అల్‌-ము'జ్జమ్మిల్: The Enwrapped దుప్పటి కప్పుకున్నవాడు. ఈ సూరహ్‌ అవతరణా క్రమంలో 4 వది. మొదటి మక్కహ్ కాలానికి చెందినది. 20 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 73:1

يَا أَيُّهَا الْمُزَّمِّلُ ١

ఓ దుప్పటి కప్పుకున్నవాడా! 1


  • 73:2

قُمِ اللَّيْلَ إِلَّا قَلِيلً ٢

రాత్రంతా (నమా'జ్‌లో) నిలబడు, కొంత భాగాన్ని విడిచి;


  • 73:3

نِّصْفَهُ أَوِ انقُصْ مِنْهُ قَلِيلًا ٣

దాని సగభాగంలో, లేదా దానికంటే కొంత తక్కువ;


  • 73:4

أَوْ زِدْ عَلَيْهِ وَرَتِّلِ الْقُرْآنَ تَرْتِيلً ٤

లేదా దానికంటే కొంత ఎక్కువ; మరియు ఖుర్‌ఆన్‌ను ఆగిఆగి నెమ్మదిగాస్పష్టంగా పఠించు.


  • 73:5

إِنَّا سَنُلْقِي عَلَيْكَ قَوْلًا ثَقِيلً ٥

నిశ్చయంగా, మేము నీపై భారమైన సందేశాన్ని అవతరింపజేయ బోతున్నాము.


  • 73:6

إِنَّ نَاشِئَةَ اللَّيْلِ هِيَ أَشَدُّ وَطْئًا وَأَقْوَمُ قِيلًا ٦

నిశ్చయంగా, రాత్రివేళ లేవటం (మనస్సును) అదుపులో ఉంచుకోవటానికి ఎంతో ఉపయుక్త మైనది మరియు (అల్లాహ్‌) ప్రవచనాలను (అర్థం చేసుకోవటానికి) కూడా ఎంతో అనుగుణమైనది.


  • 73:7

إِنَّ لَكَ فِي النَّهَارِ سَبْحًا طَوِيلً ٧

వాస్తవానికి, పగటి వేళ నీకు చాలా పనులుంటాయి.


  • 73:8

وَاذْكُرِ اسْمَ رَبِّكَ وَتَبَتَّلْ إِلَيْهِ تَبْتِيلً ٨

మరియు నీవు నీ ప్రభువు నామాన్ని స్మరిస్తూ ఉండు. మరియు అత్యంత శ్రధ్ధతో ఆయన వైపుకు మరలుతూ ఉండు.


  • 73:9

رَّبُّ الْمَشْرِقِ وَالْمَغْرِبِ لَا إِلَـٰهَ إِلَّا هُوَ فَاتَّخِذْهُ وَكِيلًا ٩

ఆయనే తూర్పూ పడమరల స్వామి, ఆయన తప్ప మరొక ఆరాధ్యదైవం లేడు, కావున నీవు ఆయననే కార్యకర్తగా చేసుకో.


  • 73:10

وَاصْبِرْ عَلَىٰ مَا يَقُولُونَ وَاهْجُرْهُمْ هَجْرًا جَمِيلًا ١٠

మరియు వారు పలికే మాటలకు సహనం వహించు మరియు మంచితనంతో వారి నుండి తొలగిపో.


  • 73:11

وَذَرْنِي وَالْمُكَذِّبِينَ أُولِي النَّعْمَةِ وَمَهِّلْهُمْ قَلِيلًا ١١

మరియు అసత్యవాదులైన ఈ సంపన్నులను, నాకు వదలిపెట్టు. 2 మరియు వారికి కొంత వ్యవధి నివ్వు.


  • 73:12

إِنَّ لَدَيْنَا أَنكَالًا وَجَحِيمًا ١٢

నిశ్చయంగా, మా వద్ద వారికొరకు సంకెళ్ళు మరియు భగభగ మండే నరకాగ్ని ఉన్నాయి.


  • 73:13

وَطَعَامًا ذَا غُصَّةٍ وَعَذَابًا أَلِيمًا ١٣

మరియు గొంతులో ఇరుక్కుపోయే ఆహారం మరియు బాధాకరమైన శిక్ష (ఉన్నాయి).


  • 73:14

يَوْمَ تَرْجُفُ الْأَرْضُ وَالْجِبَالُ وَكَانَتِ الْجِبَالُ كَثِيبًا مَّهِيلًا ١٤

ఆ రోజు భూమి మరియు పర్వతాలు కంపించి పోతాయి. మరియు పర్వతాలు ప్రవహించే ఇసుక దిబ్బలుగా మారిపోతాయి. 3


  • 73:15

إِنَّا أَرْسَلْنَا إِلَيْكُمْ رَسُولًا شَاهِدًا عَلَيْكُمْ كَمَا أَرْسَلْنَا إِلَىٰ فِرْعَوْنَ رَسُولً ١٥

మేము ఫిర్‌'ఔన్‌ వద్దకు సందేశహరుణ్ణి పంపినట్లు, నిశ్చయంగా, మీ వద్దకు కూడా ఒక సందేశహరుణ్ణి, మీకుసాక్షిగా ఉండటానికి పంపాము.


