అత్‌-తకాసు'ర్‌: పేరాస, Greed for more, The Piling up. మొదటి మక్కహ్ కాలపు ఈ సూరహ్‌, మానవుని ఎడతెగని పేరాసను ఖండిస్తోంది. 8 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 102:1

أَلْهَاكُمُ التَّكَاثُرُ ١

(ఇహలోక) పేరాస మిమ్మల్ని ఏమరు పాటులో పడవేసింది; 1


  • 102:2

حَتَّىٰ زُرْتُمُ الْمَقَابِرَ ٢

మీరు గోరీలలోకి చేరే వరకు. 2


  • 102:3

كَلَّا سَوْفَ تَعْلَمُونَ ٣

అలాకాదు! త్వరలోనే మీరు తెలుసు- కుంటారు.


  • 102:4

ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُونَ ٤

మరొక సారి (వినండి)! వాస్తవంగా, మీరు అతి త్వరలోనే తెలుసుకుంటారు. 3


  • 102:5

كَلَّا لَوْ تَعْلَمُونَ عِلْمَ الْيَقِينِ ٥

ఎంత మాత్రము కాదు! ఒక వేళ మీరు నిశ్చితజ్ఞానంతో తెలుసుకొనిఉంటే (మీ వైఖరి ఇలా ఉండేది కాదు).


  • 102:6

لَتَرَوُنَّ الْجَحِيمَ ٦

నిశ్చయంగా, మీరు భగభగ మండే నరకాగ్నిని చూడగలరు!


  • 102:7

ثُمَّ لَتَرَوُنَّهَا عَيْنَ الْيَقِينِ ٧

మళ్ళీ అంటున్నాను! మీరు తప్పక దానిని (నరకాగ్నిని) నిస్సంకోచమైన దృష్టితో చూడ గలరు!


  • 102:8

ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ ٨

అప్పుడు, ఆ రోజు మీరు, (ఈ జీవితంలో అనుభవించిన) సౌఖ్యాలను గురించి తప్పక ప్రశ్నించబడతారు! 4