ర'అదున్‌: ఉరుము, మేఘగర్జన, లేక పిడుగు. ఈ సూరహ్‌ మదీనహ్లో అవతరింపజేయ బడింది. అల్లాహ్‌ (సు.త.) ఆదేశం: ''నిశ్చయంగా, ఒక జాతివారు తమ స్థితిని తాము మార్చుకో నంతవరకు, అల్లాహ్‌ వారి స్థితిని మార్చడు!'' (ఆయత్‌ 13:11). 43 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు 13వ ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

المر ۚ تِلْكَ آيَاتُ الْكِتَابِ ۗ وَالَّذِي أُنزِلَ إِلَيْكَ مِن رَّبِّكَ الْحَقُّ وَلَـٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يُؤْمِنُونَ ١

అలిఫ్‌-లామ్‌-మీమ్‌-రా. ఇవి ఈ గ్రంథ (ఖుర్‌ఆన్‌) ఆయతులు. మరియు ఇది నీ ప్రభువు తరఫు నుండి, నీపై అవతరింపజేయబడిన సత్యం! అయినా చాలా మంది విశ్వసించటం లేదు.


اللَّـهُ الَّذِي رَفَعَ السَّمَاوَاتِ بِغَيْرِ عَمَدٍ تَرَوْنَهَا ۖ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ ۖ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ ۖ كُلٌّ يَجْرِي لِأَجَلٍ مُّسَمًّى ۚ يُدَبِّرُ الْأَمْرَ يُفَصِّلُ الْآيَاتِ لَعَلَّكُم بِلِقَاءِ رَبِّكُمْ تُوقِنُونَ ٢

మీరు చూస్తున్నారు కదా! ఆకాశాలను స్తంభాలు లేకుండా నిలిపిన ఆయన, అల్లాహ్‌యే! ఆ తరువాత ఆయన, తన సింహాసనాన్ని ('అర్ష్ను) అధిష్ఠించాడు. మరియు ఆయన సూర్య-చంద్రులను తన నియమానికి బద్ధులుగా చేశాడు. ప్రతి ఒక్కటీ తన నిర్ణీతకాలంలో (తన పరిధిలో) పయనిస్తూ ఉంటుంది. 1 ఆయన అన్ని వ్యవహారాలను నడిపిస్తూ, తన సూచనలను వివరిస్తున్నాడు; బహుశా! (ఈ విధంగానైనా) మీరు మీ ప్రభువును కలుసుకోవలసి ఉందనే విషయాన్ని నమ్ముతారేమోనని.


وَهُوَ الَّذِي مَدَّ الْأَرْضَ وَجَعَلَ فِيهَا رَوَاسِيَ وَأَنْهَارًا ۖ وَمِن كُلِّ الثَّمَرَاتِ جَعَلَ فِيهَا زَوْجَيْنِ اثْنَيْنِ ۖ يُغْشِي اللَّيْلَ النَّهَارَ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَتَفَكَّرُونَ ٣

మరియు ఆయనే భూమిని విశాలంగా చేసి దానిలో స్థిరమైన పర్వతాలను మరియు నదులను నెలకొల్పాడు. అందులో ప్రతి రకమైన ఫలాన్ని, రెండేసి (ఆడ-మగ) జతలుగా చేశాడు. 2 ఆయనే రాత్రిని పగటిమీద కప్పుతాడు. నిశ్చయంగా వీట న్నింటిలో ఆలోచించేవారి కొరకు సూచన లున్నాయి.


وَفِي الْأَرْضِ قِطَعٌ مُّتَجَاوِرَاتٌ وَجَنَّاتٌ مِّنْ أَعْنَابٍ وَزَرْعٌ وَنَخِيلٌ صِنْوَانٌ وَغَيْرُ صِنْوَانٍ يُسْقَىٰ بِمَاءٍ وَاحِدٍ وَنُفَضِّلُ بَعْضَهَا عَلَىٰ بَعْضٍ فِي الْأُكُلِ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَعْقِلُونَ ٥

మరియు భూమిలో వేర్వేరు రకాల (నేలలు) ఒక దానికొకటి ప్రక్క-ప్రక్కన ఉన్నాయి మరియు ద్రాక్ష తోటలు, పంటపొలాలు మరియు ఖర్జూరపు చెట్లు, కొన్ని ఒక్కొక్కటిగానూ, మరికొన్ని గుచ్ఛలు గుచ్ఛలు (జతలు) గానూ ఉన్నాయి. 3 వాటన్నిటికీ ఒకే నీరు పారుతుంది, కాని తినటానికి వాటి రుచులు, ఒకటి మరొక దాని కంటే ఉత్తమమైనదిగా ఉన్నట్లు చేశాము. నిశ్చయంగా, వీటన్నింటిలో అర్థంచేసుకోగల వారి కొరకు ఎన్నో సూచనలున్నాయి. 4 (3/8


وَإِن تَعْجَبْ فَعَجَبٌ قَوْلُهُمْ أَإِذَا كُنَّا تُرَابًا أَإِنَّا لَفِي خَلْقٍ جَدِيدٍ ۗ أُولَـٰئِكَ الَّذِينَ كَفَرُوا بِرَبِّهِمْ ۖ وَأُولَـٰئِكَ الْأَغْلَالُ فِي أَعْنَاقِهِمْ ۖ وَأُولَـٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ ٥

* ఇది నీకు ఆశ్చర్యకరంగా ఉంటే, వారి ఈ మాట అంతకంటే ఆశ్చర్యకరమైనది: ''ఏమీ? మేము మట్టిగా మారిపోయిన తరువాత కూడా వాస్తవంగా మరల క్రొత్తగా సృష్టించబడతామా?'' అలాంటివారే తమ ప్రభువును తిరస్కరించిన వారు. అలాంటివారి మెడలలో సంకెళ్ళు వేయబడి ఉంటాయి. 5 మరియు అలాంటివారే నరక వాసులు. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు.


