అల్‌-ముద్దస్సి'ర్‌: The Enfolded One, బట్ట(దుప్పటి)లో చుట్టుకున్నవాడు! దైవప్రవక్త ము'హమ్మద్‌ ('స'అస)పై సూరహ్‌ అల్‌-ఇఖ్‌రా' (96:1-5) మొదటి అయిదు ఆయతులు అవతరించిన తరువాత కొంతకాలం (6 నెలల నుండి 3 సంవత్సరాల) వరకు ఏ వ'హీ అవతరింపజేయబడలేదు. ఈ కాలాన్ని, ఫతరతుల్‌ వ'హీ అంటారు. అప్పుడు దైవప్రవక్త ('స'అస) ఎంతో కలవరపడ్డారు. అప్పుడు అతని ('స'అస) భార్య 'ఖదీజహ్‌ (ర.'అన్హా) అతనికి నైతిక ప్రోత్సాహాన్నిచ్చారు. ఆ తరువాత ఒక రోజు జిబ్రీల్‌ ('అ.స.) ఆకాశాలు మరియు భూమి మధ్య ప్రత్యక్షమయ్యారు. ఆ తరువాత ఈ సూరహ్‌ అవతరిపంజేయబడింది. ఆ తరువాత వ'హీ త్వరత్వరగా రావడం ఆరంభమయ్యింది, ('స. బు'ఖారీ, ముస్లిం). దీని కొన్ని ఆయతులు తరువాత అవతరింపజేయబడ్డాయి. ఈ సూరహ్‌ మక్కహ్ లోఅవతరింపజేయబడింది.

ఈ సూరహ్‌ ఇస్లాం విధులను, అల్లాహ్‌ ఏకత్వాన్ని పునరుత్థానాన్ని మరియు అంతిమ తీర్పును వివరిస్తోంది. మానవుడు బలహీనుడని, అల్లాహ్‌ (సు.త.)పై అతడు ఆధారపడి ఉన్నాడని, ప్రతి మానవుడు తన కర్మలకు తానే బాధ్యుడని, అతడు వాటి ఫలితాన్ని అనుభవిస్తాడని మరియు అతడి కర్మలను బట్టి స్వర్గ-నరకాలున్నాయని బోధిస్తోంది. 56 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 74:1

يَا أَيُّهَا الْمُدَّثِّرُ ١

ఓ దుప్పటిలో చుట్టుకున్నవాడా!


  • 74:2

قُمْ فَأَنذِرْ ٢

లే! ఇక హెచ్చరించు!


  • 74:3

وَرَبَّكَ فَكَبِّرْ ٣

మరియు నీ ప్రభువు గొప్పతనాన్ని (ఘనతను) కొని యాడు (చాటి చెప్పు)!


  • 74:4

وَثِيَابَكَ فَطَهِّرْ ٤

మరియు నీ వస్త్రాలను పరిశుభ్రంగా ఉంచుకో!


  • 74:5

وَالرُّجْزَ فَاهْجُرْ ٥

మరియు మాలిన్యానికి దూరంగా ఉండు!


  • 74:6

وَلَا تَمْنُن تَسْتَكْثِرُ ٦

మరియు ఎక్కువ పొందాలనే ఆశతో ఇవ్వకు (ఉపకారం చేయకు)!


  • 74:7

وَلِرَبِّكَ فَاصْبِ ٧

మరియు నీ ప్రభువు కొరకు సహనం వహించు!


  • 74:8

فَإِذَا نُقِرَ فِي النَّاقُورِ ٨

మరియు బాకా (నాఖూర్‌) ఊదబడి నప్పుడు;


  • 74:9

فَذَٰلِكَ يَوْمَئِذٍ يَوْمٌ عَسِيرٌ ٩

ఆ దినం చాలా కఠినమైన దినమై ఉంటుంది;


  • 74:10

عَلَى الْكَافِرِينَ غَيْرُ يَسِيرٍ ١٠

సత్యతిరస్కారులకు అది సులభమైన (దినం) కాదు. 1


  • 74:11

ذَرْنِي وَمَنْ خَلَقْتُ وَحِيدًا ١١

వదలండి! నన్నూ మరియు నేను ఒంటరిగా పుట్టించిన వానినీ! 2


  • 74:12

وَجَعَلْتُ لَهُ مَالًا مَّمْدُودًا ١٢

మరియు నేను అతనికి పుష్కలంగా సంపదనిచ్చాను.


