ఈ సూరహ్‌ మరొక పేరు అల్‌-ఖితాల్‌, అని కూడా ఉంది. దైవప్రవక్త ('స'అస) పేరు 2వ ఆయత్‌లో వచ్చింది. ఇందులో 38 ఆయాతులు ఉన్నాయి. ఇది మొదటి మదీనహ్ కాలపు సూరాహ్‌లలోనిది. ఇంతవరకు 5/6వ భాగం ఖుర్‌ఆన్‌ పూర్తి అయ్యింది. ఈ మిగిలిన 1/6వ భాగంలో చిన్నచిన్న సూరాహ్‌లు ఉన్నాయి. ఈ వరుసలోని 3 సూరాహ్‌లలో ఇది మొదటిది. ము'హమ్మద్‌ ('స'అస) పేరు ఖుర్‌ఆన్‌లో 4 సార్లు వచ్చింది. 3:144, 33:40, 47:2 మరియు 48:29లలో. అ'హ్మద్‌ ('స'అస) అని, ఒకేసారి 647:6లో వచ్చింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 47:1

الَّذِينَ كَفَرُوا وَصَدُّوا عَن سَبِيلِ اللَّـهِ أَضَلَّ أَعْمَالَهُمْ ١

ఎవరైతే సత్యాన్ని తిరస్కరించి (ఇతరు లను) అల్లాహ్‌ మార్గం నుండి నిరోధించారో, వారి కర్మలను ఆయన (అల్లాహ్‌) నిష్ఫలంచేశాడు.


  • 47:2

وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَآمَنُوا بِمَا نُزِّلَ عَلَىٰ مُحَمَّدٍ وَهُوَ الْحَقُّ مِن رَّبِّهِمْ ۙ كَفَّرَ عَنْهُمْ سَيِّئَاتِهِمْ وَأَصْلَحَ بَالَهُمْ ٢

మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తూ – ముహమ్మద్‌ మీద అవతరింపజేయ బడినదానిని – తమ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యమని నమ్మారో! వారి పాపాలను ఆయన తుడిచివేశాడు మరియు వారి స్థితిని బాగుపరిచాడు.


  • 47:3

ذَٰلِكَ بِأَنَّ الَّذِينَ كَفَرُوا اتَّبَعُوا الْبَاطِلَ وَأَنَّ الَّذِينَ آمَنُوا اتَّبَعُوا الْحَقَّ مِن رَّبِّهِمْ ۚ كَذَٰلِكَ يَضْرِبُ اللَّـهُ لِلنَّاسِ أَمْثَالَهُمْ ٣

ఇలా ఎందుకు జరిగిందంటే! వాస్తవానికి అవిశ్వాసులు అసత్యాన్ని అనుసరించారు మరియు విశ్వసించినవారు తమ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యాన్ని అనుసరించారు. ఈ విధంగా అల్లాహ్‌! ప్రజలకు ఉదాహరణల ద్వారా (వారి స్థానం) తెలియ జేస్తున్నాడు.


  • 47:4

فَإِذَا لَقِيتُمُ الَّذِينَ كَفَرُوا فَضَرْبَ الرِّقَابِ حَتَّىٰ إِذَا أَثْخَنتُمُوهُمْ فَشُدُّوا الْوَثَاقَ فَإِمَّا مَنًّا بَعْدُ وَإِمَّا فِدَاءً حَتَّىٰ تَضَعَ الْحَرْبُ أَوْزَارَهَا ۚ ذَٰلِكَ وَلَوْ يَشَاءُ اللَّـهُ لَانتَصَرَ مِنْهُمْ وَلَـٰكِن لِّيَبْلُوَ بَعْضَكُم بِبَعْضٍ ۗ وَالَّذِينَ قُتِلُوا فِي سَبِيلِ اللَّـهِ فَلَن يُضِلَّ أَعْمَالَهُمْ ٤

