ఈ సూరాహ్‌ 8వ హిజ్రీ ప్రాంతంలో మదీనహ్ లో అవతరింపజేయబడింది. అల్‌-'హదీదు: ఇనుము. దీని పేరు 25వ ఆయత్‌ నుండి తీసుకోబడింది. ఇందులో 29 ఆయతులు ఉన్నాయి. ఇంతవరకు దాదాపు 9/10 వంతులు ఖుర్‌ఆన్‌ పూర్తి అయ్యింది. మిగిలిన 1/10 భాగాన్ని 2 భాగాలలో విభజించవచ్చు. మొదటి భాగంలో 10 సూరాహ్‌లు ఉన్నాయి, 57-66 వరకు. ఇవన్నీ మదీనహ్ లో అవతరింపజేయబడ్డాయి. ప్రతి ఒక్కటి సాంఘిక జీవితపు ఒక విషయాన్ని వివరిస్తోంది. రెండవ భాగంలో 48 సూరాహ్‌లు, 67-114 వరకు ఉన్నాయి. ఇవి చిన్న చిన్న మక్కహ్ సూరాహ్‌లు, కొన్ని తప్ప. ప్రతి ఒక్కటి ధర్మవిషయాలను బోధిస్తోంది. ఈ సూరహ్‌ వినయవిధేయతలను బోధిస్తోంది, అహంకారాన్ని ఖండిస్తోంది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 57:1

سَبَّحَ لِلَّـهِ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ ١

ఆకాశాలలోను మరియు భూమిలోనూ ఉన్న సమస్తం అల్లాహ్‌ పవిత్రతను కొనియాడు తుంటాయి. 1 మరియు ఆయనే సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు.


  • 57:2

لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ يُحْيِي وَيُمِيتُ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ٢

ఆకాశాలపై మరియు భూమిపై సామ్రాజ్యాధి పత్యం ఆయనదే. ఆయనే జీవనమిచ్చేవాడు మరియు మరణమిచ్చేవాడు. మరియు ఆయనే ప్రతిదీ చేయగల సమర్థుడు.


  • 57:3

هُوَ الْأَوَّلُ وَالْآخِرُ وَالظَّاهِرُ وَالْبَاطِنُ ۖ وَهُوَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ ٣

ఆయనే ప్రథమం మరియు ఆయనే అంతం 2 మరియు ఆయనే ప్రత్యక్షుడు మరియు ఆయనే పరోక్షుడు. 3 మరియు ఆయనే ప్రతిదాని గురించి జ్ఞానం గలవాడు.


  • 57:4

هُوَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ ۚ يَعْلَمُ مَا يَلِجُ فِي الْأَرْضِ وَمَا يَخْرُجُ مِنْهَا وَمَا يَنزِلُ مِنَ السَّمَاءِ وَمَا يَعْرُجُ فِيهَا ۖ وَهُوَ مَعَكُمْ أَيْنَ مَا كُنتُمْ ۚ وَاللَّـهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ ٤

ఆయనే ఆకాశాలను మరియు భూమిని ఆరు దినములలో (అయ్యామ్‌లలో) సృష్టించిన వాడు, తరువాత ఆయన సింహాసనాన్ని('అర్ష్‌ను) అధిష్టించాడు. 6 భూమిలోకి పోయేది మరియు దాని నుండి బయటికి వచ్చేది మరియు ఆకాశం నుండి దిగేది మరియు దానిలోకి ఎక్కేది అంతా ఆయనకు తెలుసు. 5 మరియు మీరెక్కడున్నా ఆయన మీతోపాటు ఉంటాడు. మరియు అల్లాహ్‌ మీరు చేసేదంతా చూస్తున్నాడు.


  • 57:5

لَّهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَإِلَى اللَّـهِ تُرْجَعُ الْأُمُورُ ٥

ఆకాశాలపై మరియు భూమిపై సామ్రాజ్యాధి పత్యం ఆయనదే మరియు అన్ని వ్యవహారాలు (నిర్ణయానికై) అల్లాహ్‌ వైపునకే తీసుకు పోబడతాయి.


