అ'త్‌-'తారిఖ్‌: The Night-Comer, రాత్రివేళ వచ్చేది, కాంతివంతమైన నక్షత్రం. ఇది ఆరంభ మక్కహ్ కాలంలో అవతరింపజేయబడింది. బహుశా 4వ సంవత్సరంలో. 17 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 86:1

وَالسَّمَاءِ وَالطَّارِقِ ١

ఆకాశం మరియు రాత్రివేళవచ్చే నక్షత్రం (అ'త్‌-'తారిఖ్‌) సాక్షిగా!


  • 86:2

وَمَا أَدْرَاكَ مَا الطَّارِقُ ٢

రాత్రివేళ వచ్చేది (అ'త్‌-'తారిఖ్‌) అంటే ఏమిటో నీకు ఎలా తెలుస్తుంది?


  • 86:3

النَّجْمُ الثَّاقِبُ ٣

అదొక అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం.


  • 86:4

إِن كُلُّ نَفْسٍ لَّمَّا عَلَيْهَا حَافِظٌ ٤

కనిపెట్టుకొని ఉండేవాడు (దేవదూత) లేకుండా ఏ వ్యక్తి కూడా లేడు. 1


  • 86:5

فَلْيَنظُرِ الْإِنسَانُ مِمَّ خُلِقَ ٥

కావున మానవుడు తాను దేనితో సృష్టించబడ్డాడో గమనించాలి!


  • 86:6

خُلِقَ مِن مَّاءٍ دَافِقٍ ٦

అతడు విసర్జించబడే (చిమ్ముకుంటూ వెలువడే) ద్రవపదార్థంతో సృష్టించబడ్డాడు.


  • 86:7

يَخْرُجُ مِن بَيْنِ الصُّلْبِ وَالتَّرَائِبِ ٧

అది వెన్ను మరియు రొమ్ము ఎముకల మధ్య భాగం నుండి బయటికి వస్తుంది.


  • 86:8

إِنَّهُ عَلَىٰ رَجْعِهِ لَقَادِرٌ ٨

నిశ్చయంగా, ఆయన (సృష్టికర్త), అతనిని మరల బ్రతికించి తేగల సామర్థ్యం గలవాడు!


  • 86:9

يَوْمَ تُبْلَى السَّرَائِرُ ٩

ఏ రోజయితే రహస్య విషయాల విచారణ జరుగుతుందో!


  • 86:10

فَمَا لَهُ مِن قُوَّةٍ وَلَا نَاصِرٍ ١٠

అప్పుడు అతనికి (మానవునికి) ఎలాంటి శక్తి ఉండదు మరియు ఏ సహాయకుడునూ ఉండడు. 2


  • 86:11

وَالسَّمَاءِ ذَاتِ الرَّجْعِ ١١

వర్షం కురిపించే ఆకాశం సాక్షిగా! 3


  • 86:12

وَالْأَرْضِ ذَاتِ الصَّدْعِ ١٢

(చెట్లు మొలకెత్తేటప్పుడు) చీలిపోయే భూమి సాక్షిగా!


  • 86:13

إِنَّهُ لَقَوْلٌ فَصْلٌ ١٣

నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్‌ఆన్‌, సత్యా- సత్యాలను) వేరుపరచే వాక్కు (గీటురాయి).


  • 86:14

وَمَا هُوَ بِالْهَزْلِ ١٤

మరియు ఇది వృథా కాలక్షేపానికి వచ్చినది కాదు.


  • 86:15

إِنَّهُمْ يَكِيدُونَ كَيْدًا ١٥

(ఓ ము'హమ్మద్‌!) నిశ్చయంగా, వారు (నీకు విరుద్ధంగా) కుట్రలు పన్నుతున్నారు. 4


  • 86:16

وَأَكِيدُ كَيْدًا ١٦

మరియు నేను కూడ పన్నాగం పన్నుతున్నాను.


  • 86:17

فَمَهِّلِ الْكَافِرِينَ أَمْهِلْهُمْ رُوَيْدًا ١٧

కనుక నీవు సత్య-తిరస్కారులకు కొంత వ్యవధినివ్వు! 5 వారి పట్ల మృదువుగా వ్యవహరించు.(1/2)