అ'త్‌-'తలాఖు: విడాకులు. ఈ 10 మదీనహ్ సూరహ్‌ల సమూహంలో ఇది 9వది. దాదాపు 6వ హిజ్రీలో అవతరింపజేయబడింది. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'విడాకులు అల్లాహ్‌ (సు.త.) దృష్టిలో అనుమతింపబడిన వాటిలో అత్యంత అయిష్టకరమైన విషయం.' [అబూ-దావూద్‌, 'అబ్దుల్లాహ్‌ బిన్‌-'ఉమర్‌ (ర. అన్హు) కథనం]. చూడండి, 2:228-233. 12 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 65:1

يَا أَيُّهَا النَّبِيُّ إِذَا طَلَّقْتُمُ النِّسَاءَ فَطَلِّقُوهُنَّ لِعِدَّتِهِنَّ وَأَحْصُوا الْعِدَّةَ ۖ وَاتَّقُوا اللَّـهَ رَبَّكُمْ ۖ لَا تُخْرِجُوهُنَّ مِن بُيُوتِهِنَّ وَلَا يَخْرُجْنَ إِلَّا أَن يَأْتِينَ بِفَاحِشَةٍ مُّبَيِّنَةٍ ۚ وَتِلْكَ حُدُودُ اللَّـهِ ۚ وَمَن يَتَعَدَّ حُدُودَ اللَّـهِ فَقَدْ ظَلَمَ نَفْسَهُ ۚ لَا تَدْرِي لَعَلَّ اللَّـهَ يُحْدِثُ بَعْدَ ذَٰلِكَ أَمْرًا ١

ఓ ప్రవక్తా! మీరు స్త్రీలకు విడాకులు ('తలాఖ్‌) ఇచ్చేటప్పుడు వారికి, వారి నిర్ణీత గడువు ('ఇద్దత్‌) తో విడాకులివ్వండి. మరియు ఆ గడువును ఖచ్చితంగా లెక్కపెట్టండి. 1 మరియు మీ ప్రభు వైన అల్లాహ్‌ పట్ల భయ-భక్తులు కలిగి ఉండండి. వారు బహిరంగంగా అశ్లీల చేష్టలకు పాల్పడితే తప్ప, మీరు వారిని వారి ఇండ్ల నుండి వెడలగొట్టకండి మరియు వారు కూడా స్వయంగా వెళ్ళిపోకూడదు. 2 మరియు ఇవి అల్లాహ్‌ నిర్ణయించిన హద్దులు. మరియు ఎవడైతే అల్లాహ్‌ (నిర్ణయించిన) హద్దులను అతిక్రమిస్తాడో వాస్తవానికి వాడు తనకు తానే అన్యాయం చేసుకున్నట్లు. నీకు తెలియదు, బహుశా! దాని తరువాత అల్లాహ్‌ ఏదైనా క్రొత్త మార్గం చూపించవచ్చు! 3


  • 65:2

فَإِذَا بَلَغْنَ أَجَلَهُنَّ فَأَمْسِكُوهُنَّ بِمَعْرُوفٍ أَوْ فَارِقُوهُنَّ بِمَعْرُوفٍ وَأَشْهِدُوا ذَوَيْ عَدْلٍ مِّنكُمْ وَأَقِيمُوا الشَّهَادَةَ لِلَّـهِ ۚ ذَٰلِكُمْ يُوعَظُ بِهِ مَن كَانَ يُؤْمِنُ بِاللَّـهِ وَالْيَوْمِ الْآخِرِ ۚ وَمَن يَتَّقِ اللَّـهَ يَجْعَل لَّهُ مَخْرَجًا ٢

ఇక వారి నిర్ణీత గడువు ముగిసినప్పుడు, వారిని ధర్మప్రకారంగా (వివాహబంధంలో) ఉంచు కోండి, లేదా ధర్మప్రకారంగా వారిని విడిచిపెట్టండి. మరియు మీలో న్యాయవంతులైన ఇద్దరు వ్యక్తులను సాక్షులుగా పెట్టుకోండి. మరియు అల్లాహ్‌ కొరకు సాక్ష్యం సరిగ్గా ఇవ్వండి. అల్లాహ్‌ను మరియు అంతిమ దినమును విశ్వసించే ప్రతి వ్యక్తి కొరకు, ఈ విధమైన ఉపదేశ మివ్వబడుతోంది. మరియు అల్లాహ్‌ యందు భయభక్తులు గల వానికి, ఆయన ముక్తి మార్గం చూపుతాడు.


