అల్‌-బురూజ్‌: తారాగణం, బురుజులు, The Big Stars, The Great Constillations, నక్షత్ర రాశులు, నక్షత్రసముదాయం. ఇది సూరహ్‌ అష్‌-షమ్స్‌ (91) తరువాత అవతరింపజేయ బడిన మక్కహ్ సూరహ్‌. దైవప్రవక్త ('స'అస) "జుహ్ర్‌ మరియు 'అస్ర్‌ నమాజులలో సూరహ్‌ అల్‌- బురూజ్‌ (85) మరియు సూరహ్‌ అత్‌-'తారిఖ్‌ (86) చదివేవారు. (తిర్మీజీ'). 4-7వ ఆయత్‌లలో, ప్రాచీన కాలంలో స'ఊదీ 'అరేబియాలో ఉన్న, నజ్‌రాన్‌ యొక్క సత్య-తిరస్కారులు విశ్వాసులను అగ్ని కందకంలో త్రోసి చంపిన దారుణ సంఘటన పేర్కొనబడింది. ఈ విధమైన దౌర్జన్యాలు ఇతర చోట్లలో కూడా జరిగినట్లు పేర్కొనబడ్డాయి. వివరాలకు చూడండి, ఇబ్నె-కసీ'ర్‌. 22 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 85:1

وَالسَّمَاءِ ذَاتِ الْبُرُوجِ ١

విస్తారమైన తారాగణం గల ఆకాశం సాక్షిగా! 1


  • 85:2

وَالْيَوْمِ الْمَوْعُودِ ٢

వాగ్దానం చేయబడిన (పునరుత్థాన) దినం సాక్షిగా!


  • 85:3

وَشَاهِدٍ وَمَشْهُودٍ ٣

చూచే (దినం) మరియు చూడబడే (దినం) సాక్షిగా! 2


  • 85:4

قُتِلَ أَصْحَابُ الْأُخْدُودِ ٤

అగ్ని కందకం (ఉ'ఖ్దూద్‌) వారు నాశనం చేయబడ్డారు. 3


  • 85:5

النَّارِ ذَاتِ الْوَقُودِ ٥

ఇంధనంతో తీవ్రంగా మండే అగ్నిని రాజేసే వారు.


  • 85:6

إِذْ هُمْ عَلَيْهَا قُعُودٌ ٦

వారు దాని (ఆ కందకం) అంచుపై కూర్చొని ఉన్నప్పుడు; 4


  • 85:7

وَهُمْ عَلَىٰ مَا يَفْعَلُونَ بِالْمُؤْمِنِينَ شُهُودٌ ٧

మరియు తాము విశ్వాసుల పట్ల చేసే ఘోర కార్యాలను (సజీవ దహనాలను) తిలకించేవారు.


  • 85:8

وَمَا نَقَمُوا مِنْهُمْ إِلَّا أَن يُؤْمِنُوا بِاللَّـهِ الْعَزِيزِ الْحَمِيدِ ٨

మరియు వారు విశ్వాసుల పట్ల కసి పెంచుకోవడానికి కారణం – వారు (విశ్వాసులు) సర్వ శక్తిమంతుడు, సర్వ స్తోత్రాలకు అర్హుడైన – అల్లాహ్‌ను విశ్వసించడం మాత్రమే!


  • 85:9

الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَاللَّـهُ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ ٩

అయనే! ఎవరికైతే భూమ్యాకాశాల ఆధిపత్యం ఉందో! మరియు అల్లాహ్‌యే ప్రతి దానికి సాక్షి.


  • 85:10

إِنَّ الَّذِينَ فَتَنُوا الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ ثُمَّ لَمْ يَتُوبُوا فَلَهُمْ عَذَابُ جَهَنَّمَ وَلَهُمْ عَذَابُ الْحَرِيقِ ١٠

ఎవరైతే విశ్వాసులైన పురుషులను మరియు విశ్వాసులైన స్త్రీలను హింసిస్తారో, ఆ తరువాత పశ్చాత్తాపంతో క్షమాపణకోరరో! నిశ్చయంగా, అలాంటి వారికి నరకశిక్ష ఉంటుంది. మరియు వారికి మండే నరకాగ్ని శిక్ష విధించబడుతుంది.


  • 85:11

إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُمْ جَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۚ ذَٰلِكَ الْفَوْزُ الْكَبِيرُ ١١

నిశ్చయంగా విశ్వసించి సత్కార్యాలు చేసే వారి కొరకు, క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనా లుంటాయి. 5 అదే గొప్ప విజయం.


  • 85:12

إِنَّ بَطْشَ رَبِّكَ لَشَدِيدٌ ١٢

నిశ్చయంగా, నీ ప్రభువు యొక్క పట్టు (శిక్ష) చాలా కఠినమైనది. 6


  • 85:13

إِنَّهُ هُوَ يُبْدِئُ وَيُعِيدُ ١٣

నిశ్చయంగా, ఆయనే (సృష్టిని) ఆరంభించే వాడు మరియు ఆయనే (దానిని) మరల ఉనికిలోకి తెచ్చే వాడు.


  • 85:14

وَهُوَ الْغَفُورُ الْوَدُودُ ١٤

మరియు ఆయన క్షమాశీలుడు, అమిత వాత్సల్యుడు.


  • 85:15

ذُو الْعَرْشِ الْمَجِيدُ ١٥

సింహాసనాన్ని ('అర్ష్‌ను) అధిష్టించిన వాడు, 7 మహత్త్వపూర్ణుడు. 8


  • 85:16

فَعَّالٌ لِّمَا يُرِيدُ ١٦

తాను తలచింది చేయగలవాడు.


  • 85:17

هَلْ أَتَاكَ حَدِيثُ الْجُنُودِ ١٧

ఏమీ? సైన్యాల వారి సమాచారం నీకు అందిందా?


  • 85:18

فِرْعَوْنَ وَثَمُودَ ١٨

ఫిర్‌'ఔన్‌ మరియు స'మూద్‌ వారి (సైన్యాల).


  • 85:19

بَلِ الَّذِينَ كَفَرُوا فِي تَكْذِيبٍ ١٩

అలాకాదు, సత్యతిరస్కారులు (సత్యాన్ని) తిరస్కరించుటలో నిమగ్నులై ఉన్నారు.


  • 85:20

وَاللَّـهُ مِن وَرَائِهِم مُّحِيطٌ ٢٠

మరియు అల్లాహ్‌ వారిని, వెనుక (ప్రతి దిక్కు) నుండి చుట్టుముట్టి ఉన్నాడు.


  • 85:21

بَلْ هُوَ قُرْآنٌ مَّجِيدٌ ٢١

వాస్తవానికి, ఇది ఒక దివ్యమైన 9 ఖుర్‌ఆన్‌;


  • 85:22

فِي لَوْحٍ مَّحْفُوظٍ ٢٢

సురక్షితమైన ఫలకం (లౌ'హె మ'హ్‌ ఫూ"జ్‌)లో 10 (వ్రాయబడి) ఉన్నది.