అష్‌-షమ్స్‌: The Sun, సూర్యుడు. ఇది సూరహ్‌ అల్‌-ఖద్ర్‌ (97) తరువాత అవతరింపజేయబడింది. మొదటి మక్కహ్ కాలపు సూరహ్‌. పరలోక జీవితానికి భయపడని వారికి భయంకరమైన పర్యవసానం ఉంటుందని ఈ సూరహ్‌ తెలుపుతుంది. 15 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 91:1

وَالشَّمْسِ وَضُحَاهَا ١

సూర్యుని మరియు దాని ఎండ సాక్షిగా! 1


  • 91:2

وَالْقَمَرِ إِذَا تَلَاهَا ٢

దాని వెనుక వచ్చే చంద్రుని సాక్షిగా!


  • 91:3

وَالنَّهَارِ إِذَا جَلَّاهَا ٣

ప్రకాశించే పగటి సాక్షిగా!


  • 91:4

وَاللَّيْلِ إِذَا يَغْشَاهَا ٤

దానిని క్రమ్ముకొనే, రాత్రి సాక్షిగా!


  • 91:5

وَالسَّمَاءِ وَمَا بَنَاهَا ٥

ఆకాశం మరియు దానిని నిర్మించిన ఆయన (అల్లాహ్‌) సాక్షిగా!


  • 91:6

وَالْأَرْضِ وَمَا طَحَاهَا ٦

భూమి మరియు దానిని విస్తరింపజేసిన ఆయన సాక్షిగా!


  • 91:7

وَنَفْسٍ وَمَا سَوَّاهَا ٧

మానవ ఆత్మ మరియు దానిని తీర్చిదిద్దిన ఆయన సాక్షిగా! 2


  • 91:8

فَأَلْهَمَهَا فُجُورَهَا وَتَقْوَاهَا ٨

ఆ తరువాత ఆయనే దానికి దుష్టతనాన్ని మరియు దైవభీతిని తెలియజేశాడు. 3


  • 91:9

قَدْ أَفْلَحَ مَن زَكَّاهَا ٩

వాస్తవానికి తన ఆత్మను శుధ్ధపరచుకున్న వాడే సఫలుడవుతాడు.


  • 91:10

وَقَدْ خَابَ مَن دَسَّاهَا ١٠

మరియు వాస్తవానికి దానిని అణగద్రొక్కిన వాడే విఫలుడవుతాడు. 4


  • 91:11

كَذَّبَتْ ثَمُودُ بِطَغْوَاهَا ١١

స'మూద్‌ జాతి తలబిరుసుతనంతో (ప్రవక్తను) అసత్యవాదుడవని తిరస్కరించింది; 5


  • 91:12

إِذِ انبَعَثَ أَشْقَاهَا ١٢

తమలోని పరమ దుష్టుడు (ఆ దుష్కార్యం చేయటానికి) లేచినప్పుడు;


  • 91:13

فَقَالَ لَهُمْ رَسُولُ اللَّـهِ نَاقَةَ اللَّـهِ وَسُقْيَاهَا ١٣

అల్లాహ్‌ సందేశహరుడు('సాలి'హ్‌) వారితో: "ఈ ఆడఒంటె అల్లాహ్‌కు చెందింది. కాబట్టి దీనిని (నీళ్ళు) త్రాగనివ్వండి!" అని అన్నాడు.


  • 91:14

فَكَذَّبُوهُ فَعَقَرُوهَا فَدَمْدَمَ عَلَيْهِمْ رَبُّهُم بِذَنبِهِمْ فَسَوَّاهَا ١٤

అయినా వారు అతని('సాలి'హ్‌) మాటను అబద్ధమని తిరస్కరించారు. మరియు దాని (ఆ ఒంటె) వెనకకాలి మోకాలి నరాన్ని కోసి, కుంటి దాన్ని చేసి చంపారు. 6 కాబట్టి వారి ప్రభువు వారి పాపానికి పర్యవసానంగా వారిమీద మహా విపత్తును పంపి వారందరినీ నాశనంచేశాడు.


  • 91:15

وَلَا يَخَافُ عُقْبَاهَا ١٥

మరియు ఆయన (అల్లాహ్‌) దాని పర్యవసానాన్ని గురించి భయపడలేదు! 7