అ'జ్‌-'జల్‌'జలహ్‌: The Earthquake, భూకంపం, ఇది సూరహ్‌ అ'జ్‌-'జిల్‌'జాల్‌ అని కూడా అనబడుతుంది. ఇది మొదటి మదీనహ్ కాలంలో అవతరింపజేయబడింది. 8 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 99:1

إِذَا زُلْزِلَتِ الْأَرْضُ زِلْزَالَهَا ١

భూమి తన అతి తీవ్రమైన (అంతిమ) భూకంపంతో కంపింపజేయబడినప్పుడు! 1


  • 99:2

وَأَخْرَجَتِ الْأَرْضُ أَثْقَالَهَا ٢

మరియు భూమి తన భారాన్నంతా తీసి బయట పడవేసినప్పుడు! 2


  • 99:3

وَقَالَ الْإِنسَانُ مَا لَهَا ٣

మరియు మానవుడు: "దీనికి ఏమైంది?" అని అన్నప్పుడు.


  • 99:4

يَوْمَئِذٍ تُحَدِّثُ أَخْبَارَهَا ٤

ఆ రోజు అది తన సమాచారాలను వివరిస్తుంది. 3


  • 99:5

بِأَنَّ رَبَّكَ أَوْحَىٰ لَهَا ٥

ఎందుకంటే, నీ ప్రభువు దానిని ఆదేశించి ఉంటాడు.


  • 99:6

يَوْمَئِذٍ يَصْدُرُ النَّاسُ أَشْتَاتًا لِّيُرَوْا أَعْمَالَهُمْ ٦

ఆ రోజు ప్రజలు తమతమ కర్మలు చూపించ బడటానికి వేర్వేరు గుంపులలో వెళ్తారు.


  • 99:7

فَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ ٧

అప్పుడు, ప్రతివాడు తాను, రవ్వంత (పరమాణువంత) మంచిని చేసిఉన్నా, దానిని చూసుకుంటాడు. 4


  • 99:8

وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ ٨

మరియు అలాగే, ప్రతివాడు తాను రవ్వంత (పరమాణువంత) చెడును చేసిఉన్నా, దానిని చూసుకుంటాడు.