అల్‌-ఖారి'అహ్‌: The Sudden Calamity, ఉపద్రవం, The Striking Hour, దుర్ఘటన, విపత్తు. మొదటి మక్కహ్ కాలపు ఈ సూరహ్‌. బహుశా సూరహ్‌ అత్‌-తీన్‌ (95) తరువాత అవతరింపజేయబడింది. 11 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ లో ఉంది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 101:1

الْقَارِعَةُ ١

ఆ! అదరగొట్టే మహా ఉపద్రవం! 1


  • 101:2

مَا الْقَارِعَةُ ٢

ఏమిటా అదరగొట్టే మహా ఉపద్రవం?


  • 101:3

وَمَا أَدْرَاكَ مَا الْقَارِعَةُ ٣

మరియు ఆ అదరగొట్టే మహా ఉపద్రవం, అంటే ఏమిటో నీకేం తెలుసు?


  • 101:4

يَوْمَ يَكُونُ النَّاسُ كَالْفَرَاشِ الْمَبْثُوثِ ٤

ఆ రోజు మానవులు చెల్లాచెదురైన చిమ్మెటల వలే అయిపోతారు. 2


  • 101:5

وَتَكُونُ الْجِبَالُ كَالْعِهْنِ الْمَنفُوشِ ٥

మరియు పర్వతాలు రంగురంగుల ఏకిన దూదివలే అయిపోతాయి. 3


  • 101:6

فَأَمَّا مَن ثَقُلَتْ مَوَازِينُهُ ٦

అప్పుడు ఎవడి త్రాసుపళ్ళాలు (సత్కా ర్యాలతో) బరువుగా ఉంటాయో! 4


  • 101:7

فَهُوَ فِي عِيشَةٍ رَّاضِيَةٍ ٧

అతడు (స్వర్గంలో) సుఖవంతమైన జీవితం గడుపుతాడు.


  • 101:8

وَأَمَّا مَنْ خَفَّتْ مَوَازِينُهُ ٨

మరియు ఎవడి (సత్కార్యాల) త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో! 5


  • 101:9

فَأُمُّهُ هَاوِيَةٌ ٩

అతని నివాసం అధఃపాతాళమే. 6


  • 101:10

وَمَا أَدْرَاكَ مَا هِيَهْ ١٠

మరియు అది ఏమిటో నీకేం తెలుసు?


  • 101:11

نَارٌ حَامِيَةٌ ١١

అదొక భగభగ మండే అగ్ని 7 (గుండం).