ఇలా ఎందుకు జరిగిందంటే! వాస్తవానికి అవిశ్వాసులు అసత్యాన్ని అనుసరించారు మరియు విశ్వసించినవారు తమ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యాన్ని అనుసరించారు. ఈ విధంగా అల్లాహ్‌! ప్రజలకు ఉదాహరణల ద్వారా (వారి స్థానం) తెలియ జేస్తున్నాడు. 1 వారిపైప్రాబల్యం పొందేవరకు, వారి మెడలపై కొట్టండి. ఆ తరువాత వారిని గట్టిగా బంధించండి, (యుధ్ధం ముగిసిన) తరువాత వారిని కనికరించి వదలి పెట్టండి, లేదా పరిహారధనం తీసుకొని వదలి పెట్టండి. 2 (మీతో) యుధ్ధం చేసేవారు తమ ఆయుధాలను పడవేసే వరకు (వారితో పోరా డండి). ఇది మీరు చేయవలసిన పని. అల్లాహ్‌ తలుచుకుంటే ఆయన వారికి ప్రతీకారం చేసే వాడు, కాని మిమ్మల్ని ఒకరి ద్వారా మరొకరిని పరీక్షించటానికి (ఆయన ఇలా చేశాడు). మరియు ఎవరైతే అల్లాహ్‌ మార్గంలో చంపబడ్డారో, అలాంటి వారి కర్మలను ఆయన వ్యర్థం చేయడు.


  • 47:5

سَيَهْدِيهِمْ وَيُصْلِحُ بَالَهُمْ ٥

ఆయన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు మరియు వారి స్థితిని చక్కబరుస్తాడు.


  • 47:6

وَيُدْخِلُهُمُ الْجَنَّةَ عَرَّفَهَا لَهُمْ ٦

మరియు వారికి తెలియజేసి యున్న స్వర్గం లోకి వారిని ప్రవేశింపజేస్తాడు.


  • 47:7

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِن تَنصُرُوا اللَّـهَ يَنصُرْكُمْ وَيُثَبِّتْ أَقْدَامَكُمْ ٧

ఓ విశ్వాసులారా! ఒకవేళ మీరు అల్లాహ్‌కు (ఆయన మార్గంలో) సహాయపడితే, ఆయన మీకు సహాయం చేస్తాడు మరియు మీ పాదాలను స్థిరపరుస్తాడు. 3


  • 47:8

وَالَّذِينَ كَفَرُوا فَتَعْسًا لَّهُمْ وَأَضَلَّ أَعْمَالَهُمْ ٨

ఇకపోతే సత్యాన్ని తిరస్కరించిన వారికి వినాశం తప్పదు. మరియు (అల్లాహ్‌) వారి కర్మలు వ్యర్థం చేస్తాడు.


  • 47:9

ذَٰلِكَ بِأَنَّهُمْ كَرِهُوا مَا أَنزَلَ اللَّـهُ فَأَحْبَطَ أَعْمَالَهُمْ ٩

ఇది ఎందుకంటే వాస్తవానికి, వారు అల్లాహ్‌ అవతరింపజేసిన దానిని అసహ్యించుకున్నారు, కాబట్టి ఆయన వారి కర్మలను విఫలంచేశాడు. 4 (1/4)


  • 47:10

أَفَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَيَنظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِن قَبْلِهِمْ ۚ دَمَّرَ اللَّـهُ عَلَيْهِمْ ۖ وَلِلْكَافِرِينَ أَمْثَالُهَا ١٠

* ఏమీ? వారు భూమిలో సంచరించి చూడలేదా? వారికి పూర్వం గతించిన వారి పర్యవసానం ఏమయిందో? అల్లాహ్‌ వారిని నిర్మూలించాడు. మరియు సత్య-తిరస్కారులకు అలాంటి గతే పట్టబోతోంది. 5


  • 47:11

ذَٰلِكَ بِأَنَّ اللَّـهَ مَوْلَى الَّذِينَ آمَنُوا وَأَنَّ الْكَافِرِينَ لَا مَوْلَىٰ لَهُمْ ١١

ఇది ఎందుకంటే! నిశ్చయంగా, విశ్వసించిన వారి సంరక్షకుడు అల్లాహ్‌! మరియు నిశ్చయంగా, సత్య-తిరస్కారులకు సంరక్షకుడు ఎవ్వడూ లేడు. 6


