అల్‌-ఖమరు: చంద్రుడు, The Moon. మొదటి ఆయత్‌లో ఈ పేరు ఉంది. ఇందులో 55 ఆయతులు ఉన్నాయి. ఈ సమూహపు 7 సూరాహ్‌లలో ఇది 5వది. ఇది మక్కహ్ మొదటి కాలంలో అవతరింపజేయబడింది. దైవప్రవక్త ('స'అస) పండుగ ('ఈద్‌)ల నమా'జ్‌లలో చదివే సూరాహ్‌లలో సూరహ్ ఖాఫ్‌ (50) మరియు ఇది పేర్కొనదగినవి.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 54:1

اقْتَرَبَتِ السَّاعَةُ وَانشَقَّ الْقَمَرُ ١

ఆ ఘడియ దగ్గరకు వచ్చింది మరియు చంద్రుడు పూర్తిగా చీలిపోయాడు. 1


  • 54:2

وَإِن يَرَوْا آيَةً يُعْرِضُوا وَيَقُولُوا سِحْرٌ مُّسْتَمِرٌّ ٢

అయినా(సత్యతిరస్కారులు)అద్భుత సూచ నను చూసినా తమ ముఖాలను త్రిప్పుకుంటు న్నారు. మరియు: "ఇది ఎప్పటినుంచో జరుగుతూ వస్తున్న మంత్ర జాలమే." అని అంటున్నారు.


  • 54:3

وَكَذَّبُوا وَاتَّبَعُوا أَهْوَاءَهُمْ ۚ وَكُلُّ أَمْرٍ مُّسْتَقِرٌّ ٣

మరియు వారుదీనిని(ఈఖుర్‌ఆన్‌ను) అసత్య మని తిరస్కరించారు. మరియు తమ మనోవాంఛ లను అనుసరించారు. మరియు ప్రతి వ్యవహారం ఒక పర్యవసానానికి చేరవలసి ఉంటుంది. 2


  • 54:4

وَلَقَدْ جَاءَهُم مِّنَ الْأَنبَاءِ مَا فِيهِ مُزْدَجَرٌ ٤

మరియు వాస్తవానికి, వారి వద్దకు సమాచా రాలు వచ్చాయి. అందు వారికి మందలింపులు ఉండేవి.


  • 54:5

حِكْمَةٌ بَالِغَةٌ ۖ فَمَا تُغْنِ النُّذُرُ ٥

కావలసినంత వివేకమూ ఉండేది. కాని ఆ హెచ్చరికలు వారికి ప్రయోజనకరం కాలేదు.


  • 54:6

فَتَوَلَّ عَنْهُمْ ۘ يَوْمَ يَدْعُ الدَّاعِ إِلَىٰ شَيْءٍ نُّكُرٍ ٦

కావున (ఓ ము'హమ్మద్‌!) నీవు వారి నుండి మరలిపో! పిలిచే వాడు భయంకరమైన ఒక విషయం వైపునకు పిలిచే రోజున;


  • 54:7

خُشَّعًا أَبْصَارُهُمْ يَخْرُجُونَ مِنَ الْأَجْدَاثِ كَأَنَّهُمْ جَرَادٌ مُّنتَشِرٌ ٧

వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి, వారు చెల్లాచెదురైన మిడతలవలే, తమ గోరీల నుండి లేచి బయటికి వస్తారు –


  • 54:8

مُّهْطِعِينَ إِلَى الدَّاعِ ۖ يَقُولُ الْكَافِرُونَ هَـٰذَا يَوْمٌ عَسِرٌ ٨

వేగంగా – పిలిచే వాని వైపునకు. సత్య-తిరస్కారులు: "ఇది చాలా కఠినమైన రోజు." అని అంటారు. (3/8)


  • 54:9

كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوحٍ فَكَذَّبُوا عَبْدَنَا وَقَالُوا مَجْنُونٌ وَازْدُجِرَ ٩

* వారికి పూర్వం నూ'హ్‌ 3 జాతివారు (తమ ప్రవక్తను) అసత్యవాదుడని తిరస్కరించి ఉన్నారు అప్పుడు వారు మాదాసుణ్ణి: "అసత్యవాది!" అని అన్నారు. మరియు: "ఇతడు పిచ్చివాడు." అని అన్నారు. మరియు అతను కసిరికొట్టబడ్డాడు.


