అల్‌-కౌస'ర్‌: అంటే అధికం, Good in Abundance, పుష్కలత్వం, సమృద్ధి. ఈ సూరహ్ మరొక పేరు అన్‌-నహ్ర్‌. చాలా మంది ఇది మొదటి మక్కహ్ కాలపు సూరహ్‌ అని అంటారు. ఇది 3 ఆయాతులున్న 2వ సూరహ్. దీని పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 108:1

إِنَّا أَعْطَيْنَاكَ الْكَوْثَرَ ١

(ఓ ము'హమ్మద్‌!) నిశ్చయంగా, మేము నీకు కౌస'ర్‌ 1 ప్రసాదించాము.


  • 108:2

فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ ٢

కనుక, నీవు నీ ప్రభువు కొరకే నమా'జ్‌ చెయ్యి మరియు బలి (ఖుర్బానీ) కూడా (ఆయన కొరకే) ఇవ్వు! 2


  • 108:3

إِنَّ شَانِئَكَ هُوَ الْأَبْتَ ٣

నిశ్చయంగా, నీ శత్రువు, వాడే! వేరుతెగిన వాడిగా (వారసుడూ, పేరూ లేకుండా) అయిపోతాడు. 3