  • 47:12

إِنَّ اللَّـهَ يُدْخِلُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۖ وَالَّذِينَ كَفَرُوا يَتَمَتَّعُونَ وَيَأْكُلُونَ كَمَا تَأْكُلُ الْأَنْعَامُ وَالنَّارُ مَثْوًى لَّهُمْ ١٢

నిశ్చయంగా, అల్లాహ్‌! విశ్వసించి సత్కార్యాలు చేసే వారిని స్వర్గవనాలలో ప్రవేశింప జేస్తాడు. వాటి క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. మరియు సత్యాన్ని తిరస్కరించి భోగ భాగ్యాలలో మునిగి ఉండి పశువుల మాదిరిగా తింటున్నవారినివాసం నరకాగ్నియే అవుతుంది. 7


  • 47:13

وَكَأَيِّن مِّن قَرْيَةٍ هِيَ أَشَدُّ قُوَّةً مِّن قَرْيَتِكَ الَّتِي أَخْرَجَتْكَ أَهْلَكْنَاهُمْ فَلَا نَاصِرَ لَهُمْ ١٣

మరియు (ఓ ము'హమ్మద్‌!) నిన్ను బహిష్కరించిన నగరం కంటే బలమైన ఎన్నో నగరాలను మేము నాశనం చేశాము వారికి సహాయపడే వాడెవ్వడూ లేక పోయాడు. 8


  • 47:14

أَفَمَن كَانَ عَلَىٰ بَيِّنَةٍ مِّن رَّبِّهِ كَمَن زُيِّنَ لَهُ سُوءُ عَمَلِهِ وَاتَّبَعُوا أَهْوَاءَهُم ١٤

ఏమీ? తన ప్రభువు తరఫునుండి వచ్చిన స్పష్టమైన మార్గంమీద ఉన్నవాడు, తమ దుష్కార్యాలను మనోహరమైనవిగా భావించి, తమ మనోవాంఛలను అనుసరించే వారితో సమానుడు కాగలడా?


  • 47:15

مَّثَلُ الْجَنَّةِ الَّتِي وُعِدَ الْمُتَّقُونَ ۖ فِيهَا أَنْهَارٌ مِّن مَّاءٍ غَيْرِ آسِنٍ وَأَنْهَارٌ مِّن لَّبَنٍ لَّمْ يَتَغَيَّرْ طَعْمُهُ وَأَنْهَارٌ مِّنْ خَمْرٍ لَّذَّةٍ لِّلشَّارِبِينَ وَأَنْهَارٌ مِّنْ عَسَلٍ مُّصَفًّى ۖ وَلَهُمْ فِيهَا مِن كُلِّ الثَّمَرَاتِ وَمَغْفِرَةٌ مِّن رَّبِّهِمْ ۖ كَمَنْ هُوَ خَالِدٌ فِي النَّارِ وَسُقُوا مَاءً حَمِيمًا فَقَطَّعَ أَمْعَاءَهُمْ ١٥

భయ-భక్తులు గలవారికి వాగ్దానం చేయ బడిన స్వర్గం యొక్క ఉదాహరణ ఇలా వుంది: అందులో వాసన మరియు రంగు మారని నీటి సెలయేళ్ళు ఉంటాయి మరియు రుచి మారని పాల కాలువలు ఉంటాయి 9 మరియు అందులో త్రాగేవారికి మధురంగా వుండే మద్యపానపు కాలువలు ఉంటాయి మరియు అందులో శుధ్ధమైన తేనె కాలువలుంటాయి. మరియు వారి కొరకు అందులో అన్నిరకాల మంచి ఫలాలు మరియు వారి ప్రభువు నుండి క్షమాపణ కూడా వుంటాయి. 10 ఇలాంటి వాడు – నరకాగ్నిలో శాశ్వతంగా ఉండి – సలసలకాగే నీటిని 11 త్రాగేందుకు ఇవ్వబడి, దానితో ప్రేగులు కోయబడి నట్లు బాధపడే వానితో సమానుడు కాగలడా?


