అత్ -త'గాబున్‌: లాభనష్టాలు. ఈ సూరహ్ మొదటి హిజ్రీలో మదీనహ్ లో అవతరింపజేయ బడిందని చాలామంది వ్యాఖ్యాతల అభిప్రాయం. ఈ 10 మదీనహ్ సూరహ్‌ల సమూహంలో ఇది 8వది. ఈ సూరహ్‌లో సమాజపు పరస్పర వ్యవహార సంబంధాలు వివరించబడ్డాయి. 18 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు 9వ ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 64:1

يُسَبِّحُ لِلَّـهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۖ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ١

ఆకాశాలలోనున్న సమస్తమూ మరియు భూమిలో నున్న సమస్తమూ, అల్లాహ్‌ పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి. విశ్వ సామ్రాజ్యాధి పత్యం ఆయనదే మరియు సర్వస్తోత్రాలు ఆయనకే. మరియు ఆయనే ప్రతిదీ చేయగల సమర్థుడు.


  • 64:2

هُوَ الَّذِي خَلَقَكُمْ فَمِنكُمْ كَافِرٌ وَمِنكُم مُّؤْمِنٌ ۚ وَاللَّـهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ ٢

ఆయనే మిమ్మల్ని సృష్టించాడు. మీలో కొందరు సత్య-తిరస్కారులున్నారు మరియు మీలో కొందరు విశ్వాసులున్నారు. మరియు మీరు చేసేదంతా అల్లాహ్‌ చూస్తున్నాడు. 1


  • 64:3

خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ وَصَوَّرَكُمْ فَأَحْسَنَ صُوَرَكُمْ ۖ وَإِلَيْهِ الْمَصِيرُ ٣

ఆయన ఆకాశాలను మరియు భూమిని సత్యంతో సృష్టించాడు మరియు మిమ్మల్ని ఉత్తమ రూపంలో రూపొందించాడు. 2 మరియు మీ గమ్యస్థానం ఆయన వైపునకే ఉంది.


  • 64:4

يَعْلَمُ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ وَيَعْلَمُ مَا تُسِرُّونَ وَمَا تُعْلِنُونَ ۚ وَاللَّـهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ ٤

ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకు తెలుసు. మరియు మీరు దాచేది మరియు వెలిబుచ్చేది అంతా ఆయనకు బాగా తెలుసు. మరియు అల్లాహ్‌కు హృదయాలలో దాగి ఉన్నదంతా తెలుసు.


  • 64:5

أَلَمْ يَأْتِكُمْ نَبَأُ الَّذِينَ كَفَرُوا مِن قَبْلُ فَذَاقُوا وَبَالَ أَمْرِهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ ٥

ఇంతకు పూర్వం, సత్యాన్ని తిరస్కరించి, తమ కర్మల దుష్ఫలితాన్ని చవిచూసిన వారి వృత్తాంతం మీకు అందలేదా? మరియు వారికి (పరలోకంలో) బాధాకరమైన శిక్ష ఉంటుంది.


  • 64:6

ذَٰلِكَ بِأَنَّهُ كَانَت تَّأْتِيهِمْ رُسُلُهُم بِالْبَيِّنَاتِ فَقَالُوا أَبَشَرٌ يَهْدُونَنَا فَكَفَرُوا وَتَوَلَّوا ۚ وَّاسْتَغْنَى اللَّـهُ ۚ وَاللَّـهُ غَنِيٌّ حَمِيدٌ ٦

దీనికి కారణ మేమిటంటే, వాస్తవానికి వారి వద్దకు వారి ప్రవక్తలు, స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చినప్పటికీ, వారు: "ఏమీ? మాకు మానవులు మార్గదర్శకత్వం చేస్తారా?" 3 అని పలుకుతూ సత్యాన్ని తిరస్కరించి మరలి పోయారు. మరియు అల్లాహ్‌ కూడా వారిని నిర్లక్ష్యంచేశాడు. మరియు అల్లాహ్‌ స్వయం సమృద్ధుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు.


