అల్‌-'హష్రు: అంటే సమకూర్చటం, సమావేశపరచటం, ప్రోగుచేయటం, కూడబెట్టటం, సమీకరించటం అని అర్థం. ఈ 10 మదీనహ్ సూరహ్‌లలో ఇది 3వది. 3వ హిజ్రీలో ఉ'హుద్‌ యుద్ధంలో ముస్లింలకు కొంత పరాభవం కలిగినందుకు, బనూ-న'దీర్‌ తెగవారు ముస్లింలతో చేసుకున్న ఒప్పందాన్ని త్రెంపుకొని, మక్కహ్ ముష్రిక్‌ ఖురైషులతో మైత్రి చేసుకొని విశ్వాసఘాతకం చేసినందుకు, వారిని రబీ' అల్‌-అవ్వల్‌ 4వ హిజ్రీలో మదీనహ్‌ మునవ్వరహ్‌ నుండి వెడలగొట్టిన విషయం పేర్కొనబడింది. (2-7). సమాజపు కొన్ని ముఖ్య అంశాలు ఇందులో వివరించబడ్డాయి. బనూ-న'దీర్‌ తెగవారిని గురించి ఈ సూరహ్‌ అవతరింపజేయబడింది. కాబట్టి ఇది సూరహ్‌ అన్‌-న'దీర్‌ అని కూడా అనబడుతుంది. ('స'హీ'హ్‌ బు'ఖారీ). వారిలో చాలా మంది సిరియాకు వెళ్ళిపోయారు. రెండు కుటుంబాల వారు మాత్రమే 'ఖైబర్‌కు పోయారు. విశ్వాసులు, తాము సత్యసంధులై దైవభీతిపరులైతే – సంఖ్యలో, ధనసంపత్తులలో మరియు యద్ధ సామాగ్రిలో తక్కువ ఉన్నా – సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు అయిన అల్లాహ్‌ (సు.త.) వారికి తప్పక సహాయం చేస్తాడని నమ్మాలి. 24 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు 2వ ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 59:1

سَبَّحَ لِلَّـهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۖ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ ١

ఆకాశాలలోనున్న సమస్తమూ మరియు భూమిలో నున్న సమస్తమూ, అల్లాహ్‌ పవిత్రతను కొనియాడుతుంటాయి. మరియు ఆయనే సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు.


  • 59:2

هُوَ الَّذِي أَخْرَجَ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ مِن دِيَارِهِمْ لِأَوَّلِ الْحَشْرِ ۚ مَا ظَنَنتُمْ أَن يَخْرُجُوا ۖ وَظَنُّوا أَنَّهُم مَّانِعَتُهُمْ حُصُونُهُم مِّنَ اللَّـهِ فَأَتَاهُمُ اللَّـهُ مِنْ حَيْثُ لَمْ يَحْتَسِبُوا ۖ وَقَذَفَ فِي قُلُوبِهِمُ الرُّعْبَ ۚ يُخْرِبُونَ بُيُوتَهُم بِأَيْدِيهِمْ وَأَيْدِي الْمُؤْمِنِينَ فَاعْتَبِرُوا يَا أُولِي الْأَبْصَارِ ٢

గ్రంథ ప్రజలలోని సత్య-తిరస్కారులను మొదట సమీకరించిన (బనూ-న'దీర్‌ తెగ) వారిని, వారి గృహాల నుండి వెళ్ళగొట్టిన వాడు ఆయనే. 1 వారు వెళ్ళిపోతారని మీరు ఏ మాత్రం భావించ లేదు. మరియు అల్లాహ్‌ నుండి తమను తమ కోటలు తప్పక రక్షిస్తాయని వారు భావించారు! కాని అల్లాహ్‌ (శిక్ష) వారు ఊహించని వైపు నుండి, వారి పై వచ్చిపడింది. మరియు ఆయన వారి హృదయాలలో భయం కలుగజేశాడు, కావున వారు తమ ఇండ్లను తమ చేతులారా మరియు విశ్వాసుల చేతులతో కూడా, నాశనం చేయించు కున్నారు. కావున ఓ పరిజ్ఞానం (కళ్ళు) గల వారలారా! గుణపాఠం నేర్చుకోండి.


  • 59:3

وَلَوْلَا أَن كَتَبَ اللَّـهُ عَلَيْهِمُ الْجَلَاءَ لَعَذَّبَهُمْ فِي الدُّنْيَا ۖ وَلَهُمْ فِي الْآخِرَةِ عَذَابُ النَّارِ ٣

మరియు ఒకవేళ అల్లాహ్‌ వారి విషయంలో దేశబహిష్కారం వ్రాసి ఉండకపోతే, వారిని ఈ ప్రపంచములోనే శిక్షించి ఉండేవాడు. మరియు వారికి పరలోకంలో నరకాగ్ని శిక్ష పడుతుంది.