  • 47:16

وَمِنْهُم مَّن يَسْتَمِعُ إِلَيْكَ حَتَّىٰ إِذَا خَرَجُوا مِنْ عِندِكَ قَالُوا لِلَّذِينَ أُوتُوا الْعِلْمَ مَاذَا قَالَ آنِفًا ۚ أُولَـٰئِكَ الَّذِينَ طَبَعَ اللَّـهُ عَلَىٰ قُلُوبِهِمْ وَاتَّبَعُوا أَهْوَاءَهُمْ ١٦

మరియు (ఓ ము'హమ్మద్‌!) వారిలో (కపట-విశ్వాసులలో) నీ మాటలను చెవియొగ్గి వినేవారు కొందరున్నారు. 12 కాని వారు నీ దగ్గర నుండి వెళ్ళిపోయిన తరువాత, జ్ఞానవంతులను ఇలా ప్రశ్నిస్తారు: "అతను చెప్పినదేమిటీ?" వీరే! అల్లాహ్‌ హృదయాల మీద ముద్రవేసినవారు మరియు వీరే తమ మనోవాంఛలను అనుసరించేవారు. 13


  • 47:17

وَالَّذِينَ اهْتَدَوْا زَادَهُمْ هُدًى وَآتَاهُمْ تَقْوَاهُمْ ١٧

మరియు మార్గదర్శకత్వం పొందిన వారికి ఆయన (అల్లాహ్‌) ఇంకా ఎక్కువగా సన్మార్గం చూపుతాడు మరియు వారి దైవభీతిని వృద్ధిచేస్తాడు.


  • 47:18

فَهَلْ يَنظُرُونَ إِلَّا السَّاعَةَ أَن تَأْتِيَهُم بَغْتَةً ۖ فَقَدْ جَاءَ أَشْرَاطُهَا ۚ فَأَنَّىٰ لَهُمْ إِذَا جَاءَتْهُمْ ذِكْرَاهُمْ ١٨

ఏమీ? ఇప్పుడు వారు అంతిమ ఘడియ అకస్మాత్తుగా రావాలని ఎదురుచూస్తున్నారా? వాస్తవానికి, దాని చిహ్నాలు కూడా వచ్చేశాయి. 14 అది వచ్చిపడితే, ఇక వారికి హితోపదేశం స్వీకరించే అవకాశం ఎక్కడ ఉంటుంది?


  • 47:19

فَاعْلَمْ أَنَّهُ لَا إِلَـٰهَ إِلَّا اللَّـهُ وَاسْتَغْفِرْ لِذَنبِكَ وَلِلْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ ۗ وَاللَّـهُ يَعْلَمُ مُتَقَلَّبَكُمْ وَمَثْوَاكُمْ ١٩

కావున (ఓ ము'హమ్మద్‌) తెలుసుకో! నిశ్చయంగా, అల్లాహ్‌ తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. కావున నీ పాపాలకు మరియు విశ్వాస స్త్రీల కొరకు మరియు విశ్వాస పురుషుల కొరకు కూడా క్షమాపణవేడుకో! 15 మరియు అల్లాహ్‌కు మీ కార్య-కలాపాలు మరియు మీ (అంతిమ) నివాసం కూడా తెలుసు.


  • 47:20

وَيَقُولُ الَّذِينَ آمَنُوا لَوْلَا نُزِّلَتْ سُورَةٌ ۖ فَإِذَا أُنزِلَتْ سُورَةٌ مُّحْكَمَةٌ وَذُكِرَ فِيهَا الْقِتَالُ ۙ رَأَيْتَ الَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ يَنظُرُونَ إِلَيْكَ نَظَرَ الْمَغْشِيِّ عَلَيْهِ مِنَ الْمَوْتِ ۖ فَأَوْلَىٰ لَهُمْ ٢٠

మరియు విశ్వసించిన వారు ఇలా అంటున్నారు: "(యుధ్ధం చేయమని ఆదేశిస్తూ) ఒక సూరహ్‌ ఎందుకు అవతరింపజేయ బడలేదు?" 16 కాని ఇప్పుడు యుధ్ధం చేయమని నిర్దేశిస్తూ ఒక సూరహ్‌ అవతరింపజేయబడితే, తమ హృదయాలలో వ్యాధి ఉన్నవారు – మరణం ఆవరించినవారి వలే – నీవైపునకు చూడటాన్ని, నీవు గమనిస్తావు; 17 కాని అది వారికే మేలైనదై ఉండేది.


