అస్‌-సజ్‌దహ్‌: సాష్టాంగం. ఇది చివరి మక్కహ్ సూరాహ్‌లలోనిది. సూరహ్‌ అల్‌-ము'మినూన్‌ (23) తరువాత అవతరింపజేయబడింది. ఇది సూరహ్‌ అల్‌-'అంకబూత్‌ (29)తో మొదలైన నాలుగు సూరాహ్‌లలో 4వది, చివరిది. దైవప్రవక్త ('స'అస) జుము'అహ్‌ రోజు ఫజ్ర్‌ నమా'జ్‌లో మొదటి రక'అత్‌లో ఈ సూరహ్‌ (32) మరియు రెండవ రక'అత్‌లో సూరహ్‌ అల్‌-ఇన్సాన్‌ (76), చదివేవారు, (బు'ఖారీ, ముస్లిం). దైవప్రవక్త ('స'అస) రాత్రి నిద్రపోయే ముందు ఈ సూరహ్‌ మరియు సూరహ్‌ అల్‌-ముల్క్‌ (67) చదివే వారు, (తిర్మిజీ' 892; అ'హ్మద్‌ 3/340). 30 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు 15వ ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 32:1

الم ١

అలిఫ్‌-లామ్‌-మీమ్‌.


  • 32:2

تَنزِيلُ الْكِتَابِ لَا رَيْبَ فِيهِ مِن رَّبِّ الْعَالَمِينَ ٢

నిస్సంకోచంగా, ఈ గ్రంథ (ఖుర్‌ఆన్‌) అవత రణ సర్వలోకాల ప్రభువు తరఫు నుండియే ఉంది.


  • 32:3

أَمْ يَقُولُونَ افْتَرَاهُ ۚ بَلْ هُوَ الْحَقُّ مِن رَّبِّكَ لِتُنذِرَ قَوْمًا مَّا أَتَاهُم مِّن نَّذِيرٍ مِّن قَبْلِكَ لَعَلَّهُمْ يَهْتَدُونَ ٣

ఏమీ? వారు (అవిశ్వాసులు): "ఇతనే (ము'హమ్మదే) దీనిని కల్పించాడు." అని అంటున్నారా? 1 అలాకాదు! వాస్తవానికి ఇది నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. నీకు పూర్వం హెచ్చరించే వారెవ్వరూ రాని జాతి వారికి నీవు హెచ్చరిక చేయటానికి, బహుశా వారు మార్గదర్శకత్వం పొందుతారేమోనని!


  • 32:4

اللَّـهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ ۖ مَا لَكُم مِّن دُونِهِ مِن وَلِيٍّ وَلَا شَفِيعٍ ۚ أَفَلَا تَتَذَكَّرُونَ ٤

అల్లాహ్‌, ఆయనే ఆకాశాలను భూమిని మరియు వాటి మధ్య ఉన్నదంతా ఆరు దినము లలో (అయ్యామ్‌లలో) 2 సృష్టించాడు, ఆ తరు వాత సింహాసనాన్ని ('అర్ష్‌ను) అధిష్టించాడు. ఆయన తప్ప మీకు మరొక సంరక్షకుడుగానీ, సిపారసు చేసే వాడుగానీ ఎవ్వడూ లేడు, అయినా మీరు హితబోధ గ్రహించరా?


  • 32:5

يُدَبِّرُ الْأَمْرَ مِنَ السَّمَاءِ إِلَى الْأَرْضِ ثُمَّ يَعْرُجُ إِلَيْهِ فِي يَوْمٍ كَانَ مِقْدَارُهُ أَلْفَ سَنَةٍ مِّمَّا تَعُدُّونَ ٥

ఆయనే ఆకాశం నుండి భూమి వరకు ప్రతి వ్యవహారాన్ని నడిపిస్తున్నాడు; తరువాత అంతా ఒకే దినమున, 3 ఆయన వద్దకు పోయి చేరుతుంది; దాని (ఆ దినపు) పరిమాణం మీ లెక్క ప్రకారం వేయి సంవత్సరాలు.


  • 32:6

ذَٰلِكَ عَالِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ الْعَزِيزُ الرَّحِيمُ ٦

ఆయన (అల్లాహ్‌)యే అగోచర మరియు గోచర విషయాల జ్ఞానం గలవాడు, సర్వ శక్తిమంతుడు, అపార కరుణాప్రదాత.


  • 32:7

الَّذِي أَحْسَنَ كُلَّ شَيْءٍ خَلَقَهُ ۖ وَبَدَأَ خَلْقَ الْإِنسَانِ مِن طِينٍ ٧

ఆయన తాను సృష్టించిన ప్రతి దానిని ఉత్తమరీతిలో చేశాడు. మరియు మానవసృష్టిని మట్టితో ప్రారంభించాడు. 4


  • 32:8

ثُمَّ جَعَلَ نَسْلَهُ مِن سُلَالَةٍ مِّن مَّاءٍ مَّهِينٍ ٨

తరువాత అతని సంతతిని ఒక అధమమైన ద్రవపదార్థపు సారంతో (వీర్యంతో) చేశాడు.


