అల్‌-ఇన్‌షిఖాఖ్‌: The Splitting asunder, బ్రద్దలవటం, ప్రేలిపోవటం, పగిలిపోవటం,ఖండన. ఇది సూరహ్‌ అల్‌-ఇన్‌ఫి'తార్‌ (82) తరువాత అవతరింపజేయబడింది. చివరి మక్కహ్ సూరాహ్‌. 25 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 84:1

إِذَا السَّمَاءُ انشَقَّتْ ١

* ఆకాశం బ్రద్దలయి పోయినప్పుడు! 1


  • 84:2

وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ ٢

మరియు అది తన ప్రభువు ఆదేశపాలన చేసింది మరియు అదే దాని విధ్యుక్త ధర్మం. 2


  • 84:3

وَإِذَا الْأَرْضُ مُدَّتْ ٣

మరియు భూమి విస్తరింపజేయబడి (చదునుగా చేయబడి) నప్పుడు;


  • 84:4

وَأَلْقَتْ مَا فِيهَا وَتَخَلَّتْ ٤

మరియు అది తన లోపల ఉన్నదంతా బయటికి విసరివేసి, ఖాళీ అయినప్పుడు;


  • 84:5

وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ ٥

అది తన ప్రభువు ఆదేశపాలన చేసింది మరియు అదే దాని విధ్యుక్తధర్మం.


  • 84:6

يَا أَيُّهَا الْإِنسَانُ إِنَّكَ كَادِحٌ إِلَىٰ رَبِّكَ كَدْحًا فَمُلَاقِيهِ ٦

ఓ మానవుడా! నిశ్చయంగా, నీవు నీ ప్రభువు వైపునకు, నీ (మంచి-చెడు) కర్మలను తీసుకొని మరలుతున్నావు, ఒక నిశ్చితమరల్పు. అప్పుడు నీవు నీ (కర్మల ఫలితాన్ని) పొందుతావు.


  • 84:7

فَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِيَمِينِهِ ٧

అప్పుడు తన కర్మపత్రం కుడిచేతిలో ఇవ్వబడిన వాడి నుండి; 3


  • 84:8

فَسَوْفَ يُحَاسَبُ حِسَابًا يَسِيرًا ٨

అతని లెక్క అతి తేలికగా తీసుకోబడగలదు.


  • 84:9

وَيَنقَلِبُ إِلَىٰ أَهْلِهِ مَسْرُورًا ٩

మరియు అతడు సంతోషంగా తనవారి దగ్గరకు మరలిపోతాడు!


  • 84:10

وَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ وَرَاءَ ظَهْرِهِ ١٠

ఇక తన కర్మపత్రం వీపు వెనుక నుండి ఇవ్వబడిన వాడు; 4


  • 84:11

فَسَوْفَ يَدْعُو ثُبُورًا ١١

అప్పుడతడు తన నాశనాన్నే కోరుకుంటాడు;


  • 84:12

وَيَصْلَىٰ سَعِيرًا ١٢

మరియు అతడు మండుతున్న నరకాగ్నిలో పడిపోతాడు.


  • 84:13

إِنَّهُ كَانَ فِي أَهْلِهِ مَسْرُورًا ١٣

వాస్తవానికి, అతడు (ప్రపంచంలో) తన వారి మధ్య సుఖసంతోషాలలో మునిగి ఉండేవాడు. 5


  • 84:14

إِنَّهُ ظَنَّ أَن لَّن يَحُورَ ١٤

వాస్తవానికి, అతడు (మా వైపుకు) మరలి రాడని భావించేవాడు.


  • 84:15

بَلَىٰ إِنَّ رَبَّهُ كَانَ بِهِ بَصِيرًا ١٥

అలాకాదు! వాస్తవానికి, అతని ప్రభువు అతనిని గమనిస్తూ ఉండేవాడు.


  • 84:16

فَلَا أُقْسِمُ بِالشَّفَقِ ١٦

కనుక, నేను సంధ్యకాలపు ఎరుపు సాక్షిగా చెబుతున్నాను! 6


  • 84:17

وَاللَّيْلِ وَمَا وَسَقَ ١٧

రాత్రి సాక్షిగా, అది ప్రోగుచేసే వాటి సాక్షిగా!


  • 84:18

وَالْقَمَرِ إِذَا اتَّسَقَ ١٨

పూర్ణ చంద్రుని సాక్షిగా! 7


  • 84:19

لَتَرْكَبُنَّ طَبَقًا عَن طَبَقٍ ١٩

మీరందరూ తప్పనిసరిగా ఒక స్థితి నుండి మరొక స్థితికి క్రమక్రమంగా మారుతూ పోవలసి ఉంటుంది. 8


  • 84:20

فَمَا لَهُمْ لَا يُؤْمِنُونَ ٢٠

అయితే వీరి కేమయింది? వీరు ఎందుకు విశ్వసించరు?


  • 84:21

وَإِذَا قُرِئَ عَلَيْهِمُ الْقُرْآنُ لَا يَسْجُدُونَ ۩ ٢١

మరియు ఖుర్‌ఆన్‌ వీరి ముందు పఠింప బడినప్పుడు వీరెందుకు సాష్టాంగం (సజ్దా) చేయరు? 9 (సజ్దా)


  • 84:22

بَلِ الَّذِينَ كَفَرُوا يُكَذِّبُونَ ٢٢

అలా కాదు! ఈ సత్యతిరస్కారులు దీనిని అసత్యమంటున్నారు.


  • 84:23

وَاللَّـهُ أَعْلَمُ بِمَا يُوعُونَ ٢٣

మరియు వారు కూడబెట్టేదంతా అల్లాహ్‌కు బాగా తెలుసు.


  • 84:24

فَبَشِّرْهُم بِعَذَابٍ أَلِيمٍ ٢٤

కాబట్టి వారికి (పరలోకంలో) లభించే వ్యధాభరితమైన శిక్ష యొక్క వార్తనివ్వు –


  • 84:25

إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍ ٢٥

విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి తప్ప – వారికి ఎన్నటికీ అంతంగాని ప్రతిఫలం ఉంటుంది.