَّمْ يَجِدْ فَصِيَامُ ثَلَاثَةِ أَيَّامٍ فِي الْحَجِّ وَسَبْعَةٍ إِذَا رَجَعْتُمْ ۗ تِلْكَ عَشَرَةٌ كَامِلَةٌ ۗ ذَٰلِكَ لِمَن لَّمْ يَكُنْ أَهْلُهُ حَاضِرِي الْمَسْجِدِ الْحَرَامِ ۚ وَاتَّقُوا اللَّـهَ وَاعْلَمُوا أَنَّ اللَّـهَ شَدِيدُ الْعِقَابِ ١٩٦

మరియు అల్లాహ్‌ (ప్రసన్నత) కొరకు 'హజ్జ్‌ మరియు 'ఉమ్రా పూర్తిచేయండి. 142 మీకు వాటిని పూర్తిచేయటానికి ఆటంకం కలిగినట్లైతే, మీరు ఇవ్వదలుచుకున్న బలి (ఖుర్బానీ) ఇవ్వండి. 143 బలి జంతువు దాని గమ్యస్థానానికి చేరనంత వరకు మీరు శిరోముండనం చేసుకోకండి. 144 కానీ, మీలో ఎవడైనా వ్యాధిగ్రస్తుడై ఉంటే లేదా అతని తలకు బాధ ఉంటే (శిరో ముండనం చేసుకొని) దానికి పరిహారంగా (మూడు రోజులు) ఉపవాసం ఉండాలి. లేదా దాన-ధర్మాలు చేయాలి (ఆరుగురు నిరు పేదలకు భోజనం పెట్టాలి), లేదా బలి ఇవ్వాలి. కాని శాంతి భద్రతలు ఉన్న సమయాలలో ఎవడైనా 'హజ్జె తమత్తు 145 చేయదలచుకుంటే, అతడు తనశక్తిమేరకు బలి 146 ఇవ్వాలి. కాని ఎవడైతే ఖుర్బానీ ఇవ్వలేడో 'హజ్జ్‌ కాలంలో మూడు దినాలు మరియు (ఇంటికి) తిరిగివచ్చిన పిమ్మట ఏడు దినాలు ఉపవాసం ఉండాలి, ఈ విధంగా మొత్తం పది దినాలు ఉపవాసాలు ఉండాలి. ఇది మస్జిద్‌ అల్‌-'హరామ్‌ దగ్గర నివసించని వారికి మాత్రమే. మరియు అల్లాహ్‌ యెడల భయ-భక్తులు కలిగి ఉండండి. మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ శిక్ష విధించటంలో చాలా కఠినుడు, అని తెలుసుకోండి.


الْحَجُّ أَشْهُرٌ مَّعْلُومَاتٌ ۚ فَمَن فَرَضَ فِيهِنَّ الْحَجَّ فَلَا رَفَثَ وَلَا فُسُوقَ وَلَا جِدَالَ فِي الْحَجِّ ۗ وَمَا تَفْعَلُوا مِنْ خَيْرٍ يَعْلَمْهُ اللَّـهُ ۗ وَتَزَوَّدُوا فَإِنَّ خَيْرَ الزَّادِ التَّقْوَىٰ ۚ وَاتَّقُونِ يَا أُولِي الْأَلْبَابِ ١٩٧

'హజ్జ్‌ నియమిత నెలలలోనే జరుగు తుంది. ఈ నిర్ణీత మాసాలలో 'హజ్జ్‌ చేయటానికి సంకల్పించిన వ్యక్తి 'హజ్జ్‌ (ఇ'హ్రామ్‌)లో వున్న సమయంలో (భార్యతో) రతిక్రీడ (రఫ'స్‌)కు, దుష్టకార్యాలకు మరియు కలహాలకు దూరంగా ఉండాలి. మీరు చేసే మంచిపనులన్నీ అల్లాహ్‌కు తెలుసు. ('హజ్జ్ యాత్రకు) కావలసిన వస్తు సామాగ్రిని తీసుకు వెళ్ళండి. దైవభీతియే నిశ్చయంగా, అన్నిటికంటే ఉత్తమమైన సామగ్రి. కనుక ఓ బుధ్ధిమంతులారా! కేవలం నా యందే భయ-భక్తులు కలిగి ఉండండి.


لَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ أَن تَبْتَغُوا فَضْلًا مِّن رَّبِّكُمْ ۚ فَإِذَا أَفَضْتُم مِّنْ عَرَفَاتٍ فَاذْكُرُوا اللَّـهَ عِندَ الْمَشْعَرِ v الْحَرَامِ ۖ وَاذْكُرُوهُ كَمَا هَدَاكُمْ وَإِن كُنتُم مِّن قَبْلِهِ لَمِنَ الضَّالِّينَ ١٩٨

('హజ్జ్‌ యాత్రలో) మీరు మీ ప్రభువు అనుగ్రహాలు అన్వేషిస్తే 147 అందులో దోషంలేదు. 'అరఫాత్‌ 148 నుండి బయలుదేరిన తరువాత మష్‌అరిల్‌ 'హరామ్‌ (ముజ్‌'దలిఫా) 149 వద్ద (ఆగి) అల్లాహ్‌ను స్మరించండి. మరియు ఆయన మీకు బోధించిన విధంగా ఆయనను స్మరించండి, వాస్తవానికి మీరు పూర్వం మార్గభ్రష్టులుగా ఉండేవారు.


ثُمَّ أَفِيضُوا مِنْ حَيْثُ أَفَاضَ النَّاسُ وَاسْتَغْفِرُوا اللَّـهَ ۚ إِنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ١٩٩

తరువాత ప్రజలంతా ఎక్కడి నుండి వెళ్తారో అక్కడి నుండి మీరూ వెళ్ళండి. అల్లాహ్‌తో క్షమాభిక్ష వేడుకోండి. నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.


فَإِذَا قَضَيْتُم مَّنَاسِكَكُمْ فَاذْكُرُوا اللَّـهَ كَذِكْرِكُمْ آبَاءَكُمْ أَوْ أَشَدَّ ذِكْرًا ۗ فَمِنَ النَّاسِ مَن يَقُولُ رَبَّنَا آتِنَا فِي الدُّنْيَا وَمَا لَهُ فِي الْآخِرَةِ مِنْ خَلَاقٍ ٢٠٠

ఇక మీ ('హజ్జ్‌) విధులను 150 పూర్తిచేసిన తరువాత, మీరు మీ తండ్రి-తాతలను (పూర్వం) స్మరించే విధంగా, ఇంకా దానికంటే అధికంగా అల్లాహ్‌ను స్మరించండి. కాని వారిలో కొందరు: ''ఓ మా ప్రభూ! మాకు ఈ లోకంలో (అన్నీ) ప్రసాదించు!'' అని ప్రార్థిస్తారు. అలాంటి వారికి పరలోకంలో ఎలాంటి భాగం ఉండదు.


وَمِنْهُم مَّن يَقُولُ رَبَّنَا آتِنَا فِي الدُّنْيَا حَسَنَةً وَفِي الْآخِرَةِ حَسَنَةً وَقِنَا عَذَابَ النَّارِ ٢٠١

వారిలో మరికొందరు: ''ఓ మా ప్రభూ! మాకు ఇహలోకంలో మంచిని మరియు పరలోకంలో కూడా మంచిని ప్రసాదించు మరియు మమ్మల్ని నరకాగ్నినుండి కాపాడు!'' అని ప్రార్థిస్తారు. 0


أُولَـٰئِكَ لَهُمْ نَصِيبٌ مِّمَّا كَسَبُوا ۚ وَاللَّـهُ سَرِيعُ الْحِسَابِ ٢٠٢

అలాంటి వారు తమ సంపాదనకు అను గుణంగా (ఉభయలోకాలలో) తమ వాటాను పొందు తారు. మరియు అల్లాహ్‌ లెక్క తీసుకోవటంలో అతిశీఘ్రుడు. (1/2)