  • 32:9

ثُمَّ سَوَّاهُ وَنَفَخَ فِيهِ مِن رُّوحِهِ ۖ وَجَعَلَ لَكُمُ السَّمْعَ وَالْأَبْصَارَ وَالْأَفْئِدَةَ ۚ قَلِيلًا مَّا تَشْكُرُونَ ٩

ఆ తరువాత అతనిని యుక్తమైన రూపంలో తీర్చిదిద్ది, అతనిలో తన (నుండి) ప్రాణం (ఆత్మ) ఊదాడు. 5 మరియు మీకు వినేశక్తిని, చూసేశక్తిని మరియు హృదయాలను (అర్థంచేసుకునే శక్తిని) ఇచ్చాడు. (అయినా) మీరు కృతజ్ఞతలు తెలుపుకునేది చాలా తక్కువ!


  • 32:10

وَقَالُوا أَإِذَا ضَلَلْنَا فِي الْأَرْضِ أَإِنَّا لَفِي خَلْقٍ جَدِيدٍ ۚ بَلْ هُم بِلِقَاءِ رَبِّهِمْ كَافِرُونَ ١٠

మరియు వారు (అవిశ్వాసులు) అంటు న్నారు: "ఏమీ? మేము నశించి మట్టిలో కలిసి పోయినా మేము మళ్ళీ క్రొత్తగా సృష్టించబడ తామా?" అదికాదు! వారు తమ ప్రభువుతో కాబోయే సమావేశాన్ని తిరస్కరిస్తున్నారు. 6 (5/8)


  • 32:11

قُلْ يَتَوَفَّاكُم مَّلَكُ الْمَوْتِ الَّذِي وُكِّلَ بِكُمْ ثُمَّ إِلَىٰ رَبِّكُمْ تُرْجَعُونَ ١١

* వారితో ఇలా అను: "మీపై నియమించ బడిన మృత్యుదూత మీ ప్రాణం తీస్తాడు. ఆ తరువాత మీరు మీ ప్రభువు వద్దకు మరలింపబడతారు."


  • 32:12

وَلَوْ تَرَىٰ إِذِ الْمُجْرِمُونَ نَاكِسُو رُءُوسِهِمْ عِندَ رَبِّهِمْ رَبَّنَا أَبْصَرْنَا وَسَمِعْنَا فَارْجِعْنَا نَعْمَلْ صَالِحًا إِنَّا مُوقِنُونَ ١٢

మరియు (పునరుత్థానదినమున) ఈ అపరాధులు, తమ ప్రభువు సమక్షంలో, ఏవిధంగా తమతలలు వంచుకొని నిలబడిఉంటారో, నీవు చూడగలిగితే! వారు: "ఓమాప్రభూ! మేమిప్పుడు చూశాము మరియువిన్నాము, కావున మమ్మల్ని తిరిగి (భూలోకానికి) పంపించు. మేము సత్కార్యాలు చేస్తాము, నిశ్చయంగా, మాకు ఇప్పుడు నమ్మకం కలిగింది." అని అంటారు.


  • 32:13

وَلَوْ شِئْنَا لَآتَيْنَا كُلَّ نَفْسٍ هُدَاهَا وَلَـٰكِنْ حَقَّ الْقَوْلُ مِنِّي لَأَمْلَأَنَّ جَهَنَّمَ مِنَ الْجِنَّةِ وَالنَّاسِ أَجْمَعِينَ ١٣

మరియు, మేముకోరినట్లయితే, ప్రతి వ్యక్తికి (ఆత్మకు) దాని మార్గదర్శకత్వం చేసి ఉండే వారము. 7 కాని నేను: "నిశ్చయంగా జిన్నాతులు మరియు మానవులందరితో నరకాన్నినింపివేస్తాను." అని పలికిన, నా మాట సత్యమయ్యింది. 8


  • 32:14

فَذُوقُوا بِمَا نَسِيتُمْ لِقَاءَ يَوْمِكُمْ هَـٰذَا إِنَّا نَسِينَاكُمْ ۖ وَذُوقُوا عَذَابَ الْخُلْدِ بِمَا كُنتُمْ تَعْمَلُونَ ١٤

కావున మీరు మీ యొక్క ఈ నాటి సమా వేశాన్ని మరచిపోయిన దాని ఫలితాన్ని రుచి చూడండి. నిశ్చయంగా మేము కూడా మిమ్మల్ని మరచిపోయాము. మరియు మీరు మీ కర్మల ఫలితమైన ఈ శాశ్వత శిక్షను రుచి చూడండి!


