ఖురైష్‌: మక్కహ్ లోని ఒక పెద్ద తెగ పేరు. దైవప్రవక్త ('స'అస) ఈ తెగకే చెందిన వారు. ఈ సూరహ్‌ మరొక పేరు సూరహ్‌ అల్‌-ఈలాఫ్‌. ఇది మొదటి మక్కహ్ కాలపు సూరహ్‌. అల్‌- ఫీల్‌ మరియు ఖురైష్‌ సూరాహ్‌లు ఒకేసూరహ్‌ కావచ్చని కొందరు వ్యాఖ్యాతలు అభిప్రాయ పడ్డారు. 4 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 106:1

لِإِيلَافِ قُرَيْشٍ ١

(అల్లాహ్‌ రక్షణ మరియు ఆయన కరుణతో) ఖురైషులు (ప్రయాణాలకు) అలవాటుపడ్డారు.


  • 106:2

إِيلَافِهِمْ رِحْلَةَ الشِّتَاءِ وَالصَّيْفِ ٢

(అల్లాహ్‌ కరుణ మరియు ఆయన రక్షణతో) వారు శీతా కాలపు మరియు వేసవి కాలపు ప్రయాణాలు చేయగలుగుతున్నారు. 1


  • 106:3

فَلْيَعْبُدُوا رَبَّ هَـٰذَا الْبَيْتِ ٣

కావున వారు ఈ ఆలయ (క'అబహ్) ప్రభువును (అల్లాహ్‌ను) మాత్రమే ఆరాధించాలి! 2


  • 106:4

الَّذِي أَطْعَمَهُم مِّن جُوعٍ وَآمَنَهُم مِّنْ خَوْفٍ ٤

వారు ఆకలితో ఉన్నప్పుడు ఆయనే వారికి ఆహారమిచ్చాడు మరియు ఆయనే వారిని భయం (ప్రమాదం) నుండి కాపాడాడు. 3