ఇంతవరకు 14/15వ వంతు ఖుర్‌ఆన్‌ పూర్తి అయ్యింది. ఇక మిగిలిన 1/15 భాగంలో చిన్న చిన్న సూరహ్‌లు చాలామట్టుకు మక్కహ్ కు చెందినవి ఉన్నాయి. అల్‌-ముల్క్‌: The Dominion, సామ్రాజ్యాధిపత్యం, అధికారం, ఆధిపత్యం, రాజ్యం, ప్రభుత్వం. దీని గొప్పతనాలను గురించిన 'హదీస్‌'లు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి: "ఒక సూరహ్‌ 30 ఆయతులది ఉంది. అది మానవునికి సిఫారసు చేస్తుంది, దాని వల్ల అతడు క్షమించబడతాడు." అన్న 'హదీస్‌' (సునన్‌ తిర్మిజీ', సునన్‌ అబూ-దావూద్‌, ఇబ్నె-మాజా మరియు ముస్నద్‌ అ'హ్మద్‌). మరొక 'హదీస్‌': "ఖుర్‌ఆన్‌లో ఒక సూరహ్‌ ఉంది అది తనను చదివిన వాడిని స్వర్గానికి పంపేవరకు అల్లాహ్‌తో వాదులాడుతుంది." (మజ్‌మ'అ అ'జ్జవాయి'ద్‌ 7/172,) మరొక 'హదీస్‌': "దైవప్రవక్త ('స'అస) రాత్రి నిద్రపోక ముందు సూరహ్‌ అస్‌-సజ్దా (32) మరియు సూరహ్‌ అల్‌-ముల్క్‌ (67) తప్పక చదివే వారు." మరొక షే'ఖ్‌ అల్బానీ సమకూర్చిన 'స'హీ'హ్‌ రివాయత్‌లో: "సూరహ్‌ అల్‌-ముల్క్‌ గోరీ శిక్ష నుండి కాపాడుతుంది. అయితే చదివేవాడు ఇస్లాం ఆజ్ఞలను మరియు విధులను పాటించేవాడై ఉండాలి!" అని ఉంది. 30 ఆయాతులున్న ఈ మక్కహ్ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

 • 67:1

تَبَارَكَ الَّذِي بِيَدِهِ الْمُلْكُ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ١

[(*)] ఎవరి చేతిలోనయితే విశ్వ సామ్రాజ్యాధి పత్యం ఉందో! ఆయన సర్వశ్రేష్ఠుడు (శుభదాయకుడు) మరియు ఆయన ప్రతిదీ చేయగల సమర్థుడు.


 • 67:2

الَّذِي خَلَقَ الْمَوْتَ وَالْحَيَاةَ لِيَبْلُوَكُمْ أَيُّكُمْ أَحْسَنُ عَمَلًا ۚ وَهُوَ الْعَزِيزُ الْغَفُورُ ٢

ఆయనే! మీలో మంచిపనులు చేసేవారెవరో పరీక్షించటానికి, చావుబ్రతుకులను సృష్టించాడు. 1 మరియు ఆయన సర్వ శక్తిమంతుడు క్షమాశీలుడు.


 • 67:3

الَّذِي خَلَقَ سَبْعَ سَمَاوَاتٍ طِبَاقًا ۖ مَّا تَرَىٰ فِي خَلْقِ الرَّحْمَـٰنِ مِن تَفَاوُتٍ ۖ فَارْجِعِ الْبَصَرَ هَلْ تَرَىٰ مِن فُطُورٍ ٣

ఆయనే, ఒకదానిపై ఒకటి ఏడు ఆకాశాలను సృష్టించాడు. ఆ అనంత కరుణామయుని సృష్టిలో నీవు ఎలాంటి లోపాన్నీ చూడలేవు. కావాలంటే మరొకసారి చూడు: "ఏమీ? నీకేమైనా లోపం కనిపిస్తుందా?"


 • 67:4

ثُمَّ ارْجِعِ الْبَصَرَ كَرَّتَيْنِ يَنقَلِبْ إِلَيْكَ الْبَصَرُ خَاسِئًا وَهُوَ حَسِيرٌ ٤

ఇంకా, మాటిమాటికీ నీ చూపులు త్రిప్పి చూడు. అది (నీ చూపు) విఫలమై, అలిసి సొలసి తిరిగి నీవైపుకే వస్తుంది.