وَيَسْتَعْجِلُونَكَ بِالسَّيِّئَةِ قَبْلَ الْحَسَنَةِ وَقَدْ خَلَتْ مِن قَبْلِهِمُ الْمَثُلَاتُ ۗ وَإِنَّ رَبَّكَ لَذُو مَغْفِرَةٍ لِّلنَّاسِ عَلَىٰ ظُلْمِهِمْ ۖ وَإِنَّ رَبَّكَ لَشَدِيدُ الْعِقَابِ ٦

మరియు వారు మేలుకు ముందు కీడును (తెమ్మని) నిన్ను తొందరపెడుతున్నారు. 6 మరియు వారికి పూర్వం అనేక ఉదాహరణలు గడిచాయి. మరియు వారు దుర్మార్గం చేసి నప్పటికీ! 7 నిశ్చయంగా, నీ ప్రభువు ప్రజల యెడల క్షమాశీలుడు. మరియు నిశ్చయంగా, నీ ప్రభువు శిక్షించటంలో కూడా చాలా కఠినుడు. 8


وَيَقُولُ الَّذِينَ كَفَرُوا لَوْلَا أُنزِلَ عَلَيْهِ آيَةٌ مِّن رَّبِّهِ ۗ إِنَّمَا أَنتَ مُنذِرٌ ۖ وَلِكُلِّ قَوْمٍ هَادٍ ٧

మరియు సత్యతిరస్కారులు అంటున్నారు: ''అతని పై అతని ప్రభువు తరఫు నుండి ఏదైనా ఒక అద్భుత సంకేతం ఎందుకు అవతరింపజేయ బడలేదు?'' 9 వాస్తవానికి నీవు కేవలం హెచ్చరిక చేసేవాడవు మాత్రమే! మరియు ప్రతి జాతికి ఒక మార్గదర్శకుడు వచ్చి ఉన్నాడు. 10


اللَّـهُ يَعْلَمُ مَا تَحْمِلُ كُلُّ أُنثَىٰ وَمَا تَغِيضُ الْأَرْحَامُ وَمَا تَزْدَادُ ۖ وَكُلُّ شَيْءٍ عِندَهُ بِمِقْدَارٍ ٨

అల్లాహ్‌కు, ప్రతి స్త్రీ తన గర్భంలోదాల్చేది 11 మరియు గర్భకాలపు హెచ్చుతగ్గులు 12 కూడా బాగా తెలుసు. ప్రతిదానికి ఆయన దగ్గర ఒక పరిమాణం (నిర్ణయింపబడి) ఉంది.


عَالِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ الْكَبِيرُ الْمُتَعَالِ ٩

ఆయన అగోచర మరియు గోచర విషయా లన్నింటినీ ఎరిగిన వాడు. మహనీయుడు, 13 సర్వోన్నతుడు. 14


سَوَاءٌ مِّنكُم مَّنْ أَسَرَّ الْقَوْلَ وَمَن جَهَرَ بِهِ وَمَنْ هُوَ مُسْتَخْفٍ بِاللَّيْلِ وَسَارِبٌ بِالنَّهَارِ ١٠

మీలో ఒకడు తన మాటను రహస్యంగా చెప్పినా, లేక దానిని బహిరంగంగా చెప్పినా మరియు ఒకడు రాత్రి చీకటిలో దాగి ఉన్నా లేక పగటి వెలుగులో తిరుగుతూ ఉన్నా, (అల్లాహ్‌ దృష్టిలో) అంతా సమానమే (ఒకటే)! 14


لَهُ مُعَقِّبَاتٌ مِّن بَيْنِ يَدَيْهِ وَمِنْ خَلْفِهِ يَحْفَظُونَهُ مِنْ أَمْرِ اللَّـهِ ۗ إِنَّ اللَّـهَ لَا يُغَيِّرُ مَا بِقَوْمٍ حَتَّىٰ يُغَيِّرُوا مَا بِأَنفُسِهِمْ ۗ وَإِذَا أَرَادَ اللَّـهُ بِقَوْمٍ سُوءًا فَلَا مَرَدَّ لَهُ ۚ وَمَا لَهُم مِّن دُونِهِ مِن وَالٍ ١١

ప్రతివాని ముందూ వెనుకా ఆయన నియ మించిన, ఒకరివెంట ఒకరు వచ్చే 16 కావలివారు (దైవదూతలు) ఉన్నారు. వారు అల్లాహ్‌ ఆజ్ఞానుసారం అతనిని (మనిషిని) కాపాడుతూ ఉంటారు. నిశ్చయంగా ఒక జాతివారు తమ స్థితిని తాము మార్చుకోనంత వరకు, అల్లాహ్‌ వారి స్థితిని మార్చడు. 17 అల్లాహ్‌ ఒక జాతి వారికి కీడు చేయదలిస్తే దానిని ఎవ్వరూ తొలగించ లేరు. మరియు వారికి ఆయన తప్ప మరొక స్నేహితుడు (ఆదుకునేవాడు) లేడు.


