అల్‌-ఇ'ఖ్లా'స్‌: The Purity, దృఢ విశ్వాసం. దీని మరోక పేరు అత్‌-తౌ'హీద్‌ - ఏక దైవత్వం. ఈ సూరహ్‌ ఖుర్‌ఆన్‌ యొక్క సారం అనబడుతుంది. దైవప్రవక్త ('స'అస) దీనిని 1/3 ఖుర్‌ఆన్‌ అన్నారు. ఈ సూరహ్‌ను రాత్రిపూట చదవమని ప్రోత్సహించారు. ('స'హీ'హ్‌ బు'ఖారీ). ముష్రికులు దైవప్రవక్త ('స'అస)ను నీ ప్రభువు లక్షణాలు చెప్పమని ప్రశ్నించినప్పుడు ఈ సూరహ్‌ అవతరింపజేయబడింది (ముస్నద్‌ అ'హ్‌మద్‌ 5/133-134). ఈ సూరహ్‌ మొదటి మక్కహ్ కాలంలో అవతరింపజేయబడింది. కొందరు 'స'హాబీలు ప్రతి రక'అత్‌లో ఇతర సూరహ్‌ల తరువాత ఈ సూరహ్‌ను చదివేవారు. దానికి దైవప్రవక్త ('స'అస) అన్నారు: "ఈ సూరహ్‌ పట్ల మీ ప్రేమ మిమ్మల్ని స్వర్గంలో ప్రవేశింపజేస్తుంది." (బు'ఖారీ, ముస్లిం). 4 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు దీని తాత్పర్యం నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 112:1

قُلْ هُوَ اللَّـهُ أَحَدٌ ١

ఇలా అను: "ఆయనే అల్లాహ్‌! ఏకైకుడు. 1


  • 112:2

اللَّـهُ الصَّمَدُ ٢

"అల్లాహ్‌! ఎవరి అక్కరా లేనివాడు. 2


  • 112:3

لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ ٣

"ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించినవాడునూ) కాడు.


  • 112:4

وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ ٤

"మరియు (సర్వ లోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు." 3