 • 67:5

وَلَقَدْ زَيَّنَّا السَّمَاءَ الدُّنْيَا بِمَصَابِيحَ وَجَعَلْنَاهَا رُجُومًا لِّلشَّيَاطِينِ ۖ وَأَعْتَدْنَا لَهُمْ عَذَابَ السَّعِيرِ ٥

మరియు వాస్తవంగా, మేము భూమికి దగ్గరగా ఉన్న ఆకాశాన్ని దీపాలతో అలంక రించాము. మరియు వాటిని, షై'తాన్‌లను తరిమి కొట్టే సాధనాలుగా చేశాము. 2 మరియు వారి కొరకు (షై'తాన్‌ల కొరకు) మేము భగభగ మండే అగ్నిజ్వాలల శిక్షను సిధ్ధపరచి ఉంచాము.


 • 67:6

وَلِلَّذِينَ كَفَرُوا بِرَبِّهِمْ عَذَابُ جَهَنَّمَ ۖ وَبِئْسَ الْمَصِيرُ ٦

మరియు తమ ప్రభువును (అల్లాహ్‌ను) తిరస్కరించే వారికి నరకశిక్షఉంది. అది ఎంతచెడ్డ గమ్యస్థానం.


 • 67:7

إِذَا أُلْقُوا فِيهَا سَمِعُوا لَهَا شَهِيقًا وَهِيَ تَفُورُ ٧

వారు అందులోకి విసిరివేయబడినప్పుడు, వారు దాని (భయంకరమైన) గర్జనను వింటారు. మరియు అది మరిగి పొంగుతూ ఉంటుంది.


 • 67:8

تَكَادُ تَمَيَّزُ مِنَ الْغَيْظِ ۖ كُلَّمَا أُلْقِيَ فِيهَا فَوْجٌ سَأَلَهُمْ خَزَنَتُهَا أَلَمْ يَأْتِكُمْ نَذِيرٌ ٨

అది దాదాపు ఉద్రేకంతో ప్రేలిపోతూ ఉంటుంది. ప్రతిసారి అందులోకి (పాపుల) గుంపు పడవేయబడినప్పుడు! దాని కాపలాదారులు వారితో: "ఏమీ? మీ వద్దకు ఏ హెచ్చరిక చేసేవాడు రాలేదా?" అని, ప్రశ్నిస్తారు.


 • 67:9

قَالُوا بَلَىٰ قَدْ جَاءَنَا نَذِيرٌ فَكَذَّبْنَا وَقُلْنَا مَا نَزَّلَ اللَّـهُ مِن شَيْءٍ إِنْ أَنتُمْ إِلَّا فِي ضَلَالٍ كَبِيرٍ ٩

వారంటారు: "ఎందుకు రాలేదు! వాస్తవానికి మా వద్దకు హెచ్చరిక చేసేవాడు వచ్చాడు, కాని మేము అతనిని అసత్యుడవని తిరస్కరించాము మరియు అతనితో ఇలా అన్నాము: 'అల్లాహ్‌ దేనినీ (ఏ దివ్యజ్ఞానాన్ని) అవతరింపజేయలేదు; మీరు కేవలం ఘోర మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు!' "


 • 67:10

وَقَالُوا لَوْ كُنَّا نَسْمَعُ أَوْ نَعْقِلُ مَا كُنَّا فِي أَصْحَابِ السَّعِيرِ ١٠

ఇంకా వారు ఇలా అంటారు: "ఒకవేళ మేము విని ఉంటే లేదా గ్రహించి ఉంటే, మేము మండే అగ్నిజ్వాలలలో పడివుండే వారితో చేరేవారము కాముకదా!"


 • 67:11

فَاعْتَرَفُوا بِذَنبِهِمْ فَسُحْقًا لِّأَصْحَابِ السَّعِيرِ ١١

అప్పుడు వారే స్వయంగా తమ పాపాన్ని ఒప్పుకుంటారు. కావున భగగ మండే అగ్నిజ్వాల వాసులు దూరమై పోవు గాక!


 • 67:12

إِنَّ الَّذِينَ يَخْشَوْنَ رَبَّهُم بِالْغَيْبِ لَهُم مَّغْفِرَةٌ وَأَجْرٌ كَبِيرٌ ١٢

నిశ్చయంగా, ఎవరైతే అగోచరుడైన తమ ప్రభువుకు భయపడతారో! వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం ఉంటాయి.


 • 67:13

وَأَسِرُّوا قَوْلَكُمْ أَوِ اجْهَرُوا بِهِ ۖ إِنَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ ١٣

మరియు మీరు మీ మాటలను రహస్యంగా ఉంచినా సరే! లేక వాటిని వెల్లడిచేసినా సరే! నిశ్చయంగా, ఆయనకు హృదయాల స్థితి బాగా తెలుసు.


