అల్‌-జుము'అహ్‌: అంటే The congregation, సమావేశం. మతవిధుల నిర్వహణకు కూడిన జన సముదాయం. ఈ 10 మదీనహ్ సూరహ్‌ల సమూహంలో ఇది 6వది. మదీనహ్ ప్రారంభపు కాలంలో (2-4వ హిజ్రీలలో) అవతరింపజేయబడింది. దైవప్రవక్త ('స'అస) జుము'అహ్‌ నమా'జులో సూరహ్‌ అల్‌-జుము'అహ్‌ (62) మరియు సూరహ్‌ అల్‌-మునాఫిఖూన్‌ (63) చదివేవారు, ('స. ముస్లిం). 11 ఆయాతులున్నఈ సూరహ్ పేరు 9వ ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 62:1

يُسَبِّحُ لِلَّـهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ الْمَلِكِ الْقُدُّوسِ الْعَزِيزِ الْحَكِيمِ ١

* ఆకాశాలలో నున్నవి మరియు భూమిలో నున్నవి, సమస్తమూ విశ్వ సార్వభౌముడు, 1 పరమ పవిత్రుడు, సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు అయిన అల్లాహ్‌ పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి.


  • 62:2

هُوَ الَّذِي بَعَثَ فِي الْأُمِّيِّينَ رَسُولًا مِّنْهُمْ يَتْلُو عَلَيْهِمْ آيَاتِهِ وَيُزَكِّيهِمْ وَيُعَلِّمُهُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَإِن كَانُوا مِن قَبْلُ لَفِي ضَلَالٍ مُّبِينٍ ٢

ఆయనే ఆ నిరక్షరాస్యులైన 2 వారిలో నుండి ఒక సందేశహరుణ్ణి లేపాడు. అతను వారికి ఆయన సూచనలను (ఆయాత్‌లను) చదివి వినిపిస్తు న్నాడు మరియు వారిని సంస్కరిస్తున్నాడు మరియు వారికి గ్రంథాన్ని మరియు వివేకాన్ని బోధిస్తున్నాడు. మరియు వాస్తవానికివారు అంతకు పూర్వం స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడిఉండే వారు.


  • 62:3

وَآخَرِينَ مِنْهُمْ لَمَّا يَلْحَقُوا بِهِمْ ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ ٣

మరియు ఇంకా వారిలో చేరని ఇతరులకు కూడా (బోధించటానికి). మరియు ఆయన సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.


  • 62:4

ذَٰلِكَ فَضْلُ اللَّـهِ يُؤْتِيهِ مَن يَشَاءُ ۚ وَاللَّـهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ ٤

ఇది అల్లాహ్‌ అనుగ్రహం, ఆయన దానిని తాను కోరిన వారికి ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్‌ అనుగ్రహశాలి, సర్వోత్తముడు.


  • 62:5

مَثَلُ الَّذِينَ حُمِّلُوا التَّوْرَاةَ ثُمَّ لَمْ يَحْمِلُوهَا كَمَثَلِ الْحِمَارِ يَحْمِلُ أَسْفَارًا ۚ بِئْسَ مَثَلُ الْقَوْمِ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِ اللَّـهِ ۚ وَاللَّـهُ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ ٥

తౌరాత్‌ బాధ్యత (భారం) మోపబడిన తరువాత దానిపై అమలు చేయలేక పోయిన వారి పోలిక, పుస్తకాల భారాన్ని మోసే ఆ గాడిదవలే ఉంది. (వారు ఆ భారాన్ని భరించారే గానీ, దానిని అర్థం చేసుకోలేక పోయారు). అల్లాహ్‌ సూచన (ఆయాత్‌) లను తిరస్కరించిన వారి దృష్టాంతము ఎంతచెడ్డది. మరియు అల్లాహ్‌ దుర్మార్గులకు మార్గదర్శకత్వం చేయడు.


