సూరహ్‌ అల్‌-ము'తఫ్ఫిఫీన్‌

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 83:1

وَيْلٌ لِّلْمُطَفِّفِينَ ١

కొలతలలో, తూనికలలో తగ్గించి ఇచ్చే వారికి వినాశముంది.


  • 83:2

الَّذِينَ إِذَا اكْتَالُوا عَلَى النَّاسِ يَسْتَوْفُونَ ٢

వారు ప్రజల నుండి తీసుకునేటప్పుడు పూర్తిగా తీసుకుంటారు.


  • 83:3

وَإِذَا كَالُوهُمْ أَو وَّزَنُوهُمْ يُخْسِرُونَ ٣

మరియు తాము ప్రజలకు కొలిచి గానీ లేక తూచిగానీ ఇచ్చేటప్పుడు మాత్రం తగ్గించి ఇస్తారు. 1


  • 83:4

أَلَا يَظُنُّ أُولَـٰئِكَ أَنَّهُم مَّبْعُوثُونَ ٤

ఏమీ? ఇలాంటి వారు తిరిగి బ్రతికించి లేపబడరని భావిస్తున్నారా?


  • 83:5

لِيَوْمٍ عَظِيمٍ ٥

ఒక గొప్ప దినమున!


  • 83:6

يَوْمَ يَقُومُ النَّاسُ لِرَبِّ الْعَالَمِينَ ٦

సర్వ లోకాల ప్రభువు సమక్షంలో ప్రజలు అందరూ నిలబడే రోజు. 2


  • 83:7

كَلَّا إِنَّ كِتَابَ الْفُجَّارِ لَفِي سِجِّينٍ ٧

అలాకాదు!నిశ్చయంగా దుష్టుల కర్మపత్రం సిజ్జీనులో ఉంది.


  • 83:8

وَمَا أَدْرَاكَ مَا سِجِّينٌ ٨

ఆ సిజ్జీన్‌ అంటే నీవు ఏమనుకుంటున్నావు?


  • 83:9

كِتَابٌ مَّرْقُومٌ ٩

వ్రాసిపెట్టబడిన (చెరగని) గ్రంథం. 3


  • 83:10

وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ ١٠

సత్యాన్ని తిరస్కరించే వారికి ఆ రోజు వినాశముంది.


  • 83:11

الَّذِينَ يُكَذِّبُونَ بِيَوْمِ الدِّينِ ١١

వారికే! ఎవరైతే తీర్పుదినాన్ని తిరస్కరిస్తారో!


  • 83:12

وَمَا يُكَذِّبُ بِهِ إِلَّا كُلُّ مُعْتَدٍ أَثِيمٍ ١٢

మరియు మితిమీరి ప్రవర్తించే పాపిష్ఠుడు తప్ప, మరెవ్వడూ దానిని (తీర్పుదినాన్ని) తిరస్కరించడు.


  • 83:13

إِذَا تُتْلَىٰ عَلَيْهِ آيَاتُنَا قَالَ أَسَاطِيرُ الْأَوَّلِينَ ١٣

మా సూచనలు (ఆయాత్‌) అతడికి వినిపించ బడినప్పుడు అతడు: "ఇవి పూర్వకాలపు కట్టు కథలే!" అని అంటాడు.


  • 83:14

كَلَّا ۖ بَلْ ۜ رَانَ عَلَىٰ قُلُوبِهِم مَّا كَانُوا يَكْسِبُونَ ١٤

అలాకాదు! వాస్తవానికి వారి హృదయా లకు వారి (దుష్ట) కార్యాల త్రుప్పు పట్టింది. 4


  • 83:15

كَلَّا إِنَّهُمْ عَن رَّبِّهِمْ يَوْمَئِذٍ لَّمَحْجُوبُونَ ١٥

అంతేకాదు, ఆ రోజు నిశ్చయంగా, వారు తమ ప్రభువు కారుణ్యం నుండి నిరోధింపబడతారు.


  • 83:16

ثُمَّ إِنَّهُمْ لَصَالُو الْجَحِيمِ ١٦

తరువాత వారు నిశ్చయంగా, భగభగ మండే నరకాగ్నిలోకి పోతారు.


  • 83:17

ثُمَّ يُقَالُ هَـٰذَا الَّذِي كُنتُم بِهِ تُكَذِّبُونَ ١٧

అప్పుడు వారితో: "దేనినైతే మీరు అసత్యమని తిరస్కరిస్తూ వచ్చారో, అది ఇదే!" అని చెప్పబడుతుంది.


  • 83:18

كَلَّا إِنَّ كِتَابَ الْأَبْرَارِ لَفِي عِلِّيِّينَ ١٨

అలాకాదు! నిశ్చయంగా, ధర్మనిష్ఠాపరుల (పుణ్యాత్ముల) కర్మపత్రం మహోన్నత గ్రంథం ('ఇల్లియ్యీన్)లో ఉంది. 5


  • 83:19

وَمَا أَدْرَاكَ مَا عِلِّيُّونَ ١٩

మరి ఆ 'ఇల్లియ్యూన్‌ అంటే నీవు ఏమను కుంటున్నావు?