  • 54:10

فَدَعَا رَبَّهُ أَنِّي مَغْلُوبٌ فَانتَصِرْ ١٠

అప్పుడతను తన ప్రభువును ఇలా ప్రార్థించాడు: "నిశ్చయంగా నేను ఓడిపోయాను కావున నాకు సహాయం చేయి!"


  • 54:11

فَفَتَحْنَا أَبْوَابَ السَّمَاءِ بِمَاءٍ مُّنْهَمِرٍ ١١

అప్పుడు మేము ఆకాశపు ద్వారాలు తెరిచి కుంభవర్షాన్ని కురిపించాము.


  • 54:12

وَفَجَّرْنَا الْأَرْضَ عُيُونًا فَالْتَقَى الْمَاءُ عَلَىٰ أَمْرٍ قَدْ قُدِرَ ١٢

మరియు భూమి నుండి ఊటలను పొంగింప జేశాము అపుడు నిర్ణీత కార్యానికిగాను నీళ్ళన్నీ కలిసి పోయాయి.


  • 54:13

وَحَمَلْنَاهُ عَلَىٰ ذَاتِ أَلْوَاحٍ وَدُسُرٍ ١٣

మరియు మేము అతనిని (నూ'హ్‌ను) పలకలు మరియు మేకులుగల దాని (ఓడ)పై ఎక్కించాము.


  • 54:14

تَجْرِي بِأَعْيُنِنَا جَزَاءً لِّمَن كَانَ كُفِرَ ١٤

అది మా కన్నుల ముందు తేలియాడుతూ పోయింది. (తన జాతివారి చేత) తిరస్కరింప బడిన వానికి ప్రతిఫలంగా!


  • 54:15

وَلَقَد تَّرَكْنَاهَا آيَةً فَهَلْ مِن مُّدَّكِرٍ ١٥

మరియు వాస్తవానికి మేము దానిని (ఆ ఓడను) ఒక సూచనగా చేసి వదలిపెట్టాము. అయితే, హితబోధ స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా? 4


  • 54:16

فَكَيْفَ كَانَ عَذَابِي وَنُذُرِ ١٦

చూశారా! నా శిక్ష మరియు నా హెచ్చరికలు ఎలా ఉండెనో?


  • 54:17

وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ ١٧

మరియు వాస్తవానికి మేము ఈ ఖుర్‌ఆన్‌ను హితబోధ గ్రహించటంకోసం సులభం చేశాము. అయితే హితబోధను స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా?


  • 54:18

كَذَّبَتْ عَادٌ فَكَيْفَ كَانَ عَذَابِي وَنُذُرِ ١٨

ఆద్‌ జాతి సత్యాన్ని తిరస్కరించింది. చూశారా! నా శిక్ష మరియు నా హెచ్చరికలు ఎలా ఉండేనో?


  • 54:19

إِنَّا أَرْسَلْنَا عَلَيْهِمْ رِيحًا صَرْصَرًا فِي يَوْمِ نَحْسٍ مُّسْتَمِرٍّ ١٩

నిశ్చయంగా, మేము పూర్తిగా దురదృష్ట మైన (అరిష్టదాయకమైన) ఒక రోజున, తీవ్రమైన ఎడతెగని తుఫానుగాలిని పంపాము. 5


  • 54:20

تَنزِعُ النَّاسَ كَأَنَّهُمْ أَعْجَازُ نَخْلٍ مُّنقَعِرٍ ٢٠

అది ప్రజలను, వేళ్లతో పెళ్ళగింపబడిన ఖర్జూరపు చెట్లవలె పెళ్ళగించి వేసింది. 6


  • 54:21

فَكَيْفَ كَانَ عَذَابِي وَنُذُرِ ٢١

ఇక చూశారా! నా శిక్ష మరియు నా హెచ్చరికలు ఎలా ఉండెనో?