هُوَ الَّذِي يُرِيكُمُ الْبَرْقَ خَوْفًا وَطَمَعًا وَيُنشِئُ السَّحَابَ الثِّقَالَ ١٢

ఆయనే! మీకు భయం మరియు ఆశ కలిగించే మెరుపులను చూపుతున్నాడు. మరియు ఆయనే నీళ్ళతో బరువెక్కిన మేఘాలను పుట్టిస్తున్నాడు.


وَيُسَبِّحُ الرَّعْدُ بِحَمْدِهِ وَالْمَلَائِكَةُ مِنْ خِيفَتِهِ وَيُرْسِلُ الصَّوَاعِقَ فَيُصِيبُ بِهَا مَن يَشَاءُ وَهُمْ يُجَادِلُونَ فِي اللَّـهِ وَهُوَ شَدِيدُ الْمِحَالِ ١٣

13. మరియు ఉరుము ఆయన పవిత్రతను కొని యాడుతుంది, ఆయన స్తోత్రం చేస్తుంది; మరియు దైవదూతలు కూడా ఆయనభయంతో (ఆయన స్తోత్రం చేస్తూ ఉంటారు)! 18 మరియు ఆయన ఫెళ ఫెళమనే ఉరుములను పంపి, వాటిద్వారా తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అయినా వీరు (సత్య- తిరస్కారులు) అల్లాహ్‌ ను గురించి వాదులాడు తున్నారు. మరియు ఆయన అద్భుత యుక్తిపరుడు. 19


لَهُ دَعْوَةُ الْحَقِّ ۖ وَالَّذِينَ يَدْعُونَ مِن دُونِهِ لَا يَسْتَجِيبُونَ لَهُم بِشَيْءٍ إِلَّا كَبَاسِطِ كَفَّيْهِ إِلَى الْمَاءِ لِيَبْلُغَ فَاهُ وَمَا هُوَ بِبَالِغِهِ ۚ وَمَا دُعَاءُ الْكَافِرِينَ إِلَّا فِي ضَلَالٍ ١٤

ఆయనను ప్రార్థించటమే విద్యుక్త ధర్మం. ఆయనను వదలి వారు ప్రార్థించేవి (ఇతర శక్తులు) వారికి ఏవిధమైన సమాధానమివ్వలేవు. అది (వాటిని వేడుకోవడం): ఒకడు తన రెండుచేతులు నీటివైపుకు చాచి అది (నీరు) నోటిదాకా రావాలని ఆశించటమే! కాని అది అతని (నోటి వరకు) చేరదు కదా! (అలాగే) సత్య-తిరస్కారుల ప్రార్థన లన్నీ వ్యర్థమైపోతాయి.


وَلِلَّـهِ يَسْجُدُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ طَوْعًا وَكَرْهًا وَظِلَالُهُم بِالْغُدُوِّ وَالْآصَالِ ۩ ١٥

మరియు భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువు ఇష్టంగానో అయిష్టంగానో అల్లాహ్‌కు సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉంటుంది. మరియు వాటి నీడలు కూడా ఉదయం మరియు సాయంత్రం (సాష్టాంగం చేస్తూ ఉంటాయి). 20 (సజ్దా)


قُلْ مَن رَّبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ قُلِ اللَّـهُ ۚ قُلْ أَفَاتَّخَذْتُم مِّن دُونِهِ أَوْلِيَاءَ لَا يَمْلِكُونَ لِأَنفُسِهِمْ نَفْعًا وَلَا ضَرًّا ۚ قُلْ هَلْ يَسْتَوِي الْأَعْمَىٰ وَالْبَصِيرُ أَمْ هَلْ تَسْتَوِي الظُّلُمَاتُ وَالنُّورُ ۗ أَمْ جَعَلُوا لِلَّـهِ شُرَكَاءَ خَلَقُوا كَخَلْقِهِ فَتَشَابَهَ الْخَلْقُ عَلَيْهِمْ ۚ قُلِ اللَّـهُ خَالِقُ كُلِّ شَيْءٍ وَهُوَ الْوَاحِدُ الْقَهَّارُ ١٦

ఇలా అడుగు: ''భూమ్యాకాశాలకు ప్రభువు ఎవరు?'' నీవే ఇలా జవాబివ్వు: ''అల్లాహ్‌!'' తరు వాత ఇలా అను: ''అయితే మీరు ఆయనను వదలి తమకుతాము మేలుగానీ, కీడుగానీ చేసుకో లేని వారిని, మీకు సహాయకులుగా (సంరక్షకు లుగా) ఎన్నుకుంటారా?'' ఇంకా ఇలా అడుగు: ''ఏమీ? గ్రుడ్డివాడు మరియు చూడ గలిగేవాడూ సమానులు కాగలరా? లేక అంధకారాలు మరియు వెలుగు సమానమేనా? లేక వారు (అల్లాహ్‌కు) సాటి-కల్పించిన వారు కూడా అల్లాహ్‌ సృష్టించి నట్లు ఏమైనా సృష్టించారా అందువలన సృష్టి విషయంలో వారికి సందేహం కలిగిందా?'' వారితో అను: ''అల్లాహ్‌యే ప్రతి దానికి సృష్టికర్త. 21 మరియు ఆయన అద్వితీయుడు, ప్రబలుడు (తన సృష్టిపై సంపూర్ణ అధికారం గలవాడు).'' 22


أَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَسَالَتْ أَوْدِيَةٌ بِقَدَرِهَا فَاحْتَمَلَ السَّيْلُ زَبَدًا رَّابِيًا ۚ وَمِمَّا يُوقِدُونَ عَلَيْهِ فِي النَّارِ ابْتِغَاءَ حِلْيَةٍ أَوْ مَتَاعٍ زَبَدٌ مِّثْلُهُ ۚ كَذَٰلِكَ يَضْرِبُ اللَّـهُ الْحَقَّ وَالْبَاطِلَ ۚ فَأَمَّا الزَّبَدُ فَيَذْهَبُ جُفَاءً ۖ وَأَمَّا مَا يَنفَعُ النَّاسَ فَيَمْكُثُ فِي الْأَرْضِ ۚ كَذَٰلِكَ يَضْرِبُ اللَّـهُ الْأَمْثَالَ ١٧

ఆయన (అల్లాహ్‌) ఆకాశం నుండి నీరు కురిపించగా (ఎండిపోయిన) సెలయేళ్ళు తమ తమ పరిమాణాలకు సరిపడేలా 23 ప్రవహింప సాగుతాయి. అప్పుడు వరద (ఉపరితలం మీద) నురుగులు ఉబ్బివస్తాయి. మరియు అగ్నిని రగిలించి నగలు, పాత్రలు చేసేటప్పుడు కూడా కరిగించే లోహాల మీద కూడా అదేవిధంగా నురుగులు వస్తాయి. 24 ఈ విధంగా అల్లాహ్‌ సత్యమేదో అసత్యమేదో పోల్చి వివరిస్తున్నాడు. ఎందుకంటే నురుగంతా ఎగిరిపోతుంది, కాని మానవులకు లాభదాయకమైనది భూమిలో మిగులుతుంది. ఈ విధంగా అల్లాహ్‌ ఉదాహరణ లను వివరిస్తున్నాడు. 25


لِلَّذِينَ اسْتَجَابُوا لِرَبِّهِمُ الْحُسْنَىٰ ۚ وَالَّذِينَ لَمْ يَسْتَجِيبُوا لَهُ لَوْ أَنَّ لَهُم مَّا فِي الْأَرْضِ جَمِيعًا وَمِثْلَهُ مَعَهُ لَافْتَدَوْا بِهِ ۚ أُولَـٰئِكَ لَهُمْ سُوءُ الْحِسَابِ وَمَأْوَاهُمْ جَهَنَّمُ ۖ وَبِئْسَ الْمِهَادُ ١٨

తమ ప్రభువుసందేశాన్ని స్వీకరించిన వారికి మంచిప్రతిఫలంఉంటుంది. మరియు ఆయన సందే శాన్ని స్వీకరించని వారి దగ్గర భూమిలో ఉన్న దంతా మరియు దానితో పాటు దానికి సమానంగా ఉన్నా, వారు అదంతా పరిహారంగా ఇవ్వదలచు కున్నా (అది స్వీకరించబడదు). 26 అలాంటి వారి లెక్క దారుణంగా ఉంటుంది. మరియు వారి ఆశ్రయం నరకమే. మరియు అది ఎంతో దుర్భర మైన విరామ స్థలము. (1/2)


فَمَن يَعْلَمُ أَنَّمَا أُنزِلَ إِلَيْكَ مِن رَّبِّكَ الْحَقُّ كَمَنْ هُوَ أَعْمَىٰ ۚ إِنَّمَا يَتَذَكَّرُ أُولُو الْأَلْبَابِ ١٩

* ఏమీ? నీ ప్రభువు నుండి నీపై అవతరింప జేయబడినది (ఈ సందేశం) సత్యమని తెలుసు కున్నవాడు, గ్రుడ్డివానితో సమానుడా? నిశ్చయంగా, బుధ్ధిమంతులే ఇది (ఈ విషయం) గ్రహించగలరు.


الَّذِينَ يُوفُونَ بِعَهْدِ اللَّـهِ وَلَا يَنقُضُونَ الْمِيثَاقَ ٢٠

వారే, ఎవరైతే అల్లాహ్‌తో చేసిన వాగ్దానం పూర్తిచేస్తారో మరియు తమ వాగ్దానాన్ని భంగపరచరో! 27


وَالَّذِينَ يَصِلُونَ مَا أَمَرَ اللَّـهُ بِهِ أَن يُوصَلَ وَيَخْشَوْنَ رَبَّهُمْ وَيَخَافُونَ سُوءَ الْحِسَابِ ٢١

మరియు ఎవరైతే అల్లాహ్‌ కలుపమని ఆజ్ఞాపించిన వాటిని కలుపుతారో! 28 మరియు తమ ప్రభువుకు భయపడుతారో మరియు దారుణంగా (ఖచ్చితంగా) తీసుకోబడే లెక్కకు భయపడుతారో!