 • 67:14

أَلَا يَعْلَمُ مَنْ خَلَقَ وَهُوَ اللَّطِيفُ الْخَبِيرُ ١٤

ఏమిటీ? పుట్టించిన వాడికే తెలియదా? మరియు ఆయన సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసినవాడు!


 • 67:15

هُوَ الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ ذَلُولًا فَامْشُوا فِي مَنَاكِبِهَا وَكُلُوا مِن رِّزْقِهِ ۖ وَإِلَيْهِ النُّشُورُ ١٥

15. భూమిని మీ ఆధీనంలో ఉంచినవాడు ఆయనే! కావున మీరు దాని దారులలో తిరగండి. మరియు ఆయన ప్రసాదించిన జీవనోపాధిని తినండి. మరియు మీరు ఆయన వైపునకే సజీవులై మరలిపోవలసి ఉంది.


 • 67:16

أَأَمِنتُم مَّن فِي السَّمَاءِ أَن يَخْسِفَ بِكُمُ الْأَرْضَ فَإِذَا هِيَ تَمُورُ ١٦

ఏమీ? మీరు నిర్భయంగా ఉన్నారా? ఆకాశాలలో ఉన్నవాడు, మిమ్మల్ని భూమిలోకి అణగ ద్రొక్కడని, ఎప్పుడైతే అది తీవ్ర కంపనాలకు గురి అవుతుందో?


 • 67:17

أَمْ أَمِنتُم مَّن فِي السَّمَاءِ أَن يُرْسِلَ عَلَيْكُمْ حَاصِبًا ۖ فَسَتَعْلَمُونَ كَيْفَ نَذِيرِ ١٧

లేక, ఆకాశాలలో ఉన్నవాడు, మీపైకి రాళ్ళు కురిపించే గాలివాన పంపడని మీరు నిర్భయంగా ఉన్నారా? నా హెచ్చరిక ఎలాంటిదో అప్పుడు మీరు తెలుసుకోగలరు.


 • 67:18

وَلَقَدْ كَذَّبَ الَّذِينَ مِن قَبْلِهِمْ فَكَيْفَ كَانَ نَكِيرِ ١٨

మరియు వాస్తవానికి వారికి పూర్వం గతించిన వారు కూడా (ప్రవక్తలను) తిరస్కరించారు. నా పట్టు (శిక్ష) ఎంత తీవ్రంగా ఉండిందో (చూశారా)?


 • 67:19

أَوَلَمْ يَرَوْا إِلَى الطَّيْرِ فَوْقَهُمْ صَافَّاتٍ وَيَقْبِضْنَ ۚ مَا يُمْسِكُهُنَّ إِلَّا الرَّحْمَـٰنُ ۚ إِنَّهُ بِكُلِّ شَيْءٍ بَصِيرٌ ١٩

ఏమీ? వారు తమ మీద ఎగిరే పక్షులు రెక్కలను ఎలా చాపుతూ ముడుచుకుంటూ, ఎగురు తున్నాయో చూడటం లేదా? ఆ అనంత కరుణామయుడు తప్ప మరెవ్వరూ వాటిని అలా నిలిపి ఉంచలేరు కదా! నిశ్చయంగా, ఆయన ప్రతి దానినీ చూస్తున్నాడు!


 • 67:20

أَمَّنْ هَـٰذَا الَّذِي هُوَ جُندٌ لَّكُمْ يَنصُرُكُم مِّن دُونِ الرَّحْمَـٰنِ ۚ إِنِ الْكَافِرُونَ إِلَّا فِي غُرُورٍ ٢٠

ఏమీ? అనంత కరుణామయుడు తప్ప మీకు సేనవలే అడ్డుగా నిలిచి, మీకు సహాయ పడగల వాడెవడైనా ఉన్నాడా? ఈ సత్య-తిరస్కారులు కేవలం మోసంలో పడివున్నారు.


 • 67:21

أَمَّنْ هَـٰذَا الَّذِي يَرْزُقُكُمْ إِنْ أَمْسَكَ رِزْقَهُ ۚ بَل لَّجُّوا فِي عُتُوٍّ وَنُفُورٍ ٢١

ఒకవేళ ఆయన మీ జీవనోపాధిని ఆపివేస్తే, మీకు జీవనోపాధి ఇచ్చేవాడు ఎవడున్నాడు? అయినా వారు తలబిరుసుతనంలో మునిగి (సత్యానికి) దూరమై పోతున్నారు.


 • 67:22

أَفَمَن يَمْشِي مُكِبًّا عَلَىٰ وَجْهِهِ أَهْدَىٰ أَمَّن يَمْشِي سَوِيًّا عَلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ ٢٢

ఏమీ? ఎవడైతే తన ముఖం మీద దేవులాడుతూ నడుస్తాడో, అతడు సరైన మార్గం పొందుతాడా? 3 లేక చక్కగా ఋజుమార్గం మీద నడిచే వాడు పొందుతాడా?