  • 47:21

طَاعَةٌ وَقَوْلٌ مَّعْرُوفٌ ۚ فَإِذَا عَزَمَ الْأَمْرُ فَلَوْ صَدَقُوا اللَّـهَ لَكَانَ خَيْرًا لَّهُمْ ٢١

ఆజ్ఞాపాలన చేయటం మరియు మంచి మాటలు పలుకటం. ఒకవేళ (జిహాద్‌ కొరకు) దృఢమైన నిర్ణయం తీసుకోబడినప్పుడు, వారు అల్లాహ్‌ విషయంలో సత్యవంతులుగా ఉన్నట్లయితే వారికే మేలు జరిగేది.


  • 47:22

فَهَلْ عَسَيْتُمْ إِن تَوَلَّيْتُمْ أَن تُفْسِدُوا فِي الْأَرْضِ وَتُقَطِّعُوا أَرْحَامَكُمْ ٢٢

(వారితో ఇలా అను): "ఏమీ? మీరు (అల్లాహ్‌) ఆజ్ఞాపాలనకు విముఖులై, మరల భూమిలో సంక్షోభం రేకెత్తిస్తూ మీ బంధుత్వాలను తెంపుకుంటారా?"


  • 47:23

أُولَـٰئِكَ الَّذِينَ لَعَنَهُمُ اللَّـهُ فَأَصَمَّهُمْ وَأَعْمَىٰ أَبْصَارَهُمْ ٢٣

ఇలాంటి వారినే అల్లాహ్‌ శపించాడు (బహిష్కరించాడు). వారిని చెవిటివారిగా చేశాడు మరియు వారి కండ్లను గ్రుడ్డిచేశాడు.


  • 47:24

أَفَلَا يَتَدَبَّرُونَ الْقُرْآنَ أَمْ عَلَىٰ قُلُوبٍ أَقْفَالُهَا ٢٤

వారు ఈ ఖుర్‌ఆన్‌ను గురించి యోచించరా? లేదా వారి హృదయాల మీద తాళాలు పడివున్నాయా?


  • 47:25

إِنَّ الَّذِينَ ارْتَدُّوا عَلَىٰ أَدْبَارِهِم مِّن بَعْدِ مَا تَبَيَّنَ لَهُمُ الْهُدَى ۙ الشَّيْطَانُ سَوَّلَ لَهُمْ وَأَمْلَىٰ لَهُمْ ٢٥

మార్గదర్శకత్వం స్పష్టమైన తర్వాత కూడా, ఎవరైతే తమ వీపులు త్రిప్పుకొని మరలి పోయారో! నిశ్చయంగా, షై'తాన్‌ (వారి చేష్టలను) వారికి మంచివిగా చూపాడు మరియు (అల్లాహ్‌) వారికి వ్యవధినిచ్చాడు.


  • 47:26

ذَٰلِكَ بِأَنَّهُمْ قَالُوا لِلَّذِينَ كَرِهُوا مَا نَزَّلَ اللَّـهُ سَنُطِيعُكُمْ فِي بَعْضِ الْأَمْرِ ۖ وَاللَّـهُ يَعْلَمُ إِسْرَارَهُمْ ٢٦

ఇది ఎందుకంటే, వాస్తవానికి వారు, అల్లాహ్‌ అవతరింపజేసిన దానిని అసహ్యించుకునేవారితో ఇలా అన్నందుకు: "మేము కొన్ని విషయాలలో మిమ్మల్ని అనుసరిస్తాము." మరియు అల్లాహ్‌కు వారి రహస్య సమాలోచనలను గురించి బాగా తెలుసు. 18


