అత్‌-తీన్‌: The Fig, అత్తి, అంజూరం, ఇది సూరహ్‌ అల్‌-బురూజ్‌ (85) తరువాత మక్కహ్ లో అవతరింపజేయబడింది. ఇది సూరహ్‌ అల్‌-'అ'స్ర్‌ (103)ను పోలిఉంది. అత్తి మరియు 'జైతూన్‌ చెట్లు ఫలస్తీన్‌ మరియు సీరియాలలో చాలా ఉన్నాయి. 8 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِّسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 95:1

وَالتِّينِ وَالزَّيْتُونِ ١

అంజూరం (అత్తి) మరియు జైతూన్‌ సాక్షిగా!


  • 95:2

وَطُورِ سِينِينَ ٢

సీనాయ్‌ (తూర్‌) కొండ సాక్షిగా! 1


  • 95:3

وَهَـٰذَا الْبَلَدِ الْأَمِينِ ٣

ఈ శాంతి నగరం (మక్కహ్) సాక్షిగా! 2


  • 95:4

لَقَدْ خَلَقْنَا الْإِنسَانَ فِي أَحْسَنِ تَقْوِيمٍ ٤

వాస్తవంగా! మేము మానవుడిని సర్వశ్రేష్ఠమైన ఆకారంలో సృష్టించాము. 3


  • 95:5

ثُمَّ رَدَدْنَاهُ أَسْفَلَ سَافِلِينَ ٥

తరువాత మేము అతన్ని దిగజార్చి అధమాతి అధమమైన స్థితికి మార్చాము.


  • 95:6

إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَلَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍ ٦

కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు తప్ప! ఎందుకంటే అలాంటి వారికి అంతులేని ప్రతిఫలం ఉంది.


  • 95:7

فَمَا يُكَذِّبُكَ بَعْدُ بِالدِّينِ ٧

అయితే, (ఓ మానవుడా!) దీని తరువాత గూడా నీవు ఎందుకు ప్రతిఫలదినాన్ని తిరస్కరిస్తున్నావు?


  • 95:8

أَلَيْسَ اللَّـهُ بِأَحْكَمِ الْحَاكِمِينَ ٨

ఏమీ? అల్లాహ్‌ న్యాయాధిపతులలో కెల్లా సర్వోత్తమ న్యాయాధిపతి కాడా?