وَاذْكُرُوا اللَّـهَ فِي أَيَّامٍ مَّعْدُودَاتٍ ۚ فَمَن تَعَجَّلَ فِي يَوْمَيْنِ فَلَا إِثْمَ عَلَيْهِ وَمَن تَأَخَّرَ فَلَا إِثْمَ عَلَيْهِ ۚ لِمَنِ اتَّقَىٰ ۗ وَاتَّقُوا وَاعْلَمُوا أَنَّكُمْ إِلَيْهِ تُحْشَرُونَ ٢٠٣

* మరియు నియమిత రోజులలో అల్లాహ్‌ను స్మరించండి. 151 ఎవడైనా త్వరగా రెండు రోజులలోనే వెళ్ళిపోయినా, అతనిపై ఎలాంటి దోషంలేదు. మరెవడైనా నిదానించి (పదమూడవ తేదీవరకు) నిలిచిపోయినా, అతనిపై ఎలాంటి దోషంలేదు, 152 వాడికి, ఎవడైతే దైవభీతి కలిగిఉంటాడో! మరియు అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉండండి. మరియు నిశ్చయంగా, మీరంతా ఆయన సన్నిధిలో హాజరు చేయబడుతారనేది తెలుసుకోండి.


وَمِنَ النَّاسِ مَن يُعْجِبُكَ قَوْلُهُ فِي الْحَيَاةِ الدُّنْيَا وَيُشْهِدُ اللَّـهَ عَلَىٰ مَا فِي قَلْبِهِ وَهُوَ أَلَدُّ الْخِصَامِ ٢٠٤

మరియు ప్రజలలో నుండి ఒక వ్యక్తి మాటలు ఇహలోక జీవితంలో నీకు సంతోషం కలుగ జేయవచ్చు; మరియు తన సంకల్పశుధ్ధిని తెలుప డానికి అతడు అల్లాహ్‌ను సాక్షిగా నిలబెట్టవచ్చు! కాని, వాస్తవానికి, అతడు ఘోరమైన జగడాలమారి కావచ్చు! 153


وَإِذَا تَوَلَّىٰ سَعَىٰ فِي الْأَرْضِ لِيُفْسِدَ فِيهَا وَيُهْلِكَ الْحَرْثَ وَالنَّسْلَ ۗ وَاللَّـهُ لَا يُحِبُّ الْفَسَادَ ٢٠٥

మరియు (ఓ ము'హమ్మద్‌!) అతడు (నీ వద్ద నుండి) తిరిగిపోయి లోకంలో కల్లోలం రేకెత్తించ టానికి, పంట పొలాలను మరియు పశువులను నాశనం చేయటానికి పాటుపడవచ్చు. మరియు అల్లాహ్‌ కల్లోలాన్ని ఏ మాత్రం ప్రేమించడు.


وَإِذَا قِيلَ لَهُ اتَّقِ اللَّـهَ أَخَذَتْهُ الْعِزَّةُ بِالْإِثْمِ ۚ فَحَسْبُهُ جَهَنَّمُ ۚ وَلَبِئْسَ الْمِهَادُ ٢٠٦

మరియు: ''అల్లాహ్‌ యందు భయ-భక్తు లు కలిగి ఉండు.'' అని అతనితో అన్నప్పుడు, అహంభావం అతనిని మరింత పాపానికే ప్రేరే పిస్తుంది. కావున నరకమే అలాంటివానికి తగిన స్థలం. మరియు అది ఎంతచెడ్డ విరామస్థలం!