  • 83:20

كِتَابٌ مَّرْقُومٌ ٢٠

అది వ్రాసిపెట్టబడిన ఒక గ్రంథం.


  • 83:21

يَشْهَدُهُ الْمُقَرَّبُونَ ٢١

దానికి, (అల్లాహ్‌కు) సన్నిహితులైన వారు (దేవదూతలు) సాక్ష్యంగా ఉంటారు. 6


  • 83:22

إِنَّ الْأَبْرَارَ لَفِي نَعِيمٍ ٢٢

నిశ్చయంగా, పుణ్యాత్ములు సుఖ- సంతోషాలలో ఉంటారు.


  • 83:23

عَلَى الْأَرَائِكِ يَنظُرُونَ ٢٣

ఎత్తైన ఆసనాలపై కూర్చొని (స్వర్గ దృశ్యాలను) తిలకిస్తూ. 7


  • 83:24

تَعْرِفُ فِي وُجُوهِهِمْ نَضْرَةَ النَّعِيمِ ٢٤

వారి ముఖాలు సుఖ-సంతోషాలతో కళకళ లాడుతూ ఉండటం, నీవు చూస్తావు.


  • 83:25

يُسْقَوْنَ مِن رَّحِيقٍ مَّخْتُومٍ ٢٥

సీలు చేయబడిన నాణ్యమైన మధువు వారికి త్రాగటానికి ఇవ్వబడుతుంది. 8


  • 83:26

خِتَامُهُ مِسْكٌ ۚ وَفِي ذَٰلِكَ فَلْيَتَنَافَسِ الْمُتَنَافِسُونَ ٢٦

దాని చివరి చుక్కలోనూ కస్తూరి సువాసన ఉంటుంది. కాబట్టి దానిని పొందటానికి అపేక్షించే వారంతా ప్రయాసపడాలి.


  • 83:27

وَمِزَاجُهُ مِن تَسْنِيمٍ ٢٧

మరియు దానిలో (ఆ మధువులో) తస్నీమ్‌ కలుపబడి ఉంటుంది. 9


  • 83:28

عَيْنًا يَشْرَبُ بِهَا الْمُقَرَّبُونَ ٢٨

అదొక చెలమ, (అల్లాహ్‌) సాన్నిధ్యం పొందినవారే దాని నుండి త్రాగుతారు. 10


  • 83:29

إِنَّ الَّذِينَ أَجْرَمُوا كَانُوا مِنَ الَّذِينَ آمَنُوا يَضْحَكُونَ ٢٩

వాస్తవానికి (ప్రపంచంలో) అపరాధులు విశ్వసించిన వారిని హేళన చేసేవారు.


  • 83:30

وَإِذَا مَرُّوا بِهِمْ يَتَغَامَزُونَ ٣٠

మరియు వీరు (విశ్వాసులు), వారి (అవిశ్వాసుల) యెదుట నుండి పోయినప్పుడు, వారు (అవిశ్వాసులు) పరస్పరం కనుసైగలు చేసుకునేవారు.


  • 83:31

وَإِذَا انقَلَبُوا إِلَىٰ أَهْلِهِمُ انقَلَبُوا فَكِهِينَ ٣١

మరియు (అవిశ్వాసులు) తమ ఇంటివారి దగ్గరికి పోయినప్పుడు (విశ్వాసులను గురించి) పరిహసిస్తూ మరలేవారు.


  • 83:32

وَإِذَا رَأَوْهُمْ قَالُوا إِنَّ هَـٰؤُلَاءِ لَضَالُّونَ ٣٢

మరియు (విశ్వాసులను) చూసినపుడల్లా: "నిశ్చయంగా, వీరు దారితప్పిన వారు!" అని అనేవారు.


  • 83:33

وَمَا أُرْسِلُوا عَلَيْهِمْ حَافِظِينَ ٣٣

మరియు వారు (అవిశ్వాసులు) వీరి (విశ్వాసుల) మీద కాపలా దారులుగా పంపబడలేదు!


  • 83:34

فَالْيَوْمَ الَّذِينَ آمَنُوا مِنَ الْكُفَّارِ يَضْحَكُونَ ٣٤

కాని ఈ రోజు (పురుత్థాన దినంనాడు) విశ్వసించిన వారు, సత్య-తిరస్కారులను చూసి నవ్వుతారు.


  • 83:35

عَلَى الْأَرَائِكِ يَنظُرُونَ ٣٥

ఎత్తైన ఆసనాలపై కూర్చొని (స్వర్గ దృశ్యాలను) తిలకిస్తూ (ఇలా అంటారు):


  • 83:36

هَلْ ثُوِّبَ الْكُفَّارُ مَا كَانُوا يَفْعَلُونَ ٣٦

"ఇక! ఈ సత్య-తిరస్కారులకు, వారి చేష్టలకు తగిన ప్రతిఫలం తప్ప మరేమైనా దొరుకునా?" (3/8)