అల్‌-ఖద్ర్‌: The Decree, ఘనత, ఆదేశం, శాసనం, తీర్పు, భగవత్సంకల్పం, విధి, అదృష్టం, పర్యవసానం, Destiny. ఈ సూరహ్‌ మొదటి మక్కహ్ సూరహ్‌లలోనిది. 5 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِّسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 97:1

إِنَّا أَنزَلْنَاهُ فِي لَيْلَةِ الْقَدْرِ ١

నిశ్చయంగా, మేము దీనిని (ఈ ఖుర్‌ఆన్‌ను) ఘనతగల ఆ రాత్రి 1 (అల్‌-ఖద్ర్‌)లో అవతరింపజేశాము. 2


  • 97:2

وَمَا أَدْرَاكَ مَا لَيْلَةُ الْقَدْرِ ٢

మరియు ఆ ఘనత గల రాత్రి అంటే ఏమిటో నీకేం తెలుసు?


  • 97:3

لَيْلَةُ الْقَدْرِ خَيْرٌ مِّنْ أَلْفِ شَهْرٍ ٣

ఆ ఘనతగల రాత్రి వేయినెలల కంటే శ్రేష్ఠమైనది. 3


  • 97:4

تَنَزَّلُ الْمَلَائِكَةُ وَالرُّوحُ فِيهَا بِإِذْنِ رَبِّهِم مِّن كُلِّ أَمْرٍ ٤

ఆ రాత్రిలో దేవదూతలు మరియు ఆత్మ (జిబ్రీల్‌), 4 తమ ప్రభువు అనుమతితో, ప్రతి (వ్యవహారానికి సంబంధించిన) ఆజ్ఞలు తీసుకుని దిగివస్తారు.


  • 97:5

سَلَامٌ هِيَ حَتَّىٰ مَطْلَعِ الْفَجْرِ ٥

ఆ రాత్రిలో తెల్లవారే వరకు శాంతి వర్థిల్లుతుంది.