  • 54:22

وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ ٢٢

మరియు వాస్తవానికి మేము ఈ ఖుర్‌ఆన్‌ను హితబోధ గ్రహించటం కోసం సులభం చేశాము, అయితే హితబోధను స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా?


  • 54:23

كَذَّبَتْ ثَمُودُ بِالنُّذُرِ ٢٣

స'మూద్‌ జాతి హెచ్చరికలను అసత్యాలని తిరస్కరించింది.


  • 54:24

فَقَالُوا أَبَشَرًا مِّنَّا وَاحِدًا نَّتَّبِعُهُ إِنَّا إِذًا لَّفِي ضَلَالٍ وَسُعُرٍ ٢٤

అప్పుడు వారు ఇలా అన్నారు: "ఏమీ? మాలోని ఒక వ్యక్తిని, ఒంటరివాడిని, మేము అనుస రించాలా?అలాఅయితే నిశ్చయంగా మేము మార్గ భ్రష్టులం మరియు పిచ్చివారం అయినట్లే కదా?"


  • 54:25

أَأُلْقِيَ الذِّكْرُ عَلَيْهِ مِن بَيْنِنَا بَلْ هُوَ كَذَّابٌ أَشِرٌ ٢٥

"ఏమీ? మాఅందరిలో కేవలం అతని మీదనే (దివ్య) సందేశంపంపబడిందా? అలాకాదు! అసలు అతను అసత్యవాది, డంబాలు పలికేవాడు!"


  • 54:26

سَيَعْلَمُونَ غَدًا مَّنِ الْكَذَّابُ الْأَشِ ٢٦

అసత్యవాది, డంబాలు పలికేవాడు! ఎవడో రేపే (త్వరలోనే) వారికి తెలిసిపోతుంది!


  • 54:27

إِنَّا مُرْسِلُو النَّاقَةِ فِتْنَةً لَّهُمْ فَارْتَقِبْهُمْ وَاصْطَبِرْ ٢٧

నిశ్చయంగా, మేము ఆడ ఒంటెను, వారిని పరీక్షించటం కోసం పంపుతున్నాము, కావున (ఓ 'సాలి'హ్‌!) వారి విషయంలో వేచిఉండు మరియు సహనంవహించు!


  • 54:28

وَنَبِّئْهُمْ أَنَّ الْمَاءَ قِسْمَةٌ بَيْنَهُمْ ۖ كُلُّ شِرْبٍ مُّحْتَضَ ٢٨

మరియు వారి మధ్య నీరు (న్యాయంగా) పంచబడాలని వారికి బోధించు. ప్రతి ఒక్కరూ తమవంతు వచ్చే రోజునే త్రాగాలని నియమించ బడింది. 7


  • 54:29

فَنَادَوْا صَاحِبَهُمْ فَتَعَاطَىٰ فَعَقَرَ ٢٩

ఆ పిదప వారు తమ సహచరుణ్ణి పిలిచారు. వాడు దాన్ని పట్టుకొని (దాని వెనుక కాలి మోకాలి నరాలు కోసి) చంపాడు. 8


  • 54:30

فَكَيْفَ كَانَ عَذَابِي وَنُذُرِ ٣٠

అప్పుడు చూశారా! నా శిక్ష మరియు నా హెచ్చరికలు ఎలా ఉండెనో?


  • 54:31

إِنَّا أَرْسَلْنَا عَلَيْهِمْ صَيْحَةً وَاحِدَةً فَكَانُوا كَهَشِيمِ الْمُحْتَظِرِ ٣١

నిశ్చయంగా, మేము వారి మీదకు ఒక భయంకరమైన శబ్దాన్ని ('సయ్‌'హను) పంపాము, దాంతో వారు త్రొక్కబడిన పశువుల దొడ్డి కంచెవలే నుగ్గు-నుగ్గు అయిపోయారు.


  • 54:32

وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ ٣٢

మరియు వాస్తవానికి, మేము ఈ ఖుర్‌ఆన్‌ ను హితబోధ గ్రహించటానికి సులభం చేశాము, అయితే హితబోధ స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా?