وَالَّذِينَ صَبَرُوا ابْتِغَاءَ وَجْهِ رَبِّهِمْ وَأَقَامُوا الصَّلَاةَ وَأَنفَقُوا مِمَّا رَزَقْنَاهُمْ سِرًّا وَعَلَانِيَةً وَيَدْرَءُونَ بِالْحَسَنَةِ السَّيِّئَةَ أُولَـٰئِكَ لَهُمْ عُقْبَى الدَّارِ ٢٢

మరియు ఎవరైతే తమప్రభువు ప్రీతి కొరకు సహనం వహించి 29 మరియు నమా'జ్‌ స్థాపించి 30 మరియు మేము ప్రసాదించిన ఉపాధి నుండి రహస్యంగా మరియు బహిరంగంగా (అల్లాహ్‌ మార్గంలో) ఖర్చుచేస్తూ, చెడును మంచి ద్వారా పారద్రోలుతూ ఉంటారో; 31 అలాంటి వారికే ఉత్తమ పరలోకగృహం ప్రతిఫలంగా ఉంటుంది.


جَنَّاتُ عَدْنٍ يَدْخُلُونَهَا وَمَن صَلَحَ مِنْ آبَائِهِمْ وَأَزْوَاجِهِمْ وَذُرِّيَّاتِهِمْ ۖ وَالْمَلَائِكَةُ يَدْخُلُونَ عَلَيْهِم مِّن كُلِّ بَابٍ ٢٣

శాశ్వతంగా ఉండే ఉద్యానవనాలలో 32 వారు మరియు వారితో పాటు సద్వర్తనులైన వారి తండ్రి-తాతలు వారి సహవాసులు (అ'జ్వాజ్‌) మరియు వారి సంతానం కూడా ప్రవేశిస్తారు. 33 మరియు ప్రతి ద్వారం నుండి దేవదూతలు వారి (స్వాగతం) కొరకు వస్తారు.


سَلَامٌ عَلَيْكُم بِمَا صَبَرْتُمْ ۚ فَنِعْمَ عُقْبَى الدَّارِ ٢٤

(దేవదూతలు అంటారు): ''మీ సహనానికి, ఫలితంగా ఇప్పుడు మీకు శాంతి కలుగుగాక (సలాం)! ఇక ఈ అంతిమ (పరలోక) గృహం ఎంతో సౌఖ్యదాయక మైనది!''


وَالَّذِينَ يَنقُضُونَ عَهْدَ اللَّـهِ مِن بَعْدِ مِيثَاقِهِ وَيَقْطَعُونَ مَا أَمَرَ اللَّـهُ بِهِ أَن يُوصَلَ وَيُفْسِدُونَ فِي الْأَرْضِ ۙ أُولَـٰئِكَ لَهُمُ اللَّعْنَةُ وَلَهُمْ سُوءُ الدَّارِ ٢٥

మరియుఅల్లాహ్‌తో ఒడంబడిక చేసుకున్న తరువాత తమ వాగ్దానాన్ని భంగంచేసేవారు మరియు అల్లాహ్‌: 'కలపండి', అని ఆదేశించిన వాటిని త్రెంచేవారు మరియు భూమిలో కల్లోలం రేకెత్తించేవారు! ఇలాంటి వారందరికీ ఆయన శాపం (బహిష్కారం) ఉంటుంది మరియు వారికి (పరలోకంలో) బహుచెడ్డ నివాసముంటుంది.


اللَّـهُ يَبْسُطُ الرِّزْقَ لِمَن يَشَاءُ وَيَقْدِرُ ۚ وَفَرِحُوا بِالْحَيَاةِ الدُّنْيَا وَمَا الْحَيَاةُ الدُّنْيَا فِي الْآخِرَةِ إِلَّا مَتَاعٌ ٢٦

అల్లాహ్‌ తాను కోరినవారికి జీవనోపాధి పుష్కలంగా ప్రసాదిస్తాడు మరియు (తాను కోరిన వారికి) పరిమితం చేస్తాడు. 34 మరియు వారు ఇహలోక జీవితంలో సంతోషంగా ఉన్నారు, కాని పరలోక జీవితం ముందు ఇహలోక జీవిత సుఖ సంతోషాలు తాత్కాలిక (తుచ్ఛ) మైనవే!


وَيَقُولُ الَّذِينَ كَفَرُوا لَوْلَا أُنزِلَ عَلَيْهِ آيَةٌ مِّن رَّبِّهِ ۗ قُلْ إِنَّ اللَّـهَ يُضِلُّ مَن يَشَاءُ وَيَهْدِي إِلَيْهِ مَنْ أَنَابَ ٢٧

మరియు సత్య-తిరస్కారులు: ''అతని (ము'హమ్మద్‌) పై, అతని ప్రభువు తరఫు నుండి ఏదైనా ఒక అద్భుత సంకేతం ఎందుకు అవత రింపజేయబడలేదు?'' 35 అని అంటున్నారు. వారితో అను: ''నిశ్చయంగా, అల్లాహ్‌ తాను కోరిన వారిని మార్గ-భ్రష్టులుగా వదలుతాడు మరియు పశ్చాత్తాపపడి ఆయన వైపునకు తిరిగే వారికి సన్మార్గం చూపుతాడు.''


