అల్‌-'అ'స్ర్‌: The Time, కాలము. ఇది మొదటి మక్కహ్ కాలపు సూరహ్‌. చెడుకు పర్యవ సానం చెడు. గడిచిపోయిన కాలం మళ్ళీ చేజిక్కదు. కావున విశ్వసించి, సత్కార్యాలు చేస్తూ, సత్యాన్ని మరియు సహనాన్ని పాటిస్తూ ఒకరికొకరు బోధించుకునే వారే సాఫల్యం పొందుతారు. ఇది 3 ఆయాతులు ఉన్న 3 సూరహ్‌లలో మొదటిది. దీని పేరు మొదటి ఆయత్‌ లో ఉంది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 103:1

وَالْعَصْرِ ١

కాలం ('అ'స్ర్‌) సాక్షిగా! 1


  • 103:2

إِنَّ الْإِنسَانَ لَفِي خُسْرٍ ٢

నిశ్చయంగా, మానవుడు నష్టంలో ఉన్నాడు! 2


  • 103:3

إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَتَوَاصَوْا بِالْحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْرِ ٣

కాని విశ్వసించి, సత్కార్యాలు చేసే వారు మరియు ఒకరికొకరు సత్యాన్ని బోధించుకునే వారు మరియు ఒకరికొకరు సహనాన్ని (స్థైర్యాన్ని) బోధించుకునే వారు తప్ప! 3