అల్‌-ముమ్‌త'హి('హ)నహ్‌: The Examined, అంటే పరిశోధింపబడినది, పరిశీలింప బడినది, పరీక్షించబడినది. ఈ 10 మదీనహ్ సూరహ్‌ల సమూహంలో ఇది 4వది. ఈ సూరహ్‌ 7-8 హిజ్రీలో అవతరింపజేయబడింది. ముష్రిక్‌లను వదలి, 'మేము విశ్వసించాము' అని మదీనహ్ కు వచ్చే స్త్రీల నిజాయితీని పరిశీలించాలని ఈ సూరహ్‌లో ఆజ్ఞ వచ్చింది. 13 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు 10వ ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

 • 60:1

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّخِذُوا عَدُوِّي وَعَدُوَّكُمْ أَوْلِيَاءَ تُلْقُونَ إِلَيْهِم بِالْمَوَدَّةِ وَقَدْ كَفَرُوا بِمَا جَاءَكُم مِّنَ الْحَقِّ يُخْرِجُونَ الرَّسُولَ وَإِيَّاكُمْ ۙ أَن تُؤْمِنُوا بِاللَّـهِ رَبِّكُمْ إِن كُنتُمْ خَرَجْتُمْ جِهَادًا فِي سَبِيلِي وَابْتِغَاءَ مَرْضَاتِي ۚ تُسِرُّونَ إِلَيْهِم بِالْمَوَدَّةِ وَأَنَا أَعْلَمُ بِمَا أَخْفَيْتُمْ وَمَا أَعْلَنتُمْ ۚ وَمَن يَفْعَلْهُ مِنكُمْ فَقَدْ ضَلَّ سَوَاءَ السَّبِيلِ ١

ఓ విశ్వాసులారా! నాకు శత్రువులైనవారిని మరియు మీకు కూడా శత్రువులైన వారిని – వారి మీద ప్రేమ చూపిస్తూ – వారిని మీ స్నేహితులుగా చేసుకోకండి. 1 మరియు వాస్తవానికి వారు మీ వద్దకు వచ్చిన సత్యాన్ని తిరస్కరించారు. మీ ప్రభువైన అల్లాహ్‌ను మీరు విశ్వసించినందుకు, వారు ప్రవక్తను మరియు మిమ్మల్ని (మీ నగరం నుండి) వెడలగొట్టారు! ఒకవేళ మీరు నా ప్రసన్నత కోరి, నా మార్గంలో ధర్మయుధ్ధం కొరకు వెళితే (ఈ సత్య-తిరస్కారులను మీ స్నేహితులుగా చేసుకో కండి). వారిపట్ల వాత్సల్యం చూపుతూ మీరు వారికి రహస్యంగా సందేశం పంపుతారా! మీరు దాచేది మరియు వెలిబుచ్చేది, నాకు బాగా తెలుసు. మరియు మీలో ఎవడైతే ఇలాచేస్తాడో, అతడు వాస్తవంగా, ఋజుమార్గం నుండి తప్పిపోయిన వాడే!


 • 60:2

إِن يَثْقَفُوكُمْ يَكُونُوا لَكُمْ أَعْدَاءً وَيَبْسُطُوا إِلَيْكُمْ أَيْدِيَهُمْ وَأَلْسِنَتَهُم بِالسُّوءِ وَوَدُّوا لَوْ تَكْفُرُونَ ٢

ఒకవేళ వారు మీ మీద ప్రాబల్యం వహిస్తే, వారు మీకు విరోధులవుతారు. మరియు కీడుతో మీ వైపుకు తమ చేతులను మరియు తమ నాలుకలను చాపుతారు 2 మరియు మీరు కూడా సత్య- తిరస్కారులై పోవాలని కోరుతారు.


 • 60:3

لَن تَنفَعَكُمْ أَرْحَامُكُمْ وَلَا أَوْلَادُكُمْ ۚ يَوْمَ الْقِيَامَةِ يَفْصِلُ بَيْنَكُمْ ۚ وَاللَّـهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ ٣

మీ బంధువులు గానీ, మీ సంతానం గానీ మీకు ఏ విధంగానూ పనికిరారు. 3 ఆయన పునరు త్థాన దినమున మీ మధ్య తీర్పుచేస్తాడు. మరియు అల్లాహ్‌ మీరు చేసే దంతా చూస్తున్నాడు.