  • 57:6

يُولِجُ اللَّيْلَ فِي النَّهَارِ وَيُولِجُ النَّهَارَ فِي اللَّيْلِ ۚ وَهُوَ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ ٦

ఆయనే రాత్రిని పగటిలోకి ప్రవేశింపజేస్తాడు మరియు పగటిని రాత్రిలోకి ప్రవేశింపజేస్తాడు. 6 మరియు ఆయనకు హృదయాలలో ఉన్న విషయాలన్నీ బాగా తెలుసు.


  • 57:7

آمِنُوا بِاللَّـهِ وَرَسُولِهِ وَأَنفِقُوا مِمَّا جَعَلَكُم مُّسْتَخْلَفِينَ فِيهِ ۖ فَالَّذِينَ آمَنُوا مِنكُمْ وَأَنفَقُوا لَهُمْ أَجْرٌ كَبِيرٌ ٧

అల్లాహ్‌ను మరియు ఆయన ప్రవక్తను విశ్వ సించండి, ఆయన మిమ్మల్ని ఉత్తరాధికారులుగా చేసినవాటినుండి(దానంగా)ఖర్చుపెట్టండి. 7 మీలో ఎవరైతే విశ్వసించి తమ ధనాన్ని (దానముగా) ఖర్చుచేస్తారో, వారికి గొప్ప ప్రతిఫలం ఉంటుంది.


  • 57:8

وَمَا لَكُمْ لَا تُؤْمِنُونَ بِاللَّـهِ ۙ وَالرَّسُولُ يَدْعُوكُمْ لِتُؤْمِنُوا بِرَبِّكُمْ وَقَدْ أَخَذَ مِيثَاقَكُمْ إِن كُنتُم مُّؤْمِنِينَ ٨

మరియు మీకేమయింది? మీరు (వాస్త వానికి) విశ్వాసులే అయితే? మీరెందుకు అల్లాహ్‌ను విశ్వసించరు? మరియు ప్రవక్త, మిమ్మల్ని మీ ప్రభువును విశ్వసించండని పిలుస్తున్నాడు మరియు వాస్తవానికి మీచేత ప్రమాణం కూడా చేయించుకున్నాడు. 8


  • 57:9

هُوَ الَّذِي يُنَزِّلُ عَلَىٰ عَبْدِهِ آيَاتٍ بَيِّنَاتٍ لِّيُخْرِجَكُم مِّنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ ۚ وَإِنَّ اللَّـهَ بِكُمْ لَرَءُوفٌ رَّحِيمٌ ٩

తన దాసుని (ము'హమ్మద్‌)పై స్పష్టమైన ఆయాత్‌ (సూచనలు) అవతరింపజేసేవాడు ఆయనే! అతను వాటి ద్వారా మిమ్మల్ని అంధకారం నుండి వెలుతురులోకి తీసుకు రావటానికి. మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ మిమ్మల్ని ఎంతో కనికరించేవాడు, అపార కరుణాప్రదాత.


  • 57:10

وَمَا لَكُمْ أَلَّا تُنفِقُوا فِي سَبِيلِ اللَّـهِ وَلِلَّـهِ مِيرَاثُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ لَا يَسْتَوِي مِنكُم مَّنْ أَنفَقَ مِن قَبْلِ الْفَتْحِ وَقَاتَلَ ۚ أُولَـٰئِكَ أَعْظَمُ دَرَجَةً مِّنَ الَّذِينَ أَنفَقُوا مِن بَعْدُ وَقَاتَلُوا ۚ وَكُلًّا وَعَدَ اللَّـهُ الْحُسْنَىٰ ۚ وَاللَّـهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ ١٠

మరియు మీకేమయింది? మీరెందుకు అల్లాహ్‌ మార్గంలో ఖర్చుపెట్టడం లేదు? ఆకాశాలు మరియు భూమి యొక్క వారసత్వం అల్లాహ్‌కే చెందుతుంది. 9 (మక్కహ్) విజయానికి ముందు (అల్లాహ్‌ మార్గంలో) ఖర్చుపెట్టిన వారితో మరియు పోరాడిన వారితో, (మక్కహ్ విజయం తరువాత పోరాడిన వారు మరియు ఖర్చుపెట్టిన వారు) సమానులు కాజాలరు! అలాంటివారి స్థానం (విజయం తరువాత అల్లాహ్‌ మార్గంలో) ఖర్చు పెట్టిన మరియు పోరాడిన వారికంటే గొప్పది. కాని వారందరికీ అల్లాహ్‌ ఉత్తమమైన (ప్రతిఫల) వాగ్దానం చేశాడు. 10 మరియు మీరు చేసేదంతా అల్లాహ్‌ బాగా ఎరుగును.