وَمِنَ النَّاسِ مَن يَشْرِي نَفْسَهُ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّـهِ ۗ وَاللَّـهُ رَءُوفٌ بِالْعِبَادِ ٢٠٧

మరియు మానవులలోనే – అల్లాహ్‌ సంతోషం పొందటానికి – తన పూర్తిజీవితాన్ని అంకితం చేసేవాడూ ఉన్నాడు. మరియు అల్లాహ్‌ తనదాసుల యెడల చాల కనికరుడు. 154


يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا ادْخُلُوا فِي السِّلْمِ كَافَّةً وَلَا تَتَّبِعُوا خُطُوَاتِ الشَّيْطَانِ ۚ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ ٢٠٨

ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ విధేయతలో (ఇస్లాంలో) సంపూర్ణంగా ప్రవేశించండి. మరియు షై'తాను అడుగుజాడలను అనుసరించకండి. నిశ్చయంగా, అతడు మీకు బహిరంగ శత్రువు!


فَإِن زَلَلْتُم مِّن بَعْدِ مَا جَاءَتْكُمُ الْبَيِّنَاتُ فَاعْلَمُوا أَنَّ اللَّـهَ عَزِيزٌ حَكِيمٌ ٢٠٩

మీ వద్దకు స్పష్టమైన హితోపదేశాలు వచ్చిన పిదప కూడా, మీరు తప్పటడుగు వేస్తే! నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు అని తెలుసుకోండి.


هَلْ يَنظُرُونَ إِلَّا أَن يَأْتِيَهُمُ اللَّـهُ فِي ظُلَلٍ مِّنَ الْغَمَامِ وَالْمَلَائِكَةُ وَقُضِيَ الْأَمْرُ ۚ وَإِلَى اللَّـهِ تُرْجَعُ الْأُمُورُ ٢١٠

ఏమీ? అల్లాహ్‌ స్వయంగా దేవదూతలతో పాటు, మేఘాల ఛాయలలో ప్రత్యక్షం కావాలని వారు నిరీక్షిస్తున్నారా? కానీ, అప్పటికే ప్రతి విషయపు తీర్పు జరిగి ఉంటుంది. మరియు సమస్త విషయాలు (తీర్పు కొరకు) అల్లాహ్‌ దగ్గరికే మరలింపబడతాయి!


سَلْ بَنِي إِسْرَائِيلَ كَمْ آتَيْنَاهُم مِّنْ آيَةٍ بَيِّنَةٍ ۗ وَمَن يُبَدِّلْ نِعْمَةَ اللَّـهِ مِن بَعْدِ مَا جَاءَتْهُ فَإِنَّ اللَّـهَ شَدِيدُ الْعِقَابِ ٢١١

మేము ఎన్ని స్పష్టమైన సూచన (ఆయాత్‌)లను వారికి చూపించామో ఇస్రాయీ'ల్‌ సంతతి వారిని అడగండి! 155 మరియు ఎవడు అల్లాహ్‌ యొక్క అనుగ్రహాలను పొందిన తరువాత, వాటిని తారుమారు చేస్తాడో! నిశ్చయంగా, అల్లాహ్‌ అలాంటి వారిని శిక్షించటంలో ఎంతో కఠినుడు.


زُيِّنَ لِلَّذِينَ كَفَرُوا الْحَيَاةُ الدُّنْيَا وَيَسْخَرُونَ مِنَ الَّذِينَ آمَنُوا ۘ وَالَّذِينَ اتَّقَوْا فَوْقَهُمْ يَوْمَ الْقِيَامَةِ ۗ وَاللَّـهُ يَرْزُقُ مَن يَشَاءُ بِغَيْرِ حِسَابٍ ٢١٢

సత్య-తిరస్కారులకు ఇహలోక జీవితం మనోహరమైనదిగా చేయబడింది. కావున వారు విశ్వాసులతో పరిహాసాలాడుతుంటారు, కానీ పునరుత్థాన దినమున, దైవభీతి గలవారే వారి కంటే ఉన్నత స్థానంలో ఉంటారు. మరియు అల్లాహ్‌, తాను కోరిన వారికి లెక్కలేనంత జీవనోపాధిని ప్రసాదిస్తాడు.