 • 67:23

قُلْ هُوَ الَّذِي أَنشَأَكُمْ وَجَعَلَ لَكُمُ السَّمْعَ وَالْأَبْصَارَ وَالْأَفْئِدَةَ ۖ قَلِيلًا مَّا تَشْكُرُونَ ٢٣

వారితో ఇలా అను: "ఆయనే మిమ్మల్ని సృజించాడు. మరియు ఆయనే మీకు వినికిడినీ, దృష్టినీ మరియు హృదయాలనూ ఇచ్చాడు. (అయినా) మీరు కృతజ్ఞతలు తెలిపేది చాలా తక్కువ!"


 • 67:24

قُلْ هُوَ الَّذِي ذَرَأَكُمْ فِي الْأَرْضِ وَإِلَيْهِ تُحْشَرُونَ ٢٤

(ఇంకా) ఇలా అను: "ఆయనే మిమ్మల్ని భూమిలో వ్యాపింపజేశాడు మరియు ఆయన వద్దనే మీరంతా సమావేశపరచబడతారు."


 • 67:25

وَيَقُولُونَ مَتَىٰ هَـٰذَا الْوَعْدُ إِن كُنتُمْ صَادِقِينَ ٢٥

మరియు వారు ఇలా అడుగుతున్నారు: "మీరు సత్యవంతులే అయితే, ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరనున్నది?"


 • 67:26

قُلْ إِنَّمَا الْعِلْمُ عِندَ اللَّـهِ وَإِنَّمَا أَنَا نَذِيرٌ مُّبِينٌ ٢٦

వారితో ఇలా అను: "నిశ్చయంగా, దాని జ్ఞానం కేవలం అల్లాహ్‌కే ఉంది. 4 మరియు నేను స్పష్టంగా హెచ్చరిక చేసేవాడిని మాత్రమే!"


 • 67:27

فَلَمَّا رَأَوْهُ زُلْفَةً سِيئَتْ وُجُوهُ الَّذِينَ كَفَرُوا وَقِيلَ هَـٰذَا الَّذِي كُنتُم بِهِ تَدَّعُونَ ٢٧

తరువాత వారు దానిని సమీపంలో ఉండటం చూసి నప్పుడు, సత్యతిరస్కారుల ముఖాలు దుఃఖంతో నిండి నల్లబడిపోతాయి. 5 మరియు వారితో ఇలా అనబడుతుంది: "మీరు దేనినయితే అడుగుతూ ఉండేవారో అది (ఆ వాగ్దానం) ఇదే!" 6


 • 67:28

قُلْ أَرَأَيْتُمْ إِنْ أَهْلَكَنِيَ اللَّـهُ وَمَن مَّعِيَ أَوْ رَحِمَنَا فَمَن يُجِيرُ الْكَافِرِينَ مِنْ عَذَابٍ أَلِيمٍ ٢٨

(ఓ ప్రవక్తా!) వారితో ఇలాఅను: "ఏమీ? మీరు ఆలోచించారా? ఒకవేళ అల్లాహ్‌ నన్ను మరియు నా తోటివారిని నాశనం చేయనూ వచ్చు! లేదా మమ్మల్ని కరుణించనూ వచ్చు. కాని సత్య-తిరస్కారులను బాధాకరమైన శిక్ష నుండి ఎవడు రక్షించ గలడు?"


 • 67:29

قُلْ هُوَ الرَّحْمَـٰنُ آمَنَّا بِهِ وَعَلَيْهِ تَوَكَّلْنَا ۖ فَسَتَعْلَمُونَ مَنْ هُوَ فِي ضَلَالٍ مُّبِينٍ ٢٩

వారితో ఇంకా ఇలా అను: "ఆయనే అనంత కరుణామయుడు, మేము ఆయననే విశ్వ సించాము మరియు ఆయననే నమ్ముకున్నాము. ఇక ఎవరు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారో త్వరలోనే మీరు తెలుసుకోగలరు!"


 • 67:30

قُلْ أَرَأَيْتُمْ إِنْ أَصْبَحَ مَاؤُكُمْ غَوْرًا فَمَن يَأْتِيكُم بِمَاءٍ مَّعِينٍ ٣٠

వారితో ఇలా అను: "ఏమీ? మీరు ఆలోచించారా? ఒక వేళ మీ బావులలోని నీరు, భూమిలోనికి ఇంకిపోతే, ప్రవహించే ఈ నీటి ఊటలను మీ కొరకు ఎవడు బయటికి తేగలడు?" (1/8)