  • 57:11

مَّن ذَا الَّذِي يُقْرِضُ اللَّـهَ قَرْضًا حَسَنًا فَيُضَاعِفَهُ لَهُ وَلَهُ أَجْرٌ كَرِيمٌ ١١

అల్లాహ్‌కు ఉత్తమమైన అప్పు ఇచ్చేవాడు ఎవడు? ఆయన దానిని ఎన్నోరెట్లు హెచ్చించి తిరిగి అతనికి ఇస్తాడు 11 మరియు అతనికి శ్రేష్ఠమైన ప్రతిఫలం (స్వర్గం) ఉంటుంది.


  • 57:12

يَوْمَ تَرَى الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ يَسْعَىٰ نُورُهُم بَيْنَ أَيْدِيهِمْ وَبِأَيْمَانِهِم بُشْرَاكُمُ الْيَوْمَ جَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ ذَٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ ١٢

ఆ దినమున నీవు విశ్వాసులైన పురుషు లను మరియు విశ్వాసులైన స్త్రీలను చూస్తే, వారి వెలుగు, వారి ముందు నుండి మరియు వారి కుడివైపు నుండి పరిగెత్తుతూ ఉంటుంది. 12 (వారితో ఇలా అనబడుతుంది): "ఈ రోజు మీకు క్రింద సెలయేర్లు ప్రవహించే స్వర్గవనాల శుభవార్త ఇవ్వబడుతోంది, మీరందులో శాశ్వతంగా ఉంటారు! ఇదే ఆ గొప్ప విజయం." 13


  • 57:13

يَوْمَ يَقُولُ الْمُنَافِقُونَ وَالْمُنَافِقَاتُ لِلَّذِينَ آمَنُوا انظُرُونَا نَقْتَبِسْ مِن نُّورِكُمْ قِيلَ ارْجِعُوا وَرَاءَكُمْ فَالْتَمِسُوا نُورًا فَضُرِبَ بَيْنَهُم بِسُورٍ لَّهُ بَابٌ بَاطِنُهُ فِيهِ الرَّحْمَةُ وَظَاهِرُهُ مِن قِبَلِهِ الْعَذَابُ ١٣

ఆ రోజు కపటవిశ్వాసులైన పురుషులు మరియు కపటవిశ్వాసులైన స్త్రీలు విశ్వాసులతో ఇలా అంటారు: 14 "మీరు మాకొరకు కొంచెం వేచి ఉండండి, మేము మీ వెలుగు నుండి కొంచెం తీసు కుంటాము." 15 వారితో ఇలా అనబడుతుంది: "మీరు వెనుకకు మరలి పొండి, తరువాత వెలుగు కొరకు వెదకండి!" అప్పుడు వారి మధ్య ఒక గోడ నిలబెట్టబడుతుంది. దానికి ఒక ద్వార ముంటుంది, దాని లోపలివైపు కారుణ్య ముంటుంది 16 మరియు దాని బయటవైపు శిక్ష ఉంటుంది. 17


  • 57:14

يُنَادُونَهُمْ أَلَمْ نَكُن مَّعَكُمْ ۖ قَالُوا بَلَىٰ وَلَـٰكِنَّكُمْ فَتَنتُمْ أَنفُسَكُمْ وَتَرَبَّصْتُمْ وَارْتَبْتُمْ وَغَرَّتْكُمُ الْأَمَانِيُّ حَتَّىٰ جَاءَ أَمْرُ اللَّـهِ وَغَرَّكُم بِاللَّـهِ الْغَرُورُ ١٤

