అల్‌-ఫజ్ర్‌: The Dawn, The Day Break, ప్రాతఃకాలము, వేకువజాము. అవతరణా క్రమంలో ఇది 10వది. మక్కహ్ లో అవతరింపజేయబడింది. 30 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

 • 89:1

وَالْفَجْرِ ١

ప్రాతఃకాలం సాక్షిగా! 1


 • 89:2

وَلَيَالٍ عَشْ ٢

పది రాత్రుల సాక్షిగా! 2


 • 89:3

وَالشَّفْعِ وَالْوَتْرِ ٣

సరి-బేసీల సాక్షిగా!


 • 89:4

وَاللَّيْلِ إِذَا يَسْرِ ٤

గడచిపోయే రాత్రి సాక్షిగా!


 • 89:5

هَلْ فِي ذَٰلِكَ قَسَمٌ لِّذِي حِجْرٍ ٥

వీటిలో బుధ్ధిగల వాని కొరకు ఏ ప్రమాణమూ లేదా ఏమిటి? 3


 • 89:6

أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِعَادٍ ٦

నీ ప్రభువు 'ఆద్‌ (జాతి) వారి పట్ల ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా? 4


 • 89:7

إِرَمَ ذَاتِ الْعِمَادِ ٧

ఎత్తైన స్తంభాల (భవనాలు గల) ఇరమ ప్రజల పట్ల? 5


 • 89:8

الَّتِي لَمْ يُخْلَقْ مِثْلُهَا فِي الْبِلَادِ ٨

వారిలాంటి జాతి భూమిలో ఎన్నడూ సృష్టించ బడలేదు. 6


 • 89:9

وَثَمُودَ الَّذِينَ جَابُوا الصَّخْرَ بِالْوَادِ ٩

మరియు లోయలలోని కొండరాళ్ళలో (భవనాలను) తొలిచిన సమూద్‌ జాతి పట్ల? 7


 • 89:10

وَفِرْعَوْنَ ذِي الْأَوْتَادِ ١٠

మరియు మేకులవాడైన ఫిర్‌'ఔన్‌ పట్ల? 8


 • 89:11

الَّذِينَ طَغَوْا فِي الْبِلَادِ ١١

వారంతా ఆయాదేశాలలో తలబిరుసు తనంతో ప్రవర్తించారు;


 • 89:12

فَأَكْثَرُوا فِيهَا الْفَسَادَ ١٢

మరియు వాటిలో దౌర్జన్యాన్ని రేకెత్తించారు.


 • 89:13

فَصَبَّ عَلَيْهِمْ رَبُّكَ سَوْطَ عَذَابٍ ١٣

కాబట్టి నీ ప్రభువు వారిపైకి అనేకరకాల బాధాకరమైన శిక్షలను పంపాడు.


 • 89:14

إِنَّ رَبَّكَ لَبِالْمِرْصَادِ ١٤

వాస్తవానికి, నీ ప్రభువు మాటువేసి ఉన్నాడు (అంతా కనిపెడ్తూ ఉంటాడు)!


 • 89:15

فَأَمَّا الْإِنسَانُ إِذَا مَا ابْتَلَاهُ رَبُّهُ فَأَكْرَمَهُ وَنَعَّمَهُ فَيَقُولُ رَبِّي أَكْرَمَنِ ١٥

అయితే మానవుడు ఎలాంటి వాడంటే: అతని ప్రభువు అతన్ని పరీక్షించటానికి, అతనికి గౌరవ ప్రతిష్టలనిచ్చి అనుగ్రహించినప్పుడు: "నా ప్రభువు నన్ను గౌరవించాడు." అని అంటాడు; 9


 • 89:16

وَأَمَّا إِذَا مَا ابْتَلَاهُ فَقَدَرَ عَلَيْهِ رِزْقَهُ فَيَقُولُ رَبِّي أَهَانَنِ ١٦

కాని, అతన్ని పరీక్షించటానికి, అతని ఉపాధిని తగ్గించినప్పుడు: "నా ప్రభువు నన్ను అవమా నించాడు." అని అంటాడు. 10


