అ'ద్‌-'దు'హా: The Forenoon, పూర్వాహ్ణం, ఎండ, పగలు, పగటి కాంతి, సూర్యోదయం తరువాత మధ్యాహ్నం వరకు ఉండే కాలం. సూరహ్‌ అల్‌-ఫజ్ర్‌ (89) తరువాత ఈ సూరహ్‌ అవతరింపజేయబడిందని వ్యాఖ్యాతలు అంటారు. మొదటి మక్కహ్ కాలపు సూరహ్‌. 11 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 93:1

وَالضُّحَىٰ ١

ప్రకాశవంతమైన ప్రొద్దటిపూట (పూర్వాహ్ణం) సాక్షిగా!


  • 93:2

وَاللَّيْلِ إِذَا سَجَىٰ ٢

మరియు చీకటిపడ్డ రాత్రి సాక్షిగా! 1


  • 93:3

مَا وَدَّعَكَ رَبُّكَ وَمَا قَلَىٰ ٣

(ఓము'హమ్మద్‌!) నీప్రభువు, నిన్ను త్యజించనూ లేదు మరియు నిన్ను ఉపేక్షించనూ లేదు.


  • 93:4

وَلَلْآخِرَةُ خَيْرٌ لَّكَ مِنَ الْأُولَ ٤

మరియు రాబోయే కాలం (జీవితం) నీ కొరకు మొదటి కాలం (జీవితం) కంటే ఎంతో మేలైనది! 2


  • 93:5

وَلَسَوْفَ يُعْطِيكَ رَبُّكَ فَتَرْضَ ٥

మరియు త్వరలోనే నీ ప్రభువు నీకు (నీవు కోరేది) ప్రసాదిస్తాడు. దానితో నీవు సంతోషపడతావు.


  • 93:6

أَلَمْ يَجِدْكَ يَتِيمًا فَآوَىٰ ٦

(ఓ ము'హమ్మద్‌!) ఏమీ? నిన్ను అనాథునిగా 3 చూసి, ఆయన(అల్లాహ్‌)నీకు ఆశ్రయం కల్పించలేదా?


  • 93:7

وَوَجَدَكَ ضَالًّا فَهَدَىٰ ٧

మరియు నీకు మార్గం తోచనప్పుడు, ఆయన నీకు మార్గదర్శకత్వం చేయలేదా? 4


  • 93:8

وَوَجَدَكَ عَائِلًا فَأَغْنَىٰ ٨

మరియు ఆయన, పేదవానిగా చూసి, నిన్ను సంపన్నునిగా చేయలేదా?


  • 93:9

فَأَمَّا الْيَتِيمَ فَلَا تَقْهَرْ ٩

కాబట్టి నీవు అనాథుల పట్ల కఠినంగా ప్రవర్తించకు;


  • 93:10

وَأَمَّا السَّائِلَ فَلَا تَنْهَرْ ١٠

మరియు యాచకుణ్ణి కసరుకోకు;


  • 93:11

وَأَمَّا بِنِعْمَةِ رَبِّكَ فَحَدِّثْ ١١

మరియు నీ ప్రభువు అనుగ్రహాలను బహిరం గంగా ప్రకటిస్తూ ఉండు. 5 (3/4)