  • 65:3

وَيَرْزُقْهُ مِنْ حَيْثُ لَا يَحْتَسِبُ ۚ وَمَن يَتَوَكَّلْ عَلَى اللَّـهِ فَهُوَ حَسْبُهُ ۚ إِنَّ اللَّـهَ بَالِغُ أَمْرِهِ ۚ قَدْ جَعَلَ اللَّـهُ لِكُلِّ شَيْءٍ قَدْرًا ٣

మరియు ఆయన, అతనికి, అతడు ఊహించని దిక్కునుండి జీవనోపాధిని ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్‌ మీద నమ్మకం ఉంచుకున్న వానికి ఆయనే చాలు. నిశ్చయంగా, అల్లాహ్‌ తన పని పూర్తిచేసి తీరుతాడు. వాస్తవానికి అల్లాహ్‌ ప్రతిదానికి దాని విధి (ఖద్ర్‌) నిర్ణయించి ఉన్నాడు.


  • 65:4

وَاللَّائِي يَئِسْنَ مِنَ الْمَحِيضِ مِن نِّسَائِكُمْ إِنِ ارْتَبْتُمْ فَعِدَّتُهُنَّ ثَلَاثَةُ أَشْهُرٍ وَاللَّائِي لَمْ يَحِضْنَ ۚ وَأُولَاتُ الْأَحْمَالِ أَجَلُهُنَّ أَن يَضَعْنَ حَمْلَهُنَّ ۚ وَمَن يَتَّقِ اللَّـهَ يَجْعَل لَّهُ مِنْ أَمْرِهِ يُسْرًا ٤

మరియు మీ స్త్రీలు ఋతుస్రావపు వయస్సు గడిచిపోయిన వారైతే లేక మీకు దానిని గురించి ఎలాంటి అనుమానం ఉంటే; లేక వారి ఋతు స్రావం ఇంకా ప్రారంభంకాని వారైతే, అలాంటి వారి గడువు మూడు మాసాలు. 4 మరియు గర్భవతు లైన స్త్రీల గడువు వారి కాన్పు అయ్యే వరకు. 5 మరియు అల్లాహ్‌ పట్ల భయ-భక్తులు గలవానికి ఆయన అతని వ్యవహారంలో సౌలభ్యం కలిగిస్తాడు.


  • 65:5

ذَٰلِكَ أَمْرُ اللَّـهِ أَنزَلَهُ إِلَيْكُمْ ۚ وَمَن يَتَّقِ اللَّـهَ يُكَفِّرْ عَنْهُ سَيِّئَاتِهِ وَيُعْظِمْ لَهُ أَجْرًا ٥

ఇది అల్లాహ్‌ ఆజ్ఞ, ఆయన దానిని మీపై అవతరింపజేశాడు. మరియు ఎవడైతే అల్లాహ్‌ పట్ల భయ-భక్తులు కలిగి ఉంటాడో, ఆయన అతని పాపాలను తొలగిస్తాడు. మరియు అతని ప్రతిఫలాన్ని అధికం చేస్తాడు.


  • 65:6

أَسْكِنُوهُنَّ مِنْ حَيْثُ سَكَنتُم مِّن وُجْدِكُمْ وَلَا تُضَارُّوهُنَّ لِتُضَيِّقُوا عَلَيْهِنَّ ۚ وَإِن كُنَّ أُولَاتِ حَمْلٍ فَأَنفِقُوا عَلَيْهِنَّ حَتَّىٰ يَضَعْنَ حَمْلَهُنَّ ۚ فَإِنْ أَرْضَعْنَ لَكُمْ فَآتُوهُنَّ أُجُورَهُنَّ ۖ وَأْتَمِرُوا بَيْنَكُم بِمَعْرُوفٍ ۖ وَإِن تَعَاسَرْتُمْ فَسَتُرْضِعُ لَهُ أُخْرَىٰ ٦

(నిర్ణీత గడువు కాలంలో) మీ శక్తి మేరకు, మీరు నివసించేచోటనే, వారిని కూడా నివసించ నివ్వండి. మరియు వారిని ఇబ్బందులకు గురి చేయడానికి వారిని బాధించకండి. మరియు వారు గర్భవతులైతే, వారు ప్రసవించేవరకు వారి మీద ఖర్చుపెట్టండి. ఒకవేళ వారు మీబిడ్డకు పాలు పడుతున్నట్లైతే వారికి వారి ప్రతిఫలంఇవ్వండి. దాని కొరకు మీరు ధర్మసమ్మతంగా మీ మధ్య సంప్రదింపులు చేసుకోండి. ఒకవేళ మీకు దాని (పాలిచ్చే) విషయంలో ఇబ్బందులు కలిగితే, (తండ్రి) మరొక స్త్రీతో (బిడ్డకు) పాలిప్పించ వచ్చు!


  • 65:7

لِيُنفِقْ ذُو سَعَةٍ مِّن سَعَتِهِ ۖ وَمَن قُدِرَ عَلَيْهِ رِزْقُهُ فَلْيُنفِقْ مِمَّا آتَاهُ اللَّـهُ ۚ لَا يُكَلِّفُ اللَّـهُ نَفْسًا إِلَّا مَا آتَاهَا ۚ سَيَجْعَلُ اللَّـهُ بَعْدَ عُسْرٍ يُسْرًا ٧

సంపన్నుడైన వ్యక్తి తన ఆర్థిక స్తోమత ప్రకారం ఖర్చుపెట్టాలి. మరియు తక్కువ జీవనోపాధి గలవ్యక్తి అల్లాహ్‌ తనకు ప్రసాదించిన విధంగా ఖర్చుపెట్టాలి. అల్లాహ్‌ ఏ వ్యక్తిపై కూడా అతనికి ప్రసాదించిన దాని కంటే మించిన భారం వేయడు. 6 అల్లాహ్‌ కష్టం తరువాత సుఖం కూడా కలిగిస్తాడు.


  • 65:8

وَكَأَيِّن مِّن قَرْيَةٍ عَتَتْ عَنْ أَمْرِ رَبِّهَا وَرُسُلِهِ فَحَاسَبْنَاهَا حِسَابًا شَدِيدًا وَعَذَّبْنَاهَا عَذَابًا نُّكْرًا ٨

మరియు ఎన్నో నగరవాసులు, తమ ప్రభువు మరియు ఆయన ప్రవక్తల ఆజ్ఞలను తిరస్కరించారు. అప్పుడు మేము వాటి ప్రజల నుండి కఠినంగా లెక్క తీసుకున్నాము. మరియు వారికి తీవ్రమైన శిక్షను సిద్ధపరిచాము.


  • 65:9

فَذَاقَتْ وَبَالَ أَمْرِهَا وَكَانَ عَاقِبَةُ أَمْرِهَا خُسْرًا ٩

కావున వారు తమ వ్యవహారాల దుష్ట ఫలితాన్ని రుచి చూశారు. 7 మరియు వారి వ్యవహారాల పర్యవసానం నష్టమే!


  • 65:10

أَعَدَّ اللَّـهُ لَهُمْ عَذَابًا شَدِيدًا ۖ فَاتَّقُوا اللَّـهَ يَا أُولِي الْأَلْبَابِ الَّذِينَ آمَنُوا ۚ قَدْ أَنزَلَ اللَّـهُ إِلَيْكُمْ ذِكْرًا ١٠

అల్లాహ్‌ వారి కొరకు కఠినమైన శిక్షను సిధ్ధపరచి ఉంచాడు. కావున విశ్వాసులైన బుధ్ధిమంతులారా! అల్లాహ్‌ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. వాస్తవానికి అల్లాహ్‌ మీ వద్దకు హితబోధను (ఖుర్‌ఆన్‌ను) అవతరింపజేశాడు.


  • 65:11

رَّسُولًا يَتْلُو عَلَيْكُمْ آيَاتِ اللَّـهِ مُبَيِّنَاتٍ لِّيُخْرِجَ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ مِنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ ۚ وَمَن يُؤْمِن بِاللَّـهِ وَيَعْمَلْ صَالِحًا يُدْخِلْهُ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۖ قَدْ أَحْسَنَ اللَّـهُ لَهُ رِزْقًا ١١

ఒక ప్రవక్తను కూడా! అతను మీకు స్పష్టమైన అల్లాహ్ సూచనలను (ఆయాత్‌లను) వినిపిస్తు న్నాడు. 8 అది, విశ్వసించి సత్కార్యాలు చేసే వారిని అంధకారాల నుండి వెలుగు లోనికి తీసుకు రావటానికి. మరియు అల్లాహ్‌ను విశ్వసించి సత్కార్యాలు చేసే వారిని, ఆయన క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింప జేస్తాడు. అక్కడ వారు శాశ్వతంగా కలకాలం ఉంటారు. వాస్తవానికి అల్లాహ్‌ అలాంటి వ్యక్తి కొరకు ఉత్తమ జీవనోపాధిని ప్రసాదించాడు.


  • 65:12

اللَّـهُ الَّذِي خَلَقَ سَبْعَ سَمَاوَاتٍ وَمِنَ الْأَرْضِ مِثْلَهُنَّ يَتَنَزَّلُ الْأَمْرُ بَيْنَهُنَّ لِتَعْلَمُوا أَنَّ اللَّـهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ وَأَنَّ اللَّـهَ قَدْ أَحَاطَ بِكُلِّ شَيْءٍ عِلْمًا ١٢

అల్లాహ్‌యే సప్తాకాశాలను మరియు వాటిని పోలిన భూమండలాలను సృష్టించి, వాటి మధ్య ఆయన తన ఆదేశాలను అవతరింపజేస్తూ వుంటాడు. నిశ్చయంగా, అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడు మరియు వాస్తవానికి అల్లాహ్‌ తన జ్ఞానంతో ప్రతి దానిని పరివేష్టించి వున్నాడని మీరు తెలుసు కోవటానికి. (7/8)