(బయటనున్న కపటవిశ్వాసులు) ఇలా అరుస్తారు: "ఏమీ? మేము మీతో పాటు ఉండే వాళ్ళం కాదా?" (విశ్వాసులు) ఇలా జవాబిస్తారు: "ఎందుకు ఉండలేదు? కానీ వాస్తవానికి మిమ్మల్ని మీరు స్వయంగా పరీక్షకు గురిచేసుకున్నారు. మీరు మా (నాశనంకోసం) వేచిఉన్నారు. మరియు మీరు (పునరుత్థానాన్ని) సందేహిస్తూ ఉన్నారు మరియు మీ తుచ్ఛమైన కోరికలు మిమ్మల్ని మోసపుచ్చాయి. చివరకు అల్లాహ్‌ నిర్ణయం వచ్చింది. మరియు ఆ మోసగాడు (షై'తాన్‌) మిమ్మల్నిఅల్లాహ్‌ విషయంలో మోసపుచ్చాడు 18


  • 57:15

فَالْيَوْمَ لَا يُؤْخَذُ مِنكُمْ فِدْيَةٌ وَلَا مِنَ الَّذِينَ كَفَرُوا ۚ مَأْوَاكُمُ النَّارُ ۖ هِيَ مَوْلَاكُمْ ۖ وَبِئْسَ الْمَصِيرُ ١٥

కావున ఈ రోజు మీ నుండి ఏవిధమైన పరిహారం తీసుకోబడదు. మరియు సత్య-తిరస్కారుల నుండి కూడా తీసుకోబడదు. మీ నివాసం నరకమే, అదే మీ ఆశ్రయం. 19 ఎంత చెడ్డ గమ్యస్థానం!" (7/8)


  • 57:16

أَلَمْ يَأْنِ لِلَّذِينَ آمَنُوا أَن تَخْشَعَ قُلُوبُهُمْ لِذِكْرِ اللَّـهِ وَمَا نَزَلَ مِنَ الْحَقِّ وَلَا يَكُونُوا كَالَّذِينَ أُوتُوا الْكِتَابَ مِن قَبْلُ فَطَالَ عَلَيْهِمُ الْأَمَدُ فَقَسَتْ قُلُوبُهُمْ ۖ وَكَثِيرٌ مِّنْهُمْ فَاسِقُونَ ١٦

* ఏమీ? విశ్వాసుల హృదయాలు అల్లాహ్‌ ప్రస్తావవనతో కృంగిపోయి, ఆయన అవతరింప జేసిన సత్యానికి విధేయులయ్యే సమయం ఇంకా రాలేదా? పూర్వగ్రంథ ప్రజల్లాగా వారు కూడా మారి పోకూడదు. ఎందుకంటే చాలా కాలం గడిచి పోయినందుకు వారి హృదయాలు కఠినమై పోయాయి. మరియు వారిలో చాలా మంది అవిధేయులు (ఫాసిఖూన్‌) ఉన్నారు. 20


  • 57:17

اعْلَمُوا أَنَّ اللَّـهَ يُحْيِي الْأَرْضَ بَعْدَ مَوْتِهَا ۚ قَدْ بَيَّنَّا لَكُمُ الْآيَاتِ لَعَلَّكُمْ تَعْقِلُونَ ١٧

బాగా తెలుసుకోండి! నిశ్చయంగా అల్లాహ్‌, భూమి చనిపోయిన తరువాత, దానికి మళ్ళీ జీవం పోస్తాడు. వాస్తవానికి మేము ఈ సూచనలను మీకు స్పష్టంగా తెలుపుతున్నాము, బహుశా మీరు అర్థం చేసుకుంటారని.


  • 57:18

إِنَّ الْمُصَّدِّقِينَ وَالْمُصَّدِّقَاتِ وَأَقْرَضُوا اللَّـهَ قَرْضًا حَسَنًا يُضَاعَفُ لَهُمْ وَلَهُمْ أَجْرٌ كَرِيمٌ ١٨

నిశ్చయంగా, విధిదానం('జకాత్‌) చేసే పురు షులు మరియు విధిదానంచేసే స్త్రీలు మరియు అల్లాహ్‌కు మంచి అప్పు ఇచ్చేవారికి, ఆయన దానిని ఎన్నోరెట్లు పెంచి (తిరిగి) ఇస్తాడు. 21 మరియు వారికి గొప్ప ప్రతిఫలం ఉంటుంది.