  • 64:7

زَعَمَ الَّذِينَ كَفَرُوا أَن لَّن يُبْعَثُوا ۚ قُلْ بَلَىٰ وَرَبِّي لَتُبْعَثُنَّ ثُمَّ لَتُنَبَّؤُنَّ بِمَا عَمِلْتُمْ ۚ وَذَٰلِكَ عَلَى اللَّـهِ يَسِيرٌ ٧

సత్యాన్ని తిరస్కరించిన వారు (చనిపోయిన తరువాత) మరల సజీవులుగా లేపబడమని భావిస్తున్నారు. వారితో ఇలా అను: "అదికాదు, నా ప్రభువు సాక్షిగా! మీరు తప్పకుండా లేపబడతారు. 4 తరువాత మీరు (ప్రపంచంలో) చేసిందంతా మీకు తెలుపబడుతుంది. మరియు ఇది అల్లాహ్‌కు ఎంతో సులభం."


  • 64:8

فَآمِنُوا بِاللَّـهِ وَرَسُولِهِ وَالنُّورِ الَّذِي أَنزَلْنَا ۚ وَاللَّـهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ ٨

కావున మీరు అల్లాహ్‌ను మరియు ఆయన ప్రవక్తను మరియు మేము అవతరింపజేసిన జ్యోతిని (ఈ ఖుర్‌ఆన్‌ను) విశ్వసించండి. మరియు మీరు చేసేదంతా అల్లాహ్‌ బాగా ఎరుగును.


  • 64:9

يَوْمَ يَجْمَعُكُمْ لِيَوْمِ الْجَمْعِ ۖ ذَٰلِكَ يَوْمُ التَّغَابُنِ ۗ وَمَن يُؤْمِن بِاللَّـهِ وَيَعْمَلْ صَالِحًا يُكَفِّرْ عَنْهُ سَيِّئَاتِهِ وَيُدْخِلْهُ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ ذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ ٩

(జ్ఞాపకముంచుకోండి) సమావేశపు రోజున ఆయన మీ అందరిని సమావేశపరుస్తాడు. 5 అదే లాభనష్టాల దినం. మరియు ఎవడైతే అల్లాహ్‌ను విశ్వసించి సత్కార్యాలు చేస్తాడో, అలాంటి వాని పాపాలను ఆయన తొలగిస్తాడు. మరియు అతనిని క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు, వారందులో శాశ్వతంగా కలకాలం ఉంటారు. అదే గొప్ప విజయం.


  • 64:10

وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَـٰئِكَ أَصْحَابُ النَّارِ خَالِدِينَ فِيهَا ۖ وَبِئْسَ الْمَصِيرُ ١٠

మరియు ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తారో మరియు మా సూచనలను (ఆయాత్‌లను) అబద్ధాలని నిరాకరిస్తారో, అలాంటి వారు నరక వాసులవుతారు; అందు వారు శాశ్వతంగా ఉంటారు. మరియు అది ఎంత చెడ్డ గమ్యస్థానం!


  • 64:11

مَا أَصَابَ مِن مُّصِيبَةٍ إِلَّا بِإِذْنِ اللَّـهِ ۗ وَمَن يُؤْمِن بِاللَّـهِ يَهْدِ قَلْبَهُ ۚ وَاللَّـهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ ١١

ఏ ఆపద కూడా, అల్లాహ్‌ అనుమతి లేనిదే సంభవించదు. మరియు ఎవడైతే అల్లాహ్‌ను విశ్వసిస్తాడో, అల్లాహ్‌ అతని హృదయానికి మార్గదర్శకత్వం చేస్తాడు. మరియు అల్లాహ్‌కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు.


  • 64:12

وَأَطِيعُوا اللَّـهَ وَأَطِيعُوا الرَّسُولَ ۚ فَإِن تَوَلَّيْتُمْ فَإِنَّمَا عَلَىٰ رَسُولِنَا الْبَلَاغُ الْمُبِينُ ١٢

మీరు అల్లాహ్‌కు విధేయులై ఉండండి మరియు సందేశహరుణ్ణి అనుసరించండి. ఒకవేళ మీరు మరలిపోతే (తెలుసుకోండి) వాస్తవానికి మా సందేశహరుని బాధ్యత కేవలం (మా సందేశాన్ని) మీకు స్పష్టంగా అందజేయటం మాత్రమే!