 • 60:4

قَدْ كَانَتْ لَكُمْ أُسْوَةٌ حَسَنَةٌ فِي إِبْرَاهِيمَ وَالَّذِينَ مَعَهُ إِذْ قَالُوا لِقَوْمِهِمْ إِنَّا بُرَآءُ مِنكُمْ وَمِمَّا تَعْبُدُونَ مِن دُونِ اللَّـهِ كَفَرْنَا بِكُمْ وَبَدَا بَيْنَنَا وَبَيْنَكُمُ الْعَدَاوَةُ وَالْبَغْضَاءُ أَبَدًا حَتَّىٰ تُؤْمِنُوا بِاللَّـهِ وَحْدَهُ إِلَّا قَوْلَ إِبْرَاهِيمَ لِأَبِيهِ لَأَسْتَغْفِرَنَّ لَكَ وَمَا أَمْلِكُ لَكَ مِنَ اللَّـهِ مِن شَيْءٍ ۖ رَّبَّنَا عَلَيْكَ تَوَكَّلْنَا وَإِلَيْكَ أَنَبْنَا وَإِلَيْكَ الْمَصِيرُ ٤

వాస్తవానికి ఇబ్రాహీమ్‌ మరియు అతనితో ఉన్న వారిలో మీకొరకు ఒక మంచి ఆదర్శం ఉంది. వారు తమ జాతివారితో ఇలా అన్నప్పుడు: "నిశ్చయంగా, అల్లాహ్‌ను వదలి మీరు ఆరాధించే వాటితో మరియు మీతో, మాకు ఎలాంటి సంబంధంలేదు. మేము మిమ్మల్ని త్యజించాము మరియు మీరు అద్వితీయుడైన అల్లాహ్‌ను విశ్వసించనంత వరకు, మాకూ మీకూ మధ్య విరోధం మరియు ద్వేషం ఉంటుంది." ఇక ఇబ్రాహీమ్‌ తన తండ్రితో: "నేను తప్పక నిన్ను క్షమించమని (నా ప్రభువును) వేడుకుంటాను. ఇది తప్ప, నీ కొరకు అల్లాహ్‌ నుండి మరేమీ పొందే అధికారం నాకు లేదు." అని మాత్రమే అనగలిగాడు. 4 (అల్లాహ్‌తో ఇలా ప్రార్థించాడు): "ఓ నా ప్రభూ! మేము నిన్నే నమ్ముకున్నాము 5 మరియు నీ వైపునకే పశ్చాత్తాపంతో మరలు తున్నాము మరియు నీ వైపుకే మా గమ్యస్థానముంది.


 • 60:5

رَبَّنَا لَا تَجْعَلْنَا فِتْنَةً لِّلَّذِينَ كَفَرُوا وَاغْفِرْ لَنَا رَبَّنَا ۖ إِنَّكَ أَنتَ الْعَزِيزُ الْحَكِيمُ ٥

"ఓ మా ప్రభూ! మమ్మల్ని సత్య- తిరస్కారుల కొరకు పరీక్షా సాధనంగా చేయకు 6 మరియు ఓ మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. నిశ్చయంగా కేవలం, నీవే సర్వశక్తి మంతుడువు, మహా వివేచనాపరుడవు."


 • 60:6

لَقَدْ كَانَ لَكُمْ فِيهِمْ أُسْوَةٌ حَسَنَةٌ لِّمَن كَانَ يَرْجُو اللَّـهَ وَالْيَوْمَ الْآخِرَ ۚ وَمَن يَتَوَلَّ فَإِنَّ اللَّـهَ هُوَ الْغَنِيُّ الْحَمِيدُ ٦

వాస్తవంగా! మీకు – అల్లాహ్‌ను మరియు అంతిమదినాన్ని అపేక్షించే వారికి – వారిలో ఒక మంచి ఆదర్శం ఉంది. మరియు ఎవడైనా దీని నుండి మరలిపోతే! నిశ్చయంగా, అల్లాహ్‌ నిరపేక్షాపరుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు (అని తెలుసుకోవాలి). 7 (3/8)


 • 60:7

عَسَى اللَّـهُ أَن يَجْعَلَ بَيْنَكُمْ وَبَيْنَ الَّذِينَ عَادَيْتُم مِّنْهُم مَّوَدَّةً ۚ وَاللَّـهُ قَدِيرٌ ۚ وَاللَّـهُ غَفُورٌ رَّحِيمٌ ٧

* బహుశా, అల్లాహ్‌ మీ మధ్య మరియు మీకు విరోధులైన వారి మధ్య ప్రేమ కలిగించవచ్చు. మరియు అల్లాహ్‌ (ప్రతిదీ చేయగల) సమర్థుడు. మరియు అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.