كَانَ النَّاسُ أُمَّةً وَاحِدَةً فَبَعَثَ اللَّـهُ النَّبِيِّينَ مُبَشِّرِينَ وَمُنذِرِينَ وَأَنزَلَ مَعَهُمُ الْكِتَابَ بِالْحَقِّ لِيَحْكُمَ بَيْنَ النَّاسِ فِيمَا اخْتَلَفُوا فِيهِ ۚ وَمَا اخْتَلَفَ فِيهِ إِلَّا الَّذِينَ أُوتُوهُ مِن بَعْدِ مَا جَاءَتْهُمُ الْبَيِّنَاتُ بَغْيًا بَيْنَهُمْ ۖ فَهَدَى اللَّـهُ الَّذِينَ آمَنُوا لِمَا اخْتَلَفُوا فِيهِ مِنَ الْحَقِّ بِإِذْنِهِ ۗ وَاللَّـهُ يَهْدِي مَن يَشَاءُ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ ٢١٣

పూర్వం, మానవులంతా ఒకే ఒక సమా జంగా ఉండేవారు 156 అప్పుడు అల్లాహ్‌ వారికి శుభవార్తలు ఇవ్వటానికి మరియు హెచ్చరికలు చేయటానికి ప్రవక్తలను పంపాడు. మరియు మాన వులలో ఏర్పడిన భేదాలను పరిష్కరించటానికి, ఆయన గ్రంథాన్ని సత్యంతో వారి ద్వారా అవత రింపజేశాడు. మరియు అది (దివ్యగ్రంథం) ఇవ్వ బడినవారు, స్పష్టమైన హితోపదేశాలు పొందిన తరువాత కూడా, పరస్పర ద్వేషాలవల్ల భేదాభి ప్రాయాలు పుట్టించుకున్నారు. కాని అల్లాహ్‌ తన ఆజ్ఞతో, విశ్వాసులకు వారు వివాదాలాడుతున్న విషయంలో సత్యమార్గాన్ని చూపాడు. మరియు అల్లాహ్‌ తానుకోరిన వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు.


أَمْ حَسِبْتُمْ أَن تَدْخُلُوا الْجَنَّةَ وَلَمَّا يَأْتِكُم مَّثَلُ الَّذِينَ خَلَوْا مِن قَبْلِكُم ۖ مَّسَّتْهُمُ الْبَأْسَاءُ وَالضَّرَّاءُ وَزُلْزِلُوا حَتَّىٰ يَقُولَ الرَّسُولُ وَالَّذِينَ آمَنُوا مَعَهُ مَتَىٰ نَصْرُ اللَّـهِ ۗ أَلَا إِنَّ نَصْرَ اللَّـهِ قَرِيبٌ ٢١٤

ఏమీ? మీరు (సులభంగా) స్వర్గంలో ప్రవే శించగలమని భావిస్తున్నారా? మీ పూర్వీకులు సహించినటువంటి (కష్టాలు) మీరూ సహించనిదే! వారిపై దురవస్థలు, రోగబాధలు విరుచుకు పడ్డాయి మరియు వారు కుదిపివేయబడ్డారు, చివరకు అప్పటి సందేశహరుడు మరియు విశ్వాసులైన అతని సహచరులు: ''అల్లాహ్‌ సహాయం ఇంకా ఎప్పుడొస్తుంది?'' అని వాపోయారు. అదిగో! నిశ్చయంగా, అల్లాహ్‌ సహాయం సమీపంలోనే ఉంది! 157


يَسْأَلُونَكَ مَاذَا يُنفِقُونَ ۖ قُلْ مَا أَنفَقْتُم مِّنْ خَيْرٍ فَلِلْوَالِدَيْنِ وَالْأَقْرَبِينَ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينِ وَابْنِ السَّبِيلِ ۗ وَمَا تَفْعَلُوا مِنْ خَيْرٍ فَإِنَّ اللَّـهَ بِهِ عَلِيمٌ ٢١٥

