అన్‌-న’స్ర్: Help, Succour, సహాయం, విజయం, తోడ్పాటు. ఇది దైవప్రవక్త ('స'అస) నిర్యాణానికి కొన్ని వారాల ముందు, చిట్టచివర అవతరింపజేయబడిన మదీనహ్ సూరహ్‌. ఇది 10వ హిజ్రీలో అవతరింపజేయబడింది. ('స'హీ'హ్‌ ముస్లిం). ఇది 3 ఆయాతులున్న3వ సూరహ్. దీని పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 110:1

إِذَا جَاءَ نَصْرُ اللَّـهِ وَالْفَتْحُ ١

(ఓ ము'హమ్మద్‌!) ఎప్పడైతే అల్లాహ్‌ సహాయం వస్తుందో మరియు విజయం (లభిస్తుందో)!


  • 110:2

وَرَأَيْتَ النَّاسَ يَدْخُلُونَ فِي دِينِ اللَّـهِ أَفْوَاجًا ٢

మరియు నీవు ప్రజలను గుంపులు- గుంపులుగా అల్లాహ్‌ ధర్మం (ఇస్లాం)లో ప్రవేశించడం చూస్తావో! 1


  • 110:3

فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَاسْتَغْفِرْهُ ۚ إِنَّهُ كَانَ تَوَّابًا ٣

అప్పుడు నీవు నీ ప్రభువు స్తోత్రంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు మరియు ఆయన క్షమాభిక్షను అర్థించు. నిశ్చయంగా, ఆయనే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు. 2