 • 89:17

كَلَّا ۖ بَل لَّا تُكْرِمُونَ الْيَتِيمَ ١٧

అలాకాదు, వాస్తవానికి మీరు అనాథులను ఆదరించరు; 11


 • 89:18

وَلَا تَحَاضُّونَ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ ١٨

మరియు మీరు పేదలకు అన్నంపెట్టే విషయంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోరు; 12


 • 89:19

وَتَأْكُلُونَ التُّرَاثَ أَكْلًا لَّمًّا ١٩

మరియు వారసత్వపు ఆస్తిని పేరాశతో అంతా మీరే తినేస్తారు.


 • 89:20

وَتُحِبُّونَ الْمَالَ حُبًّا جَمًّا ٢٠

మరియు మీరు ధన వ్యామోహంలో దారుణంగా చిక్కుకు పోయారు! 13


 • 89:21

كَلَّا إِذَا دُكَّتِ الْأَرْضُ دَكًّا دَكًّا ٢١

అలాకాదు, భూమి, దంచి పిండి-పిండిగా చేయబడినపుడు;


 • 89:22

وَجَاءَ رَبُّكَ وَالْمَلَكُ صَفًّا صَفًّا ٢٢

మరియు నీ ప్రభువు (స్వయంగా) వస్తాడు మరియు దేవదూతలు వరుసలలో వస్తారు. 14


 • 89:23

وَجِيءَ يَوْمَئِذٍ بِجَهَنَّمَ ۚ يَوْمَئِذٍ يَتَذَكَّرُ الْإِنسَانُ وَأَنَّىٰ لَهُ الذِّكْرَىٰ ٢٣

ఆ రోజు నరకం (ముందుకు) తీసుకురాబడు తుంది. ఆ రోజు మానవుడు (తన కర్మలన్నీ) జ్ఞప్తికి తెచ్చుకుంటాడు; కాని ఆ రోజు జ్ఞప్తికి తెచ్చుకోవడం వల్ల అతనికి కలిగే ప్రయోజన మేమిటీ?


 • 89:24

يَقُولُ يَا لَيْتَنِي قَدَّمْتُ لِحَيَاتِي ٢٤

అతడు: "అయ్యో! నా పాడుగాను! నా ఈ జీవితం కొరకు నేను (సత్కార్యాలు) చేసి పంపు కొని ఉంటే ఎంత బాగుండేది!" అని వాపోతాడు.


 • 89:25

فَيَوْمَئِذٍ لَّا يُعَذِّبُ عَذَابَهُ أَحَدٌ ٢٥

అయితే ఆ రోజు, ఆయన (అల్లాహ్‌) శిక్షించి నట్లు, మరెవ్వడూ శిక్షించలేడు!


 • 89:26

وَلَا يُوثِقُ وَثَاقَهُ أَحَدٌ ٢٦

మరియు ఆయన (అల్లాహ్‌) బంధించి నట్లు, మరెవ్వడూ బంధించలేడు. 15


 • 89:27

يَا أَيَّتُهَا النَّفْسُ الْمُطْمَئِنَّةُ ٢٧

(సన్మార్గునితో ఇలా అనబడుతుంది): "ఓ తృప్తి పొందిన ఆత్మా!


 • 89:28

ارْجِعِي إِلَىٰ رَبِّكِ رَاضِيَةً مَّرْضِيَّةً ٢٨

"నీ ప్రభువు సన్నిధికి మరలి రా! (నీకు లభించే సత్ఫలితానికి) ఆనందిస్తూ మరియు (నీ ప్రభువునకు) ప్రియమైనదానివై!


 • 89:29

فَادْخُلِي فِي عِبَادِي ٢٩

"నీవు (పుణ్యాత్ములైన) నాదాసులలో చేరిపో!


 • 89:30

وَادْخُلِي جَنَّتِ ٣٠

"మరియు నీవు నా స్వర్గంలో ప్రవేశించు!" (5/8)