అల్‌-లైల్‌: The Night, రాత్రి, అవతరణాక్రమంలో బహుశా ఇది 9వ మక్కహ్ సూరహ్‌. 21 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

 • 92:1

وَاللَّيْلِ إِذَا يَغْشَىٰ ١

క్రమ్ముకొనే రాత్రి సాక్షిగా!


 • 92:2

وَالنَّهَارِ إِذَا تَجَلَّىٰ ٢

ప్రకాశించే పగటి సాక్షిగా!


 • 92:3

وَمَا خَلَقَ الذَّكَرَ وَالْأُنثَ ٣

మరియు, మగ మరియు ఆడ (జాతులను) సృష్టించిన ఆయన (అల్లాహ్‌) సాక్షిగా!


 • 92:4

إِنَّ سَعْيَكُمْ لَشَتَّىٰ ٤

వాస్తవానికి, మీ ప్రయత్నాలు నానా విధాలుగా ఉన్నాయి; 1


 • 92:5

فَأَمَّا مَنْ أَعْطَىٰ وَاتَّقَىٰ ٥

కాని ఎవడైతే (దాన-ధర్మాలు) చేస్తూ దైవభీతి కలిగి ఉంటాడో!


 • 92:6

وَصَدَّقَ بِالْحُسْنَ ٦

మరియు మంచిని నమ్ముతాడో! 2


 • 92:7

فَسَنُيَسِّرُهُ لِلْيُسْرَىٰ ٧

అతనికి మేము మేలు కొరకు దారిని సులభం చేస్తాము. 3


 • 92:8

وَأَمَّا مَن بَخِلَ وَاسْتَغْنَىٰ ٨

కాని ఎవడైతే పిసినారితనం చేస్తూ, నిర్లక్ష్యవైఖరిని అవలంబిస్తాడో! 4


 • 92:9

وَكَذَّبَ بِالْحُسْنَىٰ ٩

మరియు మంచిని అబద్ధమని తిరస్కరిస్తాడో!


 • 92:10

فَسَنُيَسِّرُهُ لِلْعُسْرَىٰ ١٠

అతనికి మేము చెడు కొరకు దారిని సులభం చేస్తాము.


 • 92:11

وَمَا يُغْنِي عَنْهُ مَالُهُ إِذَا تَرَدَّىٰ ١١

మరియు అతడు నశించిపోయినప్పుడు, అతనిధనం అతనికి ఎలాఉపయోగపడుతుంది?


 • 92:12

إِنَّ عَلَيْنَا لَلْـهُدَىٰ ١٢

నిశ్చయంగా సన్మార్గం చూపడం మా పని!


 • 92:13

وَإِنَّ لَنَا لَلْآخِرَةَ وَالْأُولَىٰ ١٣

మరియు నిశ్చయంగా, ఇహపర లోకాల (ఆధిపత్యం) మాకే చెందినది.


 • 92:14

فَأَنذَرْتُكُمْ نَارًا تَلَظَّىٰ ١٤

కాబట్టి నేను మిమ్మల్ని ప్రజ్వలించే నరకాగ్నిని గురించి హెచ్చరించాను.


 • 92:15

لَا يَصْلَاهَا إِلَّا الْأَشْقَى ١٥

పరమ దౌర్భాగ్యుడు తప్ప, మరెవ్వడూ అందులో కాలడు!


 • 92:16

الَّذِي كَذَّبَ وَتَوَلَّىٰ ١٦

ఎవడైతే (సత్యాన్ని) తిరస్కరించి (దాని నుండి) విముఖుడవుతాడో!


 • 92:17

وَسَيُجَنَّبُهَا الْأَتْقَى ١٧

కాని దైవభీతి గలవాడు దాని నుండి (ఆ నరకాగ్ని నుండి) దూరంగా ఉంచబడతాడు!


 • 92:18

الَّذِي يُؤْتِي مَالَهُ يَتَزَكَّ ١٨

అతడే! ఎవడైతే, పవిత్రుడవటానికి తన ధనం నుండి (ఇతరులకు) ఇస్తాడో!


 • 92:19

وَمَا لِأَحَدٍ عِندَهُ مِن نِّعْمَةٍ تُجْزَىٰ ١٩

కాని అది, వారు అతనికి చేసిన ఏ ఉపకారానికి బదులుగా గాక;


 • 92:20

إِلَّا ابْتِغَاءَ وَجْهِ رَبِّهِ الْأَعْلَىٰ ٢٠

కేవలం మహోన్నతుడైన తన ప్రభువు ప్రసన్నతను పొందటానికి మాత్రమే అయితే!


 • 92:21

وَلَسَوْفَ يَرْضَىٰ ٢١

మరియు అలాంటి వాడే తప్పక సంతోషిస్తాడు. 5