  • 32:15

إِنَّمَا يُؤْمِنُ بِآيَاتِنَا الَّذِينَ إِذَا ذُكِّرُوا بِهَا خَرُّوا سُجَّدًا وَسَبَّحُوا بِحَمْدِ رَبِّهِمْ وَهُمْ لَا يَسْتَكْبِرُونَ ١٥

నిశ్చయంగా వారే, మా సూచనలు (ఆయాత్‌) వారికి బోధించినప్పుడు, వాటిని విశ్వసించి సాష్టాంగంలో (సజ్దాలో) పడిపోతారు మరియు తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతారు మరియు ఆయనను స్తుతిస్తారు మరియు వారెన్నడూ గర్వపడరు; (సజ్దా)


  • 32:16

تَتَجَافَىٰ جُنُوبُهُمْ عَنِ الْمَضَاجِعِ يَدْعُونَ رَبَّهُمْ خَوْفًا وَطَمَعًا وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ ١٦

వారు (రాత్రులలో) తమ ప్రక్కలను తమ పరుపుల నుండి దూరంచేసి, తమ ప్రభువును భయంతో మరియు ఆశతో వేడుకుంటారు 9 మరియు మేము వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఖర్చుచేస్తారు.


  • 32:17

فَلَا تَعْلَمُ نَفْسٌ مَّا أُخْفِيَ لَهُم مِّن قُرَّةِ أَعْيُنٍ جَزَاءً بِمَا كَانُوا يَعْمَلُونَ ١٧

కాని వారికి, వారికర్మల ఫలితంగా వారి కొరకు (పరలోకంలో) కళ్ళకు చలువనిచ్చే ఎటువంటి సామాగ్రి దాచిపెట్టబడి ఉందో ఏ ప్రాణికీ తెలియదు. 10


  • 32:18

أَفَمَن كَانَ مُؤْمِنًا كَمَن كَانَ فَاسِقًا ۚ لَّا يَسْتَوُونَ ١٨

ఏమీ? విశ్వాసి అయిన వాడు (దైవభీతి లేని) అవిధేయునితో సమానుడా? (కాదు)! వారు సరిసమానులు కాలేరు. 11


  • 32:19

أَمَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَلَهُمْ جَنَّاتُ الْمَأْوَىٰ نُزُلًا بِمَا كَانُوا يَعْمَلُونَ ١٩

ఎవరైతే విశ్వసించి, సత్కార్యాలు చేస్తారో, వారికి –వారి కర్మలకు ఫలితంగా – వారి ఆతిథ్యం కొరకు స్వర్గవనాలలో నివాసాలుంటాయి.


  • 32:20

وَأَمَّا الَّذِينَ فَسَقُوا فَمَأْوَاهُمُ النَّارُ ۖ كُلَّمَا أَرَادُوا أَن يَخْرُجُوا مِنْهَا أُعِيدُوا فِيهَا وَقِيلَ لَهُمْ ذُوقُوا عَذَابَ النَّارِ الَّذِي كُنتُم بِهِ تُكَذِّبُونَ ٢٠

ఇక ఎవరైతే, విద్రోహవైఖరి అవలంబిస్తారో, వారి నివాసం నరకాగ్నియే. ప్రతిసారి వారు దాని నుండి బయటపడటానికి ప్రయత్నించినపుడల్లా, వారందులోకి తిరిగి నెట్టబడతారు. మరియు వారితో ఇలా అనబడుతుంది: "మీరు తిరస్క రిస్తూ ఉండిన నరకాగ్ని శిక్షను చవిచూడండి."


  • 32:21

وَلَنُذِيقَنَّهُم مِّنَ الْعَذَابِ الْأَدْنَىٰ دُونَ الْعَذَابِ الْأَكْبَرِ لَعَلَّهُمْ يَرْجِعُونَ ٢١

మరియు ఆ పెద్దశిక్షకు ముందు మేము (ఇహలోకంలో) వారికి సమీప శిక్షను రుచిచూపు తాము. 12 బహుశా, వారు (పశ్చాత్తాపపడి సత్కార్యాల వైపునకు) మరలి వస్తారేమోనని!