(ఓ ము'హమ్మద్‌!) వారు (ప్రజలు) నిన్ను అడుగుతున్నారు: ''మేము ఏమి ఖర్చు చేయాలి?'' అని. వారితో అను: ''మీరు మంచిది ఏది ఖర్చుచేసినా సరే, అది మీ తల్లి-దండ్రుల, బంధువుల, అనాథుల, యాచించని పేదల (మసాకీన్‌) మరియు బాటసారుల కొరకు ఖర్చు చేయాలి. మరియు మీరు ఏ మంచిపని చేసినా అది అల్లాహ్‌కు తప్పక తెలుస్తుంది.'' 158


كُتِبَ عَلَيْكُمُ الْقِتَالُ وَهُوَ كُرْهٌ لَّكُمْ ۖ وَعَسَىٰ أَن تَكْرَهُوا شَيْئًا وَهُوَ خَيْرٌ لَّكُمْ ۖ وَعَسَىٰ أَن تُحِبُّوا شَيْئًا وَهُوَ شَرٌّ لَّكُمْ ۗ وَاللَّـهُ يَعْلَمُ وَأَنتُمْ لَا تَعْلَمُونَ ٢١٦

మీకు అసహ్యకరమైనా! (ధర్మ) యుధ్ధం చేయటం మీకు విధిగా నిర్ణయించబడింది. 159 మరియు మీకు నచ్చని విషయమే మీకు మేలైనది కావచ్చు మరియు మీకు నచ్చే విషయమే మీకు హానికరమైనది కావచ్చు! మరియు అల్లాహ్‌కు అంతా తెలుసు, కాని మీకు ఏమీ తెలియదు.


يَسْأَلُونَكَ عَنِ الشَّهْرِ الْحَرَامِ قِتَالٍ فِيهِ ۖ قُلْ فِيهِ كَبِيرٌ ۖ وَصَدٌّ عَن سَبِيلِ اللَّـهِ وَكُفْرٌ بِهِ وَالْمَسْجِدِ الْحَرَامِ وَإِخْرَاجُ أَهْلِهِ مِنْهُ أَكْبَرُ عِندَ اللَّـهِ ۚ وَالْفِتْنَةُ أَكْبَرُ مِنَ الْقَتْلِ ۗ وَلَا يَزَالُونَ يُقَاتِلُونَكُمْ حَتَّىٰ يَرُدُّوكُمْ عَن دِينِكُمْ إِنِ اسْتَطَاعُوا ۚ وَمَن يَرْتَدِدْ مِنكُمْ عَن دِينِهِ فَيَمُتْ وَهُوَ كَافِرٌ فَأُولَـٰئِكَ حَبِطَتْ أَعْمَالُهُمْ فِي الدُّنْيَا وَالْآخِرَةِ ۖ وَأُولَـٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ ٢١٧

వారు నిషిధ్ధ మాసాలలో యుధ్ధం చేయటాన్ని గురించి నిన్ను అడుగు తున్నారు 160 వారితో ఇలా అను: ''వాటిలో యుధ్ధం చేయటం మహా అపరాధం. కానీ (ప్రజలను) అల్లాహ్‌ మార్గాన్ని అవలంబించటం నుండి అవరోధాలు కలిగించటం మరియు ఆయన (అల్లాహ్‌)ను తిరస్కరించటం మరియు (ప్రజలను) మస్జిద్‌ అల్‌-'హరామ్‌ను దర్శించకుండా ఆటంక పరచడం మరియు అక్కడివారిని దాని నుండి వెడలగొట్టటం అల్లాహ్‌ దృష్టిలో అంతకంటే మహా అపరాధం. పీడన (ఫిత్నా), రక్తపాతం కంటే ఘోరమైనది. 161 వారికి సాధ్యమే అయితే మిమ్మల్ని మీ ధర్మం నుండి మళ్ళించ గలిగే వరకూ వారు మీతో యుధ్ధం చేయడం మానరు. మరియు మీలో ఎవరైనా మతభ్రష్టులై సత్య-తిరస్కారులుగా మరణిస్తే, అలాంటి వారి మంచి పనులన్నీ ఇహపరలోకాలలో రెండింటి లోనూ వృథా అవుతాయి. మరియు అలాంటి వారు నరకాగ్నివాసులవుతారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.''