  • 57:19

وَالَّذِينَ آمَنُوا بِاللَّـهِ وَرُسُلِهِ أُولَـٰئِكَ هُمُ الصِّدِّيقُونَ ۖ وَالشُّهَدَاءُ عِندَ رَبِّهِمْ لَهُمْ أَجْرُهُمْ وَنُورُهُمْ ۖ وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَـٰئِكَ أَصْحَابُ الْجَحِيمِ ١٩

మరియు ఎవరైతే అల్లాహ్‌ను మరియు ఆయన ప్రవక్తలనువిశ్వసిస్తారో, అలాంటివారే సత్య సంధులైన (విశ్వాసులు). మరియు వారే తమ ప్రభువువద్ద అమరవీరులు. వారికి వారి ప్రతి ఫలం మరియు జ్యోతి లభిస్తాయి. కాని ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తారో మరియు మా ఆయతు లను అబద్ధాలని అంటారో, అలాంటి వారు తప్పక భగభగ మండే నరకాగ్ని వాసులవుతారు.


  • 57:20

اعْلَمُوا أَنَّمَا الْحَيَاةُ الدُّنْيَا لَعِبٌ وَلَهْوٌ وَزِينَةٌ وَتَفَاخُرٌ بَيْنَكُمْ وَتَكَاثُرٌ فِي الْأَمْوَالِ وَالْأَوْلَادِ ۖ كَمَثَلِ غَيْثٍ أَعْجَبَ الْكُفَّارَ نَبَاتُهُ ثُمَّ يَهِيجُ فَتَرَاهُ مُصْفَرًّا ثُمَّ يَكُونُ حُطَامًا ۖ وَفِي الْآخِرَةِ عَذَابٌ شَدِيدٌ وَمَغْفِرَةٌ مِّنَ اللَّـهِ وَرِضْوَانٌ ۚ وَمَا الْحَيَاةُ الدُّنْيَا إِلَّا مَتَاعُ الْغُرُورِ ٢٠

బాగా తెలుసుకోండి! నిశ్చయంగా, ఇహలోక జీవితం, ఒక ఆట మరియు ఒక వినోదం మరియు ఒక శృంగారం మరియు మీరు పరస్పరం గొప్పలు చెప్పుకోవడం మరియు సంపద మరియు సంతానం విషయంలో ఆధిక్యత పొందటానికి ప్రయత్నించడం మాత్రమే. 22 దాని దృష్టాంతం ఆ వర్షంవలే ఉంది: దాని (వర్షం) వల్ల పెరిగే పైరు రైతులకు ఆనందం కలిగిస్తుంది. 23 ఆ పిదప అది ఎండిపోయి పసుపుపచ్చగా మారిపోతుంది. ఆ పిదప అది పొట్టుగా మారిపోతుంది. కాని పరలోక జీవితంలో మాత్రం (దుష్టులకు) బాధాకరమైన శిక్ష మరియు (సత్పురుషులకు) అల్లాహ్‌ నుండి క్షమాపణ మరియు ఆయన ప్రసన్నత ఉంటాయి. కావున ఇహలోక జీవితం కేవలం మోసగించే బోగభాగ్యాలు మాత్రమే.


  • 57:21

سَابِقُوا إِلَىٰ مَغْفِرَةٍ مِّن رَّبِّكُمْ وَجَنَّةٍ عَرْضُهَا كَعَرْضِ السَّمَاءِ وَالْأَرْضِ أُعِدَّتْ لِلَّذِينَ آمَنُوا بِاللَّـهِ وَرُسُلِهِ ۚ ذَٰلِكَ فَضْلُ اللَّـهِ يُؤْتِيهِ مَن يَشَاءُ ۚ وَاللَّـهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ ٢١

మీ ప్రభువు క్షమాపణ వైపునకు మరియు ఆకాశం మరియు భూమియొక్క వైశాల్యమంతటి విశాలమైన స్వర్గం వైపునకు పరుగెత్తండి. అది అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించే వారికొరకు సిద్ధపరచబడి ఉంది. ఇది అల్లాహ్‌ అనుగ్రహం, ఆయన తాను కోరినవారికి దానిని ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్‌ అనుగ్రహశాలి, సర్వోత్తముడు.