  • 74:13

وَبَنِينَ شُهُودًا ١٣

మరియు అతనికి తోడుగా ఉండే కుమారులను!


  • 74:14

وَمَهَّدتُّ لَهُ تَمْهِيدًا ١٤

మరియు అతని కొరకు అతని జీవన సౌకర్యాలను సులభంచేశాను.


  • 74:15

ثُمَّ يَطْمَعُ أَنْ أَزِيدَ ١٥

అయినా నేను అతనికి ఇంకా ఇవ్వాలని అతడు ఆశిస్తూ ఉంటాడు.


  • 74:16

كَلَّا ۖ إِنَّهُ كَانَ لِآيَاتِنَا عَنِيدًا ١٦

అలాకాదు! వాస్తవానికి అతడు మా (అల్లాహ్‌) సూచన (ఆయాత్‌)ల పట్ల విరోధం కలిగివున్నాడు.


  • 74:17

سَأُرْهِقُهُ صَعُودًا ١٧

నేను త్వరలోనే అతనిని దుర్గమమైన స్థానానికి (శిక్షకు) నెట్టుతాను!


  • 74:18

إِنَّهُ فَكَّرَ وَقَدَّرَ ١٨

వాస్తవానికి అతడు ఆలోచించాడు మరియు మనస్సులో ప్రణాళిక చేసుకున్నాడు.


  • 74:19

فَقُتِلَ كَيْفَ قَدَّرَ ١٩

కావున (అతనిని) తాను ప్రణాళిక చేసుకున్నట్లు నాశనానికి గురికానివ్వండి!


  • 74:20

ثُمَّ قُتِلَ كَيْفَ قَدَّرَ ٢٠

అవును (అతనిని) తాను ప్రణాళిక చేసుకున్నట్లు, నాశనానికి గురికానివ్వండి!


  • 74:21

ثُمَّ نَظَرَ ٢١

అప్పుడు అతడు ఆలోచించాడు.


  • 74:22

ثُمَّ عَبَسَ وَبَسَ ٢٢

తరువాత అతడు నుదురు చిట్లించు కున్నాడు మరియు కోపంతో చూశాడు (ముఖం మాడ్చుకున్నాడు);


  • 74:23

ثُمَّ أَدْبَرَ وَاسْتَكْبَرَ ٢٣

తరువాత అతడు వెనుకకు మరలి దురహంకారం చూపాడు. 3


  • 74:24

فَقَالَ إِنْ هَـٰذَا إِلَّا سِحْرٌ يُؤْثَرُ ٢٤

అప్పుడతడు ఇలా అన్నాడు: "ఇది పూర్వం నుండి వస్తూ ఉన్న ఒక మంత్రజాలం మాత్రమే!


  • 74:25

إِنْ هَـٰذَا إِلَّا قَوْلُ الْبَشَرِ ٢٥

"ఇది కేవలం ఒక మానవ వాక్కు మాత్రమే!"


  • 74:26

سَأُصْلِيهِ سَقَرَ ٢٦

త్వరలోనే నేను అతనిని నరకాగ్నిలో కాల్చుతాను.


  • 74:27

وَمَا أَدْرَاكَ مَا سَقَرُ ٢٧

మరియు ఆ నరకాగ్ని అంటే నీవు ఏమను కుంటున్నావు? 4


  • 74:28

لَا تُبْقِي وَلَا تَذَرُ ٢٨

అది (ఎవరినీ) మిగల్చదు మరియు వదలి పెట్టదు. 5


  • 74:29

لَوَّاحَةٌ لِّلْبَشَرِ ٢٩

అది మానవుణ్ణి (అతడి చర్మాన్ని) దహించి వేస్తుంది. 6


  • 74:30

عَلَيْهَا تِسْعَةَ عَشَرَ ٣٠

దానిపై పందొమ్మిది (దేవదూతలు నియమించబడి) ఉన్నారు.