الَّذِينَ آمَنُوا وَتَطْمَئِنُّ قُلُوبُهُم بِذِكْرِ اللَّـهِ ۗ أَلَا بِذِكْرِ اللَّـهِ تَطْمَئِنُّ الْقُلُوبُ ٢٨

ఎవరైతే విశ్వసించారో, వారి హృదయాలు అల్లాహ్‌ ధ్యానం వలన తృప్తి పొందుతాయి. జాగ్రత్తగా వినండి! కేవలం అల్లాహ్‌ ధ్యానమే (స్మరణయే) హృదయాలకు తృప్తినిస్తుంది.


الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ طُوبَىٰ لَهُمْ وَحُسْنُ مَآبٍ ٢٩

విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి (ఇహ లోకంలో) ఆనందం, సర్వసుఖాలు 36 మరియు (పర లోకంలో) మంచి గమ్యస్థానం ఉంటాయి.


كَذَٰلِكَ أَرْسَلْنَاكَ فِي أُمَّةٍ قَدْ خَلَتْ مِن قَبْلِهَا أُمَمٌ لِّتَتْلُوَ عَلَيْهِمُ الَّذِي أَوْحَيْنَا إِلَيْكَ وَهُمْ يَكْفُرُونَ بِالرَّحْمَـٰنِ ۚ قُلْ هُوَ رَبِّي لَا إِلَـٰهَ إِلَّا هُوَ عَلَيْهِ تَوَكَّلْتُ وَإِلَيْهِ مَتَابِ ٣٠

అందుకే (ఓ ము'హమ్మద్‌!) మేము నిన్ను ఒక సమాజం వారి వద్దకు పంపాము – వాస్తవానికి వారికి పూర్వం ఎన్నో సమాజాలు గతించాయి – నీవు నీపై మేము అవతరింపజేసిన దివ్యజ్ఞానం వారికి వినిపించటానికి! ఎందుకంటే వారు తమ కరుణామయుణ్ణి తిరస్కరిస్తున్నారు. 37 వారితో అను: ''ఆయనే నా ప్రభువు! ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు! నేను ఆయననే నమ్ము కున్నాను. మరియు ఆయన వైపునకే నేను పశ్చాత్తాపంతో మరలిపోవలసి ఉన్నది.''


وَلَوْ أَنَّ قُرْآنًا سُيِّرَتْ بِهِ الْجِبَالُ أَوْ قُطِّعَتْ بِهِ الْأَرْضُ أَوْ كُلِّمَ بِهِ الْمَوْتَىٰ ۗ بَل لِّلَّـهِ الْأَمْرُ جَمِيعًا ۗ أَفَلَمْ يَيْأَسِ الَّذِينَ آمَنُوا أَن لَّوْ يَشَاءُ اللَّـهُ لَهَدَى النَّاسَ جَمِيعًا ۗ وَلَا يَزَالُ الَّذِينَ كَفَرُوا تُصِيبُهُم بِمَا صَنَعُوا قَارِعَةٌ أَوْ تَحُلُّ قَرِيبًا مِّن دَارِهِمْ حَتَّىٰ يَأْتِيَ وَعْدُ اللَّـهِ ۚ إِنَّ اللَّـهَ لَا يُخْلِفُ الْمِيعَادَ ٣١

మరియు నిశ్చయంగా, (ఖుర్‌ఆన్‌ను) పఠిం చటం వలన కొండలు కదలింపబడినా, లేదా దాని వల్ల భూమిచీల్చబడినా లేదా దానివల్ల మృతులు మాట్లాడేటట్లు చేయబడినా! (అవిశ్వాసులు దానిని విశ్వసించరు). వాస్తవానికి సర్వ నిర్ణయాల అధికారం కేవలం అల్లాహ్‌కే చెందుతుంది. 38 ఏమీ? ఒకవేళ అల్లాహ్‌ కోరితే సర్వ మానవులకు సన్మార్గం చూపేవాడని తెలిసికూడా విశ్వాసులు ఎందుకు ఆశవదులుకుంటున్నారు? 39 మరియు అల్లాహ్‌ వాగ్దానం పూర్తి అయ్యేవరకు సత్య-తిరస్కారంలో మునిగి ఉన్న వారిపై, వారి కర్మల ఫలితంగా, ఏదో ఒక ఆపద కలుగుతూనే ఉంటుంది. లేదా అది వారి ఇండ్ల సమీపంలో పడుతూ ఉంటుంది. 40 నిశ్చయంగా, అల్లాహ్‌ తన వాగ్దానాన్ని భంగపరచడు.