  • 59:4

ذَٰلِكَ بِأَنَّهُمْ شَاقُّوا اللَّـهَ وَرَسُولَهُ ۖ وَمَن يُشَاقِّ اللَّـهَ فَإِنَّ اللَّـهَ شَدِيدُ الْعِقَابِ ٤

ఇది ఎందుకంటే, వారు అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తను వ్యతిరేకించారు. మరియు అల్లాహ్‌ను వ్యతిరేకించిన వాడిని శిక్షించటంలో నిశ్చయంగా, అల్లాహ్‌ చాలా కఠినుడు.


  • 59:5

مَا قَطَعْتُم مِّن لِّينَةٍ أَوْ تَرَكْتُمُوهَا قَائِمَةً عَلَىٰ أُصُولِهَا فَبِإِذْنِ اللَّـهِ وَلِيُخْزِيَ الْفَاسِقِينَ ٥

(ఓ విశ్వాసులారా!) మీరు ఏ ఖర్జూరపు చెట్లను నరికివేశారో 2 లేక ఏ ఖర్జూరపుచెట్లను వాటి వ్రేళ్ళమీద నిలబడేలా వదలిపెట్టారో, అంతా అల్లాహ్‌ ఆజ్ఞతోనే జరిగింది. మరియు ఇదంతా అవిధేయులను అవమానించటానికి జరిగిన విషయం.


  • 59:6

وَمَا أَفَاءَ اللَّـهُ عَلَىٰ رَسُولِهِ مِنْهُمْ فَمَا أَوْجَفْتُمْ عَلَيْهِ مِنْ خَيْلٍ وَلَا رِكَابٍ وَلَـٰكِنَّ اللَّـهَ يُسَلِّطُ رُسُلَهُ عَلَىٰ مَن يَشَاءُ ۚ وَاللَّـهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ٦

మరియు అల్లాహ్‌ తన ప్రవక్తకు, వారి నుండి ఇప్పించిన ఫయ్‌'అ కొరకు, మీరు గుర్రాలను గానీ ఒంటెలను గానీ పరిగెత్తించలేదు. 3 కాని అల్లాహ్‌ తాను కోరిన వారిపై, తన సందేశహరునికి ఆధిక్యత నొసంగుతాడు. మరియు అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడు.


  • 59:7

مَّا أَفَاءَ اللَّـهُ عَلَىٰ رَسُولِهِ مِنْ أَهْلِ الْقُرَىٰ فَلِلَّـهِ وَلِلرَّسُولِ وَلِذِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينِ وَابْنِ السَّبِيلِ كَيْ لَا يَكُونَ دُولَةً بَيْنَ الْأَغْنِيَاءِ مِنكُمْ ۚ وَمَا آتَاكُمُ الرَّسُولُ فَخُذُوهُ وَمَا نَهَاكُمْ عَنْهُ فَانتَهُوا ۚ وَاتَّقُوا اللَّـهَ ۖ إِنَّ اللَّـهَ شَدِيدُ الْعِقَابِ ٧

అల్లాహ్‌ తన ప్రవక్తకు ఆ నగరవాసుల నుండి ఇప్పించిన దానిలో (ఫయ్‌అ'లో), అల్లాహ్‌కు మరియు ఆయన ప్రవక్తకు మరియు అతని దగ్గరి బంధువులకు మరియు అనాథులకు మరియు పేదలకు మరియు బాటసారులకు హక్కు ఉంది. 4 అది మీలో ధనవంతులైన వారి మధ్యనే తిరగ కుండా ఉండటానికి, ఇలా నిర్ణయించబడింది. మరియు ప్రవక్త మీకు ఇచ్చిన దానిని తీసుకోండి మరియు అతను మీకు నిషేధించిన దానికి దూరంగా ఉండండి. అల్లాహ్‌ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్‌ శిక్షించటంలో చాలా కఠినుడు.