  • 74:31

وَمَا جَعَلْنَا أَصْحَابَ النَّارِ إِلَّا مَلَائِكَةً ۙ وَمَا جَعَلْنَا عِدَّتَهُمْ إِلَّا فِتْنَةً لِّلَّذِينَ كَفَرُوا لِيَسْتَيْقِنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ وَيَزْدَادَ الَّذِينَ آمَنُوا إِيمَانًا ۙ وَلَا يَرْتَابَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ وَالْمُؤْمِنُونَ ۙ وَلِيَقُولَ الَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ وَالْكَافِرُونَ مَاذَا أَرَادَ اللَّـهُ بِهَـٰذَا مَثَلًا ۚ كَذَٰلِكَ يُضِلُّ اللَّـهُ مَن يَشَاءُ وَيَهْدِي مَن يَشَاءُ ۚ وَمَا يَعْلَمُ جُنُودَ رَبِّكَ إِلَّا هُوَ ۚ وَمَا هِيَ إِلَّا ذِكْرَىٰ لِلْبَشَ ٣١

మరియు మేము దేవదూతలను మాత్రమే నరకానికి రక్షకులుగా నియమించాము. మరియు మేము వారి సంఖ్యను (పందొమ్మిదిని), సత్య-తిరస్కారులకు ఒక పరీక్షగా, గ్రంథ ప్రజలకు నమ్మకం కలగటానికి, విశ్వాసుల విశ్వాసాన్ని అధికం చేయటానికి మరియు గ్రంథ ప్రజలు మరియు విశ్వాసులు సందేహంలో పడకుండా ఉండటానికి మరియు తమ హృదయాలలో రోగమున్న వారు మరియు సత్య-తిరస్కారులు: "ఈ ఉపమానం ఇవ్వటంలో అల్లాహ్‌ ఉద్దేశ్య మేమిటి?" అని పలుకటానికి! ఈ విధంగా అల్లాహ్‌ తాను కోరినవారిని మార్గభ్రష్టత్వంలో వదులు తాడు. మరియు తాను కోరినవారికి మార్గదర్శ కత్వంచేస్తాడు. 7 మరియు నీ ప్రభువు సైన్యాలను ఆయనతప్ప మరెవ్వరూ ఎరుగరు. మరియు ఇదంతా మానవునికి ఒక జ్ఞాపిక మాత్రమే.


  • 74:32

كَلَّا وَالْقَمَرِ ٣٢

అలా కాదు! చంద్రుని సాక్షిగా!


  • 74:33

وَاللَّيْلِ إِذْ أَدْبَرَ ٣٣

గడిచిపోయే రాత్రి సాక్షిగా!


  • 74:34

وَالصُّبْحِ إِذَا أَسْفَرَ ٣٤

ప్రకాశించే, ఉదయం సాక్షిగా!


  • 74:35

إِنَّهَا لَإِحْدَى الْكُبَرِ ٣٥

నిశ్చయంగా, ఇది (ఈ నరకాగ్ని ప్రస్తావన) ఒక గొప్ప విషయం.


  • 74:36

نَذِيرًا لِّلْبَشَ ٣٦

మానవునికి ఒక హెచ్చరిక;


  • 74:37

لِمَن شَاءَ مِنكُمْ أَن يَتَقَدَّمَ أَوْ يَتَأَخَّرَ ٣٧

మీలో ముందుకు రావాలని కోరుకునేవానికి లేదా వెనుక ఉండిపోయేవానికి;


  • 74:38

كُلُّ نَفْسٍ بِمَا كَسَبَتْ رَهِينَةٌ ٣٨

ప్రతి మానవుడు తాను చేసిన కర్మలకు తాకట్టుగా ఉంటాడు.


  • 74:39

إِلَّا أَصْحَابَ الْيَمِينِ ٣٩

కుడి పక్షంవారు తప్ప!


  • 74:40

فِي جَنَّاتٍ يَتَسَاءَلُونَ ٤٠

వారు స్వర్గాలలో ఉంటూ ఒకరినొకరు ఇలా ప్రశ్నించుకుంటారు!