  • 64:13

اللَّـهُ لَا إِلَـٰهَ إِلَّا هُوَ ۚ وَعَلَى اللَّـهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ ١٣

అల్లాహ్‌! ఆయన తప్ప, మరొక ఆరాధ్యుడు లేడు! మరియు విశ్వాసులు కేవలం అల్లాహ్‌ మీదే నమ్మకం ఉంచుకోవాలి!


  • 64:14

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِنَّ مِنْ أَزْوَاجِكُمْ وَأَوْلَادِكُمْ عَدُوًّا لَّكُمْ فَاحْذَرُوهُمْ ۚ وَإِن تَعْفُوا وَتَصْفَحُوا وَتَغْفِرُوا فَإِنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ١٤

ఓ విశ్వాసులారా! నిశ్చయంగా, మీ సహవాసులు (అ'జ్వాజ్‌) మరియు మీ సంతానంలో మీ శత్రువులు ఉండవచ్చు! కావున మీరు వారిపట్ల జాగ్రత్త వహించండి. కాని ఒకవేళ మీరు వారి అపరాధాన్ని మన్నించి వారిని ఉపేక్షించి వారిని క్షమించితే! నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత (అని తెలుసుకోండి).


  • 64:15

إِنَّمَا أَمْوَالُكُمْ وَأَوْلَادُكُمْ فِتْنَةٌ ۚ وَاللَّـهُ عِندَهُ أَجْرٌ عَظِيمٌ ١٥

నిశ్చయంగా, మీ సంపదలు మరియు మీ సంతానం మీ కొరకు ఒక పరీక్ష. మరియు అల్లాహ్‌! ఆయన దగ్గర గొప్ప ప్రతిఫలం (స్వర్గం) ఉంది. 6


  • 64:16

فَاتَّقُوا اللَّـهَ مَا اسْتَطَعْتُمْ وَاسْمَعُوا وَأَطِيعُوا وَأَنفِقُوا خَيْرًا لِّأَنفُسِكُمْ ۗ وَمَن يُوقَ شُحَّ نَفْسِهِ فَأُولَـٰئِكَ هُمُ الْمُفْلِحُونَ ١٦

కావున మీరు మీ శక్తి మేరకు అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉండి, (ఆయన సూచనలను విని), ఆయనకు విధేయులై ఉండండి మరియు (మీ ధనం నుండి) దానం చేస్తే! అది మీ సొంత మేలుకే. మరియు ఎవరైతే తమ హృదయ (ఆత్మ) లోభత్వం నుండి రక్షణ పొందుతారో, అలాంటి వారే సాఫల్యం పొందేవారు. 7


  • 64:17

إِن تُقْرِضُوا اللَّـهَ قَرْضًا حَسَنًا يُضَاعِفْهُ لَكُمْ وَيَغْفِرْ لَكُمْ ۚ وَاللَّـهُ شَكُورٌ حَلِيمٌ ١٧

ఒకవేళ మీరు అల్లాహ్‌కు అప్పుగా మంచి అప్పు ఇస్తే, ఆయన దానిని ఎన్నోరెట్లు పెంచి తిరిగి మీకు ప్రసాదిస్తాడు మరియు మిమ్మల్ని క్షమిస్తాడు. వాస్తవానికి అల్లాహ్‌ కృతజ్ఞతలను ఆమోదించే వాడు, సహనశీలుడు.


  • 64:18

عَالِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ الْعَزِيزُ الْحَكِيمُ ١٨

ఆయన అగోచర మరియు గోచర విషయాలన్నీ బాగా తెలిసిన వాడు, అపార శక్తి సంపన్నుడు, మహా వివేకవంతుడు. (3/4)