 • 60:8

لَّا يَنْهَاكُمُ اللَّـهُ عَنِ الَّذِينَ لَمْ يُقَاتِلُوكُمْ فِي الدِّينِ وَلَمْ يُخْرِجُوكُم مِّن دِيَارِكُمْ أَن تَبَرُّوهُمْ وَتُقْسِطُوا إِلَيْهِمْ ۚ إِنَّ اللَّـهَ يُحِبُّ الْمُقْسِطِينَ ٨

ఎవరైతే ధర్మ విషయంలో మీతో యుద్ధం చేయరో మరియు మిమ్మల్ని మీ గృహాల నుండి వెళ్ళగొట్టరో! వారి పట్ల మీరు సత్ప్రవర్తనతో మరియు న్యాయంతో వ్యవహరించటాన్ని అల్లాహ్‌ నిషేధించలేదు. 8 నిశ్చయంగా అల్లాహ్‌ న్యాయవర్తనులను ప్రేమిస్తాడు. 9


 • 60:9

إِنَّمَا يَنْهَاكُمُ اللَّـهُ عَنِ الَّذِينَ قَاتَلُوكُمْ فِي الدِّينِ وَأَخْرَجُوكُم مِّن دِيَارِكُمْ وَظَاهَرُوا عَلَىٰ إِخْرَاجِكُمْ أَن تَوَلَّوْهُمْ ۚ وَمَن يَتَوَلَّهُمْ فَأُولَـٰئِكَ هُمُ الظَّالِمُونَ ٩

కాని, వాస్తవానికి ఎవరైతే, ధర్మ విషయంలో మీతో యుధ్ధం చేస్తారో మరియు మిమ్మల్ని మీ ఇండ్ల నుండి వెళ్ళగొడ్తారో మరియు మిమ్మల్ని వెళ్ళగొట్టటంలో పరస్పరం సహకరించుకుంటారో; వారితో స్నేహం చేయటాన్ని అల్లాహ్‌ మీ కొరకు నిషేధిస్తున్నాడు. మరియు ఎవరైతే వారితో స్నేహంచేస్తారో, అలాంటి వారు, వారే! దుర్మార్గులు. 10


 • 60:10

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا جَاءَكُمُ الْمُؤْمِنَاتُ مُهَاجِرَاتٍ فَامْتَحِنُوهُنَّ ۖ اللَّـهُ أَعْلَمُ بِإِيمَانِهِنَّ ۖ فَإِنْ عَلِمْتُمُوهُنَّ مُؤْمِنَاتٍ فَلَا تَرْجِعُوهُنَّ إِلَى الْكُفَّارِ ۖ لَا هُنَّ حِلٌّ لَّهُمْ وَلَا هُمْ يَحِلُّونَ لَهُنَّ ۖ وَآتُوهُم مَّا أَنفَقُوا ۚ وَلَا جُنَاحَ عَلَيْكُمْ أَن تَنكِحُوهُنَّ إِذَا آتَيْتُمُوهُنَّ أُجُورَهُنَّ ۚ وَلَا تُمْسِكُوا بِعِصَمِ الْكَوَافِرِ وَاسْأَلُوا مَا أَنفَقْتُمْ وَلْيَسْأَلُوا مَا أَنفَقُوا ۚ ذَٰلِكُمْ حُكْمُ اللَّـهِ ۖ يَحْكُمُ بَيْنَكُمْ ۚ وَاللَّـهُ عَلِيمٌ حَكِيمٌ ١٠

ఓ విశ్వాసులారా! విశ్వసించిన స్త్రీలు, మీ వద్దకు వలస వచ్చినపుడు, వారిని పరీక్షించండి. 11 అల్లాహ్‌కు వారి విశ్వాసం గురించి బాగా తెలుసు. వారు వాస్తవంగా విశ్వసించినవారని మీకు తెలిసి నప్పుడు, వారిని సత్య-తిరస్కారుల వద్దకు తిరిగి పంపకండి. (ఎందుకంటే) ఆ స్త్రీలు వారికి (సత్య- తిరస్కారులకు) ధర్మసమ్మతమైన (భార్యలు) కారు మరియు వారు కూడా ఆ స్త్రీలకు ధర్మ- సమ్మతమైన (భర్తలు) కారు. కాని, వారు (సత్య-తిరస్కారులు), వారికిచ్చిన మహ్ర్‌ మీరు వారికి చెల్లించండి. మరియు వారికి వారి మహ్ర్‌ ఇచ్చిన తరువాత, ఆ స్త్రీలను వివాహమాడితే మీకు ఎలాంటి దోషంలేదు. మరియు మీరు కూడా సత్య-తిరస్కారులైన స్త్రీలను మీ వివాహబంధంలో ఉంచుకోకండి. 12 (అవిశ్వాసులుగా ఉండిపో దలచిన) మీ భార్యల నుండి మీరు ఇచ్చిన మహ్ర్‌ అడిగి తీసుకోండి. 13 (అలాగే అవిశ్వాసులను, విశ్వాసులైన తమ) భార్యల నుండి మహ్ర్‌ అడిగి తీసుకోనివ్వండి. ఇది అల్లాహ్‌ తీర్మానం. ఆయన ఈ విధంగా మీ మధ్య తీర్పు చేస్తున్నాడు. మరియు అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.