  • 57:22

مَا أَصَابَ مِن مُّصِيبَةٍ فِي الْأَرْضِ وَلَا فِي أَنفُسِكُمْ إِلَّا فِي كِتَابٍ مِّن قَبْلِ أَن نَّبْرَأَهَا ۚ إِنَّ ذَٰلِكَ عَلَى اللَّـهِ يَسِيرٌ ٢٢

భూమిమీద గానీ లేదా స్వయంగా మీ మీద గానీ విరుచుకుపడే ఏ ఆపద అయినా సరే! మేము దానిని సంభవింపజేయకముందే గ్రంథంలో వ్రాయబడకుండా లేదు. నిశ్చయంగా, ఇది అల్లాహ్‌కు ఎంతో సులభం. 24


  • 57:23

لِّكَيْلَا تَأْسَوْا عَلَىٰ مَا فَاتَكُمْ وَلَا تَفْرَحُوا بِمَا آتَاكُمْ ۗ وَاللَّـهُ لَا يُحِبُّ كُلَّ مُخْتَالٍ فَخُورٍ ٢٣

ఇదంతా మీరు పోయిన దానికి నిరాశ చెందకూడదని మరియు మీకు ఇచ్చిన దానికి సంతోషంతో ఉప్పొంగిపోరాదని. 25 మరియు అల్లాహ్‌ బడాయీలు చెప్పుకునే వారూ, గర్వించే వారూ అంటే ఇష్టపడడు.


  • 57:24

الَّذِينَ يَبْخَلُونَ وَيَأْمُرُونَ النَّاسَ بِالْبُخْلِ ۗ وَمَن يَتَوَلَّ فَإِنَّ اللَّـهَ هُوَ الْغَنِيُّ الْحَمِيدُ ٢٤

ఎవరైతే స్వయంగా లోభత్వంచూపుతూ 26 ఇతరులను కూడా లోభత్వానికి పురికొలుపుతారో మరియు ఎవడైతే (సత్యం నుండి) వెనుదిరుగు తాడో, వాడు (తెలుసుకోవాలి) నిశ్చయంగా అల్లాహ్‌ స్వయం సమృధ్ధుడు, సర్వ స్తోత్రాలకు అర్హుడని!


  • 57:25

لَقَدْ أَرْسَلْنَا رُسُلَنَا بِالْبَيِّنَاتِ وَأَنزَلْنَا مَعَهُمُ الْكِتَابَ وَالْمِيزَانَ لِيَقُومَ النَّاسُ بِالْقِسْطِ ۖ وَأَنزَلْنَا الْحَدِيدَ فِيهِ بَأْسٌ شَدِيدٌ وَمَنَافِعُ لِلنَّاسِ وَلِيَعْلَمَ اللَّـهُ مَن يَنصُرُهُ وَرُسُلَهُ بِالْغَيْبِ ۚ إِنَّ اللَّـهَ قَوِيٌّ عَزِيزٌ ٢٥

వాస్తవానికి, మేము మా సందేశహరులను స్పష్టమైన సూచనలనిచ్చి పంపాము. మరియు వారితో బాటు గ్రంథాన్ని అవతరింపజేశాము. మరియు మానవులు న్యాయశీలురుగా మెలగ టానికి త్రాసును కూడా పంపాము 27 మరియు ఇనుమును కూడా ప్రసాదించాము. అందులో గొప్పశక్తి ఉంది, మరియు మానవులకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. 28 మరియు (ఇదంతా) అల్లాహ్‌ అగోచరుడైన తనకు మరియు తన ప్రవక్తలకు ఎవడు సహాయకుడవుతాడో చూడటానికి చేశాడు. నిశ్చయంగా, అల్లాహ్‌ మహా బలశాలి, సర్వ శక్తిమంతుడు.


  • 57:26

وَلَقَدْ أَرْسَلْنَا نُوحًا وَإِبْرَاهِيمَ وَجَعَلْنَا فِي ذُرِّيَّتِهِمَا النُّبُوَّةَ وَالْكِتَابَ ۖ فَمِنْهُم مُّهْتَدٍ ۖ وَكَثِيرٌ مِّنْهُمْ فَاسِقُونَ ٢٦

మరియు వాస్తవంగా మేము నూ'హ్‌ను మరియు ఇబ్రాహీమ్‌ను పంపాము. మరియు వారిద్దరి సంతానంలో ప్రవక్త పదవినీ మరియు గ్రంథాన్ని ఉంచాము. కాని వారిసంతతిలో కొందరు మార్గదర్శకత్వం మీద ఉన్నారు, కాని వారిలో చాలామంది అవిధేయులు (ఫాసిఖూన్‌) ఉన్నారు.