  • 59:8

لِلْفُقَرَاءِ الْمُهَاجِرِينَ الَّذِينَ أُخْرِجُوا مِن دِيَارِهِمْ وَأَمْوَالِهِمْ يَبْتَغُونَ فَضْلًا مِّنَ اللَّـهِ وَرِضْوَانًا وَيَنصُرُونَ اللَّـهَ وَرَسُولَهُ ۚ أُولَـٰئِكَ هُمُ الصَّادِقُونَ ٨

(దానిలో నుండి కొంత భాగంపై) తమ ఇండ్ల నుండి మరియు తమ ఆస్తిపాస్తుల నుండి వెడల గొట్టబడి, వలస వచ్చిన (ముహాజిర్‌లకు) పేద వారికి కూడా హక్కు ఉంది. వారు అల్లాహ్‌ అనుగ్రహాన్ని మరియు ఆయన ప్రసన్నతను కోరుతున్నారు. మరియు వారు అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తకు సహాయం చేస్తున్నారు. ఇలాంటి వారు, వీరే సత్యవంతులు. 5


  • 59:9

وَالَّذِينَ تَبَوَّءُوا الدَّارَ وَالْإِيمَانَ مِن قَبْلِهِمْ يُحِبُّونَ مَنْ هَاجَرَ إِلَيْهِمْ وَلَا يَجِدُونَ فِي صُدُورِهِمْ حَاجَةً مِّمَّا أُوتُوا وَيُؤْثِرُونَ عَلَىٰ أَنفُسِهِمْ وَلَوْ كَانَ بِهِمْ خَصَاصَةٌ ۚ وَمَن يُوقَ شُحَّ نَفْسِهِ فَأُولَـٰئِكَ هُمُ الْمُفْلِحُونَ ٩

మరియు ఎవరైతే – ఈ (వలస వచ్చిన వారు) రాక పూర్వమే – విశ్వసించి వలస కేంద్రం (మదీనహ్)లో నివసిస్తూ ఉండేవారో! వారికి కూడా హక్కువుంది. 6 వారు తమ వద్దకు వలస వచ్చిన వారిని ప్రేమిస్తారు. మరియు వారు (వలస వచ్చిన) వారికి ఏది ఇవ్వబడినా! దాని అవసరం తమకు ఉన్నట్లు భావించరు. మరియు తమకు అవసరమున్నా, వారికి తమ సొంత (అవసరాల) మీద ప్రాధాన్యతనిస్తారు. మరియు ఎవరైతే ఆత్మలోభం నుండి రక్షింపబడతారో! అలాంటి వారు, వారే! సాఫల్యం పొందేవారు. 7


  • 59:10

وَالَّذِينَ جَاءُوا مِن بَعْدِهِمْ يَقُولُونَ رَبَّنَا اغْفِرْ لَنَا وَلِإِخْوَانِنَا الَّذِينَ سَبَقُونَا بِالْإِيمَانِ وَلَا تَجْعَلْ فِي قُلُوبِنَا غِلًّا لِّلَّذِينَ آمَنُوا رَبَّنَا إِنَّكَ رَءُوفٌ رَّحِيمٌ ١٠

మరియు ఎవరైతే వారి తరువాత వచ్చారో! వారికి అందులో హక్కు ఉంది. వారు ఇలా అంటారు: "ఓ మా ప్రభూ! మమ్మల్ని మరియు మా కంటే ముందు విశ్వసించిన మా సోదరులను క్షమించు. మరియు మా హృదయాలలో విశ్వాసులపట్ల ద్వేషాన్ని కలిగించకు. 8 ఓ మా ప్రభూ! నిశ్చయంగా, నీవు చాలా కనికరించేవాడవు, అపార కరుణా ప్రదాతవు!" (1/4)


  • 59:11

أَلَمْ تَرَ إِلَى الَّذِينَ نَافَقُوا يَقُولُونَ لِإِخْوَانِهِمُ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ لَئِنْ أُخْرِجْتُمْ لَنَخْرُجَنَّ مَعَكُمْ وَلَا نُطِيعُ فِيكُمْ أَحَدًا أَبَدًا وَإِن قُوتِلْتُمْ لَنَنصُرَنَّكُمْ وَاللَّـهُ يَشْهَدُ إِنَّهُمْ لَكَاذِبُونَ ١١

* (ఓ ము'హమ్మద్‌!) కపట-విశ్వాసులను గురించి నీకు తెలియదా? 9 వారు గ్రంథప్రజలలో సత్య-తిరస్కారులైన తమ సోదరులతో, ఇలా అంటారు: "ఒకవేళ మీరు వెళ్ళగొట్టబడి నట్లయితే, మేము కూడా తప్పక మీతో బాటు వెళ్తాము. మరియు మీ విషయంలో మేము ఎవ్వరి మాటా వినము. ఒకవేళ మీతో యుద్ధం జరిగితే, మేము తప్పక మీకు సహాయపడతాము." మరియు నిశ్చయంగా, వారు అసత్యవాదులు, అల్లాహ్‌యే దీనికి సాక్షి!


