అల్‌-'హాఖ్ఖహ్: The Reality,The Inevitable, అనివార్య సంఘటన, పరమ యథార్థం, నిజం, సత్యం. (ఇది పునరుత్థానదినానికి గల మరొక పేరు). ఈ సూరహ్‌ మక్కహ్ లో, సూరహ్‌ అల్‌-ముల్క్‌ (67), తరువాత అవతరింపజేయబడింది. దాదాపు హిజ్రత్‌కు 3-4 సంవత్స రాలకు ముందు. ఇంకా చూడండి, 37:19, 39:68 చివరిభాగం మరియు 50:20-21. 52 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

 • 69:1

الْحَاقَّةُ ١

* ఆ అనివార్య సంఘటన (పునరుత్థానం)!


 • 69:2

مَا الْحَاقَّةُ ٢

ఏమిటా అనివార్యసంఘటన?


 • 69:3

وَمَا أَدْرَاكَ مَا الْحَاقَّةُ ٣

మరియు ఆ అనివార్య సంఘటన, అంటే ఏమిటో నీకేమి తెలుసు?


 • 69:4

كَذَّبَتْ ثَمُودُ وَعَادٌ بِالْقَارِعَةِ ٤

స'మూద్‌ మరియు 'ఆద్‌ జాతి వారు అకస్మాత్తుగా విరుచుకుపడే ఆ ఉపద్రవాన్ని అసత్యమని తిరస్కరించారు. 1


 • 69:5

فَأَمَّا ثَمُودُ فَأُهْلِكُوا بِالطَّاغِيَةِ ٥

కావున స'మూద్‌ జాతివారైతే ఒక భయం కరమైన గర్జన ద్వారా నాశనం చేయబడ్డారు.


 • 69:6

وَأَمَّا عَادٌ فَأُهْلِكُوا بِرِيحٍ صَرْصَرٍ عَاتِيَةٍ ٦

మరియు ఆద్‌ జాతి వారేమో అతి తీవ్రమైన తుఫాను గాలి ద్వారా నాశనం చేయబడ్డారు.


 • 69:7

سَخَّرَهَا عَلَيْهِمْ سَبْعَ لَيَالٍ وَثَمَانِيَةَ أَيَّامٍ حُسُومًا فَتَرَى الْقَوْمَ فِيهَا صَرْعَىٰ كَأَنَّهُمْ أَعْجَازُ نَخْلٍ خَاوِيَةٍ ٧

ఆయన (అల్లాహ్‌), దానిని వారి మీద ఏడు రాత్రులు మరియు ఎనిమిది పగళ్ళ వరకు ఎడతెగకుండా ఆవరింపజేశాడు. 2 దాని వలన వారు వేళ్ళతో పెళ్ళగించబడిన ఖర్జూరపు బోదెల వలే పాడైపోవటం, నీవు చూస్తావు!


 • 69:8

فَهَلْ تَرَىٰ لَهُم مِّن بَاقِيَةٍ ٨

అయితే ఇప్పుడు వారిలో ఎవరైనా మిగిలి ఉన్నట్లు నీవు చూస్తున్నావా?


 • 69:9

وَجَاءَ فِرْعَوْنُ وَمَن قَبْلَهُ وَالْمُؤْتَفِكَاتُ بِالْخَاطِئَةِ ٩

ఫిర్‌'ఔన్‌ మరియు అతనికి పూర్వం గతించిన వారూ మరియు తలక్రిందులు చేయబడిన నగరాలవారూ, 3 అందరూ గొప్ప నేరాలకు పాల్పడిన వారే.


 • 69:10

فَعَصَوْا رَسُولَ رَبِّهِمْ فَأَخَذَهُمْ أَخْذَةً رَّابِيَةً ١٠

మరియు వారు తమ ప్రభువు పంపిన ప్రవక్తలకు అవిధేయత కనబరచారు కావున ఆయన వారిని కఠినమైనపట్టుతో పట్టుకున్నాడు.


