అల్‌-ఇన్సాను: The Man, మానవుడు. దీనికి సూరహ్‌ అద్‌-దహ్ర్‌, The Time, కాలచక్రం, సమయం అనే పేరు కూడా ఉంది. దైవప్రవక్త ('స'అస) జుమ'అహ్‌ రోజు, ఫజ్ర్‌ నమాజులలో సూరహ్‌ అస్‌-సజ్దా (32) మరియు ఈ సూరహ్‌ (76) చదివేవారు ('స'హీ'హ్‌ ముస్లిం). చాలా మంది వ్యాఖ్యాతల అభిప్రాయంలో ఈ సూరహ్‌ మదీనహ్ లో అవతరింపజేయబడింది, (ఫ'త్హ్ అల్‌-ఖదీర్‌). 31 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

  • 76:1

هَلْ أَتَىٰ عَلَى الْإِنسَانِ حِينٌ مِّنَ الدَّهْرِ لَمْ يَكُن شَيْئًا مَّذْكُورًا ١

అనంత కాల చక్రంలో, మానవుడు తాను చెప్పుకోదగిన వస్తువు కాకుండా ఉన్న సమయం గడవలేదా?


  • 76:2

إِنَّا خَلَقْنَا الْإِنسَانَ مِن نُّطْفَةٍ أَمْشَاجٍ نَّبْتَلِيهِ فَجَعَلْنَاهُ سَمِيعًا بَصِيرًا ٢

నిశ్చయంగా, మేము, మానవుణ్ణి ఒక మిశ్రమ వీర్య- బిందువుతో సృష్టించాము. 1 అతనిని పరీక్షించటానికి, మేము అతనిని వినేవాడిగా, చూసేవాడిగా చేశాము. 2


  • 76:3

إِنَّا هَدَيْنَاهُ السَّبِيلَ إِمَّا شَاكِرًا وَإِمَّا كَفُورًا ٣

నిశ్చయంగా, మేము అతనికి మార్గం చూపాము. ఇక అతడు కృతజ్ఞుడు కావచ్చు, లేదా కృతఘ్నుడూ కావచ్చు! 3


  • 76:4

إِنَّا أَعْتَدْنَا لِلْكَافِرِينَ سَلَاسِلَ وَأَغْلَالًا وَسَعِيرًا ٤

నిశ్చయంగా, మేము సత్య-తిరస్కారుల కొరకు సంకెళ్ళను, మెడలో పట్టాలను మరియు భగభగ మండే నరకాగ్నిని (స'ఈరాను) సిధ్దపరచి ఉంచాము. 4


  • 76:5

إِنَّ الْأَبْرَارَ يَشْرَبُونَ مِن كَأْسٍ كَانَ مِزَاجُهَا كَافُورًا ٥

నిశ్చయంగా, పుణ్యాత్ములు కాఫూర్‌ అనే ఒక చెలమనుండి ఒక గిన్నెలో తెచ్చిన (పానీయాన్ని) త్రాగుతారు. 5


  • 76:6

عَيْنًا يَشْرَبُ بِهَا عِبَادُ اللَّـهِ يُفَجِّرُونَهَا تَفْجِيرًا ٦

ధారాళంగా పొంగి ప్రవహింపజేయబడే ఊటల నుండి, అల్లాహ్‌ దాసులు త్రాగుతూ ఉంటారు. 6


  • 76:7

يُوفُونَ بِالنَّذْرِ وَيَخَافُونَ يَوْمًا كَانَ شَرُّهُ مُسْتَطِيرًا ٧

వారు తమ మొక్కుబడులను పూర్తిచేసు కున్నవారై ఉంటారు. 7 మరియు దాని హాని అన్ని వైపులా క్రమ్ముకొనే, ఆ దినమును గురించి భయపడుతూ ఉంటారు.


  • 76:8

وَيُطْعِمُونَ الطَّعَامَ عَلَىٰ حُبِّهِ مِسْكِينًا وَيَتِيمًا وَأَسِيرًا ٨

మరియు అది తమకు ప్రీతికరమైనప్పటికీ, వారు నిరుపేదలకు మరియు అనాథులకు మరియు ఖైదీలకు, ఆహారంపెట్టే వారై ఉంటారు. 8


  • 76:9

إِنَّمَا نُطْعِمُكُمْ لِوَجْهِ اللَّـهِ لَا نُرِيدُ مِنكُمْ جَزَاءً وَلَا شُكُورًا ٩

వారు (వారితో ఇలా అంటారు): "వాస్తవానికి మేము అల్లాహ్‌ ప్రసన్నతకొరకే మీకుఆహారం పెడు తున్నాము. మేము మీ నుండి ఎలాంటి ప్రతిఫలం గానీ, లేదా కృతజ్ఞతలు గానీ ఆశించటం లేదు.