وَلَقَدِ اسْتُهْزِئَ بِرُسُلٍ مِّن قَبْلِكَ فَأَمْلَيْتُ لِلَّذِينَ كَفَرُوا ثُمَّ أَخَذْتُهُمْ ۖ فَكَيْفَ كَانَ عِقَابِ ٣٢

మరియు (ఓ ము'హమ్మద్‌!) వాస్తవానికి నీకు పూర్వం కూడా చాలా మంది ప్రవక్తలు పరిహసించబడ్డారు, కావున మొదట నేను సత్య-తిరస్కారులకు వ్యవధినిచ్చాను తరువాత వారిని పట్టుకున్నాను. (చూశారా!) నా ప్రతీకారం (శిక్ష) ఎలా ఉండిందో! 41


أَفَمَنْ هُوَ قَائِمٌ عَلَىٰ كُلِّ نَفْسٍ بِمَا كَسَبَتْ ۗ وَجَعَلُوا لِلَّـهِ شُرَكَاءَ قُلْ سَمُّوهُمْ ۚ أَمْ تُنَبِّئُونَهُ بِمَا لَا يَعْلَمُ فِي الْأَرْضِ أَم بِظَاهِرٍ مِّنَ الْقَوْلِ ۗ بَلْ زُيِّنَ لِلَّذِينَ كَفَرُوا مَكْرُهُمْ وَصُدُّوا عَنِ السَّبِيلِ ۗ وَمَن يُضْلِلِ اللَّـهُ فَمَا لَهُ مِنْ هَادٍ ٣٣

ఏమీ? ఆయన (అల్లాహ్‌) ప్రతివ్యక్తి అర్జించే దానిని కనిపెట్టుకుని ఉండేవాడు (మరియు లాభ-నష్టాలు కలుగజేయలేని మీ బూటకపు దైవాలు సరిసమానులా)? అయినా వారు అల్లాహ్‌కు భాగ స్వాములు (సాటి) కల్పిస్తారు. వారితో ఇలా అను: ''(నిజంగానే వారు అల్లాహ్‌ స్వయంగా నియ మించుకున్న భాగస్వాములేఅయితే) వారి పేర్లను తెలుపండి! లేక భూమిలో ఉన్నట్లు ఆయనకు తెలియని విషయాన్ని మీరు ఆయనకు తెలుపు తున్నారా? లేక మీరు ఇట్లే నోటికి వచ్చినట్లు వాగుతున్నారా?'' 42 వాస్తవానికి, సత్యాన్ని తిరస్కరించిన వారికి, వారి కుట్ర ఆకర్షణీయంగా చేయబడుతోంది. మరియు వారు ఋజుమార్గం నుండి నిరోధించబడ్డారు. మరియు అల్లాహ్‌ మార్గభ్రష్టత్వంలో వదలిన వానికి సన్మార్గం చూపేవాడు ఎవ్వడూ ఉండడు. 43


لَّهُمْ عَذَابٌ فِي الْحَيَاةِ الدُّنْيَا ۖ وَلَعَذَابُ الْآخِرَةِ أَشَقُّ ۖ وَمَا لَهُم مِّنَ اللَّـهِ مِن وَاقٍ ٣٤

వారికి ఇహలోక జీవితంలో శిక్ష వుంది. మరియు వారి పరలోక జీవిత శిక్ష ఎంతో కఠినమైనది. మరియు వారిని అల్లాహ్‌ (శిక్ష) నుండి రక్షించేవాడు ఎవ్వడూ ఉండడు. 44 (5/8)


مَّثَلُ الْجَنَّةِ الَّتِي وُعِدَ الْمُتَّقُونَ ۖ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۖ أُكُلُهَا دَائِمٌ وَظِلُّهَا ۚ تِلْكَ عُقْبَى الَّذِينَ اتَّقَوا ۖ وَّعُقْبَى الْكَافِرِينَ النَّارُ ٣٥

* దైవభీతి గలవారికి వాగ్దానం చేయబడిన స్వర్గపు ఉదాహరణ ఇదే! దాని క్రింద సెలయేళ్ళు పారుతూ ఉంటాయి. 45 దాని ఫలాలు మరియు నీడ సదా ఉంటాయి. 46 దైవభీతి గలవారి అంతిమ ఫలితం ఇదే. మరియు సత్య-తిరస్కారుల అంతిమ ఫలితం నరకాగ్నియే!


وَالَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَفْرَحُونَ بِمَا أُنزِلَ إِلَيْكَ ۖ وَمِنَ الْأَحْزَابِ مَن يُنكِرُ بَعْضَهُ ۚ قُلْ إِنَّمَا أُمِرْتُ أَنْ أَعْبُدَ اللَّـهَ وَلَا أُشْرِكَ بِهِ ۚ إِلَيْهِ أَدْعُو وَإِلَيْهِ مَآبِ ٣٦

మరియు (ఓ ప్రవక్తా!) ఎవరికైతే మేము (ముందు) గ్రంథాన్ని ఇచ్చామో! వారు నీపై అవతరింపజేయబడిన దాని (ఈ గ్రంథం) వలన సంతోషపడుతున్నారు. 47 మరియు వారిలోని కొన్ని వర్గాల వారు దానిలోని కొన్ని విషయాలను తిరస్కరించేవారు కూడా ఉన్నారు. 48 వారితో ఇలా అను: ''నిశ్చయంగా, నేను అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలని మరియు ఆయనకు సాటి (భాగ-స్వాములను) కల్పించరాదని ఆజ్ఞాపించబడ్డాను. నేను మిమ్మల్ని ఆయన వైపునకే ఆహ్వానిస్తున్నాను మరియు గమ్యస్థానం కూడా ఆయనవద్దనే ఉంది!''