 • 69:11

إِنَّا لَمَّا طَغَى الْمَاءُ حَمَلْنَاكُمْ فِي الْجَارِيَةِ ١١

నిశ్చయంగా, ఎప్పుడైతే (నూహ్‌ తుఫాన్‌) నీరు హద్దులేకుండా ఉప్పొంగి పోయిందో! అప్పుడు మేము మిమ్మల్ని 4 పయనించే (నావలో) ఎక్కించాము.


 • 69:12

لِنَجْعَلَهَا لَكُمْ تَذْكِرَةً وَتَعِيَهَا أُذُنٌ وَاعِيَةٌ ١٢

దానిని, మీకొక హితబోధగానూ మరియు జ్ఞాపకముంచుకోగల చెవి, దానిని జ్ఞాపకం ఉంచుకోవ టానికి అనువైనదిగా చేశాము.


 • 69:13

فَإِذَا نُفِخَ فِي الصُّورِ نَفْخَةٌ وَاحِدَةٌ ١٣

ఇక ఎప్పుడైతే ఒక పెద్ద ధ్వనితో బాకా ఊదబడుతుందో! 5


 • 69:14

وَحُمِلَتِ الْأَرْضُ وَالْجِبَالُ فَدُكَّتَا دَكَّةً وَاحِدَةً ١٤

మరియు భూమి మరియు పర్వతాలు పైకి ఎత్తబడి ఒక పెద్దదెబ్బతో తుత్తునియలుగా చేయబడతాయో!


 • 69:15

فَيَوْمَئِذٍ وَقَعَتِ الْوَاقِعَةُ ١٥

అప్పుడు, ఆ రోజున సంభవించవలసిన, ఆ అనివార్య సంఘటన సంభవిస్తుంది.


 • 69:16

وَانشَقَّتِ السَّمَاءُ فَهِيَ يَوْمَئِذٍ وَاهِيَةٌ ١٦

మరియు ఆ రోజున ఆకాశం బ్రద్దలైపోతుంది మరియు దాని వ్యవస్థ సడలిపోతుంది. 6


 • 69:17

وَالْمَلَكُ عَلَىٰ أَرْجَائِهَا ۚ وَيَحْمِلُ عَرْشَ رَبِّكَ فَوْقَهُمْ يَوْمَئِذٍ ثَمَانِيَةٌ ١٧

మరియు దేవదూతలు దాని ('అర్ష్‌) ప్రక్కలలో ఉంటారు. మరియు నీ ప్రభువు యొక్క సింహాసనాన్ని ('అర్ష్‌ను), ఆ రోజు ఎనిమిది మంది (దేవదూతలు) ఎత్తుకొని ఉంటారు.


 • 69:18

يَوْمَئِذٍ تُعْرَضُونَ لَا تَخْفَىٰ مِنكُمْ خَافِيَةٌ ١٨

ఆ రోజు మీరు (తీర్పుకొరకు) హాజరు చేయబడతారు. మీరు దాచిన ఏ రహస్యం కూడా (ఆ రోజు) దాగి ఉండదు. 7


 • 69:19

فَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِيَمِينِهِ فَيَقُولُ هَاؤُمُ اقْرَءُوا كِتَابِيَهْ ١٩

ఇక ఎవనికైతే తన కర్మ పత్రము కుడి చేతిలో ఇవ్వబడుతుందో, అతడు ఇలా అంటాడు: "ఇదిగో నా కర్మపత్రాన్ని తీసుకొని చదవండి!


 • 69:20

إِنِّي ظَنَنتُ أَنِّي مُلَاقٍ حِسَابِيَهْ ٢٠

"నిశ్చయంగా, నా లెక్క నాకు తప్పకుండా లభిస్తుందని నేను భావించే వాడిని!"


 • 69:21

فَهُوَ فِي عِيشَةٍ رَّاضِيَةٍ ٢١

కావున, అతడు సంతోషకరమైన జీవితం గడుపుతాడు.