  • 47:27

فَكَيْفَ إِذَا تَوَفَّتْهُمُ الْمَلَائِكَةُ يَضْرِبُونَ وُجُوهَهُمْ وَأَدْبَارَهُمْ ٢٧

అయితే దేవదూతలు వారి ఆత్మలను వశపరచుకొని, వారి ముఖాల మీద మరియు వీపుల మీద కొడుతూ వారిని తీసుకు వెళ్ళే టప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుంది? 19


  • 47:28

ذَٰلِكَ بِأَنَّهُمُ اتَّبَعُوا مَا أَسْخَطَ اللَّـهَ وَكَرِهُوا رِضْوَانَهُ فَأَحْبَطَ أَعْمَالَهُمْ ٢٨

ఇది వాస్తవానికి, వారు అల్లాహ్‌కు ఆగ్రహం కలిగించే విధానాన్ని అనుసరించినందుకు మరియు ఆయన సమ్మతించే మార్గాన్ని అసహ్యించు కున్నందుకు! కావున ఆయన వారి కర్మలను వృథా చేశాడు.


  • 47:29

أَمْ حَسِبَ الَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ أَن لَّن يُخْرِجَ اللَّـهُ أَضْغَانَهُمْ ٢٩

ఏమీ? తమ హృదయాలలో వ్యాధి ఉన్నవారు, అల్లాహ్‌ వారి ద్వేషాన్ని బయట పెట్టడని భావిస్తున్నారా? 20


  • 47:30

وَلَوْ نَشَاءُ لَأَرَيْنَاكَهُمْ فَلَعَرَفْتَهُم بِسِيمَاهُمْ ۚ وَلَتَعْرِفَنَّهُمْ فِي لَحْنِ الْقَوْلِ ۚ وَاللَّـهُ يَعْلَمُ أَعْمَالَكُمْ ٣٠

మరియు మేము తలచుకుంటే, వారిని నీకు చూపేవారం; వారి లక్షణాలను బట్టి నీవు వారిని తెలుసుకో గలవు. మరియు వారు మాట్లాడేరీతిని బట్టి, వారిని నీవు తప్పక తెలుసుకోగలవు. మరియు అల్లాహ్‌కు మీ కర్మలు బాగాతెలుసు.


  • 47:31

وَلَنَبْلُوَنَّكُمْ حَتَّىٰ نَعْلَمَ الْمُجَاهِدِينَ مِنكُمْ وَالصَّابِرِينَ وَنَبْلُوَ أَخْبَارَكُمْ ٣١

మరియు నిశ్చయంగా మీలో ధర్మయుధ్ధం చేసేవారెవరో మరియు సహనం వహించేవారెవరో! చూచే వరకు మేము మిమ్మల్ని తప్పక పరీక్షిస్తాము. 21 మరియు మేము మీ ప్రతిజ్ఞా వచనాలను కూడా పరీక్షిస్తాము.


  • 47:32

إِنَّ الَّذِينَ كَفَرُوا وَصَدُّوا عَن سَبِيلِ اللَّـهِ وَشَاقُّوا الرَّسُولَ مِن بَعْدِ مَا تَبَيَّنَ لَهُمُ الْهُدَىٰ لَن يَضُرُّوا اللَّـهَ شَيْئًا وَسَيُحْبِطُ أَعْمَالَهُمْ ٣٢

నిశ్చయంగా, మార్గదర్శకత్వం స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా, సత్యాన్నితిరస్కరించి, ప్రజలను అల్లాహ్‌ మార్గం నుండి నిరోధిస్తూ, ప్రవక్తతో విరోధం కలిగివున్నవారు, 22 అల్లాహ్‌కు ఏ మాత్రం నష్టం కలిగించలేరు. కాని ఆయన వారి కర్మలను నిష్ఫలం చేయగలడు. (3/8)


  • 47:33

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَطِيعُوا اللَّـهَ وَأَطِيعُوا الرَّسُولَ وَلَا تُبْطِلُوا أَعْمَالَكُمْ ٣٣

* ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు అల్లాహ్‌కు విధేయులై ఉండండి మరియు ప్రవక్తను అనుసరించండి మరియు మీ కర్మలను వ్యర్థం చేసుకోకండి. 23