  • 59:12

لَئِنْ أُخْرِجُوا لَا يَخْرُجُونَ مَعَهُمْ وَلَئِن قُوتِلُوا لَا يَنصُرُونَهُمْ وَلَئِن نَّصَرُوهُمْ لَيُوَلُّنَّ الْأَدْبَارَ ثُمَّ لَا يُنصَرُونَ ١٢

కాని (వాస్తవానికి) వారు (యూదులు) వెడలగొట్ట బడితే, వీరు (ఈ కపట-విశ్వాసులు) వారివెంట ఎంత మాత్రం వెళ్ళరు మరియు వారితో యుధ్ధం జరిగితే, (ఈ కపట-విశ్వాసులు) వారికి ఏమాత్రం సహాయపడరు. 10 ఒకవేళ వీరు, వారికి (యూదులకు) సహాయపడినా, వారు తప్పక వెన్నుచూపి పారిపోతారు. ఆ తరువాత వారు విజయం (సహాయం) పొందలేరు.


  • 59:13

لَأَنتُمْ أَشَدُّ رَهْبَةً فِي صُدُورِهِم مِّنَ اللَّـهِ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ قَوْمٌ لَّا يَفْقَهُونَ ١٣

వారి హృదయాలలో, అల్లాహ్‌ భయం కంటే, మీ భయమే ఎక్కువ ఉంది. ఇది ఎందుకంటే! వాస్తవానికి వారు అర్థంచేసుకోలేని జనులు.


  • 59:14

لَا يُقَاتِلُونَكُمْ جَمِيعًا إِلَّا فِي قُرًى مُّحَصَّنَةٍ أَوْ مِن وَرَاءِ جُدُرٍ ۚ بَأْسُهُم بَيْنَهُمْ شَدِيدٌ ۚ تَحْسَبُهُمْ جَمِيعًا وَقُلُوبُهُمْ شَتَّىٰ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ قَوْمٌ لَّا يَعْقِلُونَ ١٤

వారందరూ కలసికూడా, దృఢమైన కోటలు గల నగరాలలోనో, లేదా గోడలచాటు నుండో తప్ప, మీతో యుద్ధం చేయజాలరు. వారి మధ్య ఒకరిమీద ఒకరికి ఉన్న ద్వేషం, ఎంతో తీవ్రమైనది. వారు కలసి ఉన్నట్లు నీవు భావిస్తావు, కాని వారి హృదయాలు చీలిపోయి ఉన్నాయి. ఇది ఎందు కంటే, వాస్తవానికి వారు బుద్ధిహీనులైన జనులు.


  • 59:15

كَمَثَلِ الَّذِينَ مِن قَبْلِهِمْ قَرِيبًا ۖ ذَاقُوا وَبَالَ أَمْرِهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ ١٥

వీరి దృష్టాంతం సమీపంలోనే గడిచిన వారిని (బనూ-ఖైనుఖాఅ'లను) పోలి ఉంది. వారు తమ కార్యాల ఫలితాన్ని చూశారు, మరియు (పరలోకంలో) వారికి బాధాకరమైన శిక్ష ఉంది. 11


  • 59:16

كَمَثَلِ الشَّيْطَانِ إِذْ قَالَ لِلْإِنسَانِ اكْفُرْ فَلَمَّا كَفَرَ قَالَ إِنِّي بَرِيءٌ مِّنكَ إِنِّي أَخَافُ اللَّـهَ رَبَّ الْعَالَمِينَ ١٦

వారి దృష్టాంతం మానవుణ్ణి ప్రేరేపిస్తూ, ఇలా అనే ఆ షై'తాన్‌ వలే ఉంది అతడు: "సత్యాన్ని తిరస్కరించు." అని అంటాడు. అతడు తిరస్కరించిన తరువాత ఇలా అంటాడు: "నిశ్చయంగా, నాకు నీతో ఏ విధమైన సంబంధం లేదు, నిశ్చయంగా, నేను సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కు భయపడేవాడిని!" 12


  • 59:17

فَكَانَ عَاقِبَتَهُمَا أَنَّهُمَا فِي النَّارِ خَالِدَيْنِ فِيهَا ۚ وَذَٰلِكَ جَزَاءُ الظَّالِمِينَ ١٧

తరువాత ఆ ఇద్దరి పర్యవసానం, నిశ్చయంగా, ఆ ఇరువురూ నరకాగ్నిలో ఉండటమే! అందు వారు శాశ్వతంగా ఉంటారు. మరియు దుర్మార్గులకు లభించే ప్రతిఫలం ఇదే!


  • 59:18

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّـهَ وَلْتَنظُرْ نَفْسٌ مَّا قَدَّمَتْ لِغَدٍ ۖ وَاتَّقُوا اللَّـهَ ۚ إِنَّ اللَّـهَ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ ١٨

ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ పట్ల భయ-భక్తులు కలిగి ఉండండి. మరియు ప్రతి వ్యక్తి, తాను రేపటి కొరకు ఏమి సమకూర్చు కున్నాడో చూసుకోవాలి. మరియు అల్లాహ్‌ పట్ల భయ-భక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, మీరు చేసేదంతా అల్లాహ్‌ ఎరుగును!


  • 59:19

وَلَا تَكُونُوا كَالَّذِينَ نَسُوا اللَّـهَ فَأَنسَاهُمْ أَنفُسَهُمْ ۚ أُولَـٰئِكَ هُمُ الْفَاسِقُونَ ١٩

మరియు అల్లాహ్‌ను మరచిపోయిన వారి మాదిరిగా మీరూ అయిపోకండి. అందువలన ఆయన వారిని, తమను తాము మరచి పోయేటట్లు చేశాడు. అలాంటి వారు! వారే అవిధేయులు (ఫాసిఖూన్‌).


  • 59:20

لَا يَسْتَوِي أَصْحَابُ النَّارِ وَأَصْحَابُ الْجَنَّةِ ۚ أَصْحَابُ الْجَنَّةِ هُمُ الْفَائِزُونَ ٢٠

నరకవాసులు మరియు స్వర్గవాసులు సరి- సమానులు కాజాలరు. స్వర్గవాసులు, వారే! విజయం పొందినవారు.


  • 59:21

لَوْ أَنزَلْنَا هَـٰذَا الْقُرْآنَ عَلَىٰ جَبَلٍ لَّرَأَيْتَهُ خَاشِعًا مُّتَصَدِّعًا مِّنْ خَشْيَةِ اللَّـهِ ۚ وَتِلْكَ الْأَمْثَالُ نَضْرِبُهَا لِلنَّاسِ لَعَلَّهُمْ يَتَفَكَّرُونَ ٢١

ఒకవేళ మేము ఈ ఖుర్‌ఆన్‌ను ఏ పర్వతంపైనైనా అవతరింపజేసి ఉంటే, అల్లాహ్‌ భయంవల్ల అది అణిగి బ్రద్దలై పోవటాన్ని నీవు చూసి ఉంటావు. మరియు బహుశా ప్రజలు ఆలోచిస్తారని, ఇలాంటి దృష్టాంతాలను మేము వారిముందు పెడుతున్నాము.


  • 59:22

هُوَ اللَّـهُ الَّذِي لَا إِلَـٰهَ إِلَّا هُوَ ۖ عَالِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ ۖ هُوَ الرَّحْمَـٰنُ الرَّحِيمُ ٢٢

ఆయనే, అల్లాహ్‌! ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయనకు అగోచర మరియు గోచర విషయాలన్నీ తెలుసు. 13 ఆయన అనంత కరుణామయుడు, అపార కరుణాప్రదాత.


  • 59:23

هُوَ اللَّـهُ الَّذِي لَا إِلَـٰهَ إِلَّا هُوَ الْمَلِكُ الْقُدُّوسُ السَّلَامُ الْمُؤْمِنُ الْمُهَيْمِنُ الْعَزِيزُ الْجَبَّارُ الْمُتَكَبِّرُ ۚ سُبْحَانَ اللَّـهِ عَمَّا يُشْرِكُونَ ٢٣

ఆయనే, అల్లాహ్‌! ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయన విశ్వ సార్వభౌముడు, పరమ పవిత్రుడు, శాంతికి మూలాధారుడు, శాంతి ప్రదాత, శరణమిచ్చేవాడు, సర్వ శక్తిమంతుడు, నిరంకుశుడు, గొప్పవాడు. వారు కల్పించే భాగస్వాములకు అల్లాహ్‌ అతీతుడు. 14


  • 59:24

هُوَ اللَّـهُ الْخَالِقُ الْبَارِئُ الْمُصَوِّرُ ۖ لَهُ الْأَسْمَاءُ الْحُسْنَىٰ ۚ يُسَبِّحُ لَهُ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ ٢٤

ఆయనే, అల్లాహ్‌! విశ్వ సృష్టికర్త, ప్రతి దానిని సృజించేవాడు మరియు రూపాలను తీర్చిదిద్దేవాడు. ఆయనకు సర్వశ్రేష్ఠమైన పేర్లున్నాయి. 15 ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న సమస్తమూ, ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి. మరియు ఆయనే సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు.