అల్‌-మునాఫిఖూన్‌: అంటే కపట-విశ్వాసులు, వంచకులు, డాంబికులు, ఈ 10 మదీనహ్ సూరాహ్‌ల సమూహంలో ఇది 7వది. ఇది ఉహుద్‌ యుద్ధం తరువాత 3-4 హిజ్రీలలో అవతరింపజేయబడింది. ఇందులో కపట-విశ్వాసులను గురించిన విషయాలు ఉన్నాయి. 11 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 63:1

إِذَا جَاءَكَ الْمُنَافِقُونَ قَالُوا نَشْهَدُ إِنَّكَ لَرَسُولُ اللَّـهِ ۗ وَاللَّـهُ يَعْلَمُ إِنَّكَ لَرَسُولُهُ وَاللَّـهُ يَشْهَدُ إِنَّ الْمُنَافِقِينَ لَكَاذِبُونَ ١

(ఓ ప్రవక్తా!) ఈ కపట-విశ్వాసులు (మునా ఫిఖూన్‌) నీ వద్దకు వచ్చినపుడు 1 ఇలాఅంటారు: "నీవు అల్లాహ్‌ యొక్క సందేశహరుడవని మేము సాక్ష్యమిస్తున్నాము." మరియు నిశ్చయంగా, నీవు ఆయన సందేశహరుడవని అల్లాహ్‌కు తెలుసు మరియు ఈ కపట-విశ్వాసులు, నిశ్చయంగా అసత్యవాదులని అల్లాహ్‌ సాక్ష్యమిస్తున్నాడు.


  • 63:2

اتَّخَذُوا أَيْمَانَهُمْ جُنَّةً فَصَدُّوا عَن سَبِيلِ اللَّـهِ ۚ إِنَّهُمْ سَاءَ مَا كَانُوا يَعْمَلُونَ ٢

వారు తమ ప్రమాణాలను డాలుగా చేసు- కున్నారు. ఆవిధంగా వారు (ఇతరులను) అల్లాహ్‌ మార్గం నుండి నిరోధిస్తున్నారు. 2 నిశ్చయంగా, వారు చేస్తున్న చేష్టలు ఎంతో నీచమైనవి.


  • 63:3

ذَٰلِكَ بِأَنَّهُمْ آمَنُوا ثُمَّ كَفَرُوا فَطُبِعَ عَلَىٰ قُلُوبِهِمْ فَهُمْ لَا يَفْقَهُونَ ٣

ఇది నిశ్చయంగా, వారు విశ్వసించిన తరువాత సత్య-తిరస్కారులు అవటం మూలంగానే జరిగింది కావున వారి హృదయాల మీద ముద్ర వేయబడిఉంది. కనుక వారు ఏమీ అర్థం చేసుకోలేరు. (5/8)


  • 63:4

وَإِذَا رَأَيْتَهُمْ تُعْجِبُكَ أَجْسَامُهُمْ ۖ وَإِن يَقُولُوا تَسْمَعْ لِقَوْلِهِمْ ۖ كَأَنَّهُمْ خُشُبٌ مُّسَنَّدَةٌ ۖ يَحْسَبُونَ كُلَّ صَيْحَةٍ عَلَيْهِمْ ۚ هُمُ الْعَدُوُّ فَاحْذَرْهُمْ ۚ قَاتَلَهُمُ اللَّـهُ ۖ أَنَّىٰ يُؤْفَكُونَ ٤

* మరియు నీవు గనక వారిని చూస్తే! వారి రూపాలు నీకు ఎంతో అద్భుతమైనవిగా కనిపిస్తాయి. మరియు వారు మాట్లాడినప్పుడు, నీవు వారి మాటలను వింటూ ఉండిపోతావు. నిశ్చయంగా, వారు గోడకు ఆనించబడిన మొద్దులవలే ఉన్నారు. వారు ప్రతి అరుపును తమకు వ్యతిరేకమైనదిగానే భావిస్తారు. వారు శత్రువులు, కావున వారి పట్ల జాగ్రత్తగా ఉండు. అల్లాహ్‌ వారిని నాశనం చేయుగాక! 3 వారెంత పెడమార్గంలో పడివున్నారు.


  • 63:5

وَإِذَا قِيلَ لَهُمْ تَعَالَوْا يَسْتَغْفِرْ لَكُمْ رَسُولُ اللَّـهِ لَوَّوْا رُءُوسَهُمْ وَرَأَيْتَهُمْ يَصُدُّونَ وَهُم مُّسْتَكْبِرُونَ ٥

మరియు వారితో: "రండి అల్లాహ్‌ ప్రవక్త మీ క్షమాపణ కొరకు (అల్లాహ్‌ను) ప్రార్థిస్తాడు." అని అన్నప్పుడు వారు తమ తలలు త్రిప్పుకోవటాన్ని మరియు దురహంకారంతో మరలిపోవటాన్ని నీవు చూస్తావు.


  • 63:6

سَوَاءٌ عَلَيْهِمْ أَسْتَغْفَرْتَ لَهُمْ أَمْ لَمْ تَسْتَغْفِرْ لَهُمْ لَن يَغْفِرَ اللَّـهُ لَهُمْ ۚ إِنَّ اللَّـهَ لَا يَهْدِي الْقَوْمَ الْفَاسِقِينَ ٦

(ఓ ప్రవక్తా!) నీవు వారి కొరకు క్షమాపణ కోరినా లేక క్షమాపణ కోరక పోయినా వారి విషయంలో రెండూ సమానమే! (ఎందుకంటే) అల్లాహ్‌ వారిని ఎంత మాత్రం క్షమించడు. నిశ్చయంగా, అల్లాహ్‌ అవిధేయులకు మార్గదర్శకత్వం చేయడు. 4


  • 63:7

هُمُ الَّذِينَ يَقُولُونَ لَا تُنفِقُوا عَلَىٰ مَنْ عِندَ رَسُولِ اللَّـهِ حَتَّىٰ يَنفَضُّوا ۗ وَلِلَّـهِ خَزَائِنُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَلَـٰكِنَّ الْمُنَافِقِينَ لَا يَفْقَهُونَ ٧

వారే (కపట-విశ్వాసులే) ఇలా అంటూ ఉండే వారు: "అల్లాహ్‌ సందేశహరుని వద్దనున్న వారిపై మీరు ఖర్చుచేయకుండా ఉంటే! చివరకు వారే చెల్లాచెదురైపోతారు." 5 వాస్తవానికి ఆకాశాలలో మరియు భూమిలో నున్న సమస్త కోశాగారాలు అల్లాహ్‌కే చెందినవి. కాని ఈ కపట-విశ్వాసులు అది గ్రహించలేరు.


  • 63:8

يَقُولُونَ لَئِن رَّجَعْنَا إِلَى الْمَدِينَةِ لَيُخْرِجَنَّ الْأَعَزُّ مِنْهَا الْأَذَلَّ ۚ وَلِلَّـهِ الْعِزَّةُ وَلِرَسُولِهِ وَلِلْمُؤْمِنِينَ وَلَـٰكِنَّ الْمُنَافِقِينَ لَا يَعْلَمُونَ ٨

వారు (కపట-విశ్వాసులు) ఇంకా ఇలా అంటున్నారు: "మనం మదీనహ్ నగరానికి తిరిగి వెళ్ళిన తరువాత, నిశ్చయంగా గౌరవనీయులమైన (మనం), అక్కడవున్న తుచ్ఛమైనవారిని తప్పక వెడలగొడ్దాం." మరియు గౌరవమనేది అల్లాహ్‌కు, ఆయన సందేశహరునికి మరియు విశ్వాసులకు మాత్రమే చెందినది, కాని ఈ కపట-విశ్వాసులకు అది తెలియదు.


  • 63:9

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُلْهِكُمْ أَمْوَالُكُمْ وَلَا أَوْلَادُكُمْ عَن ذِكْرِ اللَّـهِ ۚ وَمَن يَفْعَلْ ذَٰلِكَ فَأُولَـٰئِكَ هُمُ الْخَاسِرُونَ ٩

ఓ విశ్వాసులారా! మీ సంపదలు, మీ సంతానం మిమ్మల్ని అల్లాహ్‌ స్మరణ నుండి నిర్లక్ష్యంలో పడవేయరాదు సుమా! ఎవరైతే ఇలా నిర్లక్ష్యంలో పడతారో అలాంటి వారే నష్టపడేవారు.


  • 63:10

وَأَنفِقُوا مِن مَّا رَزَقْنَاكُم مِّن قَبْلِ أَن يَأْتِيَ أَحَدَكُمُ الْمَوْتُ فَيَقُولَ رَبِّ لَوْلَا أَخَّرْتَنِي إِلَىٰ أَجَلٍ قَرِيبٍ فَأَصَّدَّقَ وَأَكُن مِّنَ الصَّالِحِينَ ١٠

మరియు మీలో ఎవరికైనా మరణ సమయం సమీపించి: "ఓ నా ప్రభూ! నీవు నాకు మరికొంత వ్యవధి ఎందుకివ్వలేదు! నేను దాన-ధర్మాలు చేసి, సత్పురుషులలో చేరిపోయేవాడిని కదా?" అని పలికే స్థితి రాకముందే, మేము మీకు ప్రసాదించిన జీవనో పాధినుండి ఖర్చుచేయండి.


  • 63:11

وَلَن يُؤَخِّرَ اللَّـهُ نَفْسًا إِذَا جَاءَ أَجَلُهَا ۚ وَاللَّـهُ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ ١١

కాని ఒక వ్యక్తికి (మరణ) సమయం ఆసన్న మైనప్పుడు అల్లాహ్‌ అతనికి ఏ మాత్రం వ్యవధి నివ్వడు. మరియు మీరు చేస్తున్నదంతా అల్లాహ్‌ బాగా ఎరుగును.