 • 60:11

وَإِن فَاتَكُمْ شَيْءٌ مِّنْ أَزْوَاجِكُمْ إِلَى الْكُفَّارِ فَعَاقَبْتُمْ فَآتُوا الَّذِينَ ذَهَبَتْ أَزْوَاجُهُم مِّثْلَ مَا أَنفَقُوا ۚ وَاتَّقُوا اللَّـهَ الَّذِي أَنتُم بِهِ مُؤْمِنُونَ ١١

మరియు ఒకవేళ మీ (విశ్వాసుల) భార్యలలో ఒకామె, మిమ్మల్ని విడిచి సత్య- తిరస్కారుల వద్దకు వెళ్ళిపోతే! (ఆ సత్య- తిరస్కారులు, మీరు ఆ స్త్రీలకు చెల్లించిన మహ్ర్‌ (వధుకట్నం), మీకు వాపసు ఇవ్వడానికి నిరాకరిస్తే)! ఆ తరువాత మీకు వారితో ప్రతీకారం తీర్చుకొనే అవకాశం దొరికితే (మీరు వారిపై యుద్ధంచేసి విజయం పొందితే)! 14 దాని (విజయ ధనం) నుండి, ఎవరి భార్యలైతే సత్య-తిరస్కారుల వద్దకు పోయారో వారికి – వారు (తమ భార్యలకు) ఇచ్చిన దానికి (మహ్ర్‌కు) సమానంగా – చెల్లించండి. మరియు మీరు విశ్వసించిన, అల్లాహ్‌ యందు, భయభక్తులు కలిగి ఉండండి.


 • 60:12

يَا أَيُّهَا النَّبِيُّ إِذَا جَاءَكَ الْمُؤْمِنَاتُ يُبَايِعْنَكَ عَلَىٰ أَن لَّا يُشْرِكْنَ بِاللَّـهِ شَيْئًا وَلَا يَسْرِقْنَ وَلَا يَزْنِينَ وَلَا يَقْتُلْنَ أَوْلَادَهُنَّ وَلَا يَأْتِينَ بِبُهْتَانٍ يَفْتَرِينَهُ بَيْنَ أَيْدِيهِنَّ وَأَرْجُلِهِنَّ وَلَا يَعْصِينَكَ فِي مَعْرُوفٍ ۙ فَبَايِعْهُنَّ وَاسْتَغْفِرْ لَهُنَّ اللَّـهَ ۖ إِنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ١٢

ఓ ప్రవక్తా! విశ్వసించిన స్త్రీలు ప్రమాణం (బై'అత్‌) చేయటానికి నీ వద్దకు వచ్చి: 'తాము ఎవరినీ అల్లాహ్‌ కు సాటికల్పించమని, మరియు దొంగతనం చేయమని, మరియు వ్యభిచారం చేయమని, మరియు తమ సంతానాన్ని హత్య చేయమని, మరియు తమ చేతుల మధ్య మరియు తమ కాళ్ళ మధ్య నిందారోపణ కల్పించమని, మరియు ధర్మసమ్మతమైన విషయాలలో నీకు అవిధేయత చూపమని,' ప్రమాణం చేస్తే, వారి నుండి ప్రమాణం (బై'అత్‌) తీసుకో 15 మరియు వారిని క్షమించమని అల్లాహ్‌ను ప్రార్థించు. నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.


 • 60:13

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَوَلَّوْا قَوْمًا غَضِبَ اللَّـهُ عَلَيْهِمْ قَدْ يَئِسُوا مِنَ الْآخِرَةِ كَمَا يَئِسَ الْكُفَّارُ مِنْ أَصْحَابِ الْقُبُورِ ١٣

ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ ఆగ్రహానికి గురి అయిన జాతి వారిని స్నేహితులుగా చేసుకో కండి. 16 వాస్తవానికి గోరీలలో ఉన్న సత్య- తిరస్కారులు, నిరాశచెందినట్లు వారు కూడా పరలోక జీవితం పట్ల నిరాశచెంది ఉన్నారు.