అల్‌-ఇన్‌ఫి'తార్‌: The Cleaving, చీలిపోవుట, బీటలువారుట, బ్రద్దలగుట, పెళ్ళుమనుట, ప్రేలుట, పగులుట. కొందరు దీనిని మొదటి మక్కహ్ కాలపు, మరి కొందరు చివరి మక్కహ్ కాలపు సూరహ్‌ అని అంటారు. 19ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌లో ఉంది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 82:1

إِذَا السَّمَاءُ انفَطَرَتْ ١

* ఆకాశం చీల్చబడినప్పుడు! 1


  • 82:2

وَإِذَا الْكَوَاكِبُ انتَثَرَتْ ٢

మరియు నక్షత్రాలు చెదిరిపోయినప్పుడు!


  • 82:3

وَإِذَا الْبِحَارُ فُجِّرَتْ ٣

మరియు సముద్రాలు పొంగి పొరలిపోయి నప్పుడు!


  • 82:4

وَإِذَا الْقُبُورُ بُعْثِرَتْ ٤

మరియు సమాధులు పెళ్ళగింప (తెరువ) బడినప్పుడు!


  • 82:5

عَلِمَتْ نَفْسٌ مَّا قَدَّمَتْ وَأَخَّرَتْ ٥

ప్రతి వ్యక్తికి తాను చేసి పంపుకున్నది మరియు వెనుక వదలిపెట్టింది అంతా తెలిసి పోతుంది.


  • 82:6

يَا أَيُّهَا الْإِنسَانُ مَا غَرَّكَ بِرَبِّكَ الْكَرِيمِ ٦

ఓ మానవుడా! పరమదాత అయిన నీ ప్రభువును గురించి, ఏ విషయం నిన్ను ఏమరు పాటుకు గురిచేసింది?


  • 82:7

الَّذِي خَلَقَكَ فَسَوَّاكَ فَعَدَلَكَ ٧

ఆయనే నిన్ను సృష్టించాడు, తరువాత ఎలాంటి లోపం లేకుండా నిన్ను తీర్చిదిద్దాడు మరియు నిన్ను తగిన ప్రమాణంలో రూపొందించాడు.


  • 82:8

فِي أَيِّ صُورَةٍ مَّا شَاءَ رَكَّبَكَ ٨

తాను తలచిన ఆకారంలో నిన్ను మలిచాడు.


  • 82:9

كَلَّا بَلْ تُكَذِّبُونَ بِالدِّينِ ٩

అలా కాదు! వాస్తవానికి మీరు (పరలోక) తీర్పును అబద్ధమని తిరస్కరిస్తున్నారు!


  • 82:10

وَإِنَّ عَلَيْكُمْ لَحَافِظِينَ ١٠

మరియు నిశ్చయంగా! మిమ్మల్ని కనిపెట్టు కొని ఉండేవారు (దేవదూతలు) ఉన్నారు. 2


  • 82:11

كِرَامًا كَاتِبِينَ ١١

వారు, గౌరవనీయులైన లేఖకులు;


  • 82:12

يَعْلَمُونَ مَا تَفْعَلُونَ ١٢

మీరు చేసేదంతా తెలుసుకునేవారు!


  • 82:13

إِنَّ الْأَبْرَارَ لَفِي نَعِيمٍ ١٣

నిశ్చయంగా పుణ్యాత్ములు 3 సుఖ- సంతో షాలలో తేలియాడుతూ ఉంటారు.


  • 82:14

وَإِنَّ الْفُجَّارَ لَفِي جَحِيمٍ ١٤

మరియు నిశ్చయంగా, దుష్టులు భగభగ మండే నరకాగ్నిలో ఉంటారు. 4


  • 82:15

يَصْلَوْنَهَا يَوْمَ الدِّينِ ١٥

తీర్పు దినమున వారు అందులో ప్రవేశిస్తారు.


  • 82:16

وَمَا هُمْ عَنْهَا بِغَائِبِينَ ١٦

మరియు వారు దాని నుండి ఎంత మాత్రం తప్పించుకోలేరు.


  • 82:17

وَمَا أَدْرَاكَ مَا يَوْمُ الدِّينِ ١٧

మరియు ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా తెలుస్తుంది?


  • 82:18

ثُمَّ مَا أَدْرَاكَ مَا يَوْمُ الدِّينِ ١٨

అవును మరి! ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా తెలుస్తుంది?


  • 82:19

يَوْمَ لَا تَمْلِكُ نَفْسٌ لِّنَفْسٍ شَيْئًا ۖ وَالْأَمْرُ يَوْمَئِذٍ لِّلَّـهِ ١٩

ఆ దినమున ఏ మానవునికి కూడా ఇతరునికి ఎలాంటి సహాయం చేసే అధికారం ఉండదు. మరియు ఆ రోజు నిర్ణయాధికారం కేవలం అల్లాహ్‌కే ఉంటుంది. 5