  • 54:33

كَذَّبَتْ قَوْمُ لُوطٍ بِالنُّذُرِ ٣٣

లూ'త్‌ జాతి కూడా హెచ్చరికలను అసత్యాలని తిరస్కరించింది.


  • 54:34

إِنَّا أَرْسَلْنَا عَلَيْهِمْ حَاصِبًا إِلَّا آلَ لُوطٍ ۖ نَّجَّيْنَاهُم بِسَحَرٍ ٣٤

నిశ్చయంగా, మేము, లూ'త్‌ ఇంటివారు తప్ప! ఇతరుల మీదికి రాళ్ళువిసిరే 'తుఫాన్‌ గాలిని పంపాము. (లూ'త్‌ ఇంటి) వారిని మేము వేకువ జామున రక్షించాము; 9


  • 54:35

نِّعْمَةً مِّنْ عِندِنَا ۚ كَذَٰلِكَ نَجْزِي مَن شَكَرَ ٣٥

మా తరఫు నుండి అనుగ్రహంగా. ఈ విధంగా మేము కృతజ్ఞులకు ప్రతిఫలం ఇస్తాము.


  • 54:36

وَلَقَدْ أَنذَرَهُم بَطْشَتَنَا فَتَمَارَوْا بِالنُّذُرِ ٣٦

మరియు వాస్తవానికి (లూ'త్‌ తనజాతి) వారిని మా రాబోయే శిక్షను గురించి హెచ్చరించాడు. కాని వారు మా హెచ్చరికలను సందేహించి (మొండి) వాదనలకు దిగారు!


  • 54:37

وَلَقَدْ رَاوَدُوهُ عَن ضَيْفِهِ فَطَمَسْنَا أَعْيُنَهُمْ فَذُوقُوا عَذَابِي وَنُذُرِ ٣٧

మరియు వాస్తవానికి వారు అతని అతిథు లను 10 అతని నుండి బలవంతంగా లాక్కో వాలని అనుకున్నారు. కావున మేము వారి కళ్ళను పోగొ ట్టాము. (వారితో ఇలా అన్నాము): "ఇప్పుడు నా శిక్షను మరియు నా హెచ్చరికను చవిచూడండి."


  • 54:38

وَلَقَدْ صَبَّحَهُم بُكْرَةً عَذَابٌ مُّسْتَقِرٌّ ٣٨

మరియు వాస్తవానికి, ఉదయపు వేళ శాశ్వతమైన శిక్ష వారిమీద పడింది:


  • 54:39

فَذُوقُوا عَذَابِي وَنُذُرِ ٣٩

"ఇప్పుడు మీరు నా శిక్షను మరియు నా హెచ్చరికలను చవిచూడండి."


  • 54:40

وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ ٤٠

మరియు వాస్తవానికి మేము ఈ ఖుర్‌ఆన్‌ ను హితబోధ గ్రహించడానికి సులభంచేశాము. అయితే, హితబోధ స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా?


  • 54:41

وَلَقَدْ جَاءَ آلَ فِرْعَوْنَ النُّذُرُ ٤١

మరియు వాస్తవానికి ఫిర్‌'ఔన్‌ జాతి వారికి కూడా హెచ్చరికలు వచ్చాయి.


  • 54:42

كَذَّبُوا بِآيَاتِنَا كُلِّهَا فَأَخَذْنَاهُمْ أَخْذَ عَزِيزٍ مُّقْتَدِرٍ ٤٢

వారు మా సూచనలను అన్నిటినీ అబద్ధాలని తిరస్కరించారు, కావున మేము వారిని పట్టుకున్నాము, సర్వశక్తిమంతుడు సర్వ సమర్థుడు పట్టుకునే విధంగా!


  • 54:43

أَكُفَّارُكُمْ خَيْرٌ مِّنْ أُولَـٰئِكُمْ أَمْ لَكُم بَرَاءَةٌ فِي الزُّبُرِ ٤٣

(ఓ ఖురేషులారా!) ఏమీ? మీ సత్య-తిరస్కారులు మీకు పూర్వం గడిచిన వారికంటే శ్రేష్ఠులా? లేక దివ్యగ్రంథాలలో మీ కొరకు (మా శిక్ష నుండి) ఏదైనా మినహాయింపు వ్రాయబడి ఉందా?