  • 47:34

إِنَّ الَّذِينَ كَفَرُوا وَصَدُّوا عَن سَبِيلِ اللَّـهِ ثُمَّ مَاتُوا وَهُمْ كُفَّارٌ فَلَن يَغْفِرَ اللَّـهُ لَهُمْ ٣٤

నిశ్చయంగా, సత్యాన్ని తిరస్కరిస్తూ ప్రజలను అల్లాహ్‌ మార్గం నుండి నిరోధిస్తూ వుండి, సత్య-తిరస్కారులుగానే మరణించిన వారిని అల్లాహ్‌ ఎంత మాత్రం క్షమించడు.


  • 47:35

فَلَا تَهِنُوا وَتَدْعُوا إِلَى السَّلْمِ وَأَنتُمُ الْأَعْلَوْنَ وَاللَّـهُ مَعَكُمْ وَلَن يَتِرَكُمْ أَعْمَالَكُمْ ٣٥

కావున మీరు (ధర్మ-యుధ్ధంలో) ధైర్యాన్ని వీడకండి మరియు సంధికొరకు అడగకండి మరియు మీరే ప్రాబల్యం వహిస్తారు. మరియు అల్లాహ్‌ మీకు తోడుగా ఉన్నాడు మరియు ఆయన మీ కర్మలను వృథా కానివ్వడు.


  • 47:36

إِنَّمَا الْحَيَاةُ الدُّنْيَا لَعِبٌ وَلَهْوٌ ۚ وَإِن تُؤْمِنُوا وَتَتَّقُوا يُؤْتِكُمْ أُجُورَكُمْ وَلَا يَسْأَلْكُمْ أَمْوَالَكُمْ ٣٦

నిశ్చయంగా, ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట మరియు కాలక్షేపం మాత్రమే. ఒకవేళ మీరు విశ్వసించి దైవభీతి కలిగిఉన్నట్లయితే, ఆయన మీకు మీ ప్రతిఫలం ఇస్తాడు. మరియు మీ నుండి ధనాన్నికూడా అడగడు. 25


  • 47:37

إِن يَسْأَلْكُمُوهَا فَيُحْفِكُمْ تَبْخَلُوا وَيُخْرِجْ أَضْغَانَكُمْ ٣٧

ఒకవేళ ఆయన దానిని (ధనాన్నే) అడిగితే మరియు దాని కొరకు గట్టి పట్టుపట్టితే, మీరు పిసినారితనం చూపితే, ఆయన మీ ద్వేషాన్ని బయటపెట్టేవాడు.


  • 47:38

هَا أَنتُمْ هَـٰؤُلَاءِ تُدْعَوْنَ لِتُنفِقُوا فِي سَبِيلِ اللَّـهِ فَمِنكُم مَّن يَبْخَلُ ۖ وَمَن يَبْخَلْ فَإِنَّمَا يَبْخَلُ عَن نَّفْسِهِ ۚ وَاللَّـهُ الْغَنِيُّ وَأَنتُمُ الْفُقَرَاءُ ۚ وَإِن تَتَوَلَّوْا يَسْتَبْدِلْ قَوْمًا غَيْرَكُمْ ثُمَّ لَا يَكُونُوا أَمْثَالَكُم ٣٨

ఇదిగో చూడండి! వారు మీరే! అల్లాహ్‌ మార్గంలో ఖర్చుచేయండని పిలువబడుతున్న వారు. కాని మీలో కొందరు పిసినారితనం వహిస్తున్నారు. మరియు ఎవడు పిసినారితనం వహిస్తున్నాడో, అతడు నిజానికి తన సొంత విషయంలోనే పిసినారితనం వహిస్తున్నాడు. మరియు అల్లాహ్‌ స్వయం సమృద్ధుడు మరియు మీరే కొరతగల (పేద) వారు. 26 మరియు మీరు విముఖులైతే ఆయన మీకు బదులుగా ఇతర జాతిని మీ స్థానంలో తేగలడు, అప్పుడు వారు మీలాంటివారై ఉండరు.