  • 76:10

إِنَّا نَخَافُ مِن رَّبِّنَا يَوْمًا عَبُوسًا قَمْطَرِيرًا ١٠

"నిశ్చయంగా, మేము మా ప్రభువు నుండి వచ్చే ఉగ్రమైన, దుర్భరమైన, ఆ దినానికి భయపడుతున్నాము!"


  • 76:11

فَوَقَاهُمُ اللَّـهُ شَرَّ ذَٰلِكَ الْيَوْمِ وَلَقَّاهُمْ نَضْرَةً وَسُرُورًا ١١

కావున అల్లాహ్‌ వారిని ఆ దినపు కీడు నుండి కాపాడాడు. మరియు వారికి ఉల్లాసాన్ని మరియు ఆనందాన్ని ప్రసాదించాడు.


  • 76:12

وَجَزَاهُم بِمَا صَبَرُوا جَنَّةً وَحَرِيرًا ١٢

మరియు వారి సహనానికి 9 ప్రతిఫలంగా వారికి స్వర్గాన్ని మరియు పట్టు వస్త్రాలను ఇచ్చాడు. 10


  • 76:13

مُّتَّكِئِينَ فِيهَا عَلَى الْأَرَائِكِ ۖ لَا يَرَوْنَ فِيهَا شَمْسًا وَلَا زَمْهَرِيرًا ١٣

అందులో వారు ఎత్తైన పీఠాల మీద దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు. అందులో వారు ఎండ (బాధ) గానీ, చలి తీవ్రతను గానీ చూడరు!


  • 76:14

وَدَانِيَةً عَلَيْهِمْ ظِلَالُهَا وَذُلِّلَتْ قُطُوفُهَا تَذْلِيلًا ١٤

మరియు అందులో వారిపై నీడలు పడుతుంటాయి. 11 దాని ఫలాల గుత్తులు వారికి అందుబాటులో ఉంటాయి.


  • 76:15

وَيُطَافُ عَلَيْهِم بِآنِيَةٍ مِّن فِضَّةٍ وَأَكْوَابٍ كَانَتْ قَوَارِيرَا ١٥

మరియు వారిమధ్య వెండిపాత్రలు మరియు గాజుగ్లాసులు త్రిప్పబడుతూ ఉంటాయి.


  • 76:16

قَوَارِيرَ مِن فِضَّةٍ قَدَّرُوهَا تَقْدِيرًا ١٦

ఆ గాజు గ్లాసులు స్ఫటికంవలే తెల్లనైన వెండితో చేయబడి ఉంటాయి. అవి నియమబద్ధంగా నింపబడి ఉంటాయి.


  • 76:17

وَيُسْقَوْنَ فِيهَا كَأْسًا كَانَ مِزَاجُهَا زَنجَبِيلًا ١٧

మరియు వారికి సొంటి కలిపిన మధుపాత్రలు త్రాగటానికి ఇవ్వబడతాయి. 12


  • 76:18

عَيْنًا فِيهَا تُسَمَّىٰ سَلْسَبِيلًا ١٨

అది స్వర్గంలోని సల్‌సబీల్‌ అనే పేరుగల ఒక ఊట! (7/8)


  • 76:19

وَيَطُوفُ عَلَيْهِمْ وِلْدَانٌ مُّخَلَّدُونَ إِذَا رَأَيْتَهُمْ حَسِبْتَهُمْ لُؤْلُؤًا مَّنثُورًا ١٩

* మరియు వారి మధ్య శాశ్వతంగా, యవ్వనులుగా ఉండే బాలురు తిరుగుతూ ఉంటారు. మరియు నీవు వారిని చూస్తే, వారిని వెదజల్లిన ముత్యాలుగా భావిస్తావు. 13


  • 76:20

وَإِذَا رَأَيْتَ ثَمَّ رَأَيْتَ نَعِيمًا وَمُلْكًا كَبِيرًا ٢٠

మరియు నీవు అక్కడ (స్వర్గంలో) చూస్తే, ఎక్కడచూసినా ఆనందమే పొందుతావు. మరియు ఒక మహత్తర సామ్రాజ్య వైభవం కనిపిస్తుంది.