وَكَذَٰلِكَ أَنزَلْنَاهُ حُكْمًا عَرَبِيًّا ۚ وَلَئِنِ اتَّبَعْتَ أَهْوَاءَهُم بَعْدَ مَا جَاءَكَ مِنَ الْعِلْمِ مَا لَكَ مِنَ اللَّـهِ مِن وَلِيٍّ وَلَا وَاقٍ ٣٧

మరియు ఈవిధంగా మేము అరబ్బీభాషలో మా శాసనాన్ని అవతరింపజేశాము. 49 ఇక నీవు ఈ జ్ఞానం వచ్చిన తరువాత కూడా వారి కోరిక లను అనుసరిస్తే, అల్లాహ్‌ నుండి నిన్ను రక్షించే వాడుగానీ, కాపాడేవాడుగానీ ఎవ్వడూ ఉండడు.


وَلَقَدْ أَرْسَلْنَا رُسُلًا مِّن قَبْلِكَ وَجَعَلْنَا لَهُمْ أَزْوَاجًا وَذُرِّيَّةً ۚ وَمَا كَانَ لِرَسُولٍ أَن يَأْتِيَ بِآيَةٍ إِلَّا بِإِذْنِ اللَّـهِ ۗ لِكُلِّ أَجَلٍ كِتَابٌ ٣٨

మరియు (ఓ ము'హమ్మద్‌!) వాస్తవానికి మేము నీకు పూర్వం అనేక ప్రవక్తలను పంపాము మరియు వారికి భార్యాపిల్లలను ప్రసాదించాము. 50 అల్లాహ్‌ అనుమతి లేకుండా, ఏ అధ్భుత సంకే తాన్ని (స్వయంగా) తెచ్చి చూపే శక్తి ఏ ప్రవక్తకూ లేదు. 51 ప్రతి వాగ్దానానికి (విషయానికి) వ్రాయ బడిన ఒక ఆదేశం (శాసనం) ఉంది. 52


يَمْحُو اللَّـهُ مَا يَشَاءُ وَيُثْبِتُ ۖ وَعِندَهُ أُمُّ الْكِتَابِ ٣٩

అల్లాహ్‌ తానుకోరిన దానిని రద్దుచేస్తాడు మరియు (తాను కోరిన దానిని) స్థిరపరుస్తాడు. 53 మరియు మాతృగ్రంథం (ఉమ్ముల్‌ కితాబ్‌) ఆయన దగ్గరే ఉంది. 54


وَإِن مَّا نُرِيَنَّكَ بَعْضَ الَّذِي نَعِدُهُمْ أَوْ نَتَوَفَّيَنَّكَ فَإِنَّمَا عَلَيْكَ الْبَلَاغُ وَعَلَيْنَا الْحِسَابُ ٤٠

మరియు (ఓ ప్రవక్తా!) మేము వారికి చేసిన వాగ్దానాలలో కొన్నింటిని నీకు చూపినా, లేదా (వాటిని చూపక ముందు) నిన్ను మరణింపజేసినా, నీ బాధ్యత కేవలం (మా సందేశాన్ని) అందజేయ టమే! మరియు లెక్కతీసుకోవటం కేవలం మాపని.


أَوَلَمْ يَرَوْا أَنَّا نَأْتِي الْأَرْضَ نَنقُصُهَا مِنْ أَطْرَافِهَا ۚ وَاللَّـهُ يَحْكُمُ لَا مُعَقِّبَ لِحُكْمِهِ ۚ وَهُوَ سَرِيعُ الْحِسَابِ ٤١

ఏమీ? వాస్తవానికి మేము భూమిని అన్ని వైపులనుండి తగ్గిస్తూవస్తున్నామనేది వారు చూడ టం లేదా? 55 మరియు అల్లాహ్‌యే ఆజ్ఞఇస్తాడు! ఆయన ఆజ్ఞను మార్చేవాడు ఎవ్వడూ లేడు. మరియు ఆయన లెక్కతీసుకోవటంలో అతిశీఘ్రుడు.


وَقَدْ مَكَرَ الَّذِينَ مِن قَبْلِهِمْ فَلِلَّـهِ الْمَكْرُ جَمِيعًا ۖ يَعْلَمُ مَا تَكْسِبُ كُلُّ نَفْسٍ ۗ وَسَيَعْلَمُ الْكُفَّارُ لِمَنْ عُقْبَى الدَّارِ ٤٢

మరియు వాస్తవానికి వారికి పూర్వం ఉన్నవారు కూడా కుట్రలు పన్నారు. కాని, కుట్ర లన్నీ అల్లాహ్‌కే చెందినవి. ప్రతిప్రాణి సంపాదించేది ఆయనకు తెలుసు. మరియు (మేలైన) అంతిమ (పరలోక) నివాసం ఎవరిదో సత్యతిరస్కారులు తెలుసుకుంటారు.


وَيَقُولُ الَّذِينَ كَفَرُوا لَسْتَ مُرْسَلًا ۚ قُلْ كَفَىٰ بِاللَّـهِ شَهِيدًا بَيْنِي وَبَيْنَكُمْ وَمَنْ عِندَهُ عِلْمُ الْكِتَابِ ٤٣

మరియు (ఓ ప్రవక్తా!) సత్యతిరస్కారులు నీతో అంటున్నారు: ''నీవు సందేశహరుడవు కావు!'' వారితో అను: ''నాకూ-మీకూ మధ్య అల్లాహ్‌ సాక్ష్యమే చాలు! మరియు వారి (సాక్ష్యం), ఎవరికైతే గ్రంథజ్ఞానం ఉందో!'' 56