అల్‌-ఫీల్‌: The Elephant, ఏనుగు. యమన్‌ యొక్క అబిసీనియా రాజ ప్రతినిధి (Abyssinia’s Viceroy of Yaman) అబ్రాహా (Abraha), క్రైస్తవుడు. అతడు 570 క్రీస్తు శకంలో మక్కహ్ లోని క'అబహ్ ను పడగొట్టే ఉద్దేశ్యంతో పెద్ద సైన్యం తీసుకొని, ఒక ఏనుగుపై ఎక్కి వస్తాడు. మక్కహ్ కొంతదూరంలో ఉందనగా అతడి ఏనుగు మక్కహ్ వైపుకు పోకుండా ఆగిపోతుంది. ఆ తరువాత ఒక పక్షుల దండు వచ్చి మట్టితో చేసి కాల్చిన చిన్న-చిన్న కంకర రాళ్ళను వారిపై కురిపిస్తుంది. దానితో చాలా మంది సైనికులు మరణిస్తారు. సైన్యమంతా చెల్లాచెదరైపోతుంది. అబ్రాహా వెనుదిరిగిపోతూ మధ్య మార్గంలోనే మరణిస్తాడు. ఆ కాలంలో అబ్దుల్‌ ముత్తలిబ్‌ – దైవప్రవక్త ('స'అస) తాత – మక్కహ్ ఖురైషుల నాయకులుగా ఉంటారు. అదే సంవత్సరంలో దైవప్రవక్త ('స'అస) జన్మిస్తారు. ఇది మొదటి మక్కహ్ కాలపు సూరహ్. 5 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 105:1

أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِأَصْحَابِ الْفِيلِ ١

ఏమీ? ఏనుగు వారి (సైన్యంతో) నీ ప్రభువు ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా?


  • 105:2

أَلَمْ يَجْعَلْ كَيْدَهُمْ فِي تَضْلِيلٍ ٢

ఏమీ? ఆయన వారి కుట్రను భంగం చేయలేదా? 1


  • 105:3

وَأَرْسَلَ عَلَيْهِمْ طَيْرًا أَبَابِيلَ ٣

మరియు ఆయన వారిపైకి పక్షుల గుంపులను పంపాడు;


  • 105:4

تَرْمِيهِم بِحِجَارَةٍ مِّن سِجِّيلٍ ٤

అవి (ఆ పక్షులు) వారి మీద మట్టితో చేసి కాల్చిన కంకరరాళ్ళను (సిజ్జీల్‌) విసురుతూ పోయాయి; 2


  • 105:5

فَجَعَلَهُمْ كَعَصْفٍ مَّأْكُولٍ ٥

ఆ విధంగా ఆయన వారిని (పశువులు) తిని వేసిన పొట్టుగా మార్చివేశాడు.