  • 62:6

قُلْ يَا أَيُّهَا الَّذِينَ هَادُوا إِن زَعَمْتُمْ أَنَّكُمْ أَوْلِيَاءُ لِلَّـهِ مِن دُونِ النَّاسِ فَتَمَنَّوُا الْمَوْتَ إِن كُنتُمْ صَادِقِينَ ٦

వారితో ఇలా అను: "ఓ యూదులారా! నిశ్చయంగా, ఇతర ప్రజలకంటే మీరు మాత్రమే అల్లాహ్‌కు ప్రియమైన వారు (స్నేహితులు) అనే భావం మీకుంటే, మీ (వాదంలో) మీరు సత్యవంతులే అయితే మీరు చావునుకోరండి." 3


  • 62:7

وَلَا يَتَمَنَّوْنَهُ أَبَدًا بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ ۚ وَاللَّـهُ عَلِيمٌ بِالظَّالِمِينَ ٧

కాని వారు తాము చేసి పంపుకున్న కర్మల (ఫలితాల) కు భయపడి దానిని ఏ మాత్రం కోరుకోరు! 4 మరియు అల్లాహ్‌కు దుర్మార్గులను గురించి బాగా తెలుసు.


  • 62:8

قُلْ إِنَّ الْمَوْتَ الَّذِي تَفِرُّونَ مِنْهُ فَإِنَّهُ مُلَاقِيكُمْ ۖ ثُمَّ تُرَدُّونَ إِلَىٰ عَالِمِ الْغَيْبِ وَالشَّهَادَةِ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ ٨

వారితో ఇలా అను: "వాస్తవానికి ఏ చావు నుండి అయితే మీరు పారిపోతున్నారో! నిశ్చయంగా, అదే మిమ్మల్ని పట్టుకుంటుంది. ఆ తరువాత మీరు, అగోచర మరియు గోచర విషయాలు తెలిసిన ఆయన (అల్లాహ్‌) వైపునకు మరలింపబడతారు, అప్పుడు ఆయన మీరు చేస్తూ ఉండిన కర్మలను మీకు తెలుపుతాడు."


  • 62:9

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا نُودِيَ لِلصَّلَاةِ مِن يَوْمِ الْجُمُعَةِ فَاسْعَوْا إِلَىٰ ذِكْرِ اللَّـهِ وَذَرُوا الْبَيْعَ ۚ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ ٩

ఓ విశ్వాసులారా! శుక్రవారం (జుము'అహ్) రోజు నమా'జ్‌ కొరకు పిలుపు ఇవ్వబడినప్పుడు, మీరు మీ వ్యాపారాలను విడిచి అల్లాహ్‌ స్మరణ వైపునకు పరుగెత్తండి. మీరు తెలుసుకోగలిగితే, ఇది మీకు ఎంతో ఉత్తమమైనది!


  • 62:10

فَإِذَا قُضِيَتِ الصَّلَاةُ فَانتَشِرُوا فِي الْأَرْضِ وَابْتَغُوا مِن فَضْلِ اللَّـهِ وَاذْكُرُوا اللَّـهَ كَثِيرًا لَّعَلَّكُمْ تُفْلِحُونَ ١٠

ఇక నమా'జ్‌ పూర్తి అయిన తరువాత భూమిలో వ్యాపించండి మరియు అల్లాహ్‌ అనుగ్రహాన్ని అన్వేషించండి మరియు మీరు సాఫల్యం పొందాలంటే అల్లాహ్‌ను అత్యధికంగా స్మరిస్తూ ఉండండి!


  • 62:11

وَإِذَا رَأَوْا تِجَارَةً أَوْ لَهْوًا انفَضُّوا إِلَيْهَا وَتَرَكُوكَ قَائِمًا ۚ قُلْ مَا عِندَ اللَّـهِ خَيْرٌ مِّنَ اللَّـهْوِ وَمِنَ التِّجَارَةِ ۚ وَاللَّـهُ خَيْرُ الرَّازِقِينَ ١١

మరియు (ఓ ము'హమ్మద్‌!) వారు వ్యాపారాన్ని గానీ లేదా వినోదక్రీడను గానీ చూసినప్పుడు, నిన్ను నిలబడివున్న స్థితిలోనే వదలి పెట్టి, దాని చుట్టు గుమిగూడుతారు. 5 వారితో ఇలా అను: "వినోదక్రీడల కంటే మరియు వ్యాపారం కంటే, అల్లాహ్‌ వద్ద ఉన్నదే ఎంతో ఉత్తమమైనది. మరియు అల్లాహ్‌యే జీవనోపాధి ప్రసాదించటంలో అత్యుత్తముడు."