  • 76:21

عَالِيَهُمْ ثِيَابُ سُندُسٍ خُضْرٌ وَإِسْتَبْرَقٌ ۖ وَحُلُّوا أَسَاوِرَ مِن فِضَّةٍ وَسَقَاهُمْ رَبُّهُمْ شَرَابًا طَهُورًا ٢١

వారి ఒంటి మీద సన్నని ఆకుపచ్చని శ్రేష్ఠమైన పట్టువస్త్రాలు మరియు బంగారు జలతారు అల్లిన దుస్తులుంటాయి. మరియు వారికి వెండికంకణాలు తొడిగించబడతాయి మరియు వారి ప్రభువు వారికి నిర్మలమైన పానీయాన్ని త్రాగటానికి ప్రసాదిస్తాడు.


  • 76:22

إِنَّ هَـٰذَا كَانَ لَكُمْ جَزَاءً وَكَانَ سَعْيُكُم مَّشْكُورًا ٢٢

(వారితో ఇలా అనబడుతుంది): "నిశ్చయంగా, ఇది మీకు ఇవ్వబడే ప్రతిఫలం. ఎందుకంటే, మీ శ్రమ అంగీకరించబడింది."


  • 76:23

إِنَّا نَحْنُ نَزَّلْنَا عَلَيْكَ الْقُرْآنَ تَنزِيلً ٢٣

నిశ్చయంగా మేమే, ఈ ఖుర్‌ఆన్‌ను నీపై (ఓ ము'హమ్మద్‌!) క్రమక్రమంగా అవతరింపజేశాము.


  • 76:24

فَاصْبِرْ لِحُكْمِ رَبِّكَ وَلَا تُطِعْ مِنْهُمْ آثِمًا أَوْ كَفُورًا ٢٤

కావున నీవు నీ ప్రభువు యొక్క ఆజ్ఞపై స్థిరంగాఉండు మరియు వీరిలోని ఏ పాపి యొక్క లేదా సత్య-తిరస్కారుని యొక్క మాటగానివినకు. 14


  • 76:25

وَاذْكُرِ اسْمَ رَبِّكَ بُكْرَةً وَأَصِيلًا ٢٥

మరియు నీ ప్రభువు నామాన్ని ఉదయం మరియు సాయంత్రం స్మరిస్తూ ఉండు. 15


  • 76:26

وَمِنَ اللَّيْلِ فَاسْجُدْ لَهُ وَسَبِّحْهُ لَيْلًا طَوِيلًا ٢٦

మరియు రాత్రివేళ ఆయన సన్నిధిలో సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉండు 16 మరియు రాత్రివేళ సుదీర్ఘకాలం, ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు.


  • 76:27

إِنَّ هَـٰؤُلَاءِ يُحِبُّونَ الْعَاجِلَةَ وَيَذَرُونَ وَرَاءَهُمْ يَوْمًا ثَقِيلًا ٢٧

నిశ్చయంగా, వీరు అనిశ్చితమైన ఈ ప్రాపంచిక జీవితం పట్ల మోహితులై వున్నారు. మరియు మున్ముందు రానున్న భారమైన దినాన్ని విస్మరిస్తున్నారు. 17


  • 76:28

نَّحْنُ خَلَقْنَاهُمْ وَشَدَدْنَا أَسْرَهُمْ ۖ وَإِذَا شِئْنَا بَدَّلْنَا أَمْثَالَهُمْ تَبْدِيلً ٢٨

మేమే వీరిని సృష్టించిన వారము మరియు వీరి శరీరాన్ని దృఢపరిచిన వారము. మరియు మేము కోరినప్పుడు వీరికి బదులుగా వీరి వంటి వారిని తేగలము.


  • 76:29

إِنَّ هَـٰذِهِ تَذْكِرَةٌ ۖ فَمَن شَاءَ اتَّخَذَ إِلَىٰ رَبِّهِ سَبِيلًا ٢٩

నిశ్చయంగా, ఇదొక హితోపదోశం కావున ఇష్టపడిన వాడు తన ప్రభువు వైపునకు పోయే మార్గాన్ని అవలంబించవచ్చు!


  • 76:30

وَمَا تَشَاءُونَ إِلَّا أَن يَشَاءَ اللَّـهُ ۚ إِنَّ اللَّـهَ كَانَ عَلِيمًا حَكِيمًا ٣٠

మరియు, అల్లాహ్‌ కోరకపోతే, మీరు కోరేదీ (జరగదు)! నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.


  • 76:31

يُدْخِلُ مَن يَشَاءُ فِي رَحْمَتِهِ ۚ وَالظَّالِمِينَ أَعَدَّ لَهُمْ عَذَابًا أَلِيمًا ٣١

ఆయన, తాను కోరిన వారిని తన కారుణ్యంలోకి తీసుకుంటాడు. మరియు దుర్మార్గులకొరకు, ఆయన బాధాకరమైన శిక్షను సిధ్ధపరచి ఉంచాడు.