అన్‌-నాస్‌: Mankind, మానవులు, జనులు. సూరహ్ అల్‌-ఫలఖ్‌ (113) తో పాటు, ఈ సూరహ్‌ మక్కహ్ లో అవతరింపజేయబడింది. మానవుని హృదయంలో ఉండే కీడు నుండి మరియు ఇతరుల హృదయాలలో ఉండే కీడు నుండి శరణుకోరుకోమని ప్రబోధించబడింది. దీని ఘనత ఇంతకు ముందు సూరహ్‌లో పేర్కొనబడింది. ఒకసారి దైవప్రవక్త ('స'అస) నమా'జ్‌ చేస్తుండగా అతనికి తేలుకుట్టింది. నమా'జ్‌ పూర్తి చేసిన తరువాత అతను నీటిలో ఉప్పు కలిపి గాయం మీద పూస్తూ సూ.అల్‌-కాఫిరూన్ (109) సూ. అల్‌-ఇ'ఖ్లా'స్‌ (112) మరియు సూ. అన్‌-నాస్‌ (114) సూరహ్‌లు చదివారు. (ముజమ్మ'అ అ'జ్జవాయి'ద్‌, 5/111). 6 ఆయాతులున్నఈ సూరహ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 114:1

قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ ١

ఇలా అను: "నేను మానవుల ప్రభువు (అల్లాహ్‌) ను శరణుకై వేడుకుంటున్నాను! 1


  • 114:2

مَلِكِ النَّاسِ ٢

"మానవుల సార్వభౌముడు! 2


  • 114:3

إِلَـٰهِ النَّاسِ ٣

"మానవుల ఆరాధ్యదైవం (అయిన అల్లాహ్‌ యొక్క శరణు)!


  • 114:4

مِن شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ ٤

"కలతలు రేకెత్తించి తొలగిపోయేవాని కీడునుండి;


  • 114:5

الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ ٥

"ఎవడైతే మానవుల హృదయాలలో కలతలు రేకెత్తిస్తాడో! 3


  • 114:6

مِنَ الْجِنَّةِ وَالنَّاسِ ٦

"వాడు జిన్నాతులలోనివాడూ కావచ్చు లేదా మానవులలోనివాడూ కావచ్చు! 4