  • 57:27

ثُمَّ قَفَّيْنَا عَلَىٰ آثَارِهِم بِرُسُلِنَا وَقَفَّيْنَا بِعِيسَى ابْنِ مَرْيَمَ وَآتَيْنَاهُ الْإِنجِيلَ وَجَعَلْنَا فِي قُلُوبِ الَّذِينَ اتَّبَعُوهُ رَأْفَةً وَرَحْمَةً وَرَهْبَانِيَّةً ابْتَدَعُوهَا مَا كَتَبْنَاهَا عَلَيْهِمْ إِلَّا ابْتِغَاءَ رِضْوَانِ اللَّـهِ فَمَا رَعَوْهَا حَقَّ رِعَايَتِهَا ۖ فَآتَيْنَا الَّذِينَ آمَنُوا مِنْهُمْ أَجْرَهُمْ ۖ وَكَثِيرٌ مِّنْهُمْ فَاسِقُونَ ٢٧

ఆ తరువాత చాలా మంది ప్రవక్తలను మేము వారి తరువాత పంపాము. మరియు మర్యమ్‌ కుమారుడు ఈసాను కూడా పంపాము మరియు అతనికి ఇంజీల్‌ను ప్రసాదించాము. మరియు అతనిని అనుసరించే వారి హృదయా లలో మేము జాలిని, కరుణను కలిగించాము, కాని సన్యాసాన్ని 29 వారేస్వయంగాకల్పించుకున్నారు. మేము దానిని వారిపై విధించలేదు, కాని అల్లాహ్‌ ప్రసన్నతను పొందగోరి వారే దానిని విధించు కున్నారు, కాని వారు దానిని పాటించవలసిన విధంగా నిజాయితీతో పాటించలేదు. కావున వారిలో విశ్వసించినవారికి వారి ప్రతిఫలాన్ని ప్రసాదించాము. కాని వారిలో చాలామంది అవిధేయులు (ఫాసిఖూన్‌) ఉన్నారు.


  • 57:28

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّـهَ وَآمِنُوا بِرَسُولِهِ يُؤْتِكُمْ كِفْلَيْنِ مِن رَّحْمَتِهِ وَيَجْعَل لَّكُمْ نُورًا تَمْشُونَ بِهِ وَيَغْفِرْ لَكُمْ ۚ وَاللَّـهُ غَفُورٌ رَّحِيمٌ ٢٨

ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ యందు భయ- భక్తులు కలిగి ఉండండి, మరియు ఆయన సందేశహరుణ్ణి విశ్వసించండి, ఆయన (అల్లాహ్‌) మీకు రెట్టింపు కరుణను ప్రసాదిస్తాడు మరియు వెలుగును ప్రసాదిస్తాడు, మీరు అందులో నడుస్తారు మరియు ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. మరియు అల్లాహ్‌ ఎంతో క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.


  • 57:29

لِّئَلَّا يَعْلَمَ أَهْلُ الْكِتَابِ أَلَّا يَقْدِرُونَ عَلَىٰ شَيْءٍ مِّن فَضْلِ اللَّـهِ ۙ وَأَنَّ الْفَضْلَ بِيَدِ اللَّـهِ يُؤْتِيهِ مَن يَشَاءُ ۚ وَاللَّـهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ ٢٩

అల్లాహ్‌ అనుగ్రహం మీద తమకు ఎలాంటి అధికారం లేదని మరియు నిశ్చయంగా, అనుగ్రహం కేవలం అల్లాహ్‌ చేతిలో ఉందని మరియు ఆయన తాను కోరిన వారికి దానిని ప్రసాదిస్తాడని, పూర్వ గ్రంథప్రజలు తెలుసుకోవాలి. మరియు అల్లాహ్‌ అనుగ్రహశాలి, సర్వోత్తముడు.