 • 69:22

فِي جَنَّةٍ عَالِيَةٍ ٢٢

అత్యున్నతమైన స్వర్గవనంలో; 8


 • 69:23

قُطُوفُهَا دَانِيَةٌ ٢٣

దాని పండ్ల గుత్తులు, సమీపంలో వ్రేలాడుతూ ఉంటాయి.


 • 69:24

كُلُوا وَاشْرَبُوا هَنِيئًا بِمَا أَسْلَفْتُمْ فِي الْأَيَّامِ الْخَالِيَةِ ٢٤

(వారితో ఇలా అనబడుతుంది): "గడిచి పోయిన దినాలలో మీరు చేసి పంపిన కర్మలకు ప్రతిఫలంగా, ఇప్పుడు మీరు హాయిగా తినండి మరియు త్రాగండి!"


 • 69:25

وَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِشِمَالِهِ فَيَقُولُ يَا لَيْتَنِي لَمْ أُوتَ كِتَابِيَهْ ٢٥

ఇక ఎవడికైతే, తన కర్మపత్రం ఎడమ చేతికి ఇవ్వబడుతుందో, అతడు ఇలా వాపోతాడు: "అయ్యో నా పాడుగాను! నా కర్మపత్రం అసలు నాకు ఇవ్వబడకుండా ఉంటే ఎంత బాగుండేది!


 • 69:26

وَلَمْ أَدْرِ مَا حِسَابِيَهْ ٢٦

"మరియు నా లెక్క ఏమిటో నాకు తెలియకుంటే ఎంత బాగుండేది!


 • 69:27

يَا لَيْتَهَا كَانَتِ الْقَاضِيَةَ ٢٧

"అయ్యో, నా పాడుగాను! అది (ఆ మరణమే) నాకు అంతిమ మరణమై ఉంటే ఎంత బాగుండేది!


 • 69:28

مَا أَغْنَىٰ عَنِّي مَالِيَهْ ۜ ٢٨

"నా సంపద నాకేమీ పనికిరాలేదు;


 • 69:29

هَلَكَ عَنِّي سُلْطَانِيَهْ ٢٩

"నా అధికారమంతా అంతమైపోయింది!"


 • 69:30

خُذُوهُ فَغُلُّوهُ ٣٠

(అప్పుడు ఇలా ఆజ్ఞ ఇవ్వబడుతుంది): "అతన్ని పట్టుకోండి మరియు అతని మెడలో సంకెళ్ళు వేయండి; 9


 • 69:31

ثُمَّ الْجَحِيمَ صَلُّوهُ ٣١

"తరువాత అతనిని భగభగ మండే నరకాగ్నిలో వేయండి.


 • 69:32

ثُمَّ فِي سِلْسِلَةٍ ذَرْعُهَا سَبْعُونَ ذِرَاعًا فَاسْلُكُوهُ ٣٢

"ఆ తరువాత అతనిని డెభ్భై మూరల పొడువుగల గొలుసుతో బంధించండి!" 10


 • 69:33

إِنَّهُ كَانَ لَا يُؤْمِنُ بِاللَّـهِ الْعَظِيمِ ٣٣

వాస్తవానికి అతడు సర్వోత్తముడైన అల్లాహ్‌ను విశ్వసించేవాడు కాదు.


 • 69:34

وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ ٣٤

మరియు నిరుపేదలకు ఆహారం పెట్టమని ప్రోత్సహించేవాడు కాదు.


 • 69:35

فَلَيْسَ لَهُ الْيَوْمَ هَاهُنَا حَمِيمٌ ٣٥

కావున, ఈనాడు అతనికి ఇక్కడ ఏ స్నేహితుడూ లేడు;


 • 69:36

وَلَا طَعَامٌ إِلَّا مِنْ غِسْلِينٍ ٣٦

మరియు అసహ్యకరమైన గాయాల కడుగు తప్ప, మరొక ఆహారమూ లేదు!