  • 32:22

وَمَنْ أَظْلَمُ مِمَّن ذُكِّرَ بِآيَاتِ رَبِّهِ ثُمَّ أَعْرَضَ عَنْهَا ۚ إِنَّا مِنَ الْمُجْرِمِينَ مُنتَقِمُونَ ٢٢

మరియు తన ప్రభువు సూచన (ఆయత్) ల ద్వారా హితబోధచేయబడిన తరువాతకూడా వాటి నుండి విముఖుడయ్యే వానికంటే ఎక్కువ దుర్మార్గుడెవడు? నిశ్చయంగా, మేము అలాంటి అపరాధులకు ప్రతీకారం చేసి తీరుతాము. 13


  • 32:23

وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ فَلَا تَكُن فِي مِرْيَةٍ مِّن لِّقَائِهِ ۖ وَجَعَلْنَاهُ هُدًى لِّبَنِي إِسْرَائِيلَ ٢٣

మరియు వాస్తవంగా, మేము మూసాకు గ్రంథాన్ని ఇచ్చాము. కావున, (ఓ ప్రవక్తా)! నీవు అతనిని (ఇస్రా'రాత్రిలో) కలుసుకోబోయే విషయాన్ని గురించి సందేహంలో పడకు. 14 మరియు మేము దానిని (తౌరాత్‌ను) ఇస్రా'యీల్‌ సంతతివారికి మార్గదర్శినిగా చేశాము. 15


  • 32:24

وَجَعَلْنَا مِنْهُمْ أَئِمَّةً يَهْدُونَ بِأَمْرِنَا لَمَّا صَبَرُوا ۖ وَكَانُوا بِآيَاتِنَا يُوقِنُونَ ٢٤

మరియు మేము (ఇస్రా'యీల్‌ సంతతి) వారిలో నుండి కొందరిని నాయకులుగాచేశాము – వారు, వారికి మా ఆజ్ఞానుసారంగా మార్గదర్శ కత్వం చేస్తూ ఉన్నారు – ఎంత వరకైతే వారు సహనం వహించి ఉన్నారో మరియు వారు మా ఆయాత్‌ (సూచన) లను నమ్ముతూ ఉన్నారో!


  • 32:25

إِنَّ رَبَّكَ هُوَ يَفْصِلُ بَيْنَهُمْ يَوْمَ الْقِيَامَةِ فِيمَا كَانُوا فِيهِ يَخْتَلِفُونَ ٢٥

నిశ్చయంగా, నీ ప్రభువు, పునరుత్థాన దినమున, వారికున్న భేదాభిప్రాయాలను గురించి వారిమధ్య తీర్పుచేస్తాడు. 16


  • 32:26

أَوَلَمْ يَهْدِ لَهُمْ كَمْ أَهْلَكْنَا مِن قَبْلِهِم مِّنَ الْقُرُونِ يَمْشُونَ فِي مَسَاكِنِهِمْ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ ۖ أَفَلَا يَسْمَعُونَ ٢٦

ఏమీ? వీరికి పూర్వం అనేక తరాలను నాశ నంచేసిన విషయం వీరికి మార్గదర్శకత్వం కాదా? వీరు, వారి నివాసస్థలాలలో తిరుగుతున్నారు కదా! నిశ్చయంగా ఇందులో ఎన్నో సూచన లున్నాయి. ఏమీ? వీరు వినటం లేదా?


  • 32:27

أَوَلَمْ يَرَوْا أَنَّا نَسُوقُ الْمَاءَ إِلَى الْأَرْضِ الْجُرُزِ فَنُخْرِجُ بِهِ زَرْعًا تَأْكُلُ مِنْهُ أَنْعَامُهُمْ وَأَنفُسُهُمْ ۖ أَفَلَا يُبْصِرُونَ ٢٧

ఏమీ? వారు చూడటంలేదా? నిశ్చయంగా, మేము ఒక బంజరు భూమి వైపునకు నీళ్ళను (వర్షాన్ని) పంపి దాని నుండి పైరును ఉత్పత్తి చేస్తే, దానిని వారి పశువులు మరియు వారూ తింటున్నారని. ఏమీ? వారిది గమనించటం లేదా (చూడటం లేదా)?


  • 32:28

وَيَقُولُونَ مَتَىٰ هَـٰذَا الْفَتْحُ إِن كُنتُمْ صَادِقِينَ ٢٨

ఇంకా ఇలా అంటున్నారు: "మీరు సత్య వంతులే అయితే, ఆ తీర్పు ఎప్పుడు వస్తుందో చెప్పండి!" 17


  • 32:29

قُلْ يَوْمَ الْفَتْحِ لَا يَنفَعُ الَّذِينَ كَفَرُوا إِيمَانُهُمْ وَلَا هُمْ يُنظَرُونَ ٢٩

ఇలా అను: "ఆ తీర్పుదినంనాడు 18 సత్య-తిరస్కారులు విశ్వసించగోరినా, అది వారికి ఏ విధంగానూ పనికిరాదు! మరియు వారికెలాంటి గడువు కూడా ఇవ్వబడదు."


  • 32:30

فَأَعْرِضْ عَنْهُمْ وَانتَظِرْ إِنَّهُم مُّنتَظِرُونَ ٣٠

కావున నీవు వారితో విముఖుడవగు! 19 మరియు వేచి ఉండు, నిశ్చయంగా, వారు కూడా (ఆ దినం కొరకు) వేచి ఉంటారు. (3/4)