  • 54:44

أَمْ يَقُولُونَ نَحْنُ جَمِيعٌ مُّنتَصِرٌ ٤٤

లేక వారు: "మాది ఒక శక్తిగల వర్గం, (కావున) మేము ప్రాబల్యం పొందగలం" అని అంటున్నారా?


  • 54:45

سَيُهْزَمُ الْجَمْعُ وَيُوَلُّونَ الدُّبُرَ ٤٥

కాని త్వరలోనే ఈ శక్తిగల వర్గం పరాజయం పొందగలదు. మరియు వారు వెన్నుచూపి పారిపోతారు. 11


  • 54:46

بَلِ السَّاعَةُ مَوْعِدُهُمْ وَالسَّاعَةُ أَدْهَىٰ وَأَمَرُّ ٤٦

అంతే కాదు! అంతిమ ఘడియయే, వారి వాగ్దాన సమయం మరియు ఆ ఘడియ ఎంతో దారుణమైనది మరియు ఎంతో తీవ్రమైనదీను (చేదైనదీను).


  • 54:47

إِنَّ الْمُجْرِمِينَ فِي ضَلَالٍ وَسُعُرٍ ٤٧

నిశ్చయంగా పాపాత్ములు మార్గ-భ్రష్టత్వంలో ఉన్నారు మరియు వారు (పరలోకంలో) నరకాగ్నిలో కాలుతారు.


  • 54:48

يَوْمَ يُسْحَبُونَ فِي النَّارِ عَلَىٰ وُجُوهِهِمْ ذُوقُوا مَسَّ سَقَرَ ٤٨

ఆ రోజు వారు తమ ముఖాల మీద నర కాగ్నిలోకి ఈడ్చబడతారు; (వారితో): "నరకాగ్ని స్పర్శను చవిచూడండి!" అని అనబడుతుంది. 12


  • 54:49

إِنَّا كُلَّ شَيْءٍ خَلَقْنَاهُ بِقَدَرٍ ٤٩

నిశ్చయంగా, మేము ప్రతి దానిని ఒక విధివ్రాత (ఖద్ర్‌)తో సృష్టించాము. 13


  • 54:50

وَمَا أَمْرُنَا إِلَّا وَاحِدَةٌ كَلَمْحٍ بِالْبَصَرِ ٥٠

మరియు మా ఆజ్ఞ కేవలం ఒక్కటే చాలు, కనురెప్ప పాటుది. (అది అయిపోతుంది) 14


  • 54:51

وَلَقَدْ أَهْلَكْنَا أَشْيَاعَكُمْ فَهَلْ مِن مُّدَّكِرٍ ٥١

మరియు వాస్తవానికి, మేము మీ వంటి వారిని, ఎందరినో నాశనం చేశాము. అయితే, హితబోధ స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా?


  • 54:52

وَكُلُّ شَيْءٍ فَعَلُوهُ فِي الزُّبُرِ ٥٢

మరియు వారు చేసిన ప్రతి విషయం వారి కర్మ గ్రంథాలలో (చిట్టాలలో) వ్రాయబడి ఉంది. 15


  • 54:53

وَكُلُّ صَغِيرٍ وَكَبِيرٍ مُّسْتَطَرٌ ٥٣

మరియు ప్రతి చిన్న మరియు ప్రతి పెద్ద విషయం అన్నీ వ్రాయబడి ఉన్నాయి. 16


  • 54:54

إِنَّ الْمُتَّقِينَ فِي جَنَّاتٍ وَنَهَرٍ ٥٤

నిశ్చయంగా, దైవభీతి గలవారు స్వర్గవనాలలో సెలయేళ్ళ దగ్గర ఉంటారు.


  • 54:55

فِي مَقْعَدِ صِدْقٍ عِندَ مَلِيكٍ مُّقْتَدِرٍ ٥٥

సత్య పీఠం మీద, 17 విశ్వసామ్రాట్టు, 18 సర్వ సమర్థుని సన్నిధిలో. (1/2)