  • 74:41

عَنِ الْمُجْرِمِينَ ٤١

అపరాధులను గురించి (మరియు వారితో అంటారు):


  • 74:42

مَا سَلَكَكُمْ فِي سَقَرَ ٤٢

"మిమ్మల్ని ఏ విషయం నరకంలోకి ప్రవేశింపజేసింది?"


  • 74:43

قَالُوا لَمْ نَكُ مِنَ الْمُصَلِّينَ ٤٣

వారు (నరకవాసులు) ఇలా జవాబిస్తారు: "మేము నమా'జ్‌ చేసేవాళ్ళం కాము.


  • 74:44

وَلَمْ نَكُ نُطْعِمُ الْمِسْكِينَ ٤٤

"మరియు నిరుపేదకు ఆహారం పెట్టేవాళ్ళం కాము;


  • 74:45

وَكُنَّا نَخُوضُ مَعَ الْخَائِضِينَ ٤٥

"మరియు వృథా కాలక్షేపం చేసేవారితో కలిసి వ్యర్థప్రలాపాలు (ప్రసంగాలు) చేస్తూ ఉండే వాళ్ళము;


  • 74:46

وَكُنَّا نُكَذِّبُ بِيَوْمِ الدِّينِ ٤٦

"మరియు తీర్పు దినాన్ని అబద్ధమని నిరాక రిస్తూ ఉండేవాళ్ళము;


  • 74:47

حَتَّىٰ أَتَانَا الْيَقِينُ ٤٧

"చివరకు ఆ అనివార్యమైన ఘడియ మాపై వచ్చి పడింది." 8


  • 74:48

فَمَا تَنفَعُهُمْ شَفَاعَةُ الشَّافِعِينَ ٤٨

అప్పుడు సిఫారసు చేసేవారి సిఫారసు, వారికి ఏ మాత్రం ఉపయోగపడదు. 9


  • 74:49

فَمَا لَهُمْ عَنِ التَّذْكِرَةِ مُعْرِضِينَ ٤٩

అయితే, వారికేమయింది? ఈ హితోపదేశం నుండి వారెందుకు ముఖం త్రిప్పుకుంటున్నారు.


  • 74:50

كَأَنَّهُمْ حُمُرٌ مُّسْتَنفِرَةٌ ٥٠

వారి స్థితి బెదిరిన అడవి గాడిదల మాదిరిగా ఉంది;


  • 74:51

فَرَّتْ مِن قَسْوَرَةٍ ٥١

సింహం నుండి పారిపోయే (గాడిదల మాదిరిగా)! 10


  • 74:52

بَلْ يُرِيدُ كُلُّ امْرِئٍ مِّنْهُمْ أَن يُؤْتَىٰ صُحُفًا مُّنَشَّرَةً ٥٢

అలాకాదు! వారిలో ప్రతిఒక్క వ్యక్తి తనకు విప్ప బడిన గ్రంథాలు ఇవ్వబడాలని కోరుతున్నాడు 11


  • 74:53

كَلَّا ۖ بَل لَّا يَخَافُونَ الْآخِرَةَ ٥٣

కాదుకాదు! అసలు వారు పరలోక జీవితం గురించి భయపడటంలేదు.


  • 74:54

كَلَّا إِنَّهُ تَذْكِرَةٌ ٥٤

అలా కాదు! నిశ్చయంగా, ఇది ఒక హితోపదేశం.


  • 74:55

فَمَن شَاءَ ذَكَرَهُ ٥٥

కావున కోరినవాడు దీని నుండి హితబోధ గ్రహించవచ్చు.


  • 74:56

وَمَا يَذْكُرُونَ إِلَّا أَن يَشَاءَ اللَّـهُ ۚ هُوَ أَهْلُ التَّقْوَىٰ وَأَهْلُ الْمَغْفِرَةِ ٥٦

కాని అల్లాహ్‌ కోరితే తప్ప! 12 వీరు దీని నుండి హితబోధ గ్రహించలేరు. ఆయనే (అల్లాహ్ యే) భయభక్తులకు అర్హుడు మరియు ఆయనే క్షమించే అర్హత గలవాడు. (3/4)