అల్‌-అ'అలా: The Most High, అత్యున్నతుడు. ప్రారంభ మక్కహ్ కాలపు, ఇది బహుశా అవతరణాక్రమంలో 8వది, సూరహ్‌ అత్‌-తక్వీర్‌ (81) తరువాత అవతరింపజేయబడింది. దైవప్రవక్త ('స'అస) పండుగ ('ఈద్‌)ల నమా'జ్‌లలో మరియు జుము'అహ్‌ నమా'జ్‌లలో ఈ సూరహ్‌ (87)ను మరియు సూరహ్‌ అల్‌-'గాషియహ్‌ (88)ను పఠించేవారు. వి'త్ర్‌ నమా'జ్‌ మొదటి రకాత్‌లో ఈ సూరహ్‌ అల్‌-అ'అలా (87)ను, 2వ రకాత్‌లో సూరహ్‌ అల్‌-కాఫిరూన్‌ (109)ను మరియు 3వ రకాత్‌లో సూరహ్‌ అల్‌-ఇ'ఖ్లా'స్‌ (112)ను పఠించేవారు 19 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు మొదటి ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

 • 87:1

سَبِّحِ اسْمَ رَبِّكَ الْأَعْلَى ١

* అత్యున్నతుడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు!


 • 87:2

الَّذِي خَلَقَ فَسَوَّىٰ ٢

ఆయనే (ప్రతిదానిని) సృష్టించాడు మరియు తగిన ప్రమాణంలో రూపొందించాడు. 1


 • 87:3

وَالَّذِي قَدَّرَ فَهَدَىٰ ٣

మరియు ఆయనే దాని ప్రకృతి లక్షణాలను నిర్ణయించాడు, 2 మరియు మార్గం చూపాడు!


 • 87:4

وَالَّذِي أَخْرَجَ الْمَرْعَىٰ ٤

మరియు ఆయనే పచ్చికను మొలిపింప- జేశాడు!


 • 87:5

فَجَعَلَهُ غُثَاءً أَحْوَىٰ ٥

మరల దానిని నల్లని చెత్తాచెదారంగా చేశాడు. 3


 • 87:6

سَنُقْرِئُكَ فَلَا تَنسَىٰ ٦

మేము నీచేత (ఖుర్‌ఆన్‌ను) చదివింప జేస్తాము, తరువాత నీవు (దానిని) మరచిపోవు –


 • 87:7

إِلَّا مَا شَاءَ اللَّـهُ ۚ إِنَّهُ يَعْلَمُ الْجَهْرَ وَمَا يَخْفَىٰ ٧

అల్లాహ్‌ కోరింది తప్ప! 4 నిశ్చయంగా, బహిరంగంగా ఉన్నదీ మరియు గోప్యంగా ఉన్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు.


 • 87:8

وَنُيَسِّرُكَ لِلْيُسْرَىٰ ٨

మరియు మేము నీ మార్గాన్ని సులభం చేయడానికి నీకు సౌలభ్యాన్ని కలుగజేస్తాము. 5


 • 87:9

فَذَكِّرْ إِن نَّفَعَتِ الذِّكْرَىٰ ٩

కావున నీవు హితోపదేశం చేస్తూ ఉండు; వారికి హితోపదేశం లాభదాయకం కావచ్చు! 6


 • 87:10

سَيَذَّكَّرُ مَن يَخْشَىٰ ١٠

(అల్లాహ్‌కు) భయపడే వాడు హితోప- దేశాన్ని స్వీకరిస్తాడు.


 • 87:11

وَيَتَجَنَّبُهَا الْأَشْقَى ١١

మరియు దౌర్భాగ్యుడు దానికి దూరమై పోతాడు;


 • 87:12

الَّذِي يَصْلَى النَّارَ الْكُبْرَىٰ ١٢

అలాంటి వాడే ఘోరమైన నరకాగ్నిలో పడి కాలుతాడు.


 • 87:13

ثُمَّ لَا يَمُوتُ فِيهَا وَلَا يَحْيَ ١٣

అప్పుడు, అతడు అందులో చావనూ లేడు, బ్రతకనూ లేడు. 7


 • 87:14

قَدْ أَفْلَحَ مَن تَزَكَّىٰ ١٤

సుశీలతను (పవిత్రతను) పాటించే వాడు తప్పక సాఫల్యం పొందుతాడు;


 • 87:15

وَذَكَرَ اسْمَ رَبِّهِ فَصَلَّىٰ ١٥

మరియు తన ప్రభువు నామాన్ని స్మరిస్తూ, నమా'జ్‌ చేస్తూ ఉండేవాడు.


 • 87:16

بَلْ تُؤْثِرُونَ الْحَيَاةَ الدُّنْيَا ١٦

అలాకాదు! మీరు ఐహిక జీవితానికి ప్రాధాన్యత నిస్తున్నారు;


 • 87:17

وَالْآخِرَةُ خَيْرٌ وَأَبْقَىٰ ١٧

కాని పరలోక జీవితమే మేలైనది మరియు చిరకాలముండేది.


 • 87:18

إِنَّ هَـٰذَا لَفِي الصُّحُفِ الْأُولَىٰ ١٨

నిశ్చయంగా, ఈ విషయం పూర్వ గ్రంథాలలో (వ్రాయబడి) ఉంది;


 • 87:19

صُحُفِ إِبْرَاهِيمَ وَمُوسَىٰ ١٩

ఇబ్రాహీమ్‌ మరియు మూసాలపై (అవతరింపజేయబడిన) గ్రంథాలలో.