إِنَّ الَّذِينَ آمَنُوا وَالَّذِينَ هَاجَرُوا وَجَاهَدُوا فِي سَبِيلِ اللَّـهِ أُولَـٰئِكَ يَرْجُونَ رَحْمَتَ اللَّـهِ ۚ وَاللَّـهُ غَفُورٌ رَّحِيمٌ ٢١٨

నిశ్చయంగా, విశ్వసించిన వారు మరియు (అల్లాహ్‌ మార్గంలో తమ జన్మ భూమిని విడిచి) వలస పోయేవారు మరియు అల్లాహ్‌ మార్గంలో ధర్మ పోరాటం చేసేవారు; ఇలాంటి వారే! అల్లాహ్‌ కారుణ్యం ఆశించటానికి అర్హులు. మరియు అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత. (5/8)


يَسْأَلُونَكَ عَنِ الْخَمْرِ وَالْمَيْسِرِ ۖ قُلْ فِيهِمَا إِثْمٌ كَبِيرٌ وَمَنَافِعُ لِلنَّاسِ وَإِثْمُهُمَا أَكْبَرُ مِن نَّفْعِهِمَا ۗ وَيَسْأَلُونَكَ مَاذَا يُنفِقُونَ قُلِ الْعَفْوَ ۗ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّـهُ لَكُمُ الْآيَاتِ لَعَلَّكُمْ تَتَفَكَّرُونَ ٢١٩

* (ఓ ప్రవక్తా!) వారు, మద్యపానాన్ని మరియు జూదాన్ని గురించి నిన్ను ప్రశ్నిస్తు న్నారు. 162 నీవు ఈ విధంగా సమాధానమివ్వు: ''ఈ రెండింటిలోనూ ఎంతో హాని (పాపం) ఉంది. వాటిలో ప్రజలకు కొన్నిలాభాలు కూడా ఉన్నాయి కాని వాటి హాని (పాపం) వాటి లాభాల కంటే ఎంతో అధికమైనది.'' మరియు వారిలా అడుగు తున్నారు: ''మేము (అల్లాహ్‌ మార్గంలో) ఏమి ఖర్చుపెట్టాలి?'' నీవు ఇలా సమాధానమివ్వు: ''మీ (నిత్యావసరాలకుపోగా) మిగిలేది.'' 163 మీరు ఆలోచించటానికి, అల్లాహ్‌ ఈ విధంగా తన సూచన (ఆయాత్‌)లను మీకు విశదీ కరిస్తున్నాడు –


فِي الدُّنْيَا وَالْآخِرَةِ ۗ وَيَسْأَلُونَكَ عَنِ الْيَتَامَىٰ ۖ قُلْ إِصْلَاحٌ لَّهُمْ خَيْرٌ ۖ وَإِن تُخَالِطُوهُمْ فَإِخْوَانُكُمْ ۚ وَاللَّـهُ يَعْلَمُ الْمُفْسِدَ مِنَ الْمُصْلِحِ ۚ وَلَوْ شَاءَ اللَّـهُ لَأَعْنَتَكُمْ ۚ إِنَّ اللَّـهَ عَزِيزٌ حَكِيمٌ ٢٢٠

ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ – మరియు అనాథులను గురించి వారు నిన్ను అడుగుతున్నారు. నీవు ఇలా సమాధానమివ్వు: ''వారి సంక్షేమానికి తోడ్పడటమే మేలైనది.'' మరియు మీరు వారితో కలిసి మెలిసి 164 ఉంటే (తప్పులేదు), వారు మీ సోదరులే! మరియు చెరచేవాడెవడో, సవరించేవాడెవడో అల్లాహ్‌కు బాగా తెలుసు. మరియు అల్లాహ్‌ కోరితే మిమ్మల్ని కష్టపెట్టి ఉండేవాడు. నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.