  • 73:16

فَعَصَىٰ فِرْعَوْنُ الرَّسُولَ فَأَخَذْنَاهُ أَخْذًا وَبِيلً ١٦

కాని ఫిర్‌'ఔన్‌ ఆ సందేశహరునికి అవిధేయత చూపాడు. కావున మేము అతనిని తీవ్రమైన శిక్షకు గురిచేశాము.


  • 73:17

فَكَيْفَ تَتَّقُونَ إِن كَفَرْتُمْ يَوْمًا يَجْعَلُ الْوِلْدَانَ شِيبًا ١٧

ఒకవేళ మీరు సత్యాన్ని తిరస్కరిస్తే, బాలురను ముసలివారిగా చేసేటటువంటి ఆ దినపు శిక్ష నుండి ఎలా తప్పించుకోగలరు? 4


  • 73:18

السَّمَاءُ مُنفَطِرٌ بِهِ ۚ كَانَ وَعْدُهُ مَفْعُولًا ١٨

అప్పుడు ఆకాశం బ్రద్దలైపోతుంది. ఆయన యొక్క వాగ్దానం తప్పక నెరవేరి తీరుతుంది.


  • 73:19

إِنَّ هَـٰذِهِ تَذْكِرَةٌ ۖ فَمَن شَاءَ اتَّخَذَ إِلَىٰ رَبِّهِ سَبِيلًا ١٩

నిశ్చయంగా, ఇదొక ఉపదేశం కావున ఇష్టమైన వాడు తన ప్రభువు వద్దకు పోయే మార్గాన్ని అవలంబించవచ్చు! (5/8)


  • 73:20

إِنَّ رَبَّكَ يَعْلَمُ أَنَّكَ تَقُومُ أَدْنَىٰ مِن ثُلُثَيِ اللَّيْلِ وَنِصْفَهُ وَثُلُثَهُ وَطَائِفَةٌ مِّنَ الَّذِينَ مَعَكَ ۚ وَاللَّـهُ يُقَدِّرُ اللَّيْلَ وَالنَّهَارَ ۚ عَلِمَ أَن لَّن تُحْصُوهُ فَتَابَ عَلَيْكُمْ ۖ فَاقْرَءُوا مَا تَيَسَّرَ مِنَ الْقُرْآنِ ۚ عَلِمَ أَن سَيَكُونُ مِنكُم مَّرْضَىٰ ۙ وَآخَرُونَ يَضْرِبُونَ فِي الْأَرْضِ يَبْتَغُونَ مِن فَضْلِ اللَّـهِ ۙ وَآخَرُونَ يُقَاتِلُونَ فِي سَبِيلِ اللَّـهِ ۖ فَاقْرَءُوا مَا تَيَسَّرَ مِنْهُ ۚ وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ وَأَقْرِضُوا اللَّـهَ قَرْضًا حَسَنًا ۚ وَمَا تُقَدِّمُوا لِأَنفُسِكُم مِّنْ خَيْرٍ تَجِدُوهُ عِندَ اللَّـهِ هُوَ خَيْرًا وَأَعْظَمَ أَجْرًا ۚ وَاسْتَغْفِرُوا اللَّـهَ ۖ إِنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ٢٠

* (ఓ ము'హమ్మద్‌!) నీవు, వాస్తవానికి దాదాపు మూడింట రెండువంతుల రాత్రి లేక సగం (రాత్రి) లేక మూడింట ఒకభాగం (నమా'జ్‌లో) నిలుస్తావనేది నీ ప్రభువుకు బాగా తెలుసు. మరియు నీతోపాటు ఉన్నవారిలో కొందరు కూడా! మరియు అల్లాహ్‌ రేయింబవళ్ళ పరిమాణాలను నిర్ణయిస్తాడు. మీరు ఖచ్చితంగా పూర్తిరాత్రి ప్రార్థించలేరని ఆయనకు తెలుసు. కావున ఆయన మీ వైపునకు (కనికరంతో) మరలాడు. కావున ఖుర్‌ఆన్‌ను, మీరు సులభంగా పఠించగలిగినంతే పఠించండి. మీలో కొందరు వ్యాధిగ్రస్తులు కావచ్చు, మరికొందరు అల్లాహ్‌ అనుగ్రహాన్ని అన్వేషిస్తూ భూమిలో ప్రయాణంలో ఉండవచ్చు, మరికొందరు అల్లాహ్‌ మార్గంలో ధర్మయుధ్ధం చేస్తూ ఉండవచ్చు, అని ఆయనకు బాగా తెలుసు. కావున మీకు దానిలో సులభమైనంత దానినే పఠించండి. 5 మరియు నమా'జ్‌ను స్థాపించండి, 6 విధిదానం ('జకాత్‌) ఇవ్వండి. మరియు అల్లాహ్‌కు మంచి అప్పును, అప్పుగా ఇస్తూ ఉండండి. మరియు మీరు, మీ కొరకు ముందుగా చేసి పంపుకున్న మంచి కార్యాలన్నింటినీ అల్లాహ్‌ దగ్గర పొందుతారు. అదే చాలా ఉత్తమమైనది. మరియు దాని ప్రతిఫలం చాలా గొప్పది. మరియు మీరు అల్లాహ్‌ను క్షమాభిక్ష అర్థిస్తూ ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.