 • 69:37

لَّا يَأْكُلُهُ إِلَّا الْخَاطِئُونَ ٣٧

దానిని పాపులు తప్ప మరెవ్వరూ తినరు!


 • 69:38

فَلَا أُقْسِمُ بِمَا تُبْصِرُونَ ٣٨

కావున, నేను మీరు చూడగలిగే వాటి శపథం చేస్తున్నాను;


 • 69:39

وَمَا لَا تُبْصِرُونَ ٣٩

మరియు మీరు చూడలేనట్టి వాటి (శపథం) కూడా!


 • 69:40

إِنَّهُ لَقَوْلُ رَسُولٍ كَرِيمٍ ٤٠

నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్‌ఆన్‌) గౌరవనీయుడైన సందేశహరునిపై (అవతరింప జేయబడిన) వాక్కు.


 • 69:41

وَمَا هُوَ بِقَوْلِ شَاعِرٍ ۚ قَلِيلًا مَّا تُؤْمِنُونَ ٤١

మరియు ఇది ఒక కవియొక్క వాక్కు కాదు. మీరు విశ్వసించేది చాలా తక్కువ.


 • 69:42

وَلَا بِقَوْلِ كَاهِنٍ ۚ قَلِيلًا مَّا تَذَكَّرُونَ ٤٢

మరియు ఇది ఏ జ్యోతిష్యుని వాక్కు కూడా కాదు! మీరు గ్రహించేది చాలా తక్కువ.


 • 69:43

تَنزِيلٌ مِّن رَّبِّ الْعَالَمِينَ ٤٣

ఇది సర్వలోకాల ప్రభువు తరఫు నుండి అవతరించింది.


 • 69:44

وَلَوْ تَقَوَّلَ عَلَيْنَا بَعْضَ الْأَقَاوِيلِ ٤٤

ఒకవేళ ఇతను (ఈ ప్రవక్త), మా (అల్లాహ్‌ను) గురించి ఏదైనా అబద్ధపు మాట కల్పించి ఉంటే!


 • 69:45

لَأَخَذْنَا مِنْهُ بِالْيَمِينِ ٤٥

మేము అతని కుడిచేతిని పట్టుకునేవారం.


 • 69:46

ثُمَّ لَقَطَعْنَا مِنْهُ الْوَتِينَ ٤٦

తరువాత అతని (మెడ) రక్తనాళాన్ని కోసేవారం.


 • 69:47

فَمَا مِنكُم مِّنْ أَحَدٍ عَنْهُ حَاجِزِينَ ٤٧

అప్పుడు మీలో నుండి ఏ ఒక్కడు కూడా అతనిని (మా శిక్ష నుండి) కాపాడలేక పోయేవాడు.


 • 69:48

وَإِنَّهُ لَتَذْكِرَةٌ لِّلْمُتَّقِينَ ٤٨

మరియు నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్‌ఆన్‌) దైవభీతి గలవారికొక హితోపదేశం.


 • 69:49

وَإِنَّا لَنَعْلَمُ أَنَّ مِنكُم مُّكَذِّبِينَ ٤٩

మరియు నిశ్చయంగా మీలో కొందరు దీనిని (ఈ ఖుర్‌ఆన్‌ను) అసత్యమని అనేవారు ఉన్నారని మాకు బాగా తెలుసు.


 • 69:50

وَإِنَّهُ لَحَسْرَةٌ عَلَى الْكَافِرِينَ ٥٠

మరియు నిశ్చయంగా ఇది (ఈ తిరస్కారం) సత్య-తిరస్కారులకు దుఃఖకారణ మవుతుంది.


 • 69:51

وَإِنَّهُ لَحَقُّ الْيَقِينِ ٥١

మరియు నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్‌ఆన్‌) నమ్మదగిన సత్యం.


 • 69:52

فَسَبِّحْ بِاسْمِ رَبِّكَ الْعَظِيمِ ٥٢

కావున నీవు సర్వత్తముడైన నీ ప్రభువు పవిత్ర నామాన్ని స్తుతించు.