అత్‌-తక్వీర్‌: Shrouding in Darkness (అంధకారంలో) చుట్టివేయబడటం, మూయబడటం, కాంతిని కోల్పోవటం. ఇది మొదటి మక్కహ్ కాలపు సూరహ్‌. బహుశా అవతరణలో 7వది. ఇది అంతిమ ఘడియను సూచిస్తోంది. 8-9 ఆయత్‌లలో అజ్ఞానకాలపు ముష్రిక్‌ అరబ్బులు తమ ఆడ శిశువులను పుట్టిన వెంటనే సజీవంగా మట్టిలో పూడ్చివేసే దారుణమైన సామాజిక దురాచారం పేర్కొన బడింది. ఈ సూరహ్‌లో పునరుత్థానదినపు దృశ్యం చూపబడింది. అందుకే దైవప్రవక్త ('స'అస) అన్నారు: "ఎవనికైతే పునరుత్థానదినపు దృశ్యాన్నిచూడాలని ఉందో అతడు దీనిని - సూరహ్‌ అత్‌-తక్వీర్ (81), సూరహ్‌ అల్‌-ఇన్ఫితార్‌ (82) మరియు సూరహ్‌ అల్‌ - ఇన్షిఖాఖ్‌ (84)లు ధ్యానంతో చదవాలి." (తిర్మీజీ', ముస్నద్‌ అ'హ్మద్‌; అల్బానీ ప్రమాణీకం). 29 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 81:1

إِذَا الشَّمْسُ كُوِّرَتْ ١

సూర్యుడు (అంధకారంలో) చుట్టివేయబడి, కాంతిహీను- డైనప్పుడు! 1


  • 81:2

وَإِذَا النُّجُومُ انكَدَرَتْ ٢

మరియు నక్షత్రాలు (కాంతిని కోల్పోయి) రాలి పోవునప్పుడు!


  • 81:3

وَإِذَا الْجِبَالُ سُيِّرَتْ ٣

మరియు పర్వతాలు కదిలించబడి నప్పుడు! 2


  • 81:4

وَإِذَا الْعِشَارُ عُطِّلَتْ ٤

మరియు నిండు సూడి ఒంటెలు, నిరపేక్షంగా వదిలి వేయబడినప్పుడు!


  • 81:5

وَإِذَا الْوُحُوشُ حُشِرَتْ ٥

మరియు క్రూర మృగాలన్నీ ఒకచోట సమకూర్చబడినప్పుడు! 3


  • 81:6

وَإِذَا الْبِحَارُ سُجِّرَتْ ٦

మరియు సముద్రాలు ఉప్పొంగి పోయినప్పుడు! 4


  • 81:7

وَإِذَا النُّفُوسُ زُوِّجَتْ ٧

మరియు ఆత్మలు (శరీరాలతో) తిరిగి కలుపబడి నప్పుడు! 5


  • 81:8

وَإِذَا الْمَوْءُودَةُ سُئِلَتْ ٨

మరియు సజీవంగా పాతిపెట్టడిన బాలిక ప్రశ్నించ బడినప్పుడు:


  • 81:9

بِأَيِّ ذَنبٍ قُتِلَتْ ٩

ఏ అపరాధానికి తాను హత్యచేయ బడిందని?


  • 81:10

وَإِذَا الصُّحُفُ نُشِرَتْ ١٠

మరియు కర్మపత్రాలు తెరువబడి నప్పుడు! 6


  • 81:11

وَإِذَا السَّمَاءُ كُشِطَتْ ١١

మరియు ఆకాశం ఒలిచివేయబడి నప్పుడు!


  • 81:12

وَإِذَا الْجَحِيمُ سُعِّرَتْ ١٢

మరియు నరకాగ్ని మండించబడి నప్పుడు!


  • 81:13

وَإِذَا الْجَنَّةُ أُزْلِفَتْ ١٣

మరియు స్వర్గం దగ్గరకు తీసుకురాబడి నప్పుడు!


  • 81:14

عَلِمَتْ نَفْسٌ مَّا أَحْضَرَتْ ١٤

ప్రతి ఆత్మ తాను చేసి తెచ్చిన కర్మలను తెలుసు కుంటుంది.


  • 81:15

فَلَا أُقْسِمُ بِالْخُنَّسِ ١٥

అలా కాదు! నేను తొలగిపోయే నక్షత్రాల సాక్షిగా చెబుతున్నాను;


  • 81:16

الْجَوَارِ الْكُنَّسِ ١٦

(ఏవైతే) వేగంగా తిరుగుతూ కనుమరుగవు తున్నాయో! 7


  • 81:17

وَاللَّيْلِ إِذَا عَسْعَسَ ١٧

మరియు గడచిపోయే రాత్రి సాక్షిగా!


  • 81:18

وَالصُّبْحِ إِذَا تَنَفَّسَ ١٨

మరియు ప్రకాశించే ఉదయం సాక్షిగా!


  • 81:19

إِنَّهُ لَقَوْلُ رَسُولٍ كَرِيمٍ ١٩

నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్‌ఆన్‌) గౌరవ నీయుడైన సందేశహరుడు తెచ్చిన వాక్కు! 8


  • 81:20

ذِي قُوَّةٍ عِندَ ذِي الْعَرْشِ مَكِينٍ ٢٠

అతను (జిబ్రీల్‌) మహా బలశాలి, సింహాసన ('అర్ష్‌) 9 అధిపతి సన్నిధిలో ఉన్నతస్థానం గల వాడు!


  • 81:21

مُّطَاعٍ ثَمَّ أَمِينٍ ٢١

అతని ఆజ్ఞలు పాటింపబడతాయి మరియు (అతను) విశ్వసనీయుడు!


  • 81:22

وَمَا صَاحِبُكُم بِمَجْنُونٍ ٢٢

మరియు (ఓ ప్రజలారా!) మీ సహచరుడు పిచ్చివాడు కాడు! 10


  • 81:23

وَلَقَدْ رَآهُ بِالْأُفُقِ الْمُبِينِ ٢٣

మరియు వాస్తవంగా, అతను ఆ సందేశహరుణ్ణి (జిబ్రీల్‌ను) ప్రకాశవంతమైన దిఙ్మండలంలో చూశాడు. 11


  • 81:24

وَمَا هُوَ عَلَى الْغَيْبِ بِضَنِينٍ ٢٤

మరియు అతను (ము'హమ్మద్‌) అగోచర జ్ఞానాన్ని ప్రజల నుండి దాచేవాడు కాడు.


  • 81:25

وَمَا هُوَ بِقَوْلِ شَيْطَانٍ رَّجِيمٍ ٢٥

మరియు ఇది (ఈ ఖుర్‌ఆన్‌) శపించబడిన (బహిష్కరించబడిన) షై'తాన్‌ వాక్కు కాదు.


  • 81:26

فَأَيْنَ تَذْهَبُونَ ٢٦

మరి మీరు ఎటు పోతున్నారు?


  • 81:27

إِنْ هُوَ إِلَّا ذِكْرٌ لِّلْعَالَمِينَ ٢٧

ఇది (ఈ ఖుర్‌ఆన్‌) సర్వలోకాలకు ఒక హితోపదేశం.


  • 81:28

لِمَن شَاءَ مِنكُمْ أَن يَسْتَقِيمَ ٢٨

మీలో, ఋజుమార్గంలో నడవదలచుకున్న ప్రతివాని కొరకు.


  • 81:29

وَمَا تَشَاءُونَ إِلَّا أَن يَشَاءَ اللَّـهُ رَبُّ الْعَالَمِينَ ٢٩

మరియు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌ తలచనంత వరకు, మీరు తలచినంత మాత